
అరెస్టయిన రాజేశ్వరి, సత్య, మురుగవేల్, ఇన్‌సెట్‌లో హత్యకు గురైన ధనశేఖర్
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తండ్రిని తల్లితో కలిసి హత్య చేసిన కుమార్తె సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. విల్లుపురం సమీపంలోని వడవంపాళయంకు చెందిన ధనశేఖర్ (45) ఆలయ పూజారి. ఈ నెల 12న ఇంట్లో హత్యకు గురయ్యాడు. ఫిర్యాదు మేరకు విల్లుపురం ఎస్పీ రాధాకృష్ణన్ అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ధనశేఖర్ భార్య రాజేశ్వరి (40), ఆమె కుమార్తె సత్య (20), పుదుచ్చేరికి చెందిన మురుగవేల్ (30)లను విచారణ చేశారు. విచారణలో సత్యకు వివాహమైన కొద్ది నెలలకే భర్త నుంచి విడిపోయి పుట్టింటికి వచ్చింది. (తనను వ్యభిచారిగా చిత్రీకరించి.. )
భర్తకు బంధువు అయిన మురుగవేల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అతను ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఈ సంగతి తెలుసుకున్న ధనశేఖర్ కుమార్తెను నిలదీశాడు. ఈ విషయంగా భార్యతో సైతం గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఈ నెల 12న తెల్లవారుజామున 1.45 గంటలకు ఇంటికి వచ్చిన ధనశేఖర్ భార్య, కుమార్తెతో గొడవపడి నిద్రపోయాడు. తల్లి, కుమార్తె అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. నిద్రపోతున్న తండ్రిని సత్య కత్తితో పొడిచింది. రాజేశ్వరి కత్తిపీటతో గొంతు కోయడంతో అతను మృతి చెందాడు. మురుగవేల్‌ను ఇంటికి రప్పించి హత్య చేసిన ఆనవాళ్లు లేకుండా చేశారు. పోలీసులు రాజేశ్వరిని, సత్య, మురుగవేల్‌ను గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం ముగ్గురిని విల్లుపురం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment