ఆమె జైలుకు.. బాలుడు ఇంటికి | Married woman and boy ran away was arrested by police | Sakshi
Sakshi News home page

ఆమె జైలుకు.. బాలుడు ఇంటికి

Jul 28 2022 4:12 AM | Updated on Jul 28 2022 4:12 AM

Married woman and boy ran away was arrested by police - Sakshi

గుడివాడ టౌన్‌: ఎదురింటి బాలుడిని తీసుకొని పారిపోయిన వివాహితను పోలీసులు అరెస్టు చేశారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కృష్ణా జిల్లా గుడివాడలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను సీఐ దుర్గారావు వెల్లడించారు. గుడివాడ గుడ్‌మెన్‌ పేటకు చెందిన వివాహిత స్వప్న(30) తన ఎదురింటిలో ఉండే బాలుడి(15)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నెల 19న ఆ బాలుడితో పరారయ్యింది.

బాలుడి తండ్రి గత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వప్న, బాలుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి వారిద్దరినీ గుడివాడ తీసుకొచ్చారు. మహిళను బుధవారం గుడివాడ కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆమెకు రిమాండ్‌ విధించినట్లు సీఐ చెప్పారు. బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement