ఫ్లూబోట్ మాల్వేర్ మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారుల ఫోన్లకు సంక్రమిస్తుంది. ఇప్పుడు వినియోగదారుల పరికరాల్లోకి ప్రవేశించడానికి మాల్వేర్ ఒక కొత్త మార్గాన్ని కనుగొంది. ఒక నెల క్రితం భద్రతా సంస్థ ట్రెండ్ మైక్రో, న్యూజీలాండ్ కు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ) ప్రమాదకరమైన ఫ్లూబోట్ మాల్ వేర్ మరో కొత్త పద్దతిలో తిరిగి వచ్చినట్లు వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. మొబైల్ యూజర్లను ఆకర్షించడం కోసం పార్శిల్ పేరుతో ఓ టెక్ట్స్ మెసేజ్ వస్తోంది. యూజర్లు లింక్ పై క్లిక్ చేసిన తర్వాత వారికి మరో పెద్ద సందేశం వస్తుంది.
మీ మొబైల్/కంప్యూటరుకి ప్రమాదకరమైన ఫ్లూబోట్ మాల్వేర్ సోకినట్లు ఒక హెచ్చరిక చేస్తుంది. వాస్తవానికి, ఇది గూగుల్ క్రోమ్ ప్రమాదకరమైన సేఫ్ బ్రౌజింగ్ సందేశాన్ని తెలిపే రెడ్ హెచ్చరిక స్క్రీన్'తో పోలి ఉంటుంది. "ఫ్లూబోట్ మాల్వేర్ తొలగించడం కోసం ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్ ఇన్ స్టాల్ చేయండి" అని సందేశం రూపంలో ఇక్కడ క్లిక్ చేయండి చూపిస్తుంది.
ఫ్లూబోట్ మాల్ వేర్ మాల్వేర్ తొలగించడం కోసం నిజమైన సెక్యూరిటీ అప్డేట్ చేయడానికి బదులుగా వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లో ఫ్లూబోట్ వైరస్ డౌన్ లోడ్ చేస్తారు. సెక్యూరిటీ అప్ డేట్ పేరుతో మీ మొబైల్స్ లో ప్రవేశించిన తర్వాత ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, యాప్ ఆధారిత బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్, ఈ-మెయిల్, ట్విట్టర్ ఈ డేటా మొత్తాన్ని మాల్‌వేర్ ప్రయోగించిన సైబర్ నేరగాడికి ఫ్లూబోట్ అందిస్తుంది. అలాగే, మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ ద్వారా ఇతర వ్యక్తులకు పంపుతుంది. (చదవండి: డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు డౌన్‌లోడ్ చేశారా..?)
We’ve broken down some details on the FluBot text scam currently infecting Android phones. Please share this with your friends and family and help us stop the spread. https://t.co/zoz8G9o8i0
— CERT NZ (@CERTNZ) October 1, 2021
ఫ్లూబాట్ నుంచి రక్షణ ఇలా..
ఇంతటి ఇబ్బందికరమైన ఫ్లూబాట్ మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడం కోసం మీ స్క్రీన్ పై వచ్చే పాప్ అప్ క్లిక్ చేయవద్దు. ఏ ఇతర లింక్స్ ద్వారా వచ్చే యాప్‌లు సురక్షితం కావు. తెలిసిన వ్యక్తే కదా పంపించాడు అనుకుని ఎప్పుడూ లింక్స్ ఓపెన్ చేయకూడదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పొరపాటున డౌన్‌లోడ్ చేసి ఉంటే వెంటనే మొబైల్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment