
చెన్నై, అన్నానగర్: విరుదునగర్‌లో ప్రియురాలిని గొంతు కోసి హత్యచేసిన వ్యక్తి మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. రాజపాళ యం శంకరన్ కోవిల్ రోడ్డులోని ఎంఆర్‌నగర్ కు చెందిన మురుగన్ (39), రామలక్ష్మి (35) దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి గోమతినాయగం (09) అనే కుమారుడు, చందనమారి (06) అనే కుమార్తె ఉన్నారు. ఐదేళ్ల క్రి తం రాజపాళయంలో కాపురం పెట్టారు. మురుగన్ కోవైలోని ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు. ఈ క్రమంలో రామలక్ష్మికి, భర్త బంధువు షణ్ముగం (40)తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
షణ్ముగంకు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో రామలక్ష్మి నగదు కావాలని షణ్ముగంను ఇబ్బంది పెట్టేది. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మరోసారి వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన షణ్ముగం వెంటతెచ్చుకున్న కత్తితో గొంతుకోశా డు. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం షణ్ముగం రాజపాళయం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు రామలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి షణ్ముగంను విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment