
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
కోరుట‍్ల(కరీంనగర్ జిల్లా)
కరీంనగర్ జిల్లా కోరుట‍్లకి చెందిన మాధురి(23) అనే వివాహిత భర‍్త వేధింపులు తాళలేక ఆదివారం ఉదయం ఉరివేసుకుని ఆత‍్మహత‍్య చేసుకుంది. ఆమె భర‍్త శ్రీధర్ ప్లాస్టిక్ దుకాణం నిర‍్వహించేవాడు. వీరికి నాలుగు నెలల క్రితమే వివాహమైంది. వ‍్యసనాలకు బానిసైన భర‍్త తరుచూ వేధిస‍్తుండడంతో జీవితంపై విరక్తి చెంది మాధురి ఆత‍్మహత‍్య చేసుకుందని, తమ కుమార్తె మరణానికి అల్లుడే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించిన మృతదేహాన్ని పోస్టుమార‍్టం నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.