ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,పెద్దవూర(నల్గొండ): కుటుంబ కలహాలతో ఆదివారం రాత్రి నాగార్జునసాగర్ కొత్త వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన మహిళ మృతదేహం సోమవారం మధ్యాహ్నం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని పైలాన్‌కాలనీకి చెందిన రమావత్ అఖిల(25)తల్లిగారింటి వద్ద పైలాన్‌కాలనీలో నివాసం ఉంటోంది.
భర్త దొంగతనాలు చేస్తు తరచుగా జైలుకు వెళ్తుండటం, అతని ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో పాటు ఆమె తండ్రి మరణించటం, తల్లికి భారంగా మారుతున్నానని భావించి జీవితంపై విరక్తి చెందిన అఖిల కొత్త వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు గజ ఈతగాళ్లతో అఖిల దూకిన ప్ర దేశంలో వెతికించగా మృతదేహం లభ్యం అయ్యింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సాగర్ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి సంవత్సరంన్నర, మూడున్నరేళ్ల వయస్సున్న కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నర్సింహారావు తెలిపారు.
చదవండి: జైలులో స్నేహం.. బయటకు వచ్చాక..
Comments
Please login to add a commentAdd a comment