అన్నానగర్: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తండ్రిని శనివారం కుమారుడు హత్య చేశాడు. కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ధర్మపురి జిల్లా పెన్నగరం సమీపంలో కృష్ణాపురం ఎంకే నగర్‌కి చెందిన మునియప్పన్ కూలీ కార్మికుడు. ఇతనికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. అందరికీ వివాహం జరిగింది. ఇతని భార్య మృతి చెందడంతో ఒంటరిగా నివసిస్తున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తున్న నాల్గో కుమారుడు వేలన్ (45) కూలిపని చేస్తూ వస్తున్నాడు. ఇతనికి మల్లికా (40) అనే భార్య ఉంది.
శుక్రవారం మద్యం సేవించి తండ్రిని చూడడానికి వెళ్లాడు. అక్కడ నిద్రపోతున్న మునియప్పన్ మీద రాయి వేసి హత్య చేశాడు. తరువాత తండ్రిని హత్య చేసినట్లు తన సహోదరుడికి శనివారం తెలిపాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వేలన్‌ని అరెస్టు చేశారు. అతను ఇచ్చిన వాంగ్మూలంలో తన భార్య మల్లికతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, దీన్ని ఖండించినా అతను వినలేదని తెలిపాడు. తానే తండ్రి అని చూడకుండా అతనిపై రాయి వేసి హత్య చేసినట్టు వేలన్ ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment