cell
-
ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..
సైదాబాద్: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్‌బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కుతోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చేశారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్‌రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు. -
సెల్‌ఫోన్ పోయిందా.. అధైర్యపడకండి.!
● సీపీ ఏవీ రంగనాథ్ వరంగల్ క్రైం : సెల్‌ఫోన్ పోయిందా ..అధైర్యపడవద్దని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడింటి రిజిస్టార్ (సీఈఐఆర్)లో కొ న్ని వివరాలు నమోదు చేస్తే ఫోన్ ఎక్కడుందో తెలు సుకునే అవకాశం ఉంటుందని సీపీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెల్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందని, ఫోన్ పోతే బాధపడొద్దని సూచించారు. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్ఫో న్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టే షన్లో ఫిర్యాదు చేసి rwww.ceir.gov.in వెబ్సైట్లో లాగిన్ కావాలని తెలిపారు. అందులో ఐఎంఈఐ నంబర్, కంపెనీ పేరు, మోడల్, సెల్‌ఫోన్ కొనుగోలు చేసిన బిల్లు తదితర వివరాలు నమోదు చేయాల న్నారు. దీంతో పాటు రాష్త్రం, జిల్లా, మండలం, తదితర వివరాలను నమోదు చేస్తే 24 గంటల్లో ఫోన్ పనిచేయకుండా చేస్తుందని తెలిపారు. అవగాహన కల్పించాలి... ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్ వాడుతున్న వినియోగదారులకు ఫోన్ పోతే ఏం చేయాలనే విషయాలపై, సీఈఐఆర్పై అవగాహన కల్పించాలని సీపీ తెలిపారు. బ్లూకోల్ట్, పెట్రోకార్ సిబ్బంది అవగాహన కల్పిస్తారన్నారు. దీంతో పాటు ప్రజలకు అ వగాహన కల్పించడానికి పోస్టర్లు విడుదల చేశారు. -
నల్లులు కారణంగా చనిపోయిన ఖైదీ..దర్యాప్తు చేస్తున్న అధికారులు
ఓ ఖైదీ అనూహ్యంగా జైల్లోనే చనిపోయాడు. అయితే అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఎందువల్ల అతను చనిపోయాడో దర్యాప్తు చేయాలంటూ పట్టుబట్టారు. అతను నల్లుల కారణంగానే చనిపోయాడని, జైల్లో అపరిశుభ్ర వాతావరణం ఉందని ఆరోపణలు చేశారు. దీంతో అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటన అమెరికాలో అట్లాంటాలో చోటు చేసుకుంది. అసలేం జరిగందంటే..లాషాన్ థాంప్సన్ అనే వ్యక్తి జూన్ 12, 2022న అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత అతను ఫుల్టన్ కౌంటీ జైలుకి తరలించారు. అతడు మానసిక అనారోగ్యంతో ఉన్నట్లు నిర్ధారించి అధికారుల అతని మానసిక రోగుల విభాగంలోకి సెప్టంబర్ 13, 20222న మార్చారు. ఆ తర్వాత మూడు నెలలకే అతను అనుహ్యంగా చనిపోయాడు. థాంప్సన్ ఉంచిన గది ఒక రోగిని ఉంచాల్సిన సెల్ కాదని, చాలా అపరిశుభ్రంగా ఉందని అతడి బంధువులు ఆరోపించారు. అక్కడ ఉన్న నల్లుల కారణంగానే అతను చనిపోయాడని ఆరోపణలు చేశారు. అలాగే పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, తీవ్రమైన నల్లుల దాడి జరిగిందని తేలింది. దీంతో అతను ఎలా చనిపోయాడో దర్యాప్తు చేయాలంటూ జైలు అధికారులను డిమాండ్ చేశారు ఆ ఖైదీ బంధువులు. దీంతో ఫుల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులను ఆ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే సెల్లో ఉన్న మిగతా ఖైదీల భద్రతా ప్రోటోకాల్‌పై విచారణ చేయడమే గాక సంరక్షణ చర్యలు చేపట్టమని ఆదేశించింది. అక్కడ ఉన్న ఖైదీల ఆరోగ్య సంరక్షణపై తనీఖీలు నిర్వహించడమేగాక, ఏదైనా ఆరోపణ రుజవైతే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఫుల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకటించింది. అయితే నల్లులు ప్రాణాంతకం కాదని, కొన్ని అరుదైన సందర్భాల్లో తీవ్రమైన రక్తహీనతకు కారణమవుతుందన్నారు కెంటకీ విశ్వవిద్యాలయ శ్రాస్తవేత్త. చికిత్స చేయకుండా అలా వదిలేస్తే ఒక్కోసారి ప్రాణాంతకమవుతుందని కూడా చెప్పారు. (చదవండి: హైట్‌గా ఉండేలా రెండుసార్లు సర్జరీలు..రీజన్ వింటే షాక్ అవుతారు!) -
‘సోలార్’ కేరాఫ్ హైదరాబాద్
దక్షిణ భారత దేశంలో సోలార్ పవర్ ఉత్పత్తికి హైదరాబాద్ కీలక కేంద్రం కానుంది. నగరానికి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ భారీ ఎత్తున సోలార్ పరిశ్రమకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేయనుంది. దీనికి సంబంధించిన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. 1.5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ సెల్, మ్యాడ్యుల్ తయారీ పరిశ్రమని 2021 జులై 19న హైదరాబాద్ నగరంలో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ప్రారంభించబోతుంది. రూ. 483 కోట్ల వ్యయంతో ఈ తయారీ యూనిట్‌ను నెలకొల్పారు. ఇందులో 750 మెగావాట్ల సోలార్ సెల్స్, 750 మెగావాట్ల మాడ్యుల్స్ తయారీ సామర్థ్యంతో కంపెనీ పని చేయనుంది. అధునాతన మల్టీక్రిస్టలీన్, మోనో పీఈఆర్సీ టెక్నాలజీని ఈ యూనిట్లో ఉపయోగించనున్నారు. రాబోయే రోజుల్లో మరో రూ. 1200 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల సోలార్ మాడ్యుల్ తయారీ యూనిట్‌ని విస్తరిస్తామని ప్రీమియర్ ఎనర్జీస్ తెలిపింది. విస్తరణ తర్వాత సంస్థ సోలార్ మాడ్యుల్ తయారీ సామర్థ్యం 3 గిగావాట్లకు చేరుకుంటుందని ప్రీమియర్ ఎనర్జీస్ ఎండీ చిరంజీవ్ సలూజా తెలిపారు. ఈ ఆర్థిక సంవ్సతరానికి రూ.1500 కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, అంతకు ముందు ఏడాది కంపెనీ రెవెన్యూ రూ. 850 కోట్లగా నమోదు అయ్యిందని ఆయన అన్నారు. -
కణకణంలోనూ కిల్లర్ కోడ్!
నార్త్‌వెస్టర్న్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికరమైన ఆవిష్కరణ చేశారు. మన శరీరంలోని ప్రతి కణంలో ఉండే రహస్యమైన కోడ్‌ను వీరు గుర్తించారు. కణం అదుపు తప్పి పోతుందనుకున్నప్పుడు తనను తాను చంపేసుకునేందుకు ఈ కోడ్ ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కోడ్, దాని వెనుకనున్న వ్యవస్థను క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే భవిష్యత్తులో కేన్సర్ అనేది అస్సలు ఉండదని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మార్కస్ పీటర్ అంటున్నారు. రోగనిరోధక వ్యవస్థ ఏర్పడకముందు బహుకణ జీవుల్లో కేన్సర్ లాంటి ముప్పులను తట్టుకునేందుకు ఏదైనా వ్యవస్థ ఉందా? తెలుసుకునేందుకు మార్కస్ పరిశోధనలు చేపట్టారు. అతిసూక్ష్మమైన ఆర్ఎన్ఏ కణాలను చైతన్యవంతం చేయడం ద్వారా ముప్పులను అడ్డుకునేందుకు అతిపురాతన కాలం నుంచి ఓ వ్యవస్థ పనిచేస్తున్నట్లు గత ఏడాది స్పష్టమైంది. కీమోథెరపీ కూడా ఇదేరకంగా పనిచేస్తూండటం ఇక్కడ గమనార్హం. ఆరు న్యూక్లియోటైడ్లతో కూడిన మూలకాలు కేన్సర్ కణాలను నాశనం చేస్తున్నట్టు గుర్తించిన శాస్త్రవేత్తలు మొత్తం 4096 మూలకాలలో కచ్చితంగా ఏది ఈ పనిచేస్తోందో తెలుసుకోగలిగారు. ఈ మూలకం ఆధారంగా మందులు తయారు చేస్తే నిరోధకత అన్నది ఉండదని, కీమోథెరపీ అవసరం లేకుండా కేన్సర్ కణాలను నాశనం చేయవచ్చునని పీటర్ తెలిపారు. -
ఎన్నికల కోసమే మద్దతు ధర: కోదండరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధరలు పెంచిందని టీపీసీసీ కిసాన్‌సెల్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో మాట్లాడిన ఆయన...ఎన్నికల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై కపట ప్రేమను చూపిస్తున్నాయని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగిన నష్టానికి ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని, రూ.7,400 కోట్లకు సంబంధించిన పరిహారం వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కేంద్రానికి పంపలేదన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ...టీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. -
కణం బరువును తూచే యంత్రం
మన శరీరంలో కొన్ని కోట్ల కణాలున్నాయి కదా.. ఒక కణం బరువు ఎంతుంటుంది? అబ్బో అంత సూక్ష్మమైన దాన్ని తూచేదెలా? అని అనుకుంటున్నారా? ఇప్పటివరకు కష్టమయ్యేదేమోగానీ.. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి ఈ పనిని సులువు చేసింది. బేసల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, జ్యూరిచ్‌లోని ఈటీహెచ్ విశ్వవిద్యాలయాలు కలసి అత్యంత సూక్ష్మస్థాయిలోని కణం బరువును నిర్ధారించగల యంత్రాన్ని అభివృద్ధి చేశాయి. లేజర్లు, పరారుణ కాంతి కిరణాల సాయంతో పనిచేసే ఈ యంత్రం ద్వారా ఒక గ్రాములో లక్ష కోట్ల వంతు తక్కువ బరువులను కూడా లెక్కించవచ్చు. ఈ యంత్రం ఎలా పనిచేస్తుందంటే.. మైక్రోస్కోపు ద్వారా చూస్తుండగా శరీర కణాలున్న పాత్రలోకి ఓ సూదిలాంటి దాన్ని చొప్పిస్తారు. సూది పైభాగం స్థిరంగా ఉంటే.. అడుగు భాగాన్ని అటు ఇటూ కదలించేలా ఏర్పాటు ఉంటుంది. సూది ఎప్పుడైతే అడుగు భాగాన్ని చేరుకుంటుందో దాని మొనకు కణం అతుక్కుంటుందని.. అప్పుడు నీలి రంగు లేజర్ ద్వారా సూది కంపించేలా చేస్తామని, పరారుణ కాంతి కిరణంతో ఈ కంపన తీవ్రతను లెక్కించడం ద్వారా దానికి అతుక్కున్న కణం బరువు తెలుస్తుందని ఈటీహెచ్ శాస్త్రవేత్త డేవిడ్ మార్టినెజ్ తెలిపారు. -
సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి
సావధానంగా సమస్యలు విన్న కలెక్టర్ మిశ్రా సంబంధిత అధికారులకు ఆదేశాలు కాకినాడ సిటీ : కలెక్టరేట్లో ప్రతివారం నిర్వహించే మీ కోసం ప్రజావాణి ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా నూతన కలెక్టర్ కార్తికేయ మిశ్రా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సోమవారం కోర్టుహాలులో కలెక్టర్ వినతుల స్వీకరణ చేపట్టారు. వచ్చిన ప్రతి అర్జీదారుడినీ ఆప్యాయంగా పలుకరించి వారు చెప్పే సమస్యలను సావధానంగా విన్న తరువాత, ఆ సమస్య పరిష్కారంపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన వేగి సత్యనారాయణమ్మ అనే వృద్ధురాలు తన భూమిని సర్వే నంబర్ 124/3సి2లో 3.28 సెంట్లు పోలవరం కాలువ కోసం ప్రభుత్వం తీసుకున్నదని, ఈ భూమికి రెండు దఫాలుగా నష్టపరిహారం చెల్లించారని, మూడో దఫా పరిహారం చెల్లింపులో భూమి తనదని చెప్పి ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడని ఆవేదన చెందింది. ఆయాస పడుతున్న ఆమెకు తన కోసం పెట్టిన తాగునీటిని అందించి, ఆమె సమస్యను పెద్దాపురం ఆర్డీఓకు సమాచారం ఇచ్చి గురువారానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే సామర్లకోటకు చెందిన యార్లగడ్డ విజయకుమార్ తనకు చెందిన అసై¯ŒS్డ భూమి వేలం వేసి స్వాధీనం చేసుకున్నారని, తనకు న్యాయం చేయాలని కోరగా దీనిపై కాకినాడ ఆర్డీఓ తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజావాణిలో సుమారు 185 మంది అర్జీదారులు హాజరై కలెక్టర్‌కు సమస్యలపై వినతులు అందజేశారు. ఈ ఫిర్యాదులలో పింఛన్ల కోసం దరఖాస్తులు ఎక్కువగా రావడం, వికలాంగులు, వయోవృద్ధులు పింఛన్లు పొందకపోవడంపై కలెక్టర్ స్పందిస్తూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సమగ్ర నివేదిక ఇవ్వాలని డీఆర్డీఏ పీడీ ఎస్.మలి్లబాబును తగు చర్యల నిమిత్తం ఆదేశించారు. అలాగే కాకినాడ శివారు ప్రాంతాల్లో గృహ నిర్మాణం కోసం వచ్చిన దరఖాస్తులు ప్రత్యేక ప్రాజెక్టుగా అమలు చేయాలని మున్సిపల్ కార్పొరేష¯ŒS కమిషనర్ అలీంబాషాకు సూచించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ కలెక్టరేట్లో కంప్యూటరీకరించాలని, ఈ దరఖాస్తులపై తీసుకున్న చర్యలపై వచ్చే మూడు రోజుల్లో సంబంధిత అధికారులు నివేదికలు సమర్పించాలన్నారు. నిర్ధిష్టమైన చర్యలు ఉండాలి ప్రజా సమస్యలపై నామమాత్రం చర్యలను అనుమతించేది లేదని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. మండల, డివిజ¯ŒSస్థాయిలో అక్కడ సమస్యలు పరిష్కరించే దిశలో అధికారులు చర్యలు చేపట్టాలని, అర్జీదారులు జిల్లా కేంద్రానికి రావాలి్సన అవసరం ఉండదన్నారు. సంబంధిత అధికారులకు మార్క్‌చేసిన అర్జీలను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని, తీసుకున్న చర్యల నివేదిక కలెక్టర్‌కు పంపించాలని ఆదేశించారు. డీఎఫ్ఓ నందిని, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, ఇ¯ŒSచార్జి డీఆర్ఓ ఎం.జ్యోతి, డీఆర్డీఏ పీడీ ఎస్.మలి్లబాబు, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కె.పద్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
లవర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చారని..
