ఆశారాణి– ప్రదీప్ పెళ్లినాటి ఫొటో
సాక్షి, మైసూరు: కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు మెట్టినింటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు... మైసూరులోని శ్రీరామ్‌పుర ఎస్‌బీఎం లేఔట్‌లో నివాసం ఉంటున్న ప్రదీప్‌తో మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా సరగూరు గ్రామానికి చెందిన ఆశారాణి(25)కి నెల రోజుల క్రితం మైసూరులోని కాళమ్మ కళ్యాణ మండపంలో వివాహం జరిగింది. ఏం జరిగిందో ఏమో కాని శనివారం ఆశారాణి ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా మారింది.
సమాచారం అందుకున్న ఆశారాణి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి వచ్చి కూతురిని ఆ స్థితిలో చూసి విలపించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో కట్నం కోసం భర్త ప్రదీప్, అతని తండ్రి, తల్లి కొట్టి హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు కువెంపునగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న ప్రదీప్, అతని తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
చదవండి: ‘ఇళ్లల్లోకి వెళ్లండి, రోడ్లపై కనిపిస్తే కాల్చిపడేస్తాం’
Comments
Please login to add a commentAdd a comment