Extra-marital affairs
-
వివాహితపై కత్తితో దాడి.. యువకుడి ఆత్మహత్య
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): వివాహేతర సంబంధం నేపథ్యంలో నెలకున్న వివాదాల కారణంగా వివాహితపై యువకుడు కత్తితో దాడి చేసి.. ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సత్యనారాయణపురం పీఎస్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. వివాహిత కొన ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం వక్కలగడ్డ పవన్‌కుమార్, మాధురి.. వారి ఇద్దరి సంతానం గుడివాడలో నివసించేవారు. వారిద్దరూ ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో గుడివాడకు చెందిన నాని అనే యువకుడితో మాధురికి పరిచయమైంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం ఆమె ఇంట్లో తెలియడంతో అతనికి దూరంగా ఉంది. అయినా యువకుడు ఆమె వెంటపడుతూ ఇబ్బందులకు గురిచేస్తుండేవాడు. గత వారం ఆమె తాను పని చేస్తున్న స్కూల్ నుంచి విజయవాడ బ్రాంచ్‌కు బదిలి చేయించుకున్నారు. ఇద్దరు పిల్లలతో పాటు శ్రీనగర్‌కాలనీలోని ఆమె తల్లి వద్ద ఉంటోంది. ఇది తెలుసుకున్న నాని తనను కాదంటున్న ఆమెను హత్య చెయ్యాలనే ఉద్దేశంతో మంగళవారం సాయంత్రం ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో పిల్లలు బయట ఆడుకుంటుండగా వివాహితతో వాగ్విదానికి దిగాడు. తన వెంటతెచ్చుకున్న కత్తితో ఆమె మెడమీద నరికాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అపస్మారకస్థితిలో పడిపోవడంతో మృతి చెందినట్లు భావించాడు. భయంతో నాని (36) కూడా ఇంట్లో ఉన్న నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఎన్‌పురం సీఐ వెంకట నారాయణ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న మహిళను పోలీస్ వ్యాన్లోనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు విచారణ చేస్తున్నారు -
ఆమె జైలుకు.. బాలుడు ఇంటికి
గుడివాడ టౌన్: ఎదురింటి బాలుడిని తీసుకొని పారిపోయిన వివాహితను పోలీసులు అరెస్టు చేశారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కృష్ణా జిల్లా గుడివాడలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను సీఐ దుర్గారావు వెల్లడించారు. గుడివాడ గుడ్‌మెన్ పేటకు చెందిన వివాహిత స్వప్న(30) తన ఎదురింటిలో ఉండే బాలుడి(15)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నెల 19న ఆ బాలుడితో పరారయ్యింది. బాలుడి తండ్రి గత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వప్న, బాలుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి వారిద్దరినీ గుడివాడ తీసుకొచ్చారు. మహిళను బుధవారం గుడివాడ కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆమెకు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. -
పెళ్లయ్యాక నేను, నా భర్త వేరేవాళ్లతో ప్రేమాయణం నడిపాం: సీనియర్ నటి
అలనాటి అందాల తార ముంతాజ్ 70వ దశకంలో ఎన్నో చిత్రాలు చేసి జనాల మెప్పు పొందింది. సోనీకి చిడియా సినిమాతో 11 ఏళ్ల వయసులోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చిందామె. ఆ తర్వాతి కాలంలో రాజేశ్ ఖన్నాకు ఎక్కువ హిట్లు అందించిన ఆమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. అంధియాన్ సినిమా తర్వాత ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పిందీ నటి. 74 ఏళ్ల వయసున్న ఆమె పింక్‌విల్లాతో మాట్లాడుతూ తనే కాదు తన భర్త కూడా పెళ్లయ్యాక వేరొకరితో ప్రేమాయణం నడిపాడని చెప్పుకొచ్చింది. 'మగవాళ్లకు అఫైర్లు ఉండటం సహజం. నాకు తెలిసినంతవరకు మా ఆయనకు ఒక అఫైర్ మాత్రమే ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పాడు. అమెరికాలో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పాడు. కానీ అదే సమయంలో నా మీద ప్రేమను ఒలకబోసేవాడు.. ముంతాజ్, నువ్వు నా భార్యవి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. ఎప్పటికీ నీ చేయి వదిలిపెట్టనని చెప్పేవాడు. నేను చాలా మొండిదాన్ని. అతడు చెప్పినదాన్ని అంత ఈజీగా తీసుకోలేకపోయాను. దీంతో మా మధ్య సమస్యలు మొదలయ్యాయి. అతడి వివాహేతర సంబంధం గురించి తెలిసాక ఒంటరిదాన్నైపోయాననిపించింది. బాధేసింది. వెంటనే ఇండియాకు వచ్చేశాను. బాధలో ఉన్న సమయంలో మనల్ని ఓదార్చినవారితో కొంత క్లోజ్ అవడం సహజం. నా విషయంలోనూ అదే జరిగింది. కానీ ఇదంత సీరియస్ అవకముందే ఈ కథ ముగిసిపోయింది. ఇప్పుడా విషయాలన్నీ మర్చిపోయామనుకోండి. నేను మహారాణిలా బతికాను. నా భర్త నానుంచి పెద్దగా ఏదీ ఆశించలేదు. అతడు ఇప్పటికీ నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. నేను అనారోగ్యానికి గురయ్యానంటే ఏడ్చినంత పని చేస్తాడు' అని చెప్పుకొచ్చింది ముంతాజ్. చదవండి: సర్కారువారి పాట కోసం మహేశ్‌బాబు ఎంత తీసుకున్నాడో తెలుసా? అఖిల్ గేమ్ నేలపాలు, దేవుడున్నాడన్న నటరాజ్ మాస్టర్ -
‘వివాహితుడితో ఏ మహిళైనా హోటల్‌కు వెళ్తుందా’
కోల్‌కతా: భారత క్రికెటర్ మహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ సోమవారం అలిపోర్ కోర్టు మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. తన భర్త షమీపై వివాహేతర సంబంధాల కేసులో హసిన్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు సంబంధించిన వాంగ్మూలాన్ని ఆమె కోర్టులో ఇచ్చారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె నేరుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి వెళ్లారు. కాళీఘాట్‌లోని సీఎం నివాసానికి వెళ్లి.. మమతను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అభ్యర్థనను అధికారులకు అందజేశారు. భర్తకు వ్యతిరేకంగా తాను జరుపుతున్న పోరాటానికి సీఎం మమత మద్దతుగా నిలువాలని ఆమె కోరారు. తన భర్తకు చాలా వివాహేతర సంబంధాలు ఉన్నాయని, తనను చంపాడానికి కూడా షమీ ప్రయత్నించాడని ఆమె మీడియాతో అన్నారు. పాకిస్థానీ యువతి అలీషబాతో తన షమీకి వివాహేతర సంబంధం ఉందని, ఆమె తన వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ‘అలీషబా షమీ స్నేహితురాలు కాదు. అభిమానీ కాదు. ఏ మహిళ అయినా వివాహమైన వ్యక్తితో హోటల్లో గడుపుతుందా? అతని గదికి వెళ్లి.. అతని పడకగదిని పంచుకుంటుందా? నా వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలనే కుట్రతోనే ఆమె హోటల్‌కు వచ్చింది’ అని హసిన్ మీడియాతో తెలిపింది. మరోవైపు పాక్ యువతి అలీషబా మాట్లాడుతూ.. షమీ ఒక క్రికెటర్‌గా తనకు తెలుసునని, ఒక అభిమానిగా ఆయనను కలిసేందుకు మాత్రమే హోటల్‌కు వెళ్లానని వివరణ ఇచ్చారు. -
వివాహేతర సంబంధం. యువకుల దారుణ హత్య
-
వివాహేతర సంబంధం.. యువకుల దారుణ హత్య
-
వివాహేతర సంబంధం.. యువకుల దారుణ హత్య
భూపాలపల్లి: జయశంకర్ జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆగ్రహంతో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇద్దరు యువకులను కిరాతకంగా నరికిచంపారు. ఈ సంఘటన ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కమలాపూర్‌కు చెందిన నర్రా శీను అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన సదరు మహిళ కుటుంబసభ్యులు నాలుగు రోజుల క్రితం శీనును పిలిచి మందలించారు. వివాహేతర సంబంధం మానేయాలని సూచించారు. అతను పెడచెవినపెట్టడంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు శీనును, అతనికి సహకరిస్తున్న జర్సుల కల్యాణ్(బాలు) వ్యక్తిని తుదముట్టించాలని నిర్ణయించారు. శనివారం రాత్రి 10 గంటలకు ఇద్దరిని చర్చలకోసం పిలిచి బాగా మద్యం తాగించి ఇంటివద్దకు తీసుకెళ్ళి కళ్లలో కారం చల్లి గొడ్డళ్లతో నరికి చంపారు. అనంతరం నిందితులు 8 మంది పోలీసులకు లొంగిపోయారు. ఆదివారం ఉదయం శ్యామ్‌లాల్ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు వెంటబెట్టుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రక్తం మడుగులో పడిఉన్న మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు కమలాపురంలోని మృతులు శీను, బాలు బంధువులు నిందితుల ఇళ్లపై ఆదివారం మధ్యాహ్నం దాడిచేసి ఇంట్లోని వస్తువులను ధ్వంసంచేశారు. ఇంట్లో ఫర్నీచర్‌కు నిప్పు పెట్టారు.