కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లడంతో.. మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
శంషాబాద్(రంగారెడ్డి): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లడంతో.. మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మనోహర్(25)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మనోహర్‌తో గొడవపడిన భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన మనోహర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.