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): శ్రీరామ్‌నగర్‌కు చెందిన అనూక్, విశ్వనాథ్ అలియాస్ బన్నీలపై అదే కాలనీకి చెందిన దినేష్‌రెడ్డి, అమర్, సాయికుమార్, తరుణ్ సోమవారం రాత్రి దాడి చేశారు. బాధితుల్లో ఒకరు దాడి చేసిన వారిలోని ఓ వ్యక్తి లవర్ సెల్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో ఘర్షణ పడ్డారు. మాటకు మాట పెరిగి అనూక్, విశ్వనాథ్‌లపై తీవ్రంగా దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ మధుసూదన్‌రావు మంగళవారం తెలిపారు. -
జార్ఖాండ్ లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
-
కడప సెంట్రల్ జైలులో సెల్‌ఫోన్ కలకలం
-
రైట్ టర్న్
చక్రాలు తిరుగుతున్నాయి. రోడ్డు... కారును హత్తుకుంది. గమ్యం పిలుస్తోంది. స్పీడు పెరిగింది. రేర్‌వ్యూ మిర్రర్లో పీడకల మాయమైపోతోంది. ఇప్పుడు చక్రం తిప్పుతున్న చేతి గాజులు తాళం వేస్తున్నాయి. ఒక మహిళ జీవితం ఎంత అందంగా ఉండాలనుకుంటామో అంత అందంగా ఉంది. ఎంత గౌరవంగా ఉండాలనుకుంటామో అంత ధీమాతో సాగుతోంది. ఆమె టాక్సీలో పాసింజర్గా ఒక్కసారి ప్రయాణం చేసినా చాలు... ఎవరికైనా జీవితంపై ఆసక్తి, జీవనయానానికి ఒక గమ్యం దొరుకుతుంది. ఒకప్పుడు సెల్వి ఇలాంటి ఒక రోడ్డుమీదికి పరిగెట్టుకుంటూ వచ్చింది... ఏ బండి కిందైనా పడి చనిపోదామని! ఇప్పుడు అదే రోడ్డు, సెల్వి బండికి సలామ్ కొడుతోంది. మనందరికీ ఒక ‘రైట్’ టర్న్ చూపిస్తోంది! మైసూర్... తారు రోడ్డు మీద జర్క్స్ లేకుండా సాఫీగా సాగిపోతోంది ఓ టాక్సీ! వెనకసీట్లో ముప్పై పైబడిన యువకులు ఇద్దరు కూర్చుని ఉన్నారు. అందులో ఒకతను.. స్టీరింగ్ వీల్‌ని అలవోకగా తిప్పుతున్న ఆమె నల్లని, సన్నని, కోమలమైన వేళ్లనే చూస్తున్నాడు అబ్బురంగా! ఆ వేళ్లలో ఒడుపు ఉంది, నేర్పు ఉంది. పట్టువిడుపులు ఉన్నాయి. ఆమె పేరు సెల్వి. వయసు 28! స్వస్థలం.. తమిళనాడు, కర్ణాటక బార్డర్‌లోని మారుమూల పల్లె! ఓ టాక్సీడ్రైవర్ గురించి చెప్పడానికా ఈ ఉపోద్ఘాతం అని పెదవి విరవకండి! సెల్వి కర్ణాటక రాష్ట్రంలోని మొదటి మహిళా టాక్సీడ్రైవర్. బస్, లారీ, ట్రక్ లాంటి భారీ వెహికిల్స్‌ని కూడా నడపగలదు.ఆమె మీద కెనడాకు చెందిన ఎలిసా పొలోస్కీ అనే ఫిల్మ్‌మేకర్ ‘డ్రైవింగ్ విత్ సెల్వి’ అనే డాక్యుమెంటరీ కూడా తీసింది. అయితే ఈ సాధికారతను సాధించడానికి సెల్వి ఎన్నో మలుపులు, ఇంకెన్నో స్పీడ్బ్రేకర్స్ని దాటాల్సి వచ్చింది. రెండువేల సంవత్సరంలో... తొమ్మిదో తరగతిలో ఉంది సెల్వి. భుజాన పుస్తకాల బ్యాగ్మోస్తూ తన భవిష్యత్ కలను స్నేహితులతో పంచుకుంటూ నడుస్తున్న సెల్వికి చెప్పారు స్నేహితులు తమ క్లాస్మేట్స్ ఇద్దరి పెళ్లిళ్లు కుదిరాయని, ఆ రోజు నుంచి వాళ్లు ఇక స్కూల్‌కి రాకపోవచ్చని. ఆ మాట విని హఠాత్తుగా ఆగిపోయింది ఆమె. ‘పెద్ద చదువులు, ఉద్యోగాలు లేకుండా కనీసి పదో తరగతి కూడా దాటకుండానే పెళ్లా? పాపం’ అనుకొని మళ్లీ నడకసాగించింది. ‘దేవుడా నాకు ఆ గతి పట్టకుండా చూస్తున్నావ్. రొంబ థాంక్స్’ అనుకుంది మనసులోనే. అదే సమయంలో సెల్వి ఇంట్లో ఆమె తల్లి, అన్న, మేనమామ సెల్వి పెళ్లికోసం సంబంధం మాట్లాడుతున్న విషయం ఆమెకు తెలియదు.. కనీసం ఆమె ఊహకు కూడా అందలేదు! అంది ఉంటే దేవుడికి అంతలా థ్యాంక్స్ చెప్పేది కాదేమో! సాయంకాలం... స్కూల్ నుంచి వచ్చిన సెల్వికి ఇంట్లో వాతావరణం అంతా కొత్తగా అనిపించింది. ఇత్తడి పళ్లెంలో చీర, జాకెట్టు గుడ్డ, పళ్లు, పూలు, స్వీట్లతో తాంబూలం ఉండడం, ఎన్నడూలేంది మేనమామ భార్య ఆప్యాయంగా పలకరించడం.. ఆశ్చర్యంగా అనిపించింది ఆమెకు. తన తండ్రి చనిపోయినప్పుడు కూడా తమని దగ్గరికి తీసుకున్న పాపాన పోలేదు.. కానీ ఈ రోజేంటో స్కూల్నుంచి రాగానే భుజం మీదనుంచి బ్యాగ్ అయినా తీయలేదు తను ‘మా బంగారమే.. మా ఇంటి మహాలక్ష్మే’ అంటూ దగ్గరకి వచ్చి మెటికలు విరుస్తూ ఊపిరాడనంత గట్టిగా హత్తుకుంది అత్త. సెల్వి మనసు కీడు శంకించింది. అక్కడే బల్లమీద కూర్చోని చూస్తున్న తల్లి మొహంలో చిన్నపాటి కలవరం. తనకు నచ్చని విషయాన్ని చెప్పి ఎలా ఒప్పించాలా అన్నట్టుంది ఆమె వాలకం. ‘సెల్వి.. నీకు పెళ్లి కుదిరింది’ అకస్మాత్తుగా అంటూ అప్పటిదాకా ఉన్న ఇబ్బందిని బ్రేక్ చేశాడు సెల్వి అన్న. ‘నాకు పెళ్లేంటి?’ తన మనసు శంకించిన కీడు ఇదేనా అనుకుంటూ అడిగింది సెల్వి. ‘అవును.. మంచి సంబంధం. అబ్బాయికి వ్యాపారం ఉంది. పైగా అత్తావాళ్లకు తెలిసినవాళ్లు. మనకు నయాపైసా ఖర్చు కాకుండా పెళ్లి చేసుకుంటామన్నారు. అన్నయ్యకు ఉద్యోగమూ ఇప్పిస్తామన్నారు’ ఏ భావమూ లేకుండా, ఈ పెళ్లికి సెల్వి అనుమతి అవసరం అన్న భావనను జారవిడవకుండా చెప్పుకెళ్లింది సెల్వి తల్లి. ఆ రాత్రి మొదలు సెల్వి కొన్ని రాత్రులు ఏడ్చింది, మొత్తుకుంది, బతిమాలింది, బామాలింది పెళ్లివద్దని. కానీ ఎవరి చెవికీ ఎక్కలేదు. ఇంకెవరి మనసుకీ పట్టలేదు. తన క్లాస్మేట్స్ ఇద్దరిలాగే పదో తరగతి దాటకుండానే సెల్వి పెళ్లి అయిపోయింది. అత్తింట్లో... బాల్యవివాహానికి బలైన సెల్వికి అత్తింట్లో గృహ హింస ఎదురైంది. భర్తకు, ఆమెకు దాదాపు పదాహారేళ్ల వయసు తేడా. చీటికీమాటికీ కొట్టడం, నోటికొచ్చినట్టు తిట్టడం. ఇదే... అత్తింట్లో ఆమెకు భర్త ఇచ్చిన ఆదరణ. కాఫీ సరిగ్గా కలపలేదనే దగ్గర్నుంచి ఇల్లు సర్దడం రాదు అనే మిషను దాటి చివరకు పిల్లలు పుట్టలేదు అనేంత వరకు వెళ్లాయి అత్తింటి వేధింపులు. ఎంత సహనంగా ఉన్నా ప్రతి రోజూ ఆ సహనానికి పరీక్ష జరిగేది. అలా నాలుగేళ్లు గడిచాయి. అమ్మకు చెప్పి ఏడిస్తే ఈసడింపే కానీ ఓదార్పు దొరికేది కాదు. అన్న అసలు ఆమె బాధను తన చెవిదాకా రానిచ్చేవాడే కాదు. ‘ఏమైనా అదే నీ ఇల్లు. కష్టమైనా, నష్టమైనా అక్కడే భరించాలి. అసలు మేమున్నామనే విషయాన్నే మరిచిపో’ అంది అమ్మ ఒకరోజు. అత్తగారింట్లో వెతలకన్నా అమ్మ అన్న ఆ మాటే ఎక్కువ బాధించింది సెల్విని. 2004లో... ఓ రోజు.. ఆత్మహత్య తప్ప తన సమస్యకు వేరే పరిష్కారం లేదని అత్తింటి గడపదాటి రోడ్డుమీదకు వచ్చింది. వేగంగా వస్తున్న బస్ కిందకు వెళ్లాలనుకుంది. ఆ క్షణంలో ఆమె మెదడు ఏం ఆలోచించించిదో మరి బస్ కిందకు వెళ్లాలనుకున్న ఆమె చెయ్యి ఎత్తి బస్ ఆపింది. సడెన్ బ్రేక్‌తో ఆగిన బస్‌లోకి ఎక్కేసింది. అది మైసూర్ బస్. అదే ఆమె ఆలోచనా గమ్యాన్ని, ప్రయాణ మార్గాన్నీ మార్చింది. బస్‌లో పక్కసీట్లోనే ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్ సెల్వితో మాటలు కలిపింది. వివరాలు తెలుసుకొని ఆమెను సరాసరి మైసూర్‌లోని ‘ఒడనాడి’ విమెన్ రెఫ్యూజీ సంస్థకు తీసుకెళ్లింది. అక్కడ చేరిన సెల్వి డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఇంకో వైపు ప్రైవేట్‌గా టెన్త్‌క్లాస్ పరీక్షకు హాజరైంది. డ్రైవింగ్ లెసైన్స్‌తోపాటు, టెన్త్‌లోనూ ఉత్తీర్ణత సాధించింది. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఓ టాక్సీనీ కొనుక్కుంది. అలా కర్ణాటకలోనే ఫస్ట్ లేడీ టాక్సీ డ్రైవర్‌గా నిలిచింది. ఆత్మవిశ్వాసం... రోడ్డు మీద కారు ప్రయాణం సెల్విలో కొత్త విశ్వాసాన్నిచ్చింది. ఆత్మబలాన్ని పెంచింది. ఆ తెగువతో మైసూర్‌లోని స్త్రీలకు సంబంధించిన పలు స్వచ్ఛంద సంస్థలను కలవడం, వాళ్లతో కలిసి పనిచేయడం స్టార్ట్ చేసింది. అంతేకాదు మహిళల అరోగ్య సమస్యల మీదా గొంతు విప్పింది. చేతనైన సహాయం చేస్తోంది. తనలాంటి ఇంకెంతో మంది నిరాశ్రయ మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణనిస్తోంది. కొద్ది కాలంలోనే సెల్వి ఇటు కర్ణాటకలోనూ, అటు తమిళనాడులోనూ ఫేమస్అయిపోయింది. ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌లోనూ సెల్వీ స్టోరీ చోటు సంపాదించుకుంది. అది చదివే కెనడియన్ ఫిల్మ్‌మేకర్ ఎలీసా పొలోస్కి సెల్వీ మీద డాక్యుమెంటరీ తీసింది. అది లండన్‌లోని రెయిన్డాన్స్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ అయి ప్రశంసలూ అందుకుంది. ‘బస్‌కింద పడదామని వచ్చిన నాకు చివరి నిమిషంలో అనిపించింది.. నేనేందుకు చావాలి? అని. బతికి నన్ను నేను వ్రూవ్ చేసుకోవాలనుకున్నా. అందుకే చేయి ఎత్తి బస్ ఆపాను. ఈ దేశంలో ఆడవాళ్లకు బాధలే ఉండాలి అన్న రూలేం లేదుకదా! సంతోషాన్ని ఒకరు ఇవ్వడమేంటి? మన ఆనందాన్ని మనమే వెదుక్కోవాలి. సంతోషపడే హక్కు మగవాళ్లకెంత ఉందో మనకూ అంతే ఉంది. దేనికీ తలవంచకుండా ఉంటే చాలు!’ అంటూ టాక్సీ యాక్స్లెటర్ని రైజ్ చేసింది సెల్వీ గమ్యంలో మరింత దూసుకుపోవడానికి సిద్ధమవుతూ! సెల్వి జీవన ప్రయాణంలో ఆమెకు తోడైన ఒక వ్యక్తి ఆమె చేయి అందుకున్నాడు. ఇప్పుడు వాళ్లకిద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయిని పైలట్‌ను చేయాలని, చిన్నమ్మాయిని డాక్టర్ని చేయాలని అనుకుంటోంది సెల్వి. -
డిస్టెన్స్
మెట్రో కథలు బాస్ పిలిస్తే లోపలికెళ్లి బయటకు వచ్చాక మళ్లీ ఒకసారి కాల్ చేసి చూశాడు. స్విచ్డ్ ఆఫ్ వస్తోంది. సీట్లో కూచుని సెల్ వైపు చూసుకుంటూ తిరిగి కాల్ చేశాడు. స్విచ్డ్ ఆఫే. టైమ్ పదకొండు అవుతోంది. సాయంత్రం ఆరుకు ఆఫీస్ అయిపోతే ఏడుకు ఇల్లు చేరేదాకా ఈ నరకం తప్పదు. ఉదయం బయలుదేరే ముందు చిన్నగా మాటా మాటా పెరిగింది. సాయంత్రం వచ్చి తీసుకెళతారుగా అంది. చూద్దాం అన్నాడు. చూద్దాం ఏంటి? రెట్టించింది. చెప్తానన్నాగా. నువ్వు రెడీ అయి కూచుని నా ప్రాణం తీయకు. ఆ మాట చెప్పి టూ వీలర్ ఎక్కి ఆఫీసుకు వచ్చేశాడు. అయితే అలా టూ వీలర్ ఎక్కి ఆఫీసుకు వచ్చేయడం అంత సులభం కాదు. ఏ రోజూ సులభం అవగా చూళ్లేదు. ట్రాఫిక్ ఉంటుంది. సిగ్నల్స్ దగ్గర చాలాసేపు వెయిటింగ్ ఉంటుంది. మధ్యలో పోలీసులు ఎందుకాపేస్తారో తెలియదు, పదీ పదిహేను నిమిషాలు అందరినీ ఆపేసి ఎవరికో దారి వదులుతారు. బాగా నిండిన మురుగు కాలువ అతి మెల్లగా కదిలినట్టు ఒక్కోసారి ఎంత విశాలమైన రోడ్డైనా బండ్లతో నిండిపోయి నల్లటి పొగ వదులుతూ అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదులుతుంటుంది. ఓ కారు దాదాపు డ్యాష్ ఇస్తూ ముందుకుపోతుంది. యూ టర్న్ దగ్గర ఎవడిదో బైక్ మీదమీదకు వచ్చేస్తుంది. చాలా అదృష్టం కలిసి రావాలి. ఆఫీసుకు అప్పుడు చేరాలి. ఎవరో ఒకరు సెక్షన్లోనో క్యాంటీన్లోనో స్మోక్రూమ్లోనో మరొకరిని అడుగుతుంటారు- ఎక్కడ ఉంటున్నావ్? ఏదో ఒక ఏరియా చెప్తారు. అక్కడా? అంత దూరమా? అబ్బే... ఏం దూరం... అరౌండ్ ఫిఫ్టీన్. ఈ అరౌండ్ అనే మాటకు ఎవరి లెక్క వారికుంటుంది. అదనం రెండు కిలోమీటర్లు కావచ్చు. అదనం ఐదు కిలోమీటర్లు కావచ్చు. అదనం పది కిలోమీటర్లు కూడా కావచ్చు. పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్నా అరౌండ్ ఫిఫ్టీన్ అనే చెప్తారు. మరేం చేస్తారు? మంచి ఆఫీసే. చెప్పుకోదగ్గ జీతం అంటే పద్దెనిమిది నుంచి పాతికవేల వరకూ ఉంటుంది. ప్రతి నెలా పదో తేదీకల్లా ఇచ్చేస్తారు. ఒకవేళ పది ఆదివారం అయితే తొమ్మిదిన- శనివారమే పడిపోతాయి. మరి జీతం సరిగ్గా ఇస్తున్నప్పుడు పద్ధతులు సరిగ్గా ఆశించడంలో తప్పు లేదు. టైముకు రావాలి. నెలకు ఒక సెలవు వాడుకోవాలి. లేటొచ్చినా ఆబ్సెంట్ అయినా శాలరీ కట్కు అంగీకరించాలి. అందువల్ల అందరూ జాగ్రత్తగా పని చేస్తారు. బడ్జెట్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. పదీ పదిహేను కిలోమీటర్ల అవతలకు వెళ్లి- అన్నీ కలిపి ఐదున్నరా ఆరులో అయిపోయేలాగా ఒక పోర్షన్ తీసుకుని- జాగ్రత్తగా ఉండిపోతారు. అయితే ఇలాంటి సందర్భాల్లోనే వస్తుంది సమస్య. ముందు రోజు రాత్రే గుర్తు చేస్తూ అంది. శిల్పారామం సంప్రదాయవేదికలో రేపు సాయంత్రం మావాళ్ల పెళ్లి. కార్డు చూశారుగా. అంత ఇదిగా వచ్చి పిలిచి వెళ్లాక వెళ్లకుండా ఉంటే ఏం బావుంటుంది. ఏం జవాబు చెప్పలేదు. దిండు మడిచి తల కింద సర్దుకుంటూ నిద్రపోయాడు. రెండు వారాల క్రితమే ఊళ్లో ఏవో కొంపలంటు కున్నాయంటే పోయేసి వచ్చాడు. ఇప్పుడు మళ్లీ లీవ్ పెట్టలేడు. ఒకవేళ పెడదామన్నా సాయంత్రం ఫంక్షన్ అయితే ఇప్పట్నించి ఇంట్లో ఉండి లీవ్ వేస్ట్ చేయడం ఎందుకు అంటుంది. గంట ముందు పర్మిషన్ అంటే అదో పెద్ద తతంగం. ఇక ఆరుకు బయట పడి, ట్రాఫిక్ అంతా దాటి, అన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరుకుని, గొంతులో టీనీళ్లైనా పోసుకోకుండా భార్యనూ పిల్లలనూ తీసుకొని తిరిగి ముప్పై కిలోమీటర్లు ట్రాఫిక్‌లో పడి, శిల్పారామం చేరుకుని.... ఇదా బతుకు... బస్సుల్లో తిరగలేరు. ఆటోలను భరించలేరు. టూ వీలర్ నడపలేరు. చెప్తే అర్థం కాదా? హూ. మీరు ఏ రోజు సుఖపెట్టారు కనుక. నిజమే. ఆదివారం వస్తే నాలుగు వీధుల అవతల ఆమె చెల్లెలి ఇల్లు ఉంది అక్కడకు తీసుకెళ్లి పడేస్తాడు. దగ్గరలో పాత థియేటర్ ఉంది. సినిమా చూపించేస్తాడు. మూడు నెలలకు ఒకసారి పిల్లలరైలు తిరిగే ఎగ్జిబిషన్ పెడతారు. తీసుకెళ్లి తీసుకొచ్చేస్తాడు. కాని సిటీలోకి మాత్రం రాడు. అది ఆమెకు విసుగు. ఇవాళైనా అంత గట్టిగా పట్టు పట్టేది కాదు. ఆమె బంధువుల్లో వీళ్లే కాస్తంత కలిగిన వాళ్లు. చూడు... శిల్పారామంలో పెళ్లి చేసేంత స్తోమత మా వాళ్లకూ ఉంది చూడు అని చూపిద్దామని తాపత్రయం. అదీగాక ఈ మధ్యే రెండు వేలు పెట్టి ప్యారెట్గ్రీన్ పీకాక్బ్లూ కాంబినేషన్లో అనార్కలి డ్రస్ కొంది. లక్కీగా స్టిచింగ్ కూడా కుదిరింది. అది వేసుకు చూపించాలని కోరిక. పెళ్లంటే ఈ మధ్య కనీసం డెబ్బై రకాల వంటకాలైనా పెడుతున్నారు. మీల్మేకర్ రైస్... బేబీ కార్న్ దమ్ బిర్యానీ... తమ సంగతి ఏముందిగానీ పిల్లల నోటికి కాస్తంత అందివ్వచ్చు కదా. ఒక పూట వంట తప్పుతుంది. అన్నింటి కంటే ముఖ్యం- ఈ బందిఖానా నుంచి కాసేపైనా బయటపడొచ్చని ఆశ. కానీ... పిల్లల్ని కూచోబెట్టుకుని అంతంత దూరం పోకూడదు. ఇన్ని మాటలు ఎందుకు? ఇష్టం లేదని చెప్పెయ్యండి. సిటీలో టూ వీలర్ నడపడం ఎంత రిస్కో ఆడవాళ్లకు అర్థం కాదు. ముందు పెద్దాణ్ణి కూచోపెట్టుకుని వెనక పిల్లదాన్ని ఒళ్లో పెట్టుకుని... మొత్తం నాలుగు ప్రాణాలు... క్షణం కూడా గ్యారంటీ లేదు. అదీగాక వెళ్లేటప్పుడు పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. వచ్చేటప్పుడు నిద్రపోతారు. చాలాసార్లు అయ్యింది. పెద్దాడు అలా తూగుతూ ట్యాంక్ మీద వాలిపోయి నిద్రలో ఎక్కడ జారిపోతాడో అని దడ రేపి... కాని వినదు. మళ్లీ ట్రై చేశాడు. స్విచ్డాఫ్. ఇక ఫోన్ తీయదు. తీయకపోతే పోయింది ఆ కోపంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అల్లరి చేస్తుంటే నాలుగు పీకుతుంది. ఒకసారి ఇలాగే సోఫాలో నుంచి పెద్దాణ్ణి లాగి కిందకు పడేసింది. ఆ సంగతి తెలిసి రెండు రోజులు గుండె గుబగబలాడింది. ఆమె చెల్లెలికి ఫోన్ చేశాడు. ఇక్కడికి రాలేదు బావా. ఇందాక అటువైపు వెళుతూ చూశాను. ఇంట్లో కూడా లేదే. మెల్లగా కడుపులో మంట మొదలయ్యింది. ఈ మధ్య ఇంతే అవుతోంది. టెన్షన్ వస్తే ఎసిడిటీ పెరిగిపోతోంది. గడియారం వైపు చూశాడు. టైమ్ చాలా ఉంది. ఎప్పటికి సాయంత్రం కావాలి? ఎప్పటికి ట్రాఫిక్ దాటాలి? ఎప్పటికి ఇంటికి చేరాలి? చేరి ఇంట్లో ఏం చూడాలి? సెల్ పట్టుకుని వెనక్కి వాలాడు. మంట ఛాతీని గుంజుతూ ఉంది. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
'సెల్' లో కబుర్లు- గాల్లో ప్రాణాలు
-
కాంగ్రెస్ నేతల సెల్‌చల్..
సెల్‌ఫోన్ మానియాకు ఎవరూ అతీతులు కారు. యువతే కాదు.. నేతలు కూడా సెల్ ఫోన్లతో మునిగి తేలుతున్నారు. అది మీటింగ్ అయినా...మరొకటి అయినా సరే.. విషయానికి వస్తే...ఓ పక్క కాంగ్రెస్ పార్టీ సమావేశం.. వేదికపై హేమాహేమీల ప్రసంగాలు నడుస్తున్నాయి. మరోపక్క తమకు పట్టనట్టు కొందరు నేతలు సెల్ఫోన్లతో బిజీ అయిపోయారు. ఇదీ బుధవారం జరిగిన మలక్‌పేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో చోటు చేసుకున్న సంఘటన. స్థానిక స్వాతి ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. కార్యకర్తలు ప్రసంగాలు వింటుంటే.. వక్తలు తప్ప, మిగతా నాయకులంతా ప్రసంగం నడుస్తున్నంతసేపూ తమ సెల్‌ఫోన్స్ చూసుకుంటూ కనిపించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలోనూ ఇదే సీన్ కనిపించింది. -
జిల్లాలో విపత్తు సహాయక సెల్
కరీంనగర్: వరదలు, విపత్తులు సంభవిస్తే తక్షణం స్పందించేందుకు 24 గంటలూ పనిచేసే సెల్‌ను కరీంనగర్ కలెక్టర్ నీతూప్రసాద్ ఏర్పాటు చేశారు. ఈ సెల్లో 120 మంది రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బందిని నియమించారు. ఈ సెల్ సోమవారం నుంచి పనిచేయటం ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800-4254-731, 0878-2234-731 ఫోన్ నంబర్లను కేటాయించారు. ఈ నంబర్లకు అందిన ఫిర్యాదును వెంటనే తహశీల్దార్లకు, ఆర్డీవోలకు అందిస్తారు. వారు తీసుకున్న చర్యలపై కలెక్టర్ నీతూప్రసాద్ సమీక్షించనున్నారు. -
ఇదేం ఖర్మ బాబూ..
- రెండుమార్లు వివరాలు అందజేసినా అందని రుణ మాఫీ సొమ్ము - మరోమారు అధికారులకు పత్రాలు సమర్పించేందుకు వస్తున్న రైతులు - ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి సాక్షి, కడప : రుణ మాఫీ దక్కని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ వద్ద రైతులు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రుణ మాఫీ కాని రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అనువుగా ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినప్పటికీ టోకన్ల కోసం వారు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. వివరాలు సమర్పించడానికి ఉదయం ఒకసారి మాత్రమే టోకన్లు ఇస్తుండటంతో ఆ తర్వాత వచ్చిన రైతులు గంటలకొద్దీ ఎదురు చూడాల్సి వస్తోంది. వృద్ధులైన పలువురు రైతులు ఇదేం ఖర్మ అనుకుంటూ వేదనతో వెనుదిరుగుతున్నారు. ఎన్నిమార్లు పత్రాలు సమర్పించినా ఏదో ఒక కొర్రీ వేస్తూ రైతులను సతాయిస్తున్నారు. జిల్లాలో 4,95,008 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. తొలి విడతలో 2,78,070 మందికి వర్తించజేయగా, రెండవ విడతలో 1,33,048 మందికి వర్తింపజేశారు. ఇందుకు రూ.450 కోట్లు కేటాయించారు. అయితే చాలా మంది రైతులు బ్యాంకులకు వెళ్లి రుణమాఫీ అయిన సొమ్ము ఇవ్వాలని అడగడం లేదు. ఎందుకంటే ఇప్పటికే వడ్డీ భారం బాగా పెరిగిపోయింది. గత ఏడాది, ఈ ఏడాది కలుపుకుని లక్షకు దాదాపు రూ. 25 వేల పైచిలుకు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం సర్కార్ మాత్రం రుణమాఫీ పేరుతో రూ. లక్ష ఉన్న రైతుకు రూ. 20 వేలు మాత్రమే ప్రస్తుతానికి మాఫీ చేసింది. రైతు బ్యాంకుకు వెళ్లి మాఫీ సొమ్ము అడిగితే రెన్యూవల్ చేయాలని అధికారులు అడుగుతున్నారు. రెన్యూవల్ చేసుకోవాలంటే అదనంగా రైతు కొంత మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మాఫీ అయిన సొమ్మును తెచ్చుకోలేక కొంతమంది రైతులు ఇబ్బంది పడుతుంటే మరో పక్క మాఫీ కాక మరి కొంతమంది అవస్థలు పడుతున్నారు. మాఫీ కాని రైతులు దాదాపు 83 వేల మంది ఉన్నట్లు అంచనా. ఇటీవలే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రుణమాఫీ సెల్‌కు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పత్రాలు సమర్పిస్తున్నారు. ఇక్కడ ఆధార్, రేషన్ కార్డును పరిశీలించి పొరపాట్లు సరిచేస్తున్నారు. -
కొత్త సభ్యుణ్ణి చేర్చుకో.. టికెట్ దక్కించుకో
* అనుబంధ సంఘాల నాయకులకు పిలుపు * పార్టీ బలోపేతం చేయడానికి బీజేపీ కొత్త ఎత్తుగడ న్యూఢిల్లీ: ఢిల్లీ పీఠాన్ని దక్కించుకొనేందుకు భారతీయ జనతా పార్టీ విశ్వప్రయాత్నాలు చేస్తోంది. ప్రచారం ఉధృతం చేయడంతోపాటు పార్టీలోకి కొత్త సభ్యులను చేర్పించడానికి బీజేపీ రాష్ర్టశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సభ్యత్వ నమోదు పెంచేందుకు అనుబంధ సంఘాల సెల్స్‌ను సమాయత్తం చేస్తోంది. ‘పార్టీలో నూతనంగా సభ్యులను చేర్పించిన సెల్ నాయకులకు అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని పార్టీ నాయకుడు వెల్లడించారు. పార్టీ అనుబంధ సంఘాలివే.. యువ మోర్చా, మహిళా మోర్చా, మైనార్టీ మోర్చా, పూర్వాం చల్ మోర్చాలు ఇప్పటికే ఈ మేరకు కొత్త సభ్యులను పార్టీలో చేర్పించాలని పార్టీ నిర్ణియించింది. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆయా సెల్‌లకు పార్టీ నిర్ణయాలను తెలియజేశారు. కొత్త సభ్యులను చేర్పించిన వారికే ప్రాధాన్యత ఉంటుందనే విషయానికి కట్టుబడి ఉండాలని, తద్వారా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేలా పాటుపడాలని పిలుపు ఇచ్చారు. ‘పార్టీలో కొత్త సభ్యులను చేర్చుకోవాలని సెల్‌లకు ఇచ్చిన టార్గెట్స్‌ను పూర్తి చేయకుంటే అసెం బ్లీ ఎన్నికల టికెట్ కేటాయింపులో ఆయా సెల్ నాయకులకు ప్రాధాన్యత ఉండదని’ కూడా హెచ్చరించినట్లు బీజేపీ ఢిల్లీ శాఖ ఆఫీస్‌బేరర్ తెలియజేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి పార్టీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్‌లో 16 లక్షల మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్పించినట్లు చెప్పారు. వివిధ మోర్చాలకు టార్గెట్లిలా.. వివిధ సెల్‌లకు పార్టీ టార్గెట్లు నిర్ణయించింది. పూర్వాంచల్ మోర్చా జనవరి 15వ తేదీ వరకు 10 లక్షల కొత్త సభ్యులను చేర్పించాలని సూచించింది. ఇప్పటి వరకు కేవలం సభ్యత నమోదు క్యాంపెయిన్ నిర్వహించి 1 లక్ష మంది కొత్త సభ్యులను చేర్పిం చింది. మైనార్టీ మోర్చా టార్గెట్ 2లక్షల మందిని చేర్పించాల్సి ఉండగా, కేవలం 40 వేల మందిని మాత్రమే చేర్పించింది. అనధికార కాలనీల్లో పట్టుసాధించడానికి పూర్వాంచల్ మోర్చా కృషి చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అక్కడ కూల్చివేతలను నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఇక్కడ బీజేపీకి పట్టు లభించే అవకాశం ఉండడంతో కొత్త సభ్యత్వాలను ముమ్మరం చేయాలని పార్టీ నిర్ణయించింది. మహిళా మోర్చాకు ఇచ్చిన టార్గెట్ 1.5 లక్షలు కాగా, ఇప్పటి వరకు 80,000 మందిని మాత్రమే పార్టీలో చేర్పించింది. కాలేజీ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమావేశాలు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడంలో భాగంగా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో సమావేశాలు ఏర్పాటు చేసి, సాయంత్రం షిప్టులను నడిపించుకోవడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. అదేవిధంగా పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోపై టీచర్ల అభిప్రాయాలు, సూచనలను తెలుసుకొంటున్నారు. వారి డిమాండ్లను పార్టీ మేనిఫెస్టోలో చేర్చుతామని హామీ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ తూర్పు, పశ్చిమ ప్రాంగణాలను ఏర్పాటు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నరెలా, నజాఫ్‌ఘర్‌లో కాలేజీలు ఏర్పాటు చేయాలని అధ్యాపకులు సూచించారు. కొత్త హాస్టల్స్, డిజిటల్ లైబ్రరరీ ఏర్పాటు చేయాలని కోరారు. విదేశీ వర్సిటీలతో తమ కాలేజీలు అనుబంధంగా ఉండడానికి అనుమతి ఇవ్వాలని ప్రిన్సిపాళ్లు ఆయనకు సూచించారు. -
పాముతో బెదిరించి.. యువతిని వివస్త్రను చేసి
పాముతో బెదిరించి.. యువతిని వివస్త్రను చేసి.. ఆపై సెల్లో చిత్రీకరించిన దుండగులు పహాడీషరీఫ్‌లో ప్రేమజంటపై కీచకుల దాడి గొలుసు, నగదుతో ఉడాయింపు పహాడీషరీఫ్: నగరంలో దారుణం జరిగింది. ఏడుగురు యువకులు కీచక పర్వాన్ని కొనసాగించారు. సరదా కోసం ఫాం హౌస్‌కు వెళ్లిన ప్రేమజంటపై దాడి చేశారు. పాముతో, కత్తులతో బెదిరించి యువతిని వివస్త్రను చేశారు. ఆపై సెల్ఫోన్లలో ఫొటోలు తీశారు. ఆమె వద్ద ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, ప్రేమికుడి వద్ద గల రూ.6 వేల నగదు తీసుకొని ఉడాయించారు. గత నెల 31న పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ డి.భాస్కర్‌రెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడుతూ సంఘటన వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన ఓ ప్రేమ జంట (మరో నెల రోజుల్లో పెళ్లి చేసుకోనున్నారు) గత నెల 31న సరదాగా గడిపేందుకు పహాడీషరీఫ్ షాయిన్నగర్లోని ఓ ఫాం హౌస్‌కు చేరుకున్నారు. వారు అక్కడ ఫొటోలు దిగుతుండగా ఎర్రకుంటకు చెందిన ఫైసల్ దయానీ(28), ఉస్మాన్‌నగర్‌కు చెందిన ఖాదర్ బారక్‌బా(29), అన్వర్, ఖాజా, బండ్లగూడకు చెందిన తయ్యబ్ బాసలామా(20), షాయిన్‌నగర్‌కు చెందిన మహ్మద్ పర్వేజ్ (25), మహ్మద్ ఇబ్రహీం(19) గమనించారు. వెంటనే అక్కడి వాచ్‌మన్‌ను కత్తులతో బెదిరించి గోడ దూకి ఫాం హౌస్‌లోకి ప్రవేశించారు. యువతితో ఉన్న యువకుడిపై కత్తులతో దాడి చేశారు. అనంతరం యువతిని కూడా పాముతో, కత్తులతో బెదిరించి వస్త్రాలు విప్పేయాలన్నారు. నగ్నంగా మారిన యువతిని వారు సెల్ఫోన్లలో బంధించి పైశాచికానందాన్ని పొందారు. చాలా సేపటి వరకు ఆ జంటను ఇబ్బంది పెట్టారు. అనంతరం యువతి మెడలోని రెండు తులాల బంగారు గొలుసు, యువకుడి వద్ద ఉన్న రూ.6 వేల నగదును లాక్కొని పారిపోయారు. బాధిత యువకుడు అదేరోజు రాత్రి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తయ్యబ్ బాసలామా, మహ్మద్ పర్వేజ్, మహ్మద్ ఇబ్రహీంలను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు ఫైసల్ దయానీని.. ఘటన అనంతరం అతను శ్రీశైలం వెళ్లేందుకు సహకరించిన సాలం హమిది అనే యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఎస్సెమ్మెస్ కొట్టు.. బస్సు పట్టు
సెల్ ద్వారా బస్సుల రాకపోకల సమాచారం త్వరలోనే సిటీలో అందుబాటులోకి సాక్షి,సిటీబ్యూరో : రమేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. హైటెక్ సిటీకి వెళ్లేందుకు ఉదయం 9కి వనస్థలిపురం బస్టాప్‌కు చేరుకున్నాడు. బస్సు కోసం ముప్పావు గంటకు పైగా పడిగాపులు కాయాల్సి వచ్చింది. విలువైన సమయం బస్సు కోసం నిరీక్షించేందుకే వెచ్చించాల్సి వచ్చింది. కానీ తాను ఇంటి నుంచి బయలుదేరడానికి ముందే వనస్థలిపురం నుంచి హైటెక్‌సిటీకి వెళ్లేందుకు ఏ సమయానికి బస్సు ఉందో తెలుసుకోగలిగితే ఆ విలువైన సమయాన్ని మరో పని కోసం వినియోగించుకొనే అవకాశం ఉండేది. సరిగ్గా ఇలాంటి సిటీ బస్సు సమాచార సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ప్రయాణికులు తమ సమీపంలోని బస్‌షెల్టర్ కోడ్‌ను, తాము వెళ్లవలసిన రూట్ నెంబర్‌ను ఎస్సెమ్మెస్ ద్వారా ఆర్టీసీకి చేరవేస్తే చాలు. క్షణాల్లో ఆ రూట్లో వెళ్లే బస్సులు,ఆ బస్‌షెల్టర్‌కు ఏ సమయానికి చేరుకుంటాయో సంక్షిప్త సందేశం రూపంలో ప్రయాణికుల ఫోన్‌కు వచ్చేస్తుంది. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ప్రయాణికులు బస్టాపుల్లో పడిగాపులు కాయకుండా ఆఫీసు నుంచి, ఇంటి నుంచి తాము బయలుదేరే సమయానికి అందుబాటులో ఉన్న బస్సుల వివరాలను ముందే తెలుసుకొని బయటకు రావచ్చు. మరో నెల రోజుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నగరంలోని వందకు పైగా ప్రధాన బస్షెల్టర్లలో మొదట ప్రయోగాత్మకంగా దీన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం ఆ షెల్టర్లన్నింటికీ ప్రత్యేక కోడ్ నెంబర్లను కేటాయిస్తారు. ప్రయాణికులు ఎస్సెమ్మెస్ చేసేందుకు ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రవేశపెడతారు. ప్రస్తుతం రైళ్ల సమాచారాన్ని తెలుసుకొనేందుకు అందుబాటులో ఉన్న విధానం తరహాలోనే సిటీ బస్సుల సమాచారం తెలుసుకొనేందుకు అవకాశం కలుగుతుంది. పొరుగున ఉన్న మైసూర్లో 500 సిటీ బస్సులకు ఈ సదుపాయం ఉంది. నగరంలో తొలుత 1000 బస్సుల్లో దీన్ని ప్రవేశపెడతారు. దశల వారీగా అన్నింటికీ విస్తరిస్తారు. మరో నెల రోజుల్లో ఈ సదుపాయం ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ (వీటీపీఐ) పరిజ్ఞానం ఆధారంగా దీన్ని అమలు చేస్తారు. మరో మూడు రూట్లకు వెహికిల్ ట్రాకింగ్ విస్తరణ... ప్రస్తుతం నగరంలోని రెండు రూట్లలో అమలు జరుగుతున్న వెహికిల్ ట్రాకింగ్ వ్యవస్థను మరో 3 రూట్లకు విస్తరించనున్నారు. కోఠీ-లింగంపల్లి (222), వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ-కొండాపూర్ (127కె) రూట్లో ప్రయోగాత్మకంగా వెహికల్ ట్రాకింగ్ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. ట్రయల్న్‌గ్రా 46 బస్సుల్లో దీన్ని ప్రవేశపెట్టారు. ఆ రెండు రూట్లలో బస్సుల రాకపోకల వివరాలు బస్సుల్లోని ఎల్ఈడీ బోర్డుల్లో ప్రదర్శించడంతో పాటు, ఎంపిక చేసిన బస్షెల్టర్లలో కూడా ప్రదర్శిస్తారు. ఈ సదుపాయాన్ని త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు. ఉప్పల్-కొండాపూర్ (113కె), సికింద్రాబాద్-హెటెక్‌సిటీ (10హెచ్),ఉప్పల్-మెహదీపట్నం (113ఎం) రూట్లలో వెహికల్ ట్రాకింగ్‌ను విస్తరించనున్నారు. -
అబద్ధాలు, అసత్యాలను ఎన్నాళ్లని ప్రచారం చేస్తారు?
నిన్న ఒక ఛానల్, కొందరు టీడీపీ నాయకులు జగన్ జైలులో ఫోన్ వాడుతున్నాడని నానా హడావిడి చేశారు. జైలులో ఫోను సదుపాయం వచ్చి దాదాపు 2 నెలలు అవుతున్నా జగన్ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ సదుపాయాన్ని వినియోగించుకోలేదు. గత 14 నెలల 20 రోజులుగా జగన్ ఫోన్ అనే వస్తువు (అది లాండ్ ఫోన్ కావచ్చు, సెల్‌ఫోన్ కావచ్చు)ను ముట్టను కూడా ముట్టలేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ఆరోపణలు చేస్తున్న మీరు చెప్పగలరా... నేను చెప్పినంత ఖరాఖండిగా! జగన్ ఫోన్లో మాట్లాడినట్టు మీరు ఎటువంటి రుజువులు తెచ్చినా నేను మరోమాట మాట్లాడను. కానీ, మీరు రుజువు చేయలేకపోతే మీతో అబద్ధాలను / అసత్యాలను ప్రచారం చేయిస్తున్న మీ పార్టీ నాయకుడు రాజకీయాలు మానుకుంటాడా? అబద్ధాలను / అసత్యాలను ప్రచారం చేస్తున్న ఛానల్ మూసుకుంటారా? అయినా నిజాయితీతో రాజకీయాలు చేసే జగన్ లాంటి వారికి దొంగ ఫోన్లు చేయవలసిన ఖర్మ పట్టలేదు. చీకటి ఒప్పందాలు, తెరచాటు వ్యవహారాలు, రెండుకళ్ల సిద్ధాంతాలు గల చంద్రబాబు లాంటి వారికే అది అవసరం. ఎఫ్డీఐలో వోటు వేయించడానికి, చిన్న వ్యాపారుల పొట్టకొట్టి కాంగ్రెస్‌ను గట్టెక్కించడానికి అహ్మద్ పటేల్ గారితో మాట్లాడుకోవాలన్నా; అవిశ్వాసంలో గట్టెక్కిస్తామని కిరణ్‌గారితో మాట్లాడుకోవాలన్నా; చీకటిలో చిదంబరం గారితో కలవడానికి అపాయింట్మెంట్లు తీసుకోవాలన్నా చంద్రబాబుగారికే దొంగఫోన్లు అవసరం! యనమల రామకృష్ణుడు గారయితే గత 15 నెలల్లో ప్రజాసమస్యల మీద ఎన్ని మాటలు మాట్లాడారో, ఎన్ని ఉత్తరాలు రాశారో; జగన్ జైలు జీవితం గురించి ఎన్ని మాటలు మాట్లాడారో తనను తానే ప్రశ్నించుకోవడం మంచిది. జగన్ గురించి మాట్లాడడానికే ఆయనకు చంద్రబాబుగారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ప్రజలు అనుకుంటున్నారు. అయ్యా రామకృష్ణుడు గారూ, జగన్ వారానికి ఆరుగురిని మాత్రమే కలుస్తున్నాడు. మీరు భయపడుతున్నట్టు ఆయన ఫోన్ వాడడం లేదు. దయచేసి మీరు ఇప్పుడైనా ప్రజా సమస్యల మీద స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయినా రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే ఈ నాయకులంతా బయట వుండి ఏం చేస్తున్నారు? చంద్రబాబుగారు ఏం చేస్తున్నారు? కిరణ్‌కుమార్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? జైలులో ఉన్నా ఫోన్లో ఎవ్వరితో మాట్లాడకున్నా, వారానికి ఆరుగురినే కలుస్తూ వున్నా, జులై 30న తెలంగాణ మీద ప్రకటన రాకముందే జులై 25నే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాడు. రాజీనామాల కంటే ముందే హోమ్ మినిస్టర్ షిండే గారికి పార్టీ తరఫున లెటర్ కూడా రాయించాడు. సమస్యలన్నిటినీ పరిష్కరించాలని తర్వాత కూడా లెటర్ రాయించాడు. తెలంగాణ ప్రకటన వస్తూనే తను రాజీనామా చేయడంతోపాటు తన తల్లితోనూ చేయించాడు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆవేదన చెందుతూ నిద్ర పట్టడం లేదన్నాడు. ఆమరణ నిరాహారదీక్ష కూడా చేస్తానన్నాడు. జగన్ అంతగా బాధపడుతూ వుంటే - 50 ఏళ్లు పైబడిన మా అత్తగారి మాతృహృదయం తల్లడిల్లిపోయింది... జగన్‌ను వద్దని వారించింది. ఈరోజు తన కొడుకు ఇన్ని కష్టాలు, బాధలలో వుండి కూడా రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడని, ఆ కొడుకు తరఫున ప్రజలతో నిలబడడం తన కర్తవ్యమని ఈరోజు ఆ తల్లి ముందుకు వచ్చింది. ఇన్ని కష్టాల మధ్య వున్నా ప్రజా సమస్యలపై జగన్ చూపించిన చొరవ, జగన్ తీసుకున్న నిర్ణయాలు మరి ఏ నాయకుడూ తీసుకోలేదు. ఒక ప్రాంతంలో ఓట్లు, సీట్లకోసం కాంగ్రెస్, టీడీపీలు మరొక ప్రాంతానికి అన్యాయం చేస్తూ వుంటే, జగన్ నాయకత్వంలోని వైయస్సార్సీపీ తప్ప మరి ఏ పార్టీ నోరు మెదపలేదు. 2-3 నెలలుగా ఢిల్లీ వెళ్లి వస్తూ, అన్నీ తెలిసిన కిరణ్‌కుమార్‌రెడ్డి గారు తెలంగాణ ప్రకటన తరువాత 3 రోజులకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మొట్టమొదటి మాటలు - రాజీవ్‌గాంధి, ఇందిరాగాంధి విగ్రహాలు పగలగొట్టకండి అని! ఆ తరువాత 10 రోజులకు - రాష్ట్ర ప్రజలందరు తమ సమస్యల గురించి పోరాటం చేస్తూ వుంటే, ఆయనేదో తనకు తెలంగాణ ప్రకటన అప్పుడే కొత్తగా వినబడినట్టు మాట్లాడారు. ఇక చంద్రబాబుగారేమో మొదటిరోజు కొత్త రాజధానికి డబ్బులు అన్నారు... తరువాత తన దగ్గరకు వచ్చిన జెఏసీ వాళ్లతో నిర్దయగా ‘నేను లేఖను ఉపసంహరించుకోలేను’ అన్నారు. ఇదిలా వుండగా ఆయన పార్టీ ఎంపీలు రెండుకళ్ల సిద్ధాంతం పాటిస్తూ ప్రజల ముందు కొత్త నాటకాలు ఆడుతున్నారు. ఇచ్చిన మాటకు, నమ్మిన దానికి కట్టుబడి నడిచే వైయస్సార్ వారసత్వం జగన్‌ది! ప్రజలకోసం ఎందాకైనా ముందుకుసాగే వైయస్సార్ వారసత్వం జగన్‌ది! అన్ని ప్రాంతాల ప్రజల క్షేమం, సంక్షేమం కోరే వైయస్సార్ వారసత్వం జగన్‌ది! నిజాయితీ, నిబద్ధత, పట్టుదల, విశ్వసనీయత వంటి లక్షణాలు గల వారసత్వం జగన్‌ది! జగన్ మీద అబద్ధాలు, అసత్యాలు మాట్లాడే వారికి బైబిల్లో ఒక మాట వుంది - ‘‘అబద్ధములాడువాడు తప్పించుకొనడు... అబద్ధములాడువాడు నశించును’’ అని! ఒక్క బైబిల్లోనే కాదు... ప్రతి మతమూ అదే చెబుతుందనుకుంటా. అలాగే ఇన్ని కష్టాలుపడుతున్న మన రాష్ట్ర ప్రజల గురించి, జగన్ గురించి దేవుడు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడని, మన రాష్ట్రానికి సంతోషం, సమాధానం త్వరలోనే కలుగజేస్తాడనే నాకు గట్టి నమ్మకం ఉంది. త్వరలోనే మనని, మన రాష్ట్రాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను. - వైఎస్ భారతి, w/o వైఎస్ జగన్