Veteran Actress Mumtaz Reveals About Her Extra Marital Affair, Details Inside - Sakshi
Sakshi News home page

Mumtaz On Extramarital Affair: నేనే కాదు, నా భర్త కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు: నటి

Published Sat, May 14 2022 5:41 PM | Last Updated on Sat, May 14 2022 7:07 PM

Veteran Actress Mumtaz Opens Up on Her ExtraMarital Affair - Sakshi

అలనాటి అందాల తార ముంతాజ్‌ 70వ దశకంలో ఎన్నో చిత్రాలు చేసి జనాల మెప్పు పొందింది. సోనీకి చిడియా సినిమాతో 11 ఏళ్ల వయసులోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చిందామె. ఆ తర్వాతి కాలంలో రాజేశ్‌ ఖన్నాకు ఎక్కువ హిట్లు అందించిన ఆమె బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. అంధియాన్‌ సినిమా తర్వాత ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పిందీ నటి. 74 ఏళ్ల వయసున్న ఆమె పింక్‌విల్లాతో మాట్లాడుతూ తనే కాదు తన భర్త కూడా పెళ్లయ్యాక వేరొకరితో ప్రేమాయణం నడిపాడని చెప్పుకొచ్చింది.

'మగవాళ్లకు అఫైర్లు ఉండటం సహజం. నాకు తెలిసినంతవరకు మా ఆయనకు ఒక అఫైర్‌ మాత్రమే ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పాడు. అమెరికాలో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పాడు. కానీ అదే సమయంలో నా మీద ప్రేమను ఒలకబోసేవాడు.. ముంతాజ్‌, నువ్వు నా భార్యవి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. ఎప్పటికీ నీ చేయి వదిలిపెట్టనని చెప్పేవాడు. నేను చాలా మొండిదాన్ని. అతడు చెప్పినదాన్ని అంత ఈజీగా తీసుకోలేకపోయాను. దీంతో మా మధ్య సమస్యలు మొదలయ్యాయి.

అతడి వివాహేతర సంబంధం గురించి తెలిసాక ఒంటరిదాన్నైపోయాననిపించింది. బాధేసింది. వెంటనే ఇండియాకు వచ్చేశాను. బాధలో ఉన్న సమయంలో మనల్ని ఓదార్చినవారితో కొంత క్లోజ్‌ అవడం సహజం. నా విషయంలోనూ అదే జరిగింది. కానీ ఇదంత సీరియస్‌ అవకముందే ఈ కథ ముగిసిపోయింది. ఇప్పుడా విషయాలన్నీ మర్చిపోయామనుకోండి. నేను మహారాణిలా బతికాను. నా భర్త నానుంచి పెద్దగా ఏదీ ఆశించలేదు. అతడు ఇప్పటికీ నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. నేను అనారోగ్యానికి గురయ్యానంటే ఏడ్చినంత పని చేస్తాడు' అని చెప్పుకొచ్చింది ముంతాజ్‌.

చదవండి: సర్కారువారి పాట కోసం మహేశ్‌బాబు ఎంత తీసుకున్నాడో తెలుసా?

అఖిల్‌ గేమ్‌ నేలపాలు, దేవుడున్నాడన్న నటరాజ్‌ మాస్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement