చైతన్యపురి (హైదరాబాద్) : ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దిల్‌సుఖ్‌నగర్‌లోని కమలానగర్‌లో డీసీసీ బ్యాంక్ వద్ద మంగళవారం ఉదయం జరిగింది. తుకారామ్ గేట్ లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్ కూతురు చంద్రిక.. స్థానిక నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.
మంగళవారం ఉదయం ఆమె నివసిస్తున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని పనిమనిషి చూసే వరకు కుటుంబ సభ్యులు గమనించలేదు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో కాలేజీ లెక్చరర్ల వేధింపులే కారణమా? లేక ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
ఇంటిపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
Published Tue, Jan 5 2016 7:10 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement