
తుమకూరు: వివాహితలను టార్గెట్‌గా చేసుకుని డబ్బు ఎరగా చూపి వారిని వాడుకుని మోసం చేస్తున్న యువకుడిని తిలక్ నగర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తుమకూరు నగరంలోని నజరాబాద్ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్(20) తన వద్ద ఉన్న డబ్బును ఎరగా చూపి వివాహితలను లోబరుచుకోని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారితో కొన్ని రోజులు గడిపి వదలేస్తున్నాడు.
ఇలా ఇప్పటివరకు ఐదుగురు మహిళలను ఇమ్రాన్ మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఒక అంధురాలు, ఒక వికలాంగురాలు కూడా ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరిని తన స్నేహితులకు ఇచ్చి పెళ్లి చేసినట్లు తెలిసింది. బాధిత మహిళలు ఫిర్యాదు చేయడంతో నజరాబాద్ పోలీసులు అతన్ని బుధవారం అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment