bugs
-
మొక్కలు చీడపీడల్లేకుండా, పచ్చగా ఉండాలంటే, ఇవిగో చిట్కాలు!
పచ్చదనం అంటే.. ఎక్కడో పార్క్లకో, అడవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. మన పెరట్లో నాలుగు మందార, గులాబీ,చేమంతి మొక్కలో ఉంటే సరిపోతుంది. ఇంటి ముందు గుబురుగా పెరిగిన తులసి మొక్క చాలు మనసు ప్రశాంతంగా ఉండటానికి. చిన్న చిన్న మొక్కలతో ఇల్లు అందంగా కనిపించడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.అయితే మనకున్నచిన్న బాల్కనీలో, పెరట్లో మొక్కల్ని పెంచడం అంత ఈజీ కాదు సాధారణంగా మొక్కలను ఇష్టపడేవారు బయటి నుంచి మొక్కలు తెచ్చి తమ తోటల్లో లేదా ఇళ్లలోని కుండీల్లో నాటుతారు. మొక్కలకు సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, వాడిపోతూ ఉంటాయి. ఉన్నట్టుండి ఎండిపోతాయి. సరైనపోషణతో కీటకాల బెడద లేకుండాపచ్చగా ఎదగాలంటే ఏం చేయాలి?మొక్కలు జాగ్రత్తగా పరిశీలించకపోయినా,పోషణ అందకపోయినా, నీళ్లు ఎక్కువైనా చని పోతాయి. పురుగులు కీటకాలు మొక్కలను మాత్రమే కాకుండా కుండలోని మట్టిని కూడా దెబ్బతీస్తాయి. జాగ్రత్తలు, చిట్కాలుదెబ్బతిన్న, చనిపోయిన ఆకులని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. దీని వల్ల చెట్లు చక్కగా పెరుగుతుంది. కాబట్టి, వీటిని కత్తెరతో కత్తిరించడం మంచిది.మొక్కలకి నీళ్ళతో పాటు సరైన కాంతి అవసరం. మరీ ఎండలో కాకుండా సమానమైన ఎండ తగిలేలా చూసుకోవాలి. అలా అని చీకటికూడా మంచిది కాదు. కాస్తంత వెలుతురు కావాలి.మొక్కలకి ఇంట్లోనే తయారు చేసుకున్న అనేక ఎరువులు ఇస్తూ ఉండాలి. పుల్లటి మజ్జిగ ద్రావణం, బనానా పీల్ ఫెర్టిలైజర్, పంచగవ్య, ఎండిన పశువుల ఎరువు, వేపనూనె, వేపగింజలు, ఆకుల కషాయం లాంటివి మొక్క, కుండా సైజును బట్టి ఇవ్వాలి.పుల్ల మజ్జిగ ద్రావణంగ్లాసు పుల్లటి మజ్జిగలో ఐదు గ్లాసులు నీళ్లుపోసి కలపాలి. ఈ నీటిని స్ప్రే బాటిల్లో పోసి మొక్కలపై చల్లాలి. ఉదయం సాయంత్రం ఒకసారి ఈ నీటిని మొక్కలు పోయడం వల్ల చీడపీడలు పోయి మొక్కలు చక్కగా పెరుగుతాయి.పచ్చి బఠానీతో పచ్చగా... పచ్చి బఠాణి మనకు ఎంత మేలు చేస్తుందో తెలిసిందే. అయితే బఠాణి పిక్కలు తీసి తొక్కలను పారేస్తుంటాము. కానీ ఈ తొక్కలు మొక్కలకు చక్కని పోషకాలు అందిస్తాయి. అందుకే తొక్కలను మిక్సీజార్‌లో వేసి పేస్టులా చేయాలి. ఈ పేస్టులో కాసిని నీళ్లు ΄ పోసి వడగట్టాలి. ఈ నీటిని గార్డెన్‌లోని మొక్కలకు పోషకాలు ఈ నీరు మంచి బలవర్థకమైన టానిక్‌లా పనిచేసి మొక్కలు చక్కగా పెరిగేందుకు దోహదపడతాయి.తెగుళ్లు, నివారణమొక్కలు సాధారణంగా పురుగులు,తెగుళ్లు నుంచి ఎప్పటికప్పుడు వాటిని కాపాడుకోవాలి. తెల్ల నల్లి, గొంగళి లాంటి వాటిని చేతితో తీసేయవచ్చు. పసుపు, ఉప్పు, ఇంగువ నీళ్లు చల్లినా ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కనీసం రెండు రోజులకు ఒకసారైనా మొక్కల్ని పరికించి చూడాలి. లేదంటే గొంగళిపురుగులు, ఆకుతొలిచే పురుగులు ఆకుల్ని పూర్తిగా తినేస్తాయి. మట్టిలో తేమ కారణంగా, కొన్నిసార్లు చిన్న నత్తలు లేదా పాకే పురుగులు మొక్కలను పూర్తిగా నాశనం చేస్తాయి. వీటికి పొడి గుడ్డు పెంకు పొడి బాగా ఉపయోగపడుతుంది. గుడ్డు పెంకులను పూర్తిగా శుభ్రం చేసి, పొడి చేసి మట్టిలో కలపాలి.పువ్వులపై మైనంలాగా కనిపించే తెల్లటి మీలీ బగ్స్ (మందార, గులాబీ మొక్కలపై) వాటిని వదిలించుకోవడానికి, ఒక లీటరు నీటిలో చిటికెడు బేకింగ్ సోడా, 1 టీస్పూన్ షాంపూ, 2-3 చుక్కల వేపనూనె కలిపి మొక్కలపై చల్లుకోవాలి. టొమాటో, బెండకాయ, బీన్స్, ఓక్రా మొదలైన కొన్ని కూరగాయలపై కూడా ముందుగానే చల్లుకోవాలి. దాల్చిన చెక్క పొడికూడా బాగా పనిచేస్తుంది.ఇదీ చదవండి: వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్‌కు మించి బ్యాక్టీరియా -
