
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ప్రతి ఊళ్లోనూ సందడి నెలకొంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు.. సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా గురువారం కూడా ఇంటింటికీ వెళ్లారు.
ప్రస్తుత ప్రభుత్వంలో గత నాలుగేళ్లుగా జరిగిన అభివృద్ధితో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేస్తూ వివరించారు. ఈ నాలుగు సంవత్సరాల్లో తమకు ఏ మేరకు లబ్ధి కలిగిందో ప్రజలే ఆనందంగా నేతలతో పంచుకున్నారు. కులం, మతం, వర్గం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తుండటం ఒక్క సీఎం జగన్‌కే సాధ్యమైందని ఊరూరా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అవ్వాతాతలు స్పష్టీకరిస్తున్నారు.
మరోసారి వైఎస్ జగన్ సీఎం అయితేనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభమైన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. ఏప్రిల్ 19 నాటికి 70 లక్షల మంది 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment