committed
-
గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : గోదావరిలోకి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం జగ్గంపేట మండలం లోవకొత్తూరు గ్రామానికి చెందిన గరిక లోవదుర్గా నాగార్జున (25) బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం రోడ్-కం-రైలు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకాడు. 2013లో తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ట్రిబుల్ ఐటీ చదివిన నాగార్జున బ్యాంక్ టెస్ట్‌లకు కోచింగ్ తీసుకుంటూ అతడి గ్రామంలోని దారాల ఫ్యాక్టరీలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో రాజమహేంద్రవరం, కాకినాడలో వైద్యం చేయించినట్టు మృతుడి తండ్రి విశ్వనాథం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గంట సమయంలో ఇంటిలో భోజనం చేసి ఫ్యాక్టరీ పని ఉందని చెప్పినట్టు తండ్రి చెప్పారు. ఫ్యాక్టరీ మోటారు సైకిల్‌పై రాజమహేంద్రవరం చేరుకున్న అతడు.. అక్కడ మోటారు సైకిల్, జేబులోని రూ.3000, సెల్‌ఫోన్ ఉంచి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకేశాడు. అతడిని పరిశీలించిన వారు మోటారు సైకిల్ వద్ద ఉన్న సెల్‌ఫోన్, నగదు తీసుకువెళ్లిపోయారు. మృతుడి సెల్‌ఫోన్ నుంచి ఇంటికి ఫోన్ చేసి మీ కుమారుడు బ్రిడ్జి మీద నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులకు తెలిపారు. విషయాన్ని వారు రాజమహేంద్రవరంలోని బంధువులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ ఎస్సై నాగార్జున రాజు, పోలీసులు బ్రిడ్జి మీద మృతుడు వదిలిన మోటారుసైకిల్‌ను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు మృతదేహం కోసం జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. శోక సముద్రంలో కుటుంబ సభ్యులు మృతుడు నాగార్జున తండ్రికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. కుమార్తె పెద్దది కాగా కుమారులలో నాగార్జునే ఇంటికి పెద్ద కుమారుడు. ఇతడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడని అనుకుంటున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడడం కుటుంబ సభ్యులను కలచివేసింది. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
హాస్టల్లో ఉరివేసుకుని బలవన్మరణం కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళన పరిస్థితి ఉద్రిక్తం, పోలీసుల భారీ బందోబస్తు ఖమ్మం క్రైం : నగరంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని తాను ఉంటున్న హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మచేసుకున్న ఘటన బుధవారం సంచలనం సృష్టించింది. కళాశాల వారి వేధింపులతోనే విద్యార్థిని మృతిచెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా కురవి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పగడాల భవాని (19) నెహ్రూనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె ఆ కళాశాలకు సంబంధించిన హాస్టల్లోనే ఉంటోంది. బుధవారం కళాశాలలో రెండు క్లాసుల అనంతరం విరామ సమయంలో తాను ఉంటున్న హాస్టల్ గదికి వెళ్లింది. ఆ సమయంలో హాస్టల్లో స్వీపర్ మాత్రమే ఉంది. హాస్టల్ గదికి వెళ్లిన భవాని ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో స్వీపర్ ఆమె ఉంటున్న గది వద్దకు వెళ్లి చూడగా.. తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలో నుంచి చూడగా భవాని ఫ్యాన్‌కు వేళ్లాడుతూ కనిపించింది. వెంటనే స్వీపర్ కేకలు వేస్తూ కళాశాల సిబ్బందిని పిలవడంతో వారు హుటాహుటిన వచ్చి తలుపులు నెట్టి లోపలికి వెళ్లి చూడగా.. అప్పటికే భవాని మృతి చెందింది. దీంతో కళాశాల సిబ్బంది టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా.. సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ఓంకార్‌యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆమె మృతదేహం పక్కన మంచంలో ఓ లేఖ కూడా రాసి ఉంది. ఆ లేఖలో తన పెద్దమ్మ ఇటీవల చనిపోయిందని, ఆమె మృతితో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, దీంతో చదువుకోలేకపోతున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉంది. ఆ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి తల్లిదండ్రులు రాణెమ్మ, వెంకటరెడ్డికి సమాచారం అందించారు. తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు మార్చురీ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. తమ కుమార్తె కళాశాల సిబ్బంది వేధింపుల వల్లనే చనిపోయిందని, కావాలనే లేఖను పక్కన పెట్టారని, మృతదేహాన్ని వెంటనే తరలించడం ఏమిటని ఆందోళన చేశారు. విద్యార్థి సంఘం నాయకులు భవాని కుటుంబానికి న్యాయం చేసి కళాశాలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కళాశాల వద్ద, మార్చురీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అనంతరం భవాని మృతిపై విచారణ చేస్తామని కుటుంబ సభ్యులకు పోలీసులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్చురీ వద్ద అవాంచనీయ ఘటనలు జరగకుండా మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ వెంకన్న ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మరో కౌలురైతు గుండె ఆగింది
– నారు మోస్తూ పొలంలోనే – ప్రాణాలొదిలిన వైనం – జుజ్జూరు వద్ద విషాదం – ఆర్థిక ఇబ్బందులే కారణం! జుజ్జూరు (వీరులపాడు): పొలం పనులు చేస్తూ గుండెపోటుతో కౌలు రైతు మృతి చెందిన సంఘటన నందిగామ మండలంలో జరిగింది. జుజ్జూరు గ్రామానికి చెందిన ప్రత్తిపాటి దావీదు (50) నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. మంగళవారం ఉదయం మాగాణి పొలంలో నారు మూటలు మోస్తుండగా ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో పొలంలోనే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కూలీలు ఆయనను ఆటోలో జుజ్జూరు ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్ళారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. కన్నీరుమున్నీరైన కుటుంబం మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటి పెద్ద మరణంతో భార్య, కుమారుడు, కూతురు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సొంతపొలం లేకపోయినప్పటికీ కౌలుకు తీసుకొని సాగు చేస్తూ జీవిస్తున్నామని, ఇంక మాకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. దొరకని పంట రుణాలు! వ్యవసాయమే జీవనాధారమైన దావీదు వరుసగా కౌలు సేద్యంలో నష్టాలు పాలైనట్లు బంధువులు తెలిపారు. రూ. 4 లక్షల అప్పుల భారం కూడా ఉందని, పలు బ్యాంకుల్లో పంట రుణాల కోసం ప్రయత్నిస్తుంటే నిబంధనల పేరుతో తిరస్కరించారని తెలిపారు. దీంతో కొంతకాలంగా తీవ్ర ఆవేదనకు లోనవుతుండేవాడని తెలిపారు. అçప్పుడే అప్పులోళ్ల ఒత్తిడి కాగా, రైతు మరణవార్త తెలియగానే కొందరు రుణదాతలు తమకు దావీదు అప్పు తీసుకున్నాడని, చెల్లించాల్సిం దేనని నోట్లతో సహా ఇంటికి రావడంతో బంధుమిత్రులు దిగ్భ్రాంతికి గుర య్యారు. మనిషి పోయిన విషాదంలో ఉంటే రుణదాతలు ఇలా చేయడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
చందర్లపాడు : కుటుంబ కలహాల నేపధ్యంలో ఓ వివాహిత ఆత్యహత్య చేసుకున్న ఘటన మండలంలోని కోనాయిపాలెంలో జరిగింది. సేకరించిన సమాచారం మేరకు నందిగామ పట్టణం చక్రాల బజార్‌కు చెందిన అల్లి లక్ష్మి(35) ఆదివారం మధ్యాహ్నం సమయంలో కోనాయిపాలెం గ్రామంలోని చెరువులోకి దిగి ఆత్మహత్య చేసుకుంది. విషయం గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. చెరువులో నీటిలోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న ఏఎస్ఐ నూతలపాటి నాగేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ పరిశోధకుడిది ఆత్మహత్యే..!
ఇటీవల అనుమానాస్పద స్థితిలో చనిపోయిన పారానార్మల్ సొసైటీ స్థాపకుడు గౌరవ్ తివారీ ది ఆత్మహత్యేనని పోలీసులు తేల్చి చెప్పారు. అతడు తన ఇంట్లోని బాత్రూమ్ లో స్వయంగానే ఉరి వేసుకున్నాడని, అది ఆత్మహత్యేనని ప్రాథమిక శవపరీక్ష నివేదిక ఆధారంగా తేలినట్లు తెలిపారు. అతడి మరణం వెనుక ఏదైనా కుట్ర జరిగిందా అన్న కోణంలో విచారించిన పోలీసులు... అతడు ఆత్మహత్య చేసుకున్న సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నన్లు చెప్పారు. భారత్ లో ప్రేతాత్మల పరిశోధకుడిగా గుర్తింపు పొందిన గౌరవ్ తివారీ ఢిల్లీలోని తన ఫ్లాట్ లో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. 2009 లో ప్రారంభమైన ఇండియన్ పారా నార్మల్ సొసైటీ సీఈవో గౌరవ్ తివారీ.. సొసైటీ తరపున మూఢనమ్మకాలు, ప్రేతాతమ్మల భయంతో బాధపడే వారికి అవగాహన కల్పించి, వారిలోని భయాలను పోగెట్టేవాడు. 32 ఏళ్ళ తివారీకి తల్లిదండ్రులు, భార్య ఉన్నారు. అయితే అనుమానాస్పద స్థితిలో చనిపోయిన గౌరవ్ ది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారించారు. చివరికి ప్రాథమిక శవపరీక్ష నివేదికల ఆధారంగా ఆత్మహత్యేనని ధృవీకరించారు. అతడి మరణం వెనుక ఎటువంటి కుట్ర జరగలేదని తెలిపారు. గౌరవ్ బాత్రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి భార్య సహా తల్లిదండ్రులు తెలిపారని, ఓ గుడ్డతో ద్వారకా ఫ్లాట్ లోని బాత్రూమ్ లో ఇంట్లో అందరూ ఉన్న సమయంలోనే ఉరి వేసుకున్నట్లు తెలిపారని ఓ పోలీస్ సీనియర్ అధికారి వెల్లడించారు. తివారీ తరచుగా రాత్రి సమయంలో పని చేసే వాడని, సంపాదన కూడా పెద్దగా లేదని తెలిపిన కుటుంబ సభ్యులు అతడు చేపట్టిన కార్యకలాపాలపై ఏమాత్రం సంతోషంగా లేనట్లు విచారణలో తెలిసిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. -
భార్య పుట్టింటికి వెళ్లిందని..
శంషాబాద్(రంగారెడ్డి): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లడంతో.. మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మనోహర్(25)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మనోహర్‌తో గొడవపడిన భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన మనోహర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అపార్ట్మెంట్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని ఉప్పల్‌లో సోమవారం వెలుగుచూసింది. ఉప్పల్ ఆదర్శనగర్‌లోని జయధీర్ అపార్ట్మెంట్ 5వ అంతస్థులో ఉండే తన అన్న నివాసానికి వచ్చిన ప్రభాకర్‌రెడ్డి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
వివాహిత ఆత్మహత్య
మెదక్: కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా అవుసులపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన బాలగౌడ్‌కు ఆరేళ్ల క్రితం స్వాతి(23)తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం భార్య భర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అనంతరం బాలగౌడ్ బయటకు వెళ్లిన తర్వాత స్వాతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి బంధువులు మాత్రం భర్తే చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించడానికి యత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. -
భార్య, కూతురు గొంతుకోసి, వ్యక్తి ఆత్మహత్య
రాంచి: జార్ఖండ్ లోని రాంచిలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. భార్యా కూతురిని హతమార్చి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం కళ్యాణ్ పుర్ కాలనీకి చెందిన వినయ్ గోరాయ్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ముందు భార్య, కుమార్తెను గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
టేకులపల్లి: ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కొత్తతండాలో దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సుధాకర్ (38) అనే వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికే సుధాకర్ మృతి చెంది ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులే అతని ఆత్మహత్యకు కారణమని సమాచారం. -
ఇంటిపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
చైతన్యపురి (హైదరాబాద్) : ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దిల్‌సుఖ్‌నగర్‌లోని కమలానగర్లో డీసీసీ బ్యాంక్ వద్ద మంగళవారం ఉదయం జరిగింది. తుకారామ్ గేట్ లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఇన్స్పెక్టర్ కూతురు చంద్రిక.. స్థానిక నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. మంగళవారం ఉదయం ఆమె నివసిస్తున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని పనిమనిషి చూసే వరకు కుటుంబ సభ్యులు గమనించలేదు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో కాలేజీ లెక్చరర్ల వేధింపులే కారణమా? లేక ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. -
గుండెపోటుతో టెకీ మృతి, బాల్కనీలోంచి దూకేసిన భార్య
న్యూఢిల్లీ: నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో భర్త చనిపోవడాన్ని తట్టుకోలేని భార్య భవనంపై దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వీరి అయిదేళ్ల చిన్నారి అనాధగా మారిన వైనం స్థానికులను కలచివేసింది. వివరాల్లోకి వెళితే..అనురాగ్ అగర్వాల్ (39), మోనికా (36) భార్యభర్తలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనురాగ్ కు మంగళవారం తీవ్రమైన గుండెనొప్పి రావడంతో ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 1.30గం.లకు చనిపోయాడు. ఈ వార్త విన్న వెంటనే మోనిక నోయిడా ప్రతీక్ లారెల్ లోని తమ నివాసానికి వెళ్లింది. 8వ అంతస్తులోని తమ ఫ్లాట్ బాల్కనీలో నుంచి కిందకు దూకేసింది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆమెను ఇరుగుపొరుగువారు, సెక్యూరిటీ సిబ్బంది ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. భర్త చనిపోయిన ఆసుపత్రిలోనే సుమారు 2.30 గంటలకు ఆమె కూడా ప్రాణాలు విడిచింది. అనురాగ్, మోనిక లకు ఏడేళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులకు అయిదేళ్ల పాప కూడా ఉంది. భర్త చనిపోయిన షాక్ లో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీస్ అధికారి పంకజ్ పంత్ తెలిపారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించిన పోలీసులు బంధువులకు సమాచారం అందించారు. కాగా నోయిడా సెక్టార్ లోనే గత వారం ఎసీపీ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకోగా , అతని భార్య బాల్కనీలోంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది. ఆ సంఘటనను మరువకముందే ఇదే ప్రాంతంలో మరో దంపతులు విగతజీవులుగా మారడం స్థానికంగా విషాదాన్ని నింపింది. -
తిరిగి కడలి కడుపులోకి చిరుమీనాలు
ఒడిశా ముఠాలపై చర్యలకు పూనుకున్న అధికారులు అనుచితంగా వ్యవహరించిన కొందరు మత్స్యకార నేతలు కొత్తపల్లి : జిల్లాలోని తీరప్రాంతంలో తిష్టవేసి, సముద్రంలో చేపపిల్లలను వేటాడి, సీడ్‌గా అమ్ముకుంటున్న ఒడిశా ముఠాలపై మత్స్యశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆ ముఠాల కార్యకలాపాలపైనా, వారికి స్థానిక మత్స్యకార నాయకుల్లో కొందరు సహకరిస్తున్న వైనం పైనా సోమవారం ‘సాక్షి’లో ‘చిరు మీనాలపై పొరుగు వల’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కాగా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశాల మేరకు మత్స్యశాఖ అధికారులు కొత్తపల్లి మండలం మూలపేట చిప్పలేరు వద్ద జరుగుతున్న చేపపిల్లల విక్రయూల్ని అడ్డుకున్నారు. వాటిని నిల్వ చేసిన ప్రాంతాల్లో దాడి చేసి, చేపపిల్లలను సముద్రంలో విడిచిపెట్టారు. ఒడిశా ముఠాలకు అండగా నిలుస్తున్న మత్స్యకార నాయకులు అధికారులను అడ్డగించడంతో పాటు వార్తాసేకరణకు వెళ్లిన విలేకరులను దుర్భాషలాడుతూ, కెమెరాలు లాక్కుంటూ దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల రంగప్రవేశంతో వారు వెనక్కు తగ్గారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ డీడీ కల్యాణ్ మాట్లాడుతూ జీవనోపాధికి మూలమైన చేపపిల్లలను =మత్స్యకారులే అమ్ముకోవడం బాధాకరమన్నారు. చేప పిల్లలను పట్టుకోవడం చట్టరీత్యా నేరమని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదికను కలెక్టర్‌కు అందిస్తామన్నారు. ఆయన వెంట ఏడీ కనకరాజు, స్థానిక మత్స్యశాఖాధికారి పవన్‌కుమార్ ఉన్నారు. అవగాహన సదస్సుల నిర్వహణ: ఎమ్మెల్యే వర్మ సొమ్ములకు ఆశపడి చేపపిల్లలను అమ్మడం నేరమని స్థానిక ఎమ్మెల్యే వర్మ అన్నారు. చేపపిల్లల అక్రమ తరలింపుపై సోమవారం పత్రికల్లో ప్రచురించిన కథనాలకు స్పందించిన ఎమ్మెల్యే వర్మ సోమవారం ఉదయం కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడుతూ కొందరు మత్స్యకారులకు అవగాహన లేక, కొందరు నాయకులు డబ్బులకు ఆశపడి చేపపిల్లల వేట, తరలింపులకు సహకరిస్తున్నా అది నేరమన్నారు. దీనిపై అవగాహన సదస్సులను ఏర్పాటు చే స్తామని చెప్పారు. -
ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ.. సెల్ఫీ వీడియో
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో విషాదం చోటు చేసుకుంది. జూలపల్లి మండల కేంద్రంలోని బ్రిలియంట్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న సంతోష్ రెడ్డి (15) అనే విద్యార్థి ఫీజు కట్టలేనన్న మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫోన్లో వీడియో తీసి ఆత్మహత్యకు గల కారణాలు వివరించాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సంతోష్ రెడ్డి స్వగ్రామం ధర్మారం మండలం అబ్బాపూర్. ఫీజు కట్టలేదని పాఠశాలలో ఉపాధ్యాయుడు బయట నిలబెట్టడంతో సదరు విద్యార్థి మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికి వచ్చిన తర్వాత తనకు బాధ కలిగిందని, మనకు ఫీజు కట్టే స్థోమత లేదని బాధపడుతూ.. తాను చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా రికార్డింగ్ చేసి అదృశ్యమయ్యాడు. గురువారం రాత్రి పెద్దపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్‌పై గుర్తుతెలియని శవం లభించగా విచారణ చేపట్టిన పోలీసులు అది సంతోష్ రెడ్డి మృతదేహంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంతోష్ రెడ్డి మృతితో అబ్బాపూర్ గ్రామంలో ఇటు బ్రిలియంట్ మోడల్ స్కూల్ లో విషాదం నెలకొంది. -
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్(భిక్కనూర్): పురుగుల మందు తాగి మల్లయ్య అనే రైతు బుధవారం సాయంత్రం ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ సంఘటన భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో జరిగింది. క్రాప్‌లోన్‌ను బ్యాంక్ అధికారులు రిజెక్ట్ చేయడమే ఆత్మహత్యా యత్నానికి కారణంగా భావిస్తున్నారు. బాధితుడ్ని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.