flaws
-
ఆర్జీ కర్ ఆస్పత్రి మెడిసిన్ కొనుగోళ్లలో భారీ లోపాలు: సీబీఐ
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులు దర్యాప్తు సంస్థ సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. సందీప్ ఘోష్ ప్రన్సిపల్గా ఉన్న సమయంలో ఆస్పత్రిలో పేషెంట్లకు అందించే మెడిసిన్ కొనుగోళ్ల వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని సీబీఐ తాజాగా పేర్కొంది. బయటి ఏజెన్సీల నుంచి ఔషధాలను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా బిడ్డర్లను సాంకేతికంగా పరిశీలన చేసే కీలకమైన అంశాన్ని విస్మరించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. పేషెంట్ల ఆరోగ్యం బిడ్డర్లు సప్లై చేసే నాణ్యమైన మెడిసిన్‌పై అధారపడి ఉంటుంది. అయితే.. ఈ క్రమంలో బిడ్డర్ల సాంకేతిక పరిశీలిన చాలా ముఖ్యమైన అంశం. కానీ.. రెండు దశల్లో పూర్తి చేసుకోవల్సిన సాంకేతిక పరిశీలనను కేవలం ఒక దశ తర్వాతే బిడ్డర్లకు కాంట్రాక్ట్ అప్పగించనట్లు పలు డాక్యుమెంట్లపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు వెల్లడించారు. బిడ్డర్లు మొదటి దశ పరిశీలనలో అర్హత సాధించకపోయినా రెండోదశకు అనుమతించి మరీ కాంట్రాక్టు అప్పగించినట్లు సీబీఐ పేర్కొంది. అదే విధంగా ఆస్పత్రిలో రోగులకు ఇచ్చే మెడిసిన్ నాణ్యత విషయంలో పీజీ ట్రైనింగ్ డాక్టర్లు ఎన్నిసార్లు సందీప్ ఘోస్ దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పట్టించుకోలేదని సీబీఐ తెలిపింది. మరోవైపు.. కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన సమాచారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటంలో నిర్లక్ష్యం కారణంగా సందీప్ ఘోష్ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక.. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌తో పాటు సందిప్ ఘోష్‌కు కూడా సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే.చదవండి: కోల్‌కతా కేసు: 25 దాకా ‘ఘోష్’ సీబీఐ కస్టడీ పొడిగింపు -
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా లోపాలు
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ పేర్కొంది. ఆండ్రాయిడ్– 13 సహా పలు వెర్షన్లు వైరస్ల బారిన పడే ప్రమాదం చాలా ఉందని ఆందోళన వెలిబు చ్చింది. వాటి వినియోగంలో జాగ్రత్తగా ఉండాలంటూ యూజర్లకు సోమవారం ’అతి తీవ్ర’ హెచ్చరిక లు జారీ చేసింది. లేదంటే మొబైల్స్ తదితరాల్లో సున్నిత సమాచారం హాకర్ల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని వివరించింది. ఆండ్రాయిడ్ 10, 11, 12, 12ఎల్, 13 వెర్షన్లలో వీటిని ప్రధానంగా గమనించినట్టు చెప్పింది. వీటివల్ల ఫ్రేంవర్క్, ఆండ్రాయిడ్ రన్ టైం, సిస్టం కంపోనెంట్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్స్, కెర్నల్, ఆర్మ్ కంపోనెంట్స్, మీడియా టీ కంపోనెంట్, కలోకాం క్లోజ్డ్ సోర్స్ కంపోనెంట్స్ వంటివాటి పనితీరు లోపభూయిష్టంగా మారుతుందని వివరించింది. అప్డేషన్ ఇలా... ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్ల భద్రత కోసం లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్‌కు తక్షణం అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టమ్‌పై క్లిక్ చేయాలి..సిస్టమ్ అప్ డేట్స్‌పై క్లిక్ చేయండి. అప్డేట్స్ ఉంటే డౌన్ లోడ్ చేసుకోండి. -
షింజే అబే మృతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉన్నతాధికారి
Shinzo Abe's Security Had Flaws: జపాన్ మాజీ ప్రదాని షింజే అబే దారుణ హత్యకు సంబంధించి స్థానిక పోలీస్ ఉన్నతాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భద్రతా విషయాలకు సంబంధించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఈ మేరకు జపాన్ పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.....మాజీ ప్రధాని షింజో అబే భద్రతకు సంబంధించి కాదనలేని లోపాలు ఉన్నాయని అన్నారు. ఒక దుండగుడు ఆయనకు సమీపంలోకి వచ్చి మరీ కాల్పులు జరపగలిగాడంటే ఆయనకు ఎటువంటి పటిష్టమైన భద్రత ఉందో తెలుస్తోందని చెప్పారు. హింసాత్మక నేరాలు తక్కువ సంఖ్యలో నమోదయ్యే జపాన్‌లో ఇలాంటి హత్య జరిగిందంటే నమ్మశక్యంగా లేదన్నారు. పైగా కఠినమైన తుపాకి చట్టాలు ఉన్న జపాన్ దేశంలో ఈ ఘటన చోటుచేసుకోవడం బాధకరం అన్నారు. అంతేకాదు జపాన్‌లో స్థానిక ప్రచార కార్యక్రమాల్లో భద్రత సాపేక్షంగా సడలించబడుతుందని చెప్పారు. ఏదీ ఏమైన ఆయనకు పటిష్టమైన భద్రత లేదని స్పష్టమవుతోందని అన్నారు. తన 27 ఏళ్ల కెరియర్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొలేదని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పారు. అంతేకాదు మాజీ ప్రధాని అబే రక్షణకు సంబంధించి భద్రతా చర్యల్లో చాలా లోపాలు ఉన్నాయని, ఇది కాదనలేని వాస్తవమని జపాన్ పోలీస్ ఉన్నతాధికారి టోమోకి ఒనిజుకా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ఈ దురదృష్టకరమైన ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో కఠినమైన చర్యలు తీసుకోవడమే గాక పూర్తి స్తాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: మత గురువును చంపాలనుకుని.. అబేపై కాల్పులు!) -
కుటుంబ సర్వేలో సవాలక్ష సమస్యలు!!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన 'సమగ్ర కుటుంబ సర్వే' దాదాపు అయిపోయింది. అయితే.. ఇందులో సవాలక్ష సమస్యలు కనిపించాయి. సర్వే చేస్తామన్న మాటే తప్ప.. దీని గురించిన సరైన వివరాలు పూర్తి స్థాయిలో ప్రచారం కాకపోవడం, ఏ సమాచారం ఇస్తే ఏమవుతుందోనన్న అనుమానాలు, ఇవ్వకపోతే ఏం జరుగుతుందోనన్న ఆందోళన.. ఇలాంటివాటికి సమాధానాలు ఎక్కడా దొరకలేదు. ఎక్కడో మహారాష్ట్రలోని పుణె నుంచి పాలమూరుకు ఒక వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి మరీ సర్వేలో పాల్గొన్నాడు. అతడు ఎప్పుడో జీవనోపాధి కోసం అక్కడకు వెళ్లిపోయాడు. అంతంతమాత్రం జీవితమే కావడంతో కుటుంబ సభ్యులందరినీ ఊరు పంపేసరికి ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. దాంతో తాను కూడా తప్పనిసరిగా సర్వేలో పాల్గొనాలని.. అతడు సైకిల్ తొక్కుకుంటూనే వచ్చాడు. తెలంగాణ పౌరులు అనిపించుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సర్వేలో పాల్గొనాల్సిందే అనే సందేశమే ఎక్కువగా జనంలోకి వెళ్లింది. అందుకే ఇంత కష్టపడి, నానా ఇబ్బందులు పడి మరీ సర్వే కోసం వచ్చారు. చెన్నై, ముంబై, ఢిల్లీ లాంటి దూరప్రాంతాల్లో ఉన్నవాళ్లు కూడా విమానాల టికెట్లు పెట్టుకుని మరీ సర్వే కోసం రావాల్సి వచ్చింది. అయితే.. ఇంతమంది ఇన్ని కష్టాలు పