కమలాపూర్‌లో కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్య
Mar 5 2017 8:47 PM | Updated on Sep 5 2017 5:17 AM
పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధి కమలాపూర్‌లో కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.స్థానిక ఎస్‌ఐ విజయరావ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జాడు విఠల్ భార్య రేణుక(28) కుటుంబ సమస్యలతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement