
ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ
గుంటూరు, షేర్‌మహ్మద్‌పేట అడ్డరోడ్డు (జగ్గయ్యపేట): అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిచెందింది. ఈ ఘటన అడ్డరోడ్డు సమీపంలోని మంగొల్లు రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తెలంగాణ రాష్ట్రం చిలుకూరు మండలం బుదియా తండాకు చెందిన మళావత్ విజయ (40)కు భర్తతో మూడేళ్ల క్రితం విబేధాలు రావడంతో పట్టణానికి విచ్చేసింది. శాంతినగర్‌లోని వినాయక విగ్రహాలు తయారీ కేంద్రంలో కొంతకాలంగా పనిచేస్తోంది. ఈ క్రమంలో తెల్లవారుజామున మంగొల్లు రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ అబ్దుల్‌నబీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలం వద్ద మృతురాలు అర్ధనగ్నంగా ఉండటంతో పాటు చిన్నచిన్న గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. మృతురాలు ప్రతిరోజు మద్యం తాగుతుందని ఈ ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులతో చనువుగా ఉంటుందని, మృతి వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment