
లక్డీకాపూల్ : ఒక్క మిస్‌డ్ కాల్ ఇస్తే..ఇంటి వద్దకే పండ్లు సరఫరా చేస్తున్న ‘వాక్ ఫర్ వాటర్ సంస్థ’ ప్రయత్నాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు. రైతులను ప్రోత్సాహించే దిశగా జరుగుతున్న ఈ ప్రక్రియకు ప్రజలు చేయూత నివ్వాలన్నారు. ప్రజలు కొనుగోలు చేసే ప్రతి పండు రైతుక అండగా నిలవటంలో భాగమన్నారు. లాక్‌డౌన్ కారణంగా చేతికి వచ్చిన పండ్లు తోటల్లోనే మగ్గిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు, వినియోగదారులకు వారధిగా నిలుస్తున్న ‘వాక్ ఫర్ వాటర్’ వ్యవస్ధాపకులు కరుణాకర్ రెడ్డి కృషిని మంత్రి కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment