ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంలో చాలా లోపాలు | There are many flaws in Android operating system | Sakshi
Sakshi News home page

ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంలో చాలా లోపాలు

Published Tue, Aug 15 2023 5:38 AM | Last Updated on Tue, Aug 15 2023 5:38 AM

There are many flaws in Android operating system - Sakshi

న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంలో చాలా లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ టీమ్‌ పేర్కొంది. ఆండ్రాయిడ్‌– 13 సహా పలు వెర్షన్లు వైరస్‌ల బారిన పడే ప్రమాదం చాలా ఉందని ఆందోళన వెలిబు చ్చింది. వాటి వినియోగంలో జాగ్రత్తగా ఉండాలంటూ యూజర్లకు సోమవారం ’అతి తీవ్ర’ హెచ్చరిక లు జారీ చేసింది.

లేదంటే మొబైల్స్‌ తదితరాల్లో సున్నిత సమాచారం హాకర్ల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని వివరించింది. ఆండ్రాయిడ్‌ 10, 11, 12, 12ఎల్, 13 వెర్షన్లలో వీటిని ప్రధానంగా గమనించినట్టు చెప్పింది. వీటివల్ల ఫ్రేంవర్క్, ఆండ్రాయిడ్‌ రన్‌ టైం, సిస్టం కంపోనెంట్, గూగుల్‌ ప్లే సిస్టమ్‌ అప్డేట్స్, కెర్నల్, ఆర్మ్‌ కంపోనెంట్స్, మీడియా టీ కంపోనెంట్, కలోకాం క్లోజ్డ్‌ సోర్స్‌ కంపోనెంట్స్‌ వంటివాటి పనితీరు లోపభూయిష్టంగా మారుతుందని వివరించింది.

అప్‌డేషన్‌ ఇలా...
ఆండ్రాయిడ్‌ ఆధారిత డివైస్‌ల భద్రత కోసం లేటెస్ట్‌ సెక్యూరిటీ ప్యాచెస్‌కు తక్షణం అప్డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఇందుకు డివైస్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టమ్‌పై క్లిక్‌ చేయాలి..సిస్టమ్‌ అప్‌ డేట్స్‌పై క్లిక్‌ చేయండి. అప్డేట్స్‌ ఉంటే డౌన్‌ లోడ్‌ చేసుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement