వాషింగ్టన్ : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఓ కొత్త ఆఫర్ ప్రకటించింది. బగ్స్ సులువుగా కనిపెట్టే వారికి గూగుల్ ఆఫర్ మరింత ఉపయోగపడనుంది. అదేంటంటే.. గూగుల్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ యాప్స్‌లో బగ్స్‌ని కనుక్కుని సంస్థకు సమాచారం ఇచ్చిన వారికి 1000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 66 వేలు) అందిస్తామని గూగుల్ ప్రకటించింది.
హ్యాకర్ వన్ అనే కంపెనీతో డీల్ ద్వారా కొత్త డెవలపర్లను వెలికితీసేందుకు గూగుల్ శ్రీకారం చుట్టింది. ఆండ్రాయిడ్ యాప్స్ రూపొందించే వారితో పాటు యాప్ ప్రోగ్రామ్స్ చెక్ చేసి బగ్స్ గుర్తించే వారు తమ నైపుణ్యాన్ని బయటపెట్టేందుకు ఇది సదావకాశమని గూగుల్ ప్లే యాప్స్ అండ్ గేమ్స్ డైరెక్టర్ వినీత్ బచ్ అన్నారు. తమ యూజర్లకు వైరస్‌ల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకూడదని బగ్స్ గుర్తించండి.. రివార్డ్ పొందండి అంటూ కొత్తదనానికి బాటలు వేస్తోంది గూగుల్. 2015లో బగ్స్ రిమూవ్ ప్రోగ్రామ్ మొదటుపెట్టాక ఇప్పటివరకూ వీటి కోసం గూగుల్ 115 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment