హైదరాబాద్ సిటీ: ఈ నెల ప్రారంభంలో కనిపించకుండ పోయిన ఓ వివాహిత వాటర్ ట్యాంక్ లో శవమై కనిపించడం నగరంలో కలకలం సృష్టించింది. వివరాలు.. సరూర్‌నగర్‌లోని వాటర్ ట్యాంక్‌లో ఓ మహిళ శవం ఆదివారం బయటపడింది. ఆమె వయసు 32 నుంచి 38 మధ్య ఉండవచ్చుని భావిస్తున్నారు. మృతురాలు మెడలో మంగళసూత్రం, గోధుమ రంగు సాక్సులు, పసుపు రంగు నైటీ ధరించి ఉంది. మహిళ మరణించి మూడు లేక నాలుగు రోజులయి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఎవరైనా ఆమెను హత్య చేసి ట్యాంకులో పడవేశారా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వాటర్ ట్యాంక్‌లో మహిళ శవం కలకలం
Published Sun, Mar 8 2015 10:14 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
Advertisement
Advertisement