ఫ్రాన్స్‌లో నల్లుల నకరాలు.. ఒలింపిక్ ఆటగాళ్ల ఒళ్లు గుల్లే?
నల్లులు జాతీయ సమస్యగా మారనున్నాయా? అని ఫ్రెంచి వారిని అడిగితే ‘అవును’ అనే సమాధానం ఇవ్వనున్నారు. ప్రస్తుతం పారిస్ బెడ్‌బగ్స్ (నల్లులు)తో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ఇక్కడి మెట్రో, విమానాశ్రయం, సినిమా హాళ్లు, హోటళ్లు ఇలా ప్రతిచోటా నల్లులు నక్కి ఉంటున్నాయి. పారిస్‌లో నల్లుల సమస్య తీవ్రంగా మారడంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నల్లులను ప్రజలంతా తరిమికొట్టాలంటూ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు. మంత్రులంతా దీనిపై హడావుడిగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఫ్రాన్స్ 2024లో ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో విదేశీ ఆటగాళ్లు నల్లులకు బలికాకుండా చూసుకోవడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. రాజధాని ప్యారిస్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా నల్లుల బెడద సోకింది. పొంచివున్న ప్రమాదం నుంచి ఇక్కడివారు ఎవరూ సురక్షితంగా లేరని పారిస్ డిప్యూటీ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ తెలిపారు. ఆయన ఒక పత్రికా ప్రకటనలో ప్రజలనుఉద్దేశించి ‘మీరు ఎప్పుడైనా నల్లుల బారిన పడవచ్చు. అవి మిమ్మల్ని తాకినప్పుడు, అవి మీతో పాటు మీ ఇంటికి వస్తాయి’ అని హెచ్చరించారు. అలాగే గ్రెగోయిర్ ఫ్రాన్స్ స్టేట్ రేడియో సర్వీస్ ‘ఫ్రాన్స్ ఇన్ఫో’తో మాట్లాడుతూ ‘నల్లుల వల్ల వచ్చే వ్యాధుల చికిత్సను బీమా పాలసీలో చేర్చాలి. ఇది బెడ్‌బగ్ బారిన పడి అనారోగ్యానికి గురవుతున్న వారికి ఉపశమనం కల్పిస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నదని’ ఆయన మీడియాకు తెలిపారు. మూడేళ్ల కిందట కూడా ఇదేవిధంగా నలుల్ల బెడద దాపురించింది. వెంటనే స్పందించిన ఫ్రెంచ్ ప్రభుత్వం తన ప్రత్యేక వెబ్సైట్, సమాచార హాట్‌లైన్ సాయంతో యాంటీ-బెడ్‌బగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇటీవల మెట్రోలో బెడ్‌బగ్‌లు కనిపించిన నేపధ్యంలో ప్రయాణికులు సీట్లలో కూర్చోవడం మానేశారు. పారిస్ సిటీ హాల్ సభ్యులు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌కు లేఖ కూడా రాశారు. 1950లో ఫ్రాన్స్‌లో ఇదే విధమైన నల్లుల సమస్య తీవ్రంగా కనిపించింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు నల్లులు మాయమయ్యాయి. అయితే ఇప్పుడు హఠాత్తుగా నల్లుల సంఖ్య విపరీతంగా పెరిగింది. నల్లులు కుట్టడం వలన డిప్రెషన్, యాంగ్జయిటీ తదితర వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. -
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా లోపాలు
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ పేర్కొంది. ఆండ్రాయిడ్– 13 సహా పలు వెర్షన్లు వైరస్ల బారిన పడే ప్రమాదం చాలా ఉందని ఆందోళన వెలిబు చ్చింది. వాటి వినియోగంలో జాగ్రత్తగా ఉండాలంటూ యూజర్లకు సోమవారం ’అతి తీవ్ర’ హెచ్చరిక లు జారీ చేసింది. లేదంటే మొబైల్స్ తదితరాల్లో సున్నిత సమాచారం హాకర్ల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని వివరించింది. ఆండ్రాయిడ్ 10, 11, 12, 12ఎల్, 13 వెర్షన్లలో వీటిని ప్రధానంగా గమనించినట్టు చెప్పింది. వీటివల్ల ఫ్రేంవర్క్, ఆండ్రాయిడ్ రన్ టైం, సిస్టం కంపోనెంట్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్స్, కెర్నల్, ఆర్మ్ కంపోనెంట్స్, మీడియా టీ కంపోనెంట్, కలోకాం క్లోజ్డ్ సోర్స్ కంపోనెంట్స్ వంటివాటి పనితీరు లోపభూయిష్టంగా మారుతుందని వివరించింది. అప్డేషన్ ఇలా... ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్ల భద్రత కోసం లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్‌కు తక్షణం అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టమ్‌పై క్లిక్ చేయాలి..సిస్టమ్ అప్ డేట్స్‌పై క్లిక్ చేయండి. అప్డేట్స్ ఉంటే డౌన్ లోడ్ చేసుకోండి. -
నల్లులు కారణంగా చనిపోయిన ఖైదీ..దర్యాప్తు చేస్తున్న అధికారులు
ఓ ఖైదీ అనూహ్యంగా జైల్లోనే చనిపోయాడు. అయితే అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఎందువల్ల అతను చనిపోయాడో దర్యాప్తు చేయాలంటూ పట్టుబట్టారు. అతను నల్లుల కారణంగానే చనిపోయాడని, జైల్లో అపరిశుభ్ర వాతావరణం ఉందని ఆరోపణలు చేశారు. దీంతో అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటన అమెరికాలో అట్లాంటాలో చోటు చేసుకుంది. అసలేం జరిగందంటే..లాషాన్ థాంప్సన్ అనే వ్యక్తి జూన్ 12, 2022న అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత అతను ఫుల్టన్ కౌంటీ జైలుకి తరలించారు. అతడు మానసిక అనారోగ్యంతో ఉన్నట్లు నిర్ధారించి అధికారుల అతని మానసిక రోగుల విభాగంలోకి సెప్టంబర్ 13, 20222న మార్చారు. ఆ తర్వాత మూడు నెలలకే అతను అనుహ్యంగా చనిపోయాడు. థాంప్సన్ ఉంచిన గది ఒక రోగిని ఉంచాల్సిన సెల్ కాదని, చాలా అపరిశుభ్రంగా ఉందని అతడి బంధువులు ఆరోపించారు. అక్కడ ఉన్న నల్లుల కారణంగానే అతను చనిపోయాడని ఆరోపణలు చేశారు. అలాగే పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, తీవ్రమైన నల్లుల దాడి జరిగిందని తేలింది. దీంతో అతను ఎలా చనిపోయాడో దర్యాప్తు చేయాలంటూ జైలు అధికారులను డిమాండ్ చేశారు ఆ ఖైదీ బంధువులు. దీంతో ఫుల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులను ఆ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే సెల్లో ఉన్న మిగతా ఖైదీల భద్రతా ప్రోటోకాల్‌పై విచారణ చేయడమే గాక సంరక్షణ చర్యలు చేపట్టమని ఆదేశించింది. అక్కడ ఉన్న ఖైదీల ఆరోగ్య సంరక్షణపై తనీఖీలు నిర్వహించడమేగాక, ఏదైనా ఆరోపణ రుజవైతే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఫుల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకటించింది. అయితే నల్లులు ప్రాణాంతకం కాదని, కొన్ని అరుదైన సందర్భాల్లో తీవ్రమైన రక్తహీనతకు కారణమవుతుందన్నారు కెంటకీ విశ్వవిద్యాలయ శ్రాస్తవేత్త. చికిత్స చేయకుండా అలా వదిలేస్తే ఒక్కోసారి ప్రాణాంతకమవుతుందని కూడా చెప్పారు. (చదవండి: హైట్‌గా ఉండేలా రెండుసార్లు సర్జరీలు..రీజన్ వింటే షాక్ అవుతారు!) -
గూగుల్ కు దిమ్మ తిరిగే షాకిచ్చాడు, రూ.65కోట్ల జాక్ పాట్ కొట్టేశాడు!!
మనదేశానికి చెందిన ఓ యువకుడు గూగుల్‌కు భారీ షాకిచ్చాడు. గూగుల్ కు చెందిన వివిధ ప్రొడక్ట్‌లలో భారీ ఎత్తున లోపాల్ని(బగ్స్) గుర్తించాడు. లోపాల్ని గుర్తించడమే కాదు గూగుల్ నుంచి కోట్ల రూపాయిల రివార్డ్‌లును అందుకున్నాడు. భారత్‌కు చెందిన అమన్ పాండే ఎన్ఐటీ భోపాల్ లో పట్టభద్రుడయ్యాడు. అనంతరం ప్రముఖ కంపెనీలకు చెందిన సాఫ్ట్వేర్లలో లోపాల్ని గుర్తించేందుకు గతేడాది బగ్స్ మిర్రర్ పేరిట కంపెనీని స్థాపించాడు. ఈ నేపథ్యంలో గూగుల్ తమ సంస్థలకు చెందిన సాఫ్ట్వేర్లలో లోపాల్ని గుర్తించిన వారికి భారీ ఎత్తున ప్రోత్సాహకాల్ని అందిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం వల్నరబిలటీ రివార్డ్ ప్రోగ్రామ్ 2021 ను నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమన్ పాండే.. గూగుల్, ఆండ్రాయిండ్, గూగుల్ క్రోమ్, గూగుల్ ప్లేస్టోర్ తో పాటు ఇతర ప్రొడక్ట్‌లలో వందల సంఖ్యలో బగ్స్‌ను గుర్తించాడు. ఒక్క ఏడాదిలోనే గూగుల్ తో పాటు ఆ సంస్థకు చెందిన మిగిలిన కంపెనీలకు చెందిన పలు సాఫ్ట్వేర్లలో మొత్తం 232 లోపాల్ని గుర్తించాడు. ఈ నేపథ్యంలో అమన్‌ను గూగల్ ప్రత్యేకంగా అభినందించింది. బగ్స్ ను గుర్తించినందుకు రూ.65కోట్ల రివార్డ్‌ను అందిస్తున్నట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో ప్రధానంగా హైలెట్ చేసింది. కాగా, 2019లో సారా జాకోబస్ అనే వ్యక్తి అండ్రాయిడ్ వల్నరబిలిటీస్ రివార్డ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 280కి పైగా బగ్స్‌ను నివేదించి తొలిస్థానంలో నిలిచాడు. -
అభినందన్ ఈ పరీక్షలు... పాసైతేనే...
ఎట్టకేలకు అభినందన్ భారత్‌లో అడుగుపెట్టారు. అన్ని ప్రక్రియలు ముగిసినా 2 రోజులపాటు పాక్ ఆర్మీకి చిక్కడంతో అభినందన్‌కు కొన్ని పరీక్షలైతే తప్పనిసరిగా నిర్వహించాలి. పరాయిదేశానికి చిక్కిన వారు తిరిగి మాతృభూమికి చేరుకున్నప్పుడు కచ్చితంగా కొన్ని నియమ నిబంధనలైతే పాటిస్తారు. అవేంటంటే.. ► అభినందన్‌ను నేరుగా భారత వాయుసేన ఇంటెలిజెన్స్ యూనిట్‌కు అప్పగిస్తారు. ► అభినందన్ శారీరకంగా ఎంత ఫిట్నెస్తో ఉన్నారో కొన్ని వైద్య పరీక్షలు చేస్తారు. ► శత్రు దేశం ఆయన దుస్తుల్లో కానీ, శరీర భాగాల్లో కానీ ఏమైనా బగ్‌లు.. అంటే గూఢచర్యానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చిందేమోనన్న అనుమానం తీర్చకోవడానికి శరీరం మొత్తం బగ్ స్కాన్ చేస్తారు. ► వింగ్ కమాండర్ మానసిక స్థితి ఎలా ఉందో కూడా పరీక్షలు చేసి తెలుసుకుంటారు. శత్రు దేశానికి చిక్కిన తర్వాత వాళ్లేమీ అతిథి మర్యాదలు చేయరు. ప్రత్యర్థి దేశ రక్షణ రహస్యాలను తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తారు. ఎవరైనా పెదవి విప్పకపోతే చిత్రహింసలు పెడతారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక దేశ రహస్యాలేమైనా చెప్పారేమోనన్న దిశగా అభినందన్‌ను విచారిస్తారు. ► ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) అధికారులు కూడా అభినందన్‌ను క్షుణ్నంగా విచారిస్తారు. ► సాధారణ యుద్ధ ఖైదీలైతే ఈ రెండు సంస్థల విచారణ చేయనక్కర్లేదు. కానీ అభినందన్‌ను యుద్ధఖైదీగా పరిగణించాలో అక్కర్లేదో అన్న సందేహాలు ఉండటంతో ఐబీ, రా అధికారులు కూడా ప్రశ్నలు వేస్తారు. సందేహాల నివృత్తి తర్వాతే ఇంటికి.. మొత్తం వ్యవహారంలో ఐఏఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారుల విచారణే అత్యంత క్లిష్టమైన ప్రక్రియని పేరు చెప్పడానికి ఇష్టపడని ఐఏఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. అభినందన్ పాక్ ఆర్మీకి బందీగా ఉన్న సమయంలో ఎంత ధీరత్వాన్ని ప్రదర్శించినప్పటికీ, భారతీయ అధికారులకు ఆయనంటే ఎంత గౌరవం ఉన్నప్పటికీ ఇంటెలిజెన్స్‌కి ఉండే అనుమానాలు ఉంటాయి. పాక్‌లో బందీగా ఉన్నప్పుడు వాళ్లు ఏ ప్రశ్నలు వేశారు? ఎలాంటి సమాచారం రాబట్టడానికి ప్రయత్నించారు? వాళ్లు పెట్టే టార్చర్ భరించలేక లొంగిపోయి వారి గూఢచారిగా తిరిగి మన దేశానికి వచ్చారా? ఇలాంటి సందేహాలన్నీ పూర్తిస్థాయిలో నివృత్తి అయ్యాకే అభినందన్‌ను ఇంటికి వెళ్లనిస్తారు. ఆ తర్వాతే విధుల్లోకి తీసుకుంటారని వివరించారు. చదవండి...(అభినందన్ ఆగయా..) కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు పాక్‌కి చిక్కి భారత్‌కు తిరిగి వచ్చిన పైలట్ కె.నచికేతను విచారించిన సమయంలో దగ్గరుండి ఈ వ్యవహారాలన్నీ చూశానన్నారు. ఫీల్డ్ మార్షల్ కరియప్ప కుమారుడు కేసీ నంద కరియప్పను 1965 యుద్ధ సమయంలో బంధించి తిరిగి వచ్చాక జరిగిన ఘటనలపై ఆ అధికారి పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. పాక్ వారిని ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా భారత్ రహస్యాలు వాళ్లు బయటపెట్టలేదని చెప్పారు. అభినందన్ విషయంలో కూడా తమకు ఆ నమ్మకం ఉందని, కానీ తప్పనిసరిగా చేయాల్సిన పరీక్షలు, విచారణలు చేయాల్సిందేనని చెప్పారు. అభినందన్ అయినా, మరో యుద్ధ ఖైదీ అయినా ఈ విధివిధానాలు పూర్తి చేసినప్పుడు ఎంతో గౌరవం ఇస్తామని చెప్పారు. -
విమానంలో వాచిపోయేలా కుట్టిన నల్లులు, అయినా..
ముంబై : ఎయిరిండియా విమానమెక్కాలంటే.. ఇప్పుడందరూ వామ్మో అంటున్నారు. నల్లుల బెడదతో ప్రయాణికులు హడలిపోతున్నారు. అది కూడా బిజినెస్ క్లాస్‌లో అయ్యే సరికి ఎయిరిండియా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. వారం క్రితం న్యూజెర్సీ నుంచి ముంబై వస్తున్న సౌమ్య శెట్టీ అనే మహిళా ప్రయాణికురాలికి నల్లులు చుక్కులు చూపించాయి. చేయి, కాలు, మెడ వాచిపోయేలా కుట్టాయి. ఆమెను మాత్రమే కాక, తన ముగ్గురు పిల్లలు నల్లుల నుంచి పడ్డ బాధ అంతా ఇంతా కాదు. ఆ మహిళా ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ఇంటర్నెట్లో షేర్ చేసింది. నల్లులు కుట్టడం వల్ల దద్దుర్లు ఎక్కిన చేతితో కూడిన ఓ ఫోటోను, ఆమె ఎదుర్కొన్న తిప్పలను, ఎయిరిండియా నిర్లక్ష్యాన్ని ట్విటర్లో కడిగిపారేసింది. ల్యాండింగ్‌కు 30 నిమిషాల ముందు కూడా తనకు కనీసం సీట్లు మార్చుకునే అవకాశం ఇవ్వలేదని ట్విటర్ ద్వారా తన బాధను వెల్లబుచ్చుకుంది. ‘ముగ్గురు పిల్లలతో కలిసి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడం నాకు సాయపడుతుంది అనుకున్నా. కానీ మమల్ని నల్లులు చేతిలు వాచిపోయేలా కుట్టాయి. అది చాలా బాధకరమైన రోజు. అయినప్పటికీ నేను అదే సీట్లో పడుకోవాల్సి వచ్చింది. తర్వాత రోజు ల్యాండింగ్ అయ్యే సమయంలో మా సీట్లను మార్చారు. ఇది చాలా ఘోరం! ముగ్గురు పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న విషయం మీకు అర్థమవుతుందా?’ అంటూ ఎయిరిండియాను ఉద్దేశించి వరుస ట్వీట్లు చేసింది. అంతేకాక బిజినెస్ క్లాస్ టిక్కెట్లకు వెచ్చించిన తన మొత్తం మనీని రీఫండ్ చేయాలని ఎయిరిండియాను డిమాండ్ చేసింది. ఇదే విషయంపై మంగళవారం ఎయిరిండియా హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేసి, ఈ-మెయిల్ కూడా పంపింది. కానీ ఎయిరిండియా నుంచి ఆమెకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో దగ్గర్లో ఉన్న ఎయిరిండియా ఆఫీసుకు వెళ్లి అడిగితే, తప్పుడు ఈ-మెయిల్ ఐడీకి ఫిర్యాదు పంపించినట్టు ఆమెపైనే నెట్టేశారు. అయితే టిక్కెట్ ఛార్జీ మొత్తాన్ని తాము రీఫండ్ చేయలేమంటూ ఎయిరిండియా తేల్చిచెప్పింది. కేవలం టిక్కెట్లను రద్దు చేసుకునే పెనాల్టీ ఫీజు నుంచి మాత్రమే మినహాయింపు ఇస్తామంటూ చెప్పింది. తనకు టిక్కెట్ల మొత్తం రీఫండ్ కావాలని కోరితే, ఇలా నిర్లక్ష్యపూర్వకంగా వ్యవహరించడంపై సౌమ్య మండిపడింది. తర్వాత సౌమ్య శెట్టీ మెయిల్‌కు సమాధానమిచ్చిన ఎయిరిండియా యాజమాన్యం తాము పరిహారం కానీ, రీఫండ్ గురించి కానీ ఎక్కడ తెలుపలేదని, ఎయిర్‌క్రాఫ్ట్‌లో నల్లుల ప్రవేశంపై విచారణ చేపట్టామని తెలిపింది. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకుంటామని పేర్కొంది. సౌమ్యకు, తన పిల్లలకు ఈ నల్లులు కుట్టడం వల్ల 10వేల డాలర్ల మేర ఖర్చు అయిందని సౌమ్య భర్త కూడా ట్విటర్ ద్వారా ఈ విమానయాన సంస్థకు తెలిపాడు. దానికి బాధ్యత ఎవరంటూ కడిగిపారేశాడు. సౌమ్యకు మాత్రమే కాక, ఇదే రకమైన పరిస్థితి ఇటుఎయిరిండియా విమానంలో న్యూయార్క్ నుంచి ప్రయాణించిన మరో ప్రయాణికుడికి కూడా ఎదురవడం, ఈ విమానయాన సంస్థను మరింత ఇరకాటంలో పడేసింది. -
నల్లుల రాజ్యం
సాక్షి, విశాఖపట్నం: ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని ఏసీ బస్సుల్లో నల్లులు రాజ్యమేలుతున్నాయి. సరైన నిర్వహణ లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని డిపోల్లో నెలల తరబడి బస్సు సీట్ల పరిస్థితిని, వాటిలో తిష్టవేసిన నల్లుల నివారణకు చర్యలు చేపట్టడం లేదు. ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఇచ్చే బ్లాంకెట్లను ఎప్పటికప్పుడు మార్చకపోవడంతో వాటిలోనూ నల్లులు తిష్ట వేస్తున్నాయి. సీట్ల కింద నుంచే కాకుండా ఒళ్లంతా పాకుతూ రాత్రి వేళ అవస్థలు పెడుతున్నాయి. సోమవారం రాత్రి విజయవాడ నుంచి విశాఖపట్నం బయలుదేరిన 9372 సర్వీసు నంబరు గల ఇంద్ర బస్సు (విజయవాడ డిపో)లో ప్రయాణికులు నల్లుల బారిన పడ్డారు. బస్సులో అన్ని సీట్లలోనూ నల్లులు తమ ప్రతాపాన్ని చూపాయి. తొలుత వీటిని దోమలుగా భావించి సర్దుబాటు చేసుకున్నారు. బస్సు ఏలూరు దాటాక అంతా నిద్రకు ఉపక్రమించడంతో నల్లులు రక్తం తాగడం మొదలెట్టాయి. ఈ సమస్యపై ప్రయాణికులు డ్రైవర్ కాసులుకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు విజయవాడ చేరుకున్నాక సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు ఇంద్ర బస్సు డ్రైవర్ టి.వి.కాసులు పేర్కొన్నారు. రాత్రంతా తాము నల్లులతో పడ్డ అవస్థలను ప్రయాణికులు ‘సాక్షి’కి వివరించారు. ఏసీ ప్రయాణానికి భారీగా టికెట్ సొమ్ము వసూలు చేస్తున్న ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చూడడం లేదంటూ మండిపడ్డారు. ఎవరూ నిద్రపోలేదు.. మేమెక్కిన ఇంద్ర బస్సులో 35 మందికి పైగా ఉన్నాం. నల్లులు విపరీతంగా కుట్టడంతో చేతులు, ఒళ్లు దద్దుర్లెక్కాయి. లైట్లు వేసుకుని చూస్తే ఒక్కొ సీట్లో వందల కొద్ది నల్లులున్నాయి. ఇలా అన్ని సీట్లలోనూ నల్లులు కనిపించాయి. అవి పెద్ద సైజులో ఉండడంతో మూడు, నాలుగు నెలలుగా నిర్వహణ లేదని అర్థమైంది. పిల్లలతో పాటు బస్సులో ఉన్న వారంతా రాత్రంతా జాగారం చేశాం. విశాఖ ఎప్పుడొస్తుందని ఎదురుచూశాం.– వెంకటేశ్వరరావు,ప్రయాణికుడు, విశాఖపట్నం -
గూగుల్ సరికొత్త ఆఫర్
-
గూగుల్ సరికొత్త ఆఫర్
వాషింగ్టన్ : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఓ కొత్త ఆఫర్ ప్రకటించింది. బగ్స్ సులువుగా కనిపెట్టే వారికి గూగుల్ ఆఫర్ మరింత ఉపయోగపడనుంది. అదేంటంటే.. గూగుల్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ యాప్స్‌లో బగ్స్‌ని కనుక్కుని సంస్థకు సమాచారం ఇచ్చిన వారికి 1000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 66 వేలు) అందిస్తామని గూగుల్ ప్రకటించింది. హ్యాకర్ వన్ అనే కంపెనీతో డీల్ ద్వారా కొత్త డెవలపర్లను వెలికితీసేందుకు గూగుల్ శ్రీకారం చుట్టింది. ఆండ్రాయిడ్ యాప్స్ రూపొందించే వారితో పాటు యాప్ ప్రోగ్రామ్స్ చెక్ చేసి బగ్స్ గుర్తించే వారు తమ నైపుణ్యాన్ని బయటపెట్టేందుకు ఇది సదావకాశమని గూగుల్ ప్లే యాప్స్ అండ్ గేమ్స్ డైరెక్టర్ వినీత్ బచ్ అన్నారు. తమ యూజర్లకు వైరస్ల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకూడదని బగ్స్ గుర్తించండి.. రివార్డ్ పొందండి అంటూ కొత్తదనానికి బాటలు వేస్తోంది గూగుల్. 2015లో బగ్స్ రిమూవ్ ప్రోగ్రామ్ మొదటుపెట్టాక ఇప్పటివరకూ వీటి కోసం గూగుల్ 115 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు సంస్థ తెలిపింది. -
సూక్ష్మంలో మోక్షం
గ్రహదోషాలు కలిగిన వారు కొన్ని సూక్ష్మమైన పరిహారాలు చేయడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు. వాటి వివరాలు ఇలా... రవి (సూర్యుడు)దోషం కలిగిన వారు ఆదిత్య హృదయం పఠించి ఐదు ఆదివారాలు ఆవుపాలతో చేసిన పొంగలి నివేదించాలి. అలాగే, చివరి వారం గోధుమలు దానం చేయాలి. చంద్ర దోషం కలిగిన వారు దుర్గాదేవిని ఆరాధించాలి. అలాగే, మూడు సోమవారాలు శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మంచిది. బియ్యం దానం చేయాలి. కుజ (అంగారకుడు) దోషం కలిగిన వారు సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి. అలాగే మూడు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయించుకుంటే మంచిది. కందులు దానం చేయాలి.-రాహు దోషం కలిగిన వారు దుర్గాదేవికి ఐదు శుక్రవారాలు కుంకుమార్చన చేసి, చివరి వారం గారెలు నివేదించండి. మినుములు దానం మంచిది. గురుదోషం కలిగిన వారు గణేశాష్టకం, రుద్ర నమకం పఠించి, మూడు లేదా ఐదు గురువారాలు శివాలయంలో 11చొప్పున ప్రదక్షణలు చేయాలి. చివరి వారం సెనగలు దానం మంచిది. శని దోషం కలిగిన వారు ఆంజనేయస్వామికి అర్చనలు చేయాలి. అలాగే, నువ్వులు దానం చేయాలి. బుధదోషం కలిగిన వారు విష్ణుపూజలు, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి. తులసీదళాలతో విష్ణ్వాలయంలో అర్చన చేయించాలి. బుధవారం తీపి వంటకం నివేదించండి. పెసలు దానం మంచిది.కేతు దోషం కలిగిన వారు సూర్యారాధన చేయడం మంచిది. ఉలవలు దానం చేస్తే ఫలితం ఉంటుంది. శుక్రదోషం కలిగిన వారు ఐదు శుక్రవారాలు అమ్మవారికి కుంకుమార్చలు చేసి, చివరి వారం పులిహోర నివేదించండి. అలాగే, బొబ్బర్లు దానం మంచిది.ఐదు శనివారాలు రావిచెట్టు చుట్టూ 11చొప్పున ప్రదక్షణలు చేసి చీమలకు ఆహారం సమర్పిస్తే సకలదోషాలు తొలగుతాయి. -
ఫేస్బుక్ టాప్ బగ్ హంటర్స్ తెలుసా?
న్యూయార్క్: ఫేస్బుక్లో బగ్స్‌ను గుర్తించి వాటిని పరిష్కరించడంలో ఇండియన్ రిసెర్చర్స్ ముందువరుసలో ఉన్నారని ఫేస్ బుక్ వెల్లడించింది. అంతేకాదు తాము ఇప్పటి వరకు నగదు రూపంలో చెల్లించిన మొత్తాల్లో ఇండియన్స్ కే అధిక వాటా ఉందని కూడా తెలిపింది. 'బగ్స్‌ను ఏరివేసే కార్యక్రమంలో మొత్తం 127 దేశాలకు చెందిన టెక్నాలజీ రీసెర్చర్స్, హ్యాకర్స్ పాల్గొంటుండగా అందులో భారత్ మాత్రమే టాప్ స్థానంలో ఉంది. అంతేకాకుండా పెద్దమొత్తాల్లో చెల్లింపులు పొందుతున్న దేశాల్లో కూడా భారత్ దే అగ్రస్థానం' అని ఫేస్ బుక్ వెల్లడించింది. భారత్‌లోని ఫేస్ బుక్ బగ్ హంటర్స్‌కు ఇప్పటి వరకు రూ.4.84 కోట్లు చెల్లించినట్లు చెప్పింది. ఈ కార్యక్రమం తాము 2011లో ప్రారంభించినట్లు వెల్లడించింది.