
మోనిక పెళ్లినాటి ఫొటో
కర్ణాటక, కృష్ణరాజపురం : వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన హొసకోటె తాలూకా చొక్కహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. నందగుడికి చెందిన మోనిక (24) చోక్కహళ్లి గ్రామానికి చెందిన మంజునాథ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కొద్ది కాలం అంతా సజావుగానే సాగినా కొద్ది రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం మోనిక ఇంట్లో విగతజీవిగా పడిఉండడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మోనికా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మోనికాను భర్త మంజునాథ్ హత్య చేశాడంటూ మోనిక తండ్రి సోమణ్ణ ఫిర్యాదు చేయడంతో నందగుడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment