
రాయచూరు రూరల్: తాలూకాలోని గిల్లేసూగూరు గ్రామ శివారులో 15 ఏళ్ల బాలిక అనుమానాస్పదంగా మరణించిన ఘటన జరిగింది. వివరాలు..ఊరి శివారులోని పొలంలో పూరి గుడిసెలో నివాసమున్న ఈరమ్మ(14) అనే బాలిక గురువారం మధ్యాహ్నం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో కనిపించిందని ఇడపనూరు ఎస్‌ఐ కరియమ్మ తెలిపారు.
గిల్లేసూగూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఈరమ్మ ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదని కుటుంబ సభ్యులు వాపోయారు. భిక్షాటన చేసుకుని జీవితం గడిపే తల్లిదండ్రులు ఊరి బయట చిన్న గుడిసెలో ఉంటున్నారు. గురువారం బాలిక బడికి వెళ్లలేదు. ఈరమ్మను సమీప బంధువులు శివలింగ(20), శివు(21), వీరే‹Ù(22) అనే ముగ్గురు యువకులు కలిసి హత్య చేశారని సీఐ బాలచంద్ర శుక్రవారం విలేకరులకు తెలిపారు.
వీరిలో ఒకరు ఈరమ్మను ప్రేమిస్తున్నట్లు నటించి మాయమాటలతో పిలుచుకెళ్లి హత్య చేసి చెట్టుకు ఉరి వేశారన్నారు. 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశామని కేసు దర్యాప్తు చేపట్టిన ఇడపనూరు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment