Walk for Water
-
ఒక్క మిస్డ్ కాల్.. ఇంటికే పండ్లు
లక్డీకాపూల్ : ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే..ఇంటి వద్దకే పండ్లు సరఫరా చేస్తున్న ‘వాక్ ఫర్ వాటర్ సంస్థ’ ప్రయత్నాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు. రైతులను ప్రోత్సాహించే దిశగా జరుగుతున్న ఈ ప్రక్రియకు ప్రజలు చేయూత నివ్వాలన్నారు. ప్రజలు కొనుగోలు చేసే ప్రతి పండు రైతుక అండగా నిలవటంలో భాగమన్నారు. లాక్డౌన్ కారణంగా చేతికి వచ్చిన పండ్లు తోటల్లోనే మగ్గిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు, వినియోగదారులకు వారధిగా నిలుస్తున్న ‘వాక్ ఫర్ వాటర్’ వ్యవస్ధాపకులు కరుణాకర్ రెడ్డి కృషిని మంత్రి కొనియాడారు. -
నీటిని పొదుపు చేద్దాం
నీటిని పదిలంగా వాడుకుని, భవిష్యత్తును కాపాడుకుందామని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా కేబీఆర్ పార్కులో మంగళవారం ఉదయం జరిగిన వాక్ ఫర్ వాటర్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. వాటర్ హార్వెస్టింగ్ పాయింట్లను నిర్మించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి చెప్పారు. బంగారం కంటే విలువైన నీటిని జాగ్రత్తగా వాడుకుందామని ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రామ్మోహన్, సినీ నటుడు, రచయిత తనికెళ్ల భర ణి పాల్గొన్నారు.