ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం: సంసారం అన్నాక చిన్నచిన్న కలహాలు సాధారణమే. కానీ ఇటీవలకాలంలో చిన్న చిన్నకలహాలే పెద్దవిగా మారి తమ జీవితాల్ని నాశనం చేసుకునే పరిస్థితికి తెచ్చుకుంటున్న ఘటనలను చూస్తున్నాం. అచ్చం అలాంటి ఘటనే కేరళలో చోటు చేసుకుంది.
కొట్టాయం జిల్లాలోని పాలా పట్టణాంలో సతీష్ అతని భార్య ఆశా నివశిస్తున్నారు. 2006లో వీళ్ల వివాహం జరిగింది. సతీష్ ఒక ఐస్‌క్రీమ్ పరిశ్రమలో పరిచేస్తున్నాడు. 2012లో ఈ జంట పాలక్కాడ్‌లో సొంత ఇంటిని కూడా కొనుగోలు చేశారు. అయితే ఆశ.. చిన్ని చిన విషయాలకు భర్తతో తరుచు గొడవపడుతూ ఉండేది. గత కొన్ని రోజులుగా తాను బాగా అలిసిపోయి అనారోగ్యానికి గురవుతున్నట్లు సతీష్ గమనించాడు. దీంతో అతను వైద్యుడిని సంప్రదించాడు కూడా. అయితే షుగర్ లెవల్స్ పడిపోవడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పాడు.
ఈ మేరకు సెప్టెంబర్ 2021 నుంచి ఇంటిలో ఆహారం తినడం మానేశాడు. దీంతో అతని ఆరోగ్యం క్రమంగా మెరుగవ్వడం మొదలైంది. దీంతో అతను తన స్నేహితుడితో తన భార్య ఆహారంలో ఏదైన కలుపుతుందేమోనని సందేహం వ్యక్త చేయడమే కాక తన భార్య నుంచి విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా అభ్యర్థించాడు. ఈ మేరకు సతీష్ స్నేహితుడు ఆశ వద్దకు వెళ్లి విచారించగా.. తాను ఆహారంలో కొన్ని మందులు కలుపుతున్నట్లు వెల్లడించింది.
పైగా ఆ మందుల వివరాలను వాట్సాప్‌లో పంపించింది. అంతేకాక సతీష్ ఇంటి సీసీఫుటేజ్‌లో కూడా ఆశా ఏవో మందులు కలుపుతున్నట్లు రికార్డు అయ్యింది. దీంతో సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆశా తన భర్త తినే భోజనం, తాగే నీళ్లలో కూడా మందులు కలుపుతున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక ఆమెను అరెస్టు చేసి విచారించడం మొదలు పెట్టారు.
(చదవండి: భర్తతో విడాకులు.. మరో వ్యక్తితో సహజీవనం.. చిన్నారి పాలకోసం ఏడుస్తోందని..)
Comments
Please login to add a commentAdd a comment