
దగ్ధమైన కారు
చెన్నై,అన్నానగర్: క.పరమత్తి సమీపంలో వివాహేతర సంబంధం వదలని పారిశ్రామికవేత్తని బుధవారం హత్య చేసి కారులో పెట్టి దహనం చేసిన భార్య, కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. కరూర్ జిల్లా క.పరమత్తి సమీపం కుప్పం – వేలమ్‌పాలైయమ్ వెళ్లే రోడ్డు పక్కన బుధవారం ఓ కారు కాలిన స్థితిలో నిలబడి ఉంది.దీన్ని చూసిన స్థానికులు క.పరమత్తి పోలీసు స్టేషన్‌కి సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చూశారు. అప్పుడు కారు వెనుక భాగంలో కాలిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం ఉంది. అతను హత్యకు గురై ఉండవచ్చని పోలీసులకు అనుమానం వచ్చింది. కారు నంబర్‌ను బట్టి పోలీసులు విచారణ చేశారు.
ఇందులో మృతుడు నొయ్యల్‌కి చెందిన రంగస్వామి (51) అని, రియల్ ఎస్టేట్ పారిశ్రామిక వేత్త అని తెలిసింది. అతని ఇంటికి పోలీసులు నేరుగా వెళ్లి విచారణ చేశారు. ఇందులో రంగస్వామి భార్య కవితా (41), కుమారుడు ఆశ్విన్‌కుమార్ (19) అని తెలిసింది. రంగస్వామికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండడం వల్ల అతనిని కవిత, అశ్విన్‌కుమార్ ఇద్దరూ కలసి ఇంట్లోనే గొంతు నులిమి హత్య చేసి, తరువాత మృతదేహాన్ని కారులో తీసుకొని వెళ్లి తగలబెట్టినట్టు తెలిసింది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి కవిత, అశ్విన్‌కుమార్ ఇద్దర్నీ అరెస్టు చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment