సాక్షి, అమరావతి: ప్రజలే ప్రభుత్వంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ప్రజలు అపూర్వ రీతిలో మద్దతు పలుకుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా మెగా పీపుల్స్ సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష మద్దతు లభిస్తోంది.
గ్రామాలు మొదలు పట్టణాల వరకు ‘మా నమ్మకం నువ్వే జగన్’ నినాదం మార్మోగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల కుటుంబాలు సీఎం జగన్ పాలనకు మద్దతు పలికాయి. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు జోగి రమేశ్, ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్, ఎంపీ మోపిదేవి వెంకటరమణలు మెగా సర్వే సాగుతున్న తీరును ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా వెల్లడించారు.
కుప్పం.. నగరి ఎక్కడైనా చర్చకు సిద్ధం రాష్ట్రానికి పట్టిన నిజమైన క్యాన్సర్ చంద్రబాబే. పేదలకు మంచి జరగ కూడదనే దురుద్దేశంతో ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు టిడ్కో ఇళ్లపై సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. చంద్రబాబు తన హయాంలో మంచి చేసిన ఒక్క పేద వాడి ఇంటి దగ్గరికి వెళ్లి సెల్ఫీ ఛాలెంజ్ చేయగలరా? దమ్ముంటే మేనిఫెస్టో అమలుపై చర్చకు రావాలని సవాల్ చేస్తున్నా.
కుప్పం అయినా సరే.. నగరి అయినా ఓకే. గాం«దీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అందుకే మెగా పీపుల్స్ సర్వేలో ప్రజల నుంచి స్వచ్ఛందంగా మద్దతు లభిస్తోంది. ఇంటింటికీ జగనన్న స్టిక్కర్ చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో గుబులు పట్టుకుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పి పేదల ఇంటికి స్టిక్కర్లు వేయాలి. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి
ఎన్ని ఇబ్బందులున్నా ఆగని సంక్షేమాభివృద్ధి
గత ఎన్నికల్లో ఇ చ్చిన హామీల్లో ఇప్పటికే 98 శాతానికి పైగా నెరవేర్చిన సీఎం జగన్ పాలనపై ప్రజలు పూర్తి స్థాయి సంతృప్తిగా ఉన్నారు. సీఎం జగన్ మాట ఇస్తే తప్పక చేస్తారనే నమ్మకం ఇంతగా మద్దతు పలికేలా చేసింది. ఈ మెగా పీపుల్స్ సర్వే దేశ చరిత్రలోనే ప్రథమం.
కరోనా, ఇతరత్రా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమాభివృద్ధి పథకాల్లో ఎక్కడా తేడా లేకుండా అమలు చేయడం గొప్ప విషయం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. 2021–22లో రూ.1.92 లక్షలు ఉన్న తలసరి ఆదాయం 2022 –23లో రూ.2.19 లక్షలకు పెరిగింది. జీఎస్‌డీపీ వృద్ధిలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. సీఎం జగన్ దార్శనికతతో రాష్ట్రం 11.43 శాతం గ్రోత్ రేట్ సాధించింది. – ఆదిమూలపు సురేశ్, మున్సిపల్ శాఖ మంత్రి
‘జగనన్నే మా భవిష్యత్’ చరిత్రలో ఓ రికార్డు
‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. మా నమ్మకం నువ్వే జగన్.. అంటూ ప్రజలు నినదిస్తున్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల గడప వద్దకు చేర్చిన సీఎం జగన్ లాంటి సాహసోపేత నిర్ణయం ఏ రాజకీయ పార్టీ తీసుకోలేదు. ఈనెల 7వ తేదీ నుంచి పార్టీ సైనికులతో నిర్వహిస్తున్న ఈ సర్వేలో ఇప్పటికే 49 లక్షల కుటుంబాలు సీఎం జగనన్న పాలనకు మద్దతు పలికాయి.
రాష్ట్ర ప్రజలు వారి పిల్లల భవిష్యత్తు కోసం జగనన్న ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. దీంతో పార్టీ కేడర్ నూతనోత్సాహంతో ముందుకు దూసుకెళ్తోంది. నిబద్ధత కలిగిన నేతకు.. అసత్య ప్రచారాలకు మధ్య యుద్ధం ఇది. తుది విజయం జగనన్నదే. – జోగి రమేశ్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి
సంక్షేమాభివృద్ధి సారథి జగన్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివక్ష లేని సంక్షేమాభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తోంది. 98 శాతం పైగా హామీలు అమలు చేసి, సంక్షేమాభివృద్ధి సారథిగా నిలిచారు. అందుకే మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్, వెల్‌నెస్ సెంటర్ల ద్వారా సరికొత్త సుపరిపాలనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.
నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలు గౌరవంగా జీవించేలా చేస్తున్నారు. ప్రతి పథకంలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్దిదారుడికే నగదు వెళ్లేలా విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. అందుకే ప్రజల్లో ఇంత ఆదరణ కనిపిస్తోంది. – మోపిదేవి వెంకటరమణ, రాజ్యసభ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment