వివాహితపై ఆర్‌ఎంపీ అఘాయిత్యం | rmp doctor illegal behavior on married women | Sakshi
Sakshi News home page

వివాహితపై ఆర్‌ఎంపీ అఘాయిత్యం

Published Thu, Apr 14 2016 9:50 PM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

rmp doctor illegal behavior on married women

మరిపెడ(వరంగల్): పవిత్ర మైన వైద్య వృత్తికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించాడో వైద్యుడు.. వైద్యం కోసం తన వద్దకు వచ్చిన వివాహిత పై ఓ ఆర్‌ఎంపీ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో గురువారం రాత్రి వెలుగుచూసింది. మండలంలోని కాకరవాయి పంచాయతి తేనెకుంట తండాకు చెందిన ఓ నవ దంపతులు పిల్లలు పుట్టకపోవడంతో.. మండల కేంద్రంలోని ఆర్‌ఎంపీ వద్దకు వచ్చారు.

బుధవారం పరీక్షలు నిర్వహించిన అతను తిరిగి గురువారం కూడా ఇద్దర్ని మరోసారి రమ్మన్నాడు. దీంతో భార్య భర్తలిద్దరు ఈ రోజు సాయంత్రం ఆస్పత్రికి వచ్చారు. వారిద్దరిని వేరు వేరు గదుల్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పిన వైద్యుడు ఇద్దరికి మత్తు మందు ఇచ్చి ఆమె పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు వైద్యుడికి దేహ శుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement