కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా అవుసులపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది
మెదక్: కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా అవుసులపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన బాలగౌడ్‌కు ఆరేళ్ల క్రితం స్వాతి(23)తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం భార్య భర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.
అనంతరం బాలగౌడ్ బయటకు వెళ్లిన తర్వాత స్వాతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి బంధువులు మాత్రం భర్తే చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించడానికి యత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.