Gruha Saradhi
-
మూడు వ్యవస్థలూ సమన్వయంతో ముందుకు
వేమూరు: ప్రజా ప్రయోజనాలు, సంక్షేమమే లక్ష్యంగా వలంటీర్లు, గృహ సారథులు, జగనన్న సచివాలయ కన్వినర్లు సమన్వయంతో పనిచేయాలని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, దక్షిణ కోస్తా జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి సూచించారు. మూడు వ్యవస్థలూ సంక్షేమ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం వలివేరులో మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులతో కలసి శుక్రవారంనిర్వహించిన సమావేశంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. వలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వినర్లు నుంచి సలహాలు, సూచనలను స్వీకరించి సందేహాలను నివృత్తి చేశారు. గృహ సారథులకు ఇన్సూరెన్స్‌తోపాటు ఏ విధంగా న్యాయం చేయాలనే అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తమ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 87%కి పైగా గృహాలు ప్రభుత్వం నుంచి ఏదో ఒక రూపంలో లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని, పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిందని చెప్పారు. గ్రామస్థాయి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే దిశగా సీఎం జగన్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను సీఎం జగన్ అందచేస్తున్నారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేసేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయని ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు. దిండ్డుపాలెం గ్రామాభివృద్ధికి రూ.25 లక్షల గ్రాంట్ చుండూరు మండలం దిండ్డుపాలెం గ్రామంలో డ్రైనేజీ పనుల నిమిత్తం తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.25 లక్షలు గ్రాంట్‌ను మంజూరు చేస్తున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. గ్రామానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి మేరుగు నాగార్జున, సర్పంచ్ భగవద్గీత కోరడంతో ఈమేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. -
ఇంటింటా ప్రజాదరణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ప్రతి ఊళ్లోనూ సందడి నెలకొంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు.. సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా గురువారం కూడా ఇంటింటికీ వెళ్లారు. ప్రస్తుత ప్రభుత్వంలో గత నాలుగేళ్లుగా జరిగిన అభివృద్ధితో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేస్తూ వివరించారు. ఈ నాలుగు సంవత్సరాల్లో తమకు ఏ మేరకు లబ్ధి కలిగిందో ప్రజలే ఆనందంగా నేతలతో పంచుకున్నారు. కులం, మతం, వర్గం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తుండటం ఒక్క సీఎం జగన్‌కే సాధ్యమైందని ఊరూరా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అవ్వాతాతలు స్పష్టీకరిస్తున్నారు. మరోసారి వైఎస్ జగన్ సీఎం అయితేనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభమైన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. ఏప్రిల్ 19 నాటికి 70 లక్షల మంది 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. -
ఇంటింటా విశేష ఆదరణ
సాక్షి, అమరావతి: ప్రజలే ప్రభుత్వంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు ప్రజలు అపూర్వ రీతిలో మద్దతు పలుకుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా మెగా పీపుల్స్ సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష మద్దతు లభిస్తోంది. గ్రామాలు మొదలు పట్టణాల వరకు ‘మా నమ్మకం నువ్వే జగన్’ నినాదం మార్మోగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల కుటుంబాలు సీఎం జగన్ పాలనకు మద్దతు పలికాయి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు జోగి రమేశ్, ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్, ఎంపీ మోపిదేవి వెంకటరమణలు మెగా సర్వే సాగుతున్న తీరును ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వెల్లడించారు. కుప్పం.. నగరి ఎక్కడైనా చర్చకు సిద్ధం రాష్ట్రానికి పట్టిన నిజమైన క్యాన్సర్ చంద్రబాబే. పేదలకు మంచి జరగ కూడదనే దురుద్దేశంతో ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు టిడ్కో ఇళ్లపై సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. చంద్రబాబు తన హయాంలో మంచి చేసిన ఒక్క పేద వాడి ఇంటి దగ్గరికి వెళ్లి సెల్ఫీ ఛాలెంజ్ చేయగలరా? దమ్ముంటే మేనిఫెస్టో అమలుపై చర్చకు రావాలని సవాల్ చేస్తున్నా. కుప్పం అయినా సరే.. నగరి అయినా ఓకే. గాం«దీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అందుకే మెగా పీపుల్స్ సర్వేలో ప్రజల నుంచి స్వచ్ఛందంగా మద్దతు లభిస్తోంది. ఇంటింటికీ జగనన్న స్టిక్కర్ చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో గుబులు పట్టుకుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పి పేదల ఇంటికి స్టిక్కర్లు వేయాలి. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి ఎన్ని ఇబ్బందులున్నా ఆగని సంక్షేమాభివృద్ధి గత ఎన్నికల్లో ఇ చ్చిన హామీల్లో ఇప్పటికే 98 శాతానికి పైగా నెరవేర్చిన సీఎం జగన్ పాలనపై ప్రజలు పూర్తి స్థాయి సంతృప్తిగా ఉన్నారు. సీఎం జగన్ మాట ఇస్తే తప్పక చేస్తారనే నమ్మకం ఇంతగా మద్దతు పలికేలా చేసింది. ఈ మెగా పీపుల్స్ సర్వే దేశ చరిత్రలోనే ప్రథమం. కరోనా, ఇతరత్రా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమాభివృద్ధి పథకాల్లో ఎక్కడా తేడా లేకుండా అమలు చేయడం గొప్ప విషయం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. 2021–22లో రూ.1.92 లక్షలు ఉన్న తలసరి ఆదాయం 2022 –23లో రూ.2.19 లక్షలకు పెరిగింది. జీఎస్డీపీ వృద్ధిలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. సీఎం జగన్ దార్శనికతతో రాష్ట్రం 11.43 శాతం గ్రోత్ రేట్ సాధించింది. – ఆదిమూలపు సురేశ్, మున్సిపల్ శాఖ మంత్రి ‘జగనన్నే మా భవిష్యత్’ చరిత్రలో ఓ రికార్డు ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. మా నమ్మకం నువ్వే జగన్.. అంటూ ప్రజలు నినదిస్తున్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల గడప వద్దకు చేర్చిన సీఎం జగన్ లాంటి సాహసోపేత నిర్ణయం ఏ రాజకీయ పార్టీ తీసుకోలేదు. ఈనెల 7వ తేదీ నుంచి పార్టీ సైనికులతో నిర్వహిస్తున్న ఈ సర్వేలో ఇప్పటికే 49 లక్షల కుటుంబాలు సీఎం జగనన్న పాలనకు మద్దతు పలికాయి. రాష్ట్ర ప్రజలు వారి పిల్లల భవిష్యత్తు కోసం జగనన్న ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. దీంతో పార్టీ కేడర్ నూతనోత్సాహంతో ముందుకు దూసుకెళ్తోంది. నిబద్ధత కలిగిన నేతకు.. అసత్య ప్రచారాలకు మధ్య యుద్ధం ఇది. తుది విజయం జగనన్నదే. – జోగి రమేశ్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి సంక్షేమాభివృద్ధి సారథి జగన్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివక్ష లేని సంక్షేమాభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తోంది. 98 శాతం పైగా హామీలు అమలు చేసి, సంక్షేమాభివృద్ధి సారథిగా నిలిచారు. అందుకే మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్, వెల్నెస్ సెంటర్ల ద్వారా సరికొత్త సుపరిపాలనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలు గౌరవంగా జీవించేలా చేస్తున్నారు. ప్రతి పథకంలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్దిదారుడికే నగదు వెళ్లేలా విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. అందుకే ప్రజల్లో ఇంత ఆదరణ కనిపిస్తోంది. – మోపిదేవి వెంకటరమణ, రాజ్యసభ సభ్యుడు -
ప్రతి ఇంటా జగన్నినాదం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 46 నెలల్లో సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడం.. ప్రభుత్వంపై విపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం దిగ్వి జయంగా కొనసాగుతోంది. శుక్రవారం ఎనిమిదో రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, సచివాలయాల కన్వి నర్లు, వలంటీర్లు, గృహ సారథులకు ప్రతి ఇంటా ఆ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ సర్కార్‌కూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని కుటుంబ సభ్యులకు గృహ సారథులు అందించారు. సొంతిల్లు నిర్మించుకోవాలనే కలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారని.. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికిపైగా ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని అక్కచెల్లెమ్మలు ప్రశంసించారు. టీడీపీ ప్రభుత్వంలో పింఛన్ ఎప్పుడిస్తారో తెలిసేదే కాదని ఎత్తిచూపుతూ.. ఇప్పుడు ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకు వచ్చి వలంటీరు రూ.2,750 చొప్పున పింఛన్ అందిస్తున్నారని అవ్వాతాతలు సీఎం వైఎస్ జగన్‌ను అభినందించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని సీఎం వైఎస్ జగన్ వేగవంతం చేసి.. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చారని అన్నదమ్ములు ప్రశంసించారు. సీఎం వైఎస్ జగన్‌కు పెరుగుతున్న మద్దతు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా గృహ సారథులు మెగా ప్రజా సర్వేను నిర్వహిస్తున్నారు. టీడీపీ సర్కార్‌కూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ ఐదు ప్రశ్నలను అడిగి.. కుటుంబ సభ్యులు చెప్పిన అభిప్రాయాలను ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులకు రసీదు ఇస్తున్నారు. ఆ తర్వాత ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తున్నారు. ఆ వెంటనే సీఎం వైఎస్ జగన్ సందేశంతో ఐవీఆర్ఎస్ కాల్ రాగానే కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏడు రోజల్లో అంటే గురువారం నాటికి 55 లక్షల కుటుంబాలను జగనన్న సైన్యం నేరుగా కలిసింది. అందులో 43 లక్షల కుటుంబాలకు చెందిన ప్రజలు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నెంబర్‌కు మిస్డ్ కాల్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమం కొనసాగుతున్న కొద్దీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల మద్దతు పెరుగుతోంది. ప్రతిపక్షాలకు ముచ్చెమటలు: ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ‘జగనన్నే మా భవిష్యత్ అంటూ అధికార వైఎస్సార్సీపీ చేపట్టిన మేగా పీపుల్స్ సర్వే ఆంధ్ర రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఎన్నికలనగానే సాధరణంగా గుర్తొచ్చేది పాదయాత్రలు, రోడ్ షోలు ,ప్రచారార్భాటాలు. కానీ వీటన్నిటికీ భిన్నంగా.. గత ప్రభుత్వంతో బేరీజు వేస్తూ మా పరిపాలన ఎలా ఉందో చెప్పండి.. ఇదీ మా ప్రభుత్వంలో మీకు జరిగిన మేలు.. మా ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు సంక్షేమ పథకాల కింద నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేసింది.. పాలనపై అవసరమైతే సలహాలివ్వండి తీసుకుంటాం.. అంటూ నిర్వహిస్తోన్న ఈ సర్వేకు అనూహ్య స్పందన లభిస్తోంది’ అని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి తాడేపల్లిలోని సైన్స్ సిటీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 175 నియోజకవర్గాల పరిధిలోని 15 వేల సచివాలయాల్లో చేపట్టిన మేగా పీపుల్స్ సర్వే ఉవ్వెత్తున ఎగసిపడే ఉద్యమ కెరటంలా ముందుకు సాగుతోందన్నారు. రోజు రోజుకు ప్రజల నుంచి వస్తోన్న స్పందన, ఆదరణ చూసి విపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయని చెప్పారు. వాడవాడలా మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదం హోరెత్తుతోందన్నారు. కేవలం ఆరు రోజుల్లో 43 లక్షల కుటుంబాలు మిస్డ్ కాల్స్ ద్వారా జగనన్నకు మద్దతు తెలపటం చిన్న విషయం కాదన్నారు. ఈ కార్యక్రమం పార్టీ క్యాడర్‌కు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో ‘జగనన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్’ అనే నినాదాలతో షేర్ అవుతున్న ఫోటోలు, వీడియోలే ఇందుకు నిదర్శనం అని చెప్పారు. సీఎం మేలును ఎప్పటికీ మరిచిపోం.. భీమడోలు: అన్ని విధాలా మేలు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు భగవంతునితో సమానం అని, అందుకే ఆయన ఫొటోను దేవుడి గదిలో ఉంచామని ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లిలోని బీసీ కాలనీకి చెందిన సారిక వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరు వివరించారు. వాకిలికి ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే స్టిక్కర్ అంటించబోగా.. ‘ఈ ప్రభుత్వం చాలా బాగా పని చేస్తోంది. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. మా అమ్మకు పింఛన్, నా భార్యకు చేయూత, పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా లబ్ధి పొందాము. ఇంత మేలు చేసిన సీఎంను మేం ఎప్పటికీ మరచిపోము. అందుకే ఆయన ఫొటోను అంటించాల్సింది ఇక్కడ కాదు’ అంటూ ఇటివ్వండని తీసుకుని దేవుడి గదిలో అంటించారు. ఇప్పుడు తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. -
ప్రతి ఇంటా విశ్వాసం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’కు విశేష స్పందన
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. బుధవారం ఆరవ రోజు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లకు ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇదివరకెన్నడూ లేని రీతిలో గత 46 నెలలుగా సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు, సుపరిపాలన ద్వారా మేలు చేశారంటూ అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు ప్రశంసించారు. 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయకుండా తమను మోసం చేశారని అన్ని వర్గాల ప్రజలు మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ తాము పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని కొనియాడారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అని నినదించారు. మళ్లీ వైఎస్ జగనే అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ప్రజా మద్దతు పుస్తకంలో తమ అభిప్రాయాలను నమోదు చేయించి, రసీదు తీసుకున్నారు. ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్స్ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్‌ను అడిగి మరీ తీసుకుని ఇంటి తలుపులకు, మొబైల్ ఫోన్లకు అతికించుకుని అభిమానాన్ని చాటుకున్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఈ నెల 7న ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఐదో రోజు ముగిసేటప్పటికి అంటే మంగళవారానికి వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 37 లక్షల కుటుంబాలకు చెందిన అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు 82960 82960 మిస్డ్ కాల్స్ ఇచ్చారు. అన్ని వర్గాల నుంచి ప్రభుత్వానికి మద్దతు వెల్లువెత్తుతుండటం సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనకు దర్పణంగా నిలుస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు సంప్రదాయక ఓటర్లుగా భావించే కుటుంబాల నుంచి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు లభిస్తుండటం విశేషం. -
‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి విశేష స్పందన
కృష్ణా జిల్లా ►పెడనలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు.. ►మా భవిష్యత్తు జగనన్నే అనేది ప్రజల ఆకాంక్ష: మంత్రి జోగిరమేష్ ►భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అభివృద్ధి కార్యక్రమాలను ఏపీలో సీఎం జగన్ చేస్తున్నారు ► బటన్ నొక్కగానే రైతులు , అక్కచెల్లెమ్మల అకౌంట్లలలోకి డబ్బులు జమ అయ్యేలా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు ► ప్రతీ గడపకూ వెళ్లి ప్రభుత్వం పట్ల ఎంత సంతృప్తిగా ఉన్నారో అడిగి తెలుసుకుంటాం. కర్నూలు. కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ కామెంట్స్ ► ప్రభుత్వ చేసినా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్తాం. ► ప్రతి గడప గడపకు ప్రభుత్వం మేలు గురించి తెలియజేస్తున్నాం. ► రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్నారు. ► ఒక్క వైపు సంక్షేమ, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ► చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ► వారి దుష్ప్రచారం తిప్పికొట్టేందుకు జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ► పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తీరు రౌడీ తరహాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ►నాలుగు సంవత్సరాలు చేసి సంక్షేమ పథకాలు అందించిన ప్రజలకు వివరిస్తూ సమస్యలను తెలుసుకుంటాం. ► కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారు. విజయవాడ ► ప్రజల గుండెల్లోంచి వచ్చిన కార్యక్రమమే ఈ జగనన్నే మా భవిష్యత్తు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ► 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ► ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితుల్లో మిగిలిన పార్టీలున్నాయి. ► ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశాడు. ► మేము చేసింది చెప్పడానికే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. పశ్చిమ గోదావరి ►తణుకు పట్టణంలోని 4వ వార్డులో జగనన్నే మాభవిష్యత్, నువ్వే మానమ్మకం జగన్ కార్యక్రమాన్ని మంత్రి కారుమూరి ప్రారంభించారు. గృహసారదులకు వాలంటరీలకు కార్యక్రమం విధి విధానాలను మంత్రి వివరించారు. పట్టణంలోని 4వ వార్డులో గృహ సారధులతో కలసి పలు ఇళ్లకు తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. చంద్రబాబు ప్రభుత్వానికి సీఎం జగన్ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు స్వయంగా తెలియజేశారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టాక రూపాయి అవినీతికి తావులేకుండా పథకాలను అందిస్తున్నామని తెలిపారు. ►నిన్ననే ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం మొదలు పెట్టాం, పేదప్రజలు దగ్గరకు నేరుగా డాక్టరే వెళ్లి వైద్యం చేయటం దేశ చరిత్రలో ప్రప్రథమమని మంత్రి పేర్కొన్నారు. ఏపీ లో జరుగుతున్నఅభివృద్ధిని ఇతర రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూడ ఆదర్శంగా తీసుకొంటున్నారని పేర్కొన్నారు. ‘చంద్రబాబు.. కరువు కవలపిల్లలు చంద్రబాబు పాదం ఉన్నంతకాలం వర్షాలు పడవు పంటలు పండవు. సీఎం జగన్ రాగానే మేఘాలు కదిలాయి వర్షాలు వర్షించాయి. జగన్ సీఎం అయ్యాక ప్రకృతి కూడా పరవశించింది. పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. నాడు నేడులో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు’ అని తెలిపారు. ► జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి విశేష స్పందన: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ►టీడీపీ, జనసేన నేతల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ►రాష్ట్రంలో పాలనపై ప్రతి ఇంటికి వెళ్తున్న కన్వీనర్లు, గృహసారథులు కర్నూలు జిల్లా: ►ఆలూరులో మా నమ్మకం మీరే -జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరాం ►చంద్రబాబు చేసిన మోసాలను,సీఎం జగనన్న చేసిన మంచి గడప గడప తీసుకెళ్తున్నాము. ►రాష్ట్రంలో ప్రతి ఇంటికి నవర్తన సంక్షేమ పథకాలు తీరును ఆడిగితెలుసుకుంటున్నాము. ►గత ప్రభుత్వాలు పాలన ఈ ప్రభుత్వ పాలన గురించి లబ్ధిదారులకు తెలియజేస్తున్నాము....మంత్రి గుమ్మనూరు జయరాం తిరుపతి జిల్లా: ►తిరుపతి జిల్లా చిల్లకూరులో ఎంపీడీఓ కార్యాలయంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ ప్రారంభించారు. ప్రతి ఇళ్లు తిరుగుతూ సీఎం జగన్‌ను మరోసారి ఆశీర్వదించాలని కోరుతూ మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లు అంటించారు. ►వెంకటగిరిలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇంచార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ►సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపు తిరుపతి జిల్లా : ►సూళ్లూరుపేట నియోజకవర్గం లో అట్టహాసంగా ప్రారంభమైన జగనన్నే మా భవిష్యత్..నువ్వే మా నమ్మకం జగన్ కార్యక్రమం ►నాయుడుపేటలోని డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సూళ్లూరుపేట ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య ►కార్యక్రమంలో పాల్గొన్న ఆరుమండలాల వైసీపీ శ్రేణులు, జీసీఎస్ కన్వీనర్లు, గృహసారథులు పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు- మా నమ్మకం, నువ్వే జగన్ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు.. జగనన్నే మా భవిష్యత్తు - మా నమ్మకం నువ్వే జగన్ పామ్ ప్లేట్ ను ప్రతి ఇంటికి తీసుకెళ్లబోతున్నామని, ఈ పామ్ ప్లేట్లో వాస్తవాలను ప్రచురించడం జరిగిందని మంత్రి కొట్టుసత్య నారాయణ తెలిపారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు అయ్యాయో, ఎన్ని అవ్వలేదో అనేవి ప్రజల్ని వారి ఇంటి వద్దకే వెళ్లి అడగడం జరుగుతుందన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారో అడుగుతామని చెప్పారు. విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సాధికారత, గృహ నిర్మాణ లను ప్రాధాన్యంగా ఈ ప్రభుత్వం తీసుకుందన్నారు. ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారని గుర్తు చశారు. వెన్నుపోటు దారుడు చంద్రబాబు. అటువంటి వ్యక్తిని అసలు నమ్మే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. ►జగనన్న మా భవిష్యత్తు,మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం పోస్టర్ ను పెద ఆమీరం పార్టీ కార్యాలయంలో విడుదల చేసిన డిసిసిబి చైర్మన్ పి వి ఎల్ నరసింహరాజు పశ్చిమగోదావరి జిల్లా: ►భీమవరం ఒకటో వార్డు మెంటే వారి తోటలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ►మెంటే వారి తోటలో ఇంటింటికి తిరుగుతూ డోర్ పోస్టర్లు అతికిస్తూ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు వివరిస్తున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ►పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు, గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, వైయస్సార్ సిపి నాయకులు ,కార్యకర్తలు ఎన్టీఆర్ జిల్లా: ►మైలవరం లో జగనన్నే మా భవిష్యత్తు మానమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, నియోజకవర్గ పరిశీలకుడు పడమటి సురేష్ బాబు. నెల్లూరు జిల్లా: ►కావలి 10వ వార్డులో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ►ఇంటింటికి వెళ్లి. అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా : ►తిరువూరు నియోజకవర్గ స్థాయిలో విసన్నపేటలోని నాలుగో వార్డ్ లో "జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని గృహ సారధులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ప.గో:జిల్లా: ►పాలకొల్లు మావుళ్ళమ్మ పేట లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ ►పాల్గొన్న ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లె0 ఆనంద ప్రకాష్, జెడ్పీటీసీ గోవిందరాజుల నాయుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ ఏలూరు జిల్లా: ►కైకలూరు నియోజకవర్గంలో జగనన్నే మా భవిష్యత్తు- మా నమ్మకం నువ్వే జగన్, కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎలిజా కామెంట్స్ ►జగనన్న నువ్వే మా భవిష్యత్. కార్యక్రమం ఈరోజు నుంచి 20 తారీకు వరకు జరగుతుంది ►ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేసి, గత తెలుగుదేశం ప్రభుత్వం లో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేస్తాం. కృష్ణా జిల్లా : ►ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి శ్రీకాకుళం ►శ్రీకాకుళంలోని సిపన్ నాయుడుపేటలోని జగనన్న నువ్వే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా పోస్టల్ ఇంటికంటే అంటిస్తున్న ధర్మాన రామ్ మనోహర్ నాయుడు వైఎస్సార్ జిల్లా: డిప్యూటీ సీఎం అంజద్ బాషా కామెంట్స్.. ►జగనన్న నీవే మా భవిష్యత్ ఆన్న నినాదంతో కొత్త కార్యక్రమం చేపట్టాం ►అధికారంలో ఉండగా తమ ప్రభుత్వ పనితీరును ధైర్యంగా చెప్పి, వారికి అవగాహన కల్పించే సాహసోపేత నిర్ణయం ►కోటి 60 లక్షల కుటుంబాలను నేరుగా కలిసేందుకే ఈ జగనన్నే మా భవిషత్ కార్యక్రమం ►ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు ఇవేమీ అందుతున్నాయి.. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను గుర్తించేలా వైసిపి సైనికులు పనిచేస్తారు.. ►వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైనికులు, గృహ సారథులు, కన్వీనర్లు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను వివరిస్తారు ►పథకాల వివరాలతో కరపత్రం, స్టిక్కర్ అందిస్తారు. ►సంతృప్తి చెందితేనే నన్ను ఆశీర్వదించండి అని చెప్పిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్. కాకినాడ జిల్లా ►పిఠాపురం: చిత్రాడ గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. ►ప్రతి పేదవాడికి క్షేమ పథకాలు గత టిడిపి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లబ్ధిని గుర్తించాలని ప్రజలను కోరిన.. ఎమ్మెల్యే దొరబాబు ►ప్రజల గురించి నిరంతరం ఆలోచించే నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైఎస్సార్ జిల్లా ►ప్రొద్దుటూరు మునిసిపాలిటీ లో జగనన్నే మా భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ►నేటి నుండి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం రానున్న ఎన్నికల వరకు కొనసాగుతుంది ►గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పతకాలు ఎంతవరకు అందాయని వివరించనున్న ఎమ్మెల్యే రాచమల్లు ►600 కోట్ల తో ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల ను వివరించనున్న ఎమ్మెల్యే రాచమల్లు ►పార్టీలకు అతీతంగా పేదరికం నే ప్రామాణికముగా ప్రభుత్వ సంక్షేమ పతకాలు అందించిన ముఖ్యమంత్రి ►ఈ కార్యక్రమంలో పాల్గొన్న మునిసిపల్ చైర్మన్ లక్ష్మీదేవి, ఆప్కోబ్ చైర్మన్ జాన్సీ,పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ విజయ లక్ష్మి, కౌన్సిలర్లు, వైఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్తూరు ►పుంగనూరు మండలం భగత్ సింగ్ నగర్ కాలనీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ►ఇంటింటికి వెళ్లి జగనన్న నువ్వే మా భవిష్యత్తు కార్యక్రమం ►నివాస గృహాలకు స్టిక్కర్లు అతికించిన మంత్రి పెద్దిరెడ్డితో పాటు పార్టీ నేతలు ►ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లాలి ►టిడిపి వైఎస్ఆర్సిపి పాలనకు ఉన్న వ్యత్యాసం వివరించాలి ►సీఎం జగన్ చేసిన మేలును వివరించాలి చిత్తూరు ►కార్వేటి నగర్ మండలంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పర్యటన ►జగనన్న నువ్వే మా భవిష్యత్తు కార్యక్రమం ►అన్నమయ్య జిల్లా పీలేరు నియోజవర్గం వాల్మీకిపురం మండలంలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ పాల్గొన్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ►విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జగనన్నే.. మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్.. కార్యక్రమం ప్రారంభం ►కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, వైసీపీ నేత కడియాల బుచ్చిబాబు తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ►ప్రజలవద్దకు వెళ్లే దమ్ము, ధైర్యం వైసీపీకే ఉన్నాయి ►ప్రతీ ఇంటికి వెళ్లి టీడీపీ చేసిన మోసం, వైసీపీ చేసిన సంక్షేమాభివృద్ధి మేము చెప్తున్నాం ►రాష్ట్రంలో ఏ ఇంటికి సీఎం జగన్ సైన్యం వెళ్లినా ఆశీర్వదించి పంపుతున్నారు ►సీఎం జగన్ పాలనలో సుభిక్షంగా ఉన్నామని చెప్తున్నారు ►లోకేశ్ పాదయాత్రలో విద్యార్థులను మధ్యాహ్న భోజనం బావుందా అని అడిగితే చాలబావుందని చెప్పారు ►విద్యార్థుల సమాధానం విని లోకేష్ మైండ్ బ్లాంక్ అయ్యింది ►రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది ►175నియోజకవర్గాల్లో సీఎం జగన్ నిలబెట్టిన అభ్యర్థులు గెలుస్తారు ►తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నూటికి నూరుశాతం గెలుస్తుంది ►విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ కొత్త రాజీవ్ నగర్ లో జగనన్నే మా భవిష్యత్తు- మా నమ్మకం నువ్వే జగన్" కార్యక్రమం ప్రారంభం ►పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సెంట్రల్ నియోజకవర్గం పరిశీలకులు కడవకొల్లు నరసింహారావు, గృహసారథులు, కన్వీనర్లు ,వాలంటీర్లు ►ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి ప్రారంభమయ్యే ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకూ కొనసాగనుంది. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వినర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. ►దీనికి సంబంధించి వారికి ప్రత్యేకమైన కిట్ బ్యాగ్‌లు అందచేశారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు. ప్రజా మద్దతు పుస్తకంలో ప్రశ్నలివీ.. ► ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు, మీ కుటుంబానికి మంచి జరిగిందా? ►మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? ►.గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛన్, అమ్మ ఒడి, ఆసరా, చేయూత లాంటి అనేక పథకాల ద్వారా డబ్బులను నేరుగా మీ అకౌంట్లో వేయడం లేదా వలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? ► నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? ►జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా? కిట్ బ్యాగ్‌లో ఏముంటాయంటే.. ♦ ఒక్కో కిట్ బ్యాగ్‌లో 200 ఇళ్లకు సరిపడా సామగ్రి ఉంటుంది. ♦టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను వివరిస్తూ రూపొందించిన 200 కరపత్రాలు ♦ ప్రజా మద్దతు పుస్తకాలు టమూడు పెన్నులు ♦ ఇద్దరు గృహ సారథులు, ముగ్గురు కన్వినర్లు ధరించేందుకు సీఎం జగన్ ఫొటోతో కూడిన ఐదు బ్యాడ్జీలు ♦సీఎం వైఎస్ జగన్ ఫొటో ఉన్న 200 స్టిక్కర్లు ♦ సీఎం జగన్ ఫోటో ఉన్న 200 మొబైల్ ఫోన్ స్టిక్కర్లు కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటే.. ♦ ప్రతి ఇంటి వద్దకు ఇద్దరు గృహ సారథులు, వలంటీరు వెళతారు. టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను ఆ కుటుంబ సభ్యులకు వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని చదివి వినిపిస్తారు. తర్వాత కరపత్రాన్ని వారికి అందజేస్తారు. ♦ప్రజా మద్దతు పుస్తకంలో ప్రజా సర్వేకు సంబంధించి ఐదు ప్రశ్నలు ఉన్న స్లిప్పుపై కుటుంబ పెద్ద పేరు, ఫోన్ నంబర్ నమోదు చేస్తారు. ఆ తర్వాత ఐదు ప్రశ్నలను చదివి ఆయా కుటుంబాలు ఇచ్చే సమాధానాల ఆధారంగా అవును / కాదు అనే వివరాలను నమోదు చేస్తారు. స్లిప్పు కుడి వైపున ఉన్న రసీదును ఆ కుటుంబానికి ఇస్తారు. ♦వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిని 82960–82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరతారు. మిస్డ్ కాల్ ఇచ్చిన నిముషంలోపే కృతజ్ఞతలు తెలియచేస్తూ సీఎం జగన్ సందేశంతో ఐవీఆర్ఎస్ కాల్ ఆ కుటుంబానికి వస్తుంది. ♦ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారి ఇంటి తలుపునకు సీఎం వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్ అతికించేందుకు అనుమతి కోరతారు. సమ్మతించిన వారి ఇంటి తలుపునకు స్టిక్కర్ అతికిస్తారు. అదే రీతిలో మొబైల్ ఫోన్‌కు స్టిక్కర్ అతికించి ధన్యవాదాలు తెలియచేస్తారు. ♦ ఈ కార్యక్రమం పూర్తయ్యాక ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన ప్రజా మద్దతు పుస్తకాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతారు. చదవండి: జనంలోకి జగనన్న సైన్యం -
జనంలోకి జగనన్న సైన్యం!
మాట నిలబెట్టుకుంటూ 46 నెలల్లో 98.5 శాతం ఎన్నికల హామీలను అమలు చేసి మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కూడా గడవక ముందే సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2 లక్షల కోట్లు జమ చేశారు. వార్డు మెంబర్ నుంచి కేబినెట్ వరకూ సింహభాగం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు, మహిళలకు రిజర్వ్ చేస్తూ చట్టం తెచ్చి మరీ చిత్తశుద్ధి చాటుకున్నారు. 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు.. 2.60 లక్షల మంది వలంటీర్లు.. 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరణతో పరిపాలనను వికేంద్రీకరించి ఇంటివద్దే సుపరిపాలన అందిస్తున్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆదర్శ పాలనతో ముఖ్యమంత్రి జగన్ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారు. ఇదే అంశాన్ని చాటి చెబుతూ టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ మరోసారి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతూ ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి ప్రారంభమయ్యే ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకూ కొనసాగనుంది. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వినర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. దీనికి సంబంధించి వారికి ప్రత్యేకమైన కిట్ బ్యాగ్‌లు అందచేశారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు. నమ్మకం రెట్టింపు సుమారు 18 నెలల పాటు పట్టి పీడించిన కరోనాతో ప్రపంచమంతా ఆర్థి క సంక్షోభంతో తల్లడిల్లినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ ఆపలేదు. 46 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.రెండు లక్షల కోట్లను జమ చేయడం దేశ చరిత్రలో రికార్డు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించి పరిపాలనను వికేంద్రీకరించారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ఆర్థి క చేయూతతో పేదరిక నిర్మూలనతోపాటు రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం చేకూర్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు సామాజిక సాధికారత సాధించేలా బాటలు వేశారు. తాము పెట్టుకున్న నమ్మకం కంటే రెండింతలు అధికంగా న్యాయం చేస్తూ పరిపాలిస్తుండటంతో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ ప్రజలు నినదిస్తున్నారు. ప్రజల్లో నుంచి వ చ్చిన ఈ నినాదాన్నే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చేర్చింది. ప్రజా మద్దతు పుస్తకంలో ప్రశ్నలివీ.. 1 . ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు, మీ కుటుంబానికి మంచి జరిగిందా? 2 . మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? 3 .గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛన్, అమ్మ ఒడి, ఆసరా, చేయూత లాంటి అనేక పథకాల ద్వారా డబ్బులను నేరుగా మీ అకౌంట్లో వేయడం లేదా వలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? 4 . నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? 5. జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా? కిట్ బ్యాగ్‌లో ఏముంటాయంటే.. ♦ ఒక్కో కిట్ బ్యాగ్‌లో 200 ఇళ్లకు సరిపడా సామగ్రి ఉంటుంది. ♦టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను వివరిస్తూ రూపొందించిన 200 కరపత్రాలు ♦ ప్రజా మద్దతు పుస్తకాలు టమూడు పెన్నులు ♦ ఇద్దరు గృహ సారథులు, ముగ్గురు కన్వినర్లు ధరించేందుకు సీఎం జగన్ ఫొటోతో కూడిన ఐదు బ్యాడ్జీలు ♦సీఎం వైఎస్ జగన్ ఫొటో ఉన్న 200 స్టిక్కర్లు ♦ సీఎం జగన్ ఫోటో ఉన్న 200 మొబైల్ ఫోన్ స్టిక్కర్లు కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటే.. ♦ ప్రతి ఇంటి వద్దకు ఇద్దరు గృహ సారథులు, వలంటీరు వెళతారు. టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను ఆ కుటుంబ సభ్యులకు వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని చదివి వినిపిస్తారు. తర్వాత కరపత్రాన్ని వారికి అందజేస్తారు. ♦ప్రజా మద్దతు పుస్తకంలో ప్రజా సర్వేకు సంబంధించి ఐదు ప్రశ్నలు ఉన్న స్లిప్పుపై కుటుంబ పెద్ద పేరు, ఫోన్ నంబర్ నమోదు చేస్తారు. ఆ తర్వాత ఐదు ప్రశ్నలను చదివి ఆయా కుటుంబాలు ఇచ్చే సమాధానాల ఆధారంగా అవును / కాదు అనే వివరాలను నమోదు చేస్తారు. స్లిప్పు కుడి వైపున ఉన్న రసీదును ఆ కుటుంబానికి ఇస్తారు. ♦వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిని 82960–82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరతారు. మిస్డ్ కాల్ ఇచ్చిన నిముషంలోపే కృతజ్ఞతలు తెలియచేస్తూ సీఎం జగన్ సందేశంతో ఐవీఆర్ఎస్ కాల్ ఆ కుటుంబానికి వస్తుంది. ♦ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారి ఇంటి తలుపునకు సీఎం వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్ అతికించేందుకు అనుమతి కోరతారు. సమ్మతించిన వారి ఇంటి తలుపునకు స్టిక్కర్ అతికిస్తారు. అదే రీతిలో మొబైల్ ఫోన్‌కు స్టిక్కర్ అతికించి ధన్యవాదాలు తెలియచేస్తారు. ♦ ఈ కార్యక్రమం పూర్తయ్యాక ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన ప్రజా మద్దతు పుస్తకాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతారు. 15,004 సచివాలయాల్లో ఏకకాలంలో రాష్ట్రంలోని 15,004 సచివాలయాల్లో శుక్రవారం ఏకకాలంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ప్రారంభమవుతుందని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 7వ తేదీన మొదలయ్యే ఈ కార్యక్రమం 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఏడు లక్షల మంది పార్టీ సైనికులు 14 రోజుల్లో దాదాపు 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలుసుకుంటారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్–అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ సూచించింది. -
చెప్పాడంటే చేస్తాడంతే.. సీఎం జగన్ సక్సెస్ మంత్రా ఇదే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వపరంగానే కాదు.. పార్టీ పరంగా కూడా వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. వాటిని అమలు చేస్తున్నారు. పార్టీ పరంగా గృహ సారధులు పేరుతో కొత్తగా కార్యకర్తలను తయారు చేస్తున్న విధానం భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఒక రాజకీయ పార్టీని క్షేత్ర స్థాయిలో ఎలా నడిపించవచ్చో ఆయన చేసి చూపిస్తున్నారు. సీఎం జగన్ చేస్తున్న ప్రయోగం సఫలం అయితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి భారీ గెలుపు ఖాయం. ఇంటింటికి సంక్షేమ ఫలాలు.. ఇందుకోసం పార్టీలో పెద్ద కసరత్తే చేశారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకు రావడం ప్రభుత్వపరంగా ఒక సంచలనం. దానికి వలంటీర్ల వ్యవస్థను అనుసంధానం చేయడం ఎవరూ ఊహించని విషయం. తద్వారా ప్రజలకు ప్రభుత్వం లేదా పరిపాలన తమ ఇళ్ల వద్దే అందుబాటులో ఉందన్న నమ్మకాన్ని కలిగించారు. ఇది ప్రభుత్వపరంగా జరిగిన ఒక సఫల ప్రక్రియ. దీనిని పార్టీకి అనుసంధానం చేసుకోవడానికి సీఎం జగన్ సచివాలయ స్థాయిలో కన్వీనర్లు, వారి పరిధిలో గృహ సారధులను నియమిస్తున్నారు. ఇప్పటికే ఐదు లక్షల మంది పార్టీ సైన్యాన్ని సిద్దం చేశారట. ప్రభుత్వపరంగా వలంటీర్ల వ్యవస్థ ఉంటే, వారితో సమాంతరంగా ప్రతి 50 ఇళ్లకు పార్టీ పరంగా ఈ గృహ సారధులు పనిచేస్తారని అనుకోవచ్చు. సూక్ష్మ స్థాయికి కార్యకర్తల వ్యవస్థ.. గతంలో బీజేపీ బూత్ కమిటీ కాన్సెప్ట్ తెచ్చినప్పుడు అది సాధ్యమేనా అన్న అనుమానం వచ్చేది. కానీ, ఆయా రాష్ట్రాలలో బీజేపీ ఆ మోడల్ అనుసరించి విజయవంతం అయింది. దాంతో ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలు బూత్ లెవెల్లో కమిటీలు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మరో అడుగు ముందుకు వేసి మరింత సూక్ష్మస్థాయికి కార్యకర్తల వ్యవస్థను తీసుకువెళుతున్నారన్నమాట. ఇది అంత తేలికైన విషయం కాదు. ఒక రకంగా నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో నేతలతో పాటు వీరు కూడా కీలకం కాబోతున్నారు. ఏ చిన్న నేత అయినా వీరిపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. వీరు కాకుండా సాధారణ కార్యకర్తలు ఎటూ ఉంటారు. వలంటీర్లను వైఎస్సార్సీపీ తన ప్రచారానికి వాడుకుంటుందని ఇప్పటికే ప్రతిపక్షాలు అనుమానిస్తూ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే, ఆ గొడవ లేకుండా గృహ సారధుల పార్టీ వ్యవస్థను తెస్తున్నారు. 40 ఇయర్స్ కాపీ పేస్ట్ గతంలో ఏ ముఖ్యమంత్రి లేదా ఏ పార్టీ అధినేత ఇంత క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించలేదనే చెప్పాలి. గత 30 ఏళ్లుగా టీడీపీ ప్రాంతీయ పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు సైతం సీఎం జగన్ వ్యూహాలను ఎదుర్కోవడానికి సతమతమవుతున్నారు. చంద్రబాబు ఒక ఎత్తు వేసేలోపు ముఖ్యమంత్రి జగన్ పది ఎత్తులు వేయగలుగుతున్నారు. చంద్రబాబు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ఏర్పాటు ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళ్లవచ్చన్న ఆలోచన ఏనాడు చేయలేదు. సీఎం జగన్ ఆ వ్యవస్థల గురించి ప్రకటించగానే చంద్రబాబు విమర్శలు చేశారు. వలంటీర్లను ఎద్దేవా చేశారు. కానీ, ఇప్పుడు ఆ వ్యవస్థలు ప్రజల్లోకి విస్తృతంగా దూసుకెళ్లడంతో చంద్రబాబు నిస్సహాయ స్థితిలో పడ్డారు. తాము కూడా ఆ వ్యవస్థలను కొనసాగిస్తామని చెప్పక తప్పలేదు. అవి అలా ఉండగానే ముఖ్యమంత్రి జగన్ పార్టీ పరంగా కూడా దాదాపు అలాంటి వ్యవస్థలనే ప్రవేశ పెట్టారు. ఇప్పుడు దీనిని ఎలా ఎదుర్కోవాలన్నది చంద్రబాబుకు, ఆయన పార్టీ నేతలకు పెద్ద సవాలు కావచ్చు. అంతేకాదు.. సీఎం జగన్ వీరందరిని మార్చి 18-26 వరకు ప్రతీ ఇంటికి వెళ్లాలని ఆదేశించారు. వీరు ప్రభుత్వపరంగా జరుగుతున్న కార్యక్రమాలు వివరించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వీరు చెబుతారు. దీనికి జగనన్నతోనే మన భవిష్యత్తు అని పేరు కూడా పెట్టారు. ఇలాంటి పేరు పెట్టడానికి ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి. ఎల్లోస్.. ఫ్యాక్ట్స్ ప్లీజ్.. గత నాలుగేళ్లలో ప్రభుత్వపరంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన నేతగా సీఎం జగన్ ఆ నమ్మకం పొందారని అనుకోవచ్చు. అయినా, ఆ మార్పులను ప్రజలు మర్చిపోయేలా ఏమార్చడానికి టీడీపీ, ఆ పార్టీ అనుబంధంగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి మీడియా సంస్థలు ఉన్నవి.. లేనివి కల్పించి అభూత కల్పనలను ప్రచారం చేస్తున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి గృహ సారధుల వ్యవస్థ బాగా ఉపయోగపడుతుందని సీఎం జగన్ అంచనా వేస్తుండవచ్చు. అదే సమయంలో చంద్రబాబు పేరుతో టీడీపీ నేతలు ఒక ప్రచారం ఆరంభిస్తున్నారు. మళ్లీ మీరే రావాలి అన్న నినాదాన్ని ఇస్తున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్న నినాదంతో ప్రజలను ఆకట్టుకునే యత్నం చేసింది. నినాదం ఫలించింది కానీ.. ప్రజలకు ఆయన ఒరగబెట్టింది ఏమీ లేదన్న భావన అప్పట్లో నెలకొంది. 2019లో జగన్ అంతకు మించిన నినాదాలు ఇచ్చారు. కావాలి జగన్, రావాలి జగన్, నేను విన్నాను.. నేను ఉన్నాను.. అన్న నినాదాలు ఇచ్చారు. అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోను సింపుల్‌గా ప్రజలకు అర్ధం అయ్యేలా తయారు చేసి తన కార్యక్రమాలను పాజిటివ్‌గా తీసుకు వెళ్లారు. అదే చంద్రబాబు నాయుడు వందల కొద్ది హామీలను మేనిఫెస్టోలో పెట్టి, చివరికి వెబ్సైట్ నుంచి దానిని తొలగించారు. సీఎం జగన్ మాత్రం ఇప్పుడు కూడా తన మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ 98 శాతం అమలు చేశానని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. అందులోనూ ప్రత్యేకించి పేద ప్రజల కోసం ఆయన తీసుకు వచ్చిన స్కీములు విపక్షాల మైండ్‌ను బ్లాంక్ చేశాయంటే ఆశ్చర్యం కాదు. కొంతకాలం వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన టీడీపీ, జనసేనలు, తదుపరి వాటిని తాము కూడా అమలు చేస్తామని, ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పవలసి వచ్చింది. అందులోనే జగన్ సక్సెస్ ఉంది. ఈ నేపధ్యంలో జగనన్నతోనే మన భవిష్యత్తు అన్న నినాదాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లడానికి, ఎన్నికల నిర్వహణలో కీలకంగా బాధ్యతలు నిర్వహించడానికి గృహ సారధుల వ్యవస్థ పార్టీకి ఎంతగానో ప్రయోజనం కలిగించవచ్చు. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
Gruha Saradhi: అనూహ్య వ్యూహం ‘గృహ సారథి’
‘గృహ సారథి’ పేరుతో ఈ ఏడాది 5.20 లక్షల మంది యువతను సూక్ష్మ (గ్రాస్ రూట్స్) స్థాయి క్రియాశీల రాజకీయాల్లో భాగస్వామ్యుల్ని చేయాలని ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఈ ‘గృహ సారథులు’ ప్రతి 50 కుటుంబాలకు ఇద్దరు చొప్పున వారి అవసరాలు ప్రభుత్వం వద్ద ‘పెండింగ్’ కనుక ఉంటే, వాటి పరిష్కారం కోసం పార్టీ తరఫున పనిచేస్తారు. ఆ కుటుంబాల్లోని మహిళా సభ్యుల అవసరాలు తెలుసుకోవడం కోసం వీరిలో ఒక యువతి కూడా ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఎన్నికల ముందు– ‘మా పార్టీ మీ గుమ్మం వద్ద’ అన్నట్టుగా వీరు ప్రజలకు అందుబాటులో ఉంటారు. వీరి పనితీరును సమీక్షించడానికి మరో 45 వేల మంది ‘కన్వీనర్లు’ ఉంటారు. ఎనభై శాతం పైగా నిర్లక్ష్యానికి గురైన వర్గాల యువత గత మూడేళ్ళుగా వలంటీర్లు, గ్రామ సచివాలయాలల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది సర్వీస్ ఇప్పటికే ప్రభుత్వం ‘రెగ్యులరైజ్’ చేసింది. మళ్ళీ అవే వర్గాలకు ఆ వ్యవస్థతో సమాంతరంగా, అధికార రాజకీయ పార్టీ శ్రేణులుగా పని చేయడానికి మరో కొత్త అవకాశం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రంగంలో ఇంత పెద్ద ‘రిక్రూట్మెంట్’ జరగడం ఇది ప్రథమం. ఈ ‘గృహ సారథి’ వ్యవస్థ వల్ల తాత్కాలిక ప్రయోజనం వారిని నియ మించిన పార్టీకి ఉంటే, దీర్ఘకాలిక ప్రయోజనం పెద్ద సంఖ్యలో రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తున్న ఈ యువతది అవుతుంది. ఇన్నాళ్లూ పార్టీ శ్రేణులుగా తలల లెక్కకు తప్ప దేనికీ పనికిరాని ఈ యువతకు, ఇక ముందు ‘బూత్’ స్థాయిలో అధికార పార్టీ ప్రతినిధులుగా కొత్త గుర్తింపు రాబోతున్నది. అంటే– భవిష్యత్ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేయడానికి వర్ధమాన వర్గాల నుంచి వైసీపీ ‘నర్సరీ’లో సరికొత్త మానవ వనరు సిద్ధమవుతున్నదన్న మాట! సరిగ్గా ఇక్కడే తెలుగునాట మూడు దశాబ్దాల దళిత బహుజన రాజకీయాల ప్రస్తావన అనివార్యం అవుతున్నది. అప్పట్లో క్షేత్రస్థాయి శ్రేణుల పాటవ నిర్మాణాన్ని (కెపాసిటీ బిల్డింగ్) పట్టించుకోకుండా, కేవలం కొందరు నాయకుల వ్యక్తిగత ‘ఫోకస్’ తాపత్రయం కారణంగా, అప్పటి ఆ రాజకీయాల ఆయుష్షు అర్ధంతరంగా ముగిసింది. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పలుకుబడి వర్గాల ‘లాబీయింగ్’కు ‘చెక్’ పెట్టి మరీ, సాంఘిక సంక్షేమంలో– అర్హులైన అన్ని ఉపకులాలకు ఫలాలు అందే విధంగా ‘హైబ్రిడ్ మోడల్’ ప్రవేశపెట్టింది. దాంతో కాలం చెల్లిన ఒత్తిడి పెంచే ‘ట్రిక్స్’ ఇక్కడా మొదలయ్యాయి. ‘ఒకప్పటి ఎస్సీ కార్పొరేషన్ కాలం నాటి బడ్జెట్ ఏది? ఆ పథకాలు ఇప్పుడు ఏవి?’ అని ఇటీవల కొందరు వాపోతున్నారు. దామాషా మేరకు పంపిణీ లక్ష్యం కోసం, స్వీయ సామాజిక వర్గాల ఒత్తిళ్లనే జగన్ పట్టించుకోవడం లేదు. లొంగడం లేదు. చిత్రం– ఇప్పటికీ ఇక్కడ సమస్య ఏమంటే – ‘రాజ్యాధికారం’ అంటే, కాపుకొచ్చిన తోటలో పంట దింపుకోవడం కాదనీ, వీరికి అర్థం కావడం లేదు. దాన్ని ఆశించేవారు, అందుకు తమదైన నేల బాగుచేసి, అందులో అనువైన విత్తనాలు జల్లి ముందుగా మనదైన పంట పండించాలి. రాష్ట్ర విభజన తర్వాత, మారిన సమీకరణాలతో– ‘పోస్ట్ మండల్’ ‘పోస్ట్ ఎకనామిక్ రిఫారమ్స్’ కాలానికి తగిన సరి కొత్త రాజకీయాలు... కేవలం సాంప్రదాయ రాజకీయాలు మాత్రమే తెలిసిన ఈ పార్టీలకు అవగాహన లేదు. నిశ్శబ్దంగా ఆ ఖాళీ జాగాను ఆక్రమించి, గత మూడున్నర ఏళ్లుగా తన సంక్షేమ–అభివృద్ధి ప్రయోగాలను ఇక్కడ అమలు చేస్తున్నారు జగన్. గత ఏడాది జరిగిన తొలి పార్టీ సమీక్షలో– జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ‘అవుట్ రీచ్ అప్రోచ్’తో మనం పనిచేయాలి అని ఒక కొత్త పదప్రయోగం చేశారు. దాని భావం అర్థమైతే, ఆయన విమర్శకులకు సగం పని భారం తగ్గుతుంది! ఇటీవల బహిరంగ సభల్లో జగన్ ‘ఇది కులాల మధ్య యుద్ధం కాదు, వర్గాల మధ్య యుద్ధం’ అన్న తర్వాత, ఆ ప్రకటనపై వ్యాఖ్యానించలేని దశలో ఇక్కడి రాజకీయ పక్షాలు మిగిలిపోవడం, ‘అకడమిక్’ వర్గాల్లో అధ్యయనం అవసరమైన అంశం. (క్లిక్ చేయండి: రోడ్ షోలు – పౌర హక్కులు – కోర్టు తీర్పులు) ‘గృహ సారథి’ నియామకం ప్రపంచీకరణ దుష్పరిణామాలను ఎదుర్కోవడానికి సామాజిక శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్న – ‘గ్రీన్ పాలిటిక్స్’ దిశలో ఒక ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకంటే – ‘సోషల్ కేపిటల్’, ‘ఫంక్షనల్ పాలిటిక్స్’ థియరీల ఆచరణకు ఇదొక పెద్ద ముందడుగు అవుతుంది. లోతులు తెలియని విమర్శకులు కురచ దృష్టితో దీన్ని తక్కువచేసి చూడ్డం తేలికే గానీ, వీరిని నియమించిన పార్టీ కంటే, ఆ పార్టీ శ్రేణులకు దీనివల్ల కలిగే ప్రయోజనం విలువైనది. - జాన్సన్ చోరగుడి అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత