లవర్‌కు మిస్‌డ్ కాల్ ఇచ్చారని..
Published Tue, Dec 13 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): శ్రీరామ్‌నగర్‌కు చెందిన అనూక్, విశ్వనాథ్ అలియాస్ బన్నీలపై అదే కాలనీకి చెందిన దినేష్‌రెడ్డి, అమర్, సాయికుమార్, తరుణ్ సోమవారం రాత్రి దాడి చేశారు. బాధితుల్లో ఒకరు దాడి చేసిన వారిలోని ఓ వ్యక్తి లవర్ సెల్‌కు మిస్‌డ్ కాల్ ఇవ్వడంతో ఘర్షణ పడ్డారు. మాటకు మాట పెరిగి అనూక్, విశ్వనాథ్‌లపై తీవ్రంగా దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ మధుసూదన్‌రావు మంగళవారం తెలిపారు.
Advertisement
Advertisement