ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కొత్తతండాలో దారుణ ఘటన జరిగింది.
టేకులపల్లి: ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కొత్తతండాలో దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సుధాకర్ (38) అనే వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికే సుధాకర్ మృతి చెంది ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులే అతని ఆత్మహత్యకు కారణమని సమాచారం.