ఓ ఖైదీ అనూహ్యంగా జైల్లోనే చనిపోయాడు. అయితే అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఎందువల్ల అతను చనిపోయాడో దర్యాప్తు చేయాలంటూ పట్టుబట్టారు. అతను నల్లుల కారణంగానే చనిపోయాడని, జైల్లో అపరిశుభ్ర వాతావరణం ఉందని ఆరోపణలు చేశారు. దీంతో అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటన అమెరికాలో అట్లాంటాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగందంటే..లాషాన్ థాంప్సన్ అనే వ్యక్తి జూన్ 12, 2022న అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత అతను ఫుల్టన్ కౌంటీ జైలుకి తరలించారు. అతడు మానసిక అనారోగ్యంతో ఉన్నట్లు నిర్ధారించి అధికారుల అతని మానసిక రోగుల విభాగంలోకి సెప్టంబర్ 13, 20222న మార్చారు. ఆ తర్వాత మూడు నెలలకే అతను అనుహ్యంగా చనిపోయాడు. థాంప్సన్ ఉంచిన గది ఒక రోగిని ఉంచాల్సిన సెల్ కాదని, చాలా అపరిశుభ్రంగా ఉందని అతడి బంధువులు ఆరోపించారు. అక్కడ ఉన్న నల్లుల కారణంగానే అతను చనిపోయాడని ఆరోపణలు చేశారు.
అలాగే పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, తీవ్రమైన నల్లుల దాడి జరిగిందని తేలింది. దీంతో అతను ఎలా చనిపోయాడో దర్యాప్తు చేయాలంటూ జైలు అధికారులను డిమాండ్ చేశారు ఆ ఖైదీ బంధువులు. దీంతో ఫుల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులను ఆ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే సెల్‌లో ఉన్న మిగతా ఖైదీల భద్రతా ప్రోటోకాల్‌పై విచారణ చేయడమే గాక సంరక్షణ చర్యలు చేపట్టమని ఆదేశించింది.
అక్కడ ఉన్న ఖైదీల ఆరోగ్య సంరక్షణపై తనీఖీలు నిర్వహించడమేగాక, ఏదైనా ఆరోపణ రుజవైతే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఫుల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకటించింది. అయితే నల్లులు ప్రాణాంతకం కాదని, కొన్ని అరుదైన సందర్భాల్లో తీవ్రమైన రక్తహీనతకు కారణమవుతుందన్నారు కెంటకీ విశ్వవిద్యాలయ శ్రాస్తవేత్త. చికిత్స చేయకుండా అలా వదిలేస్తే ఒక్కోసారి ప్రాణాంతకమవుతుందని కూడా చెప్పారు.
(చదవండి: హైట్‌గా ఉండేలా రెండుసార్లు సర్జరీలు..రీజన్ వింటే షాక్ అవుతారు!)
Comments
Please login to add a commentAdd a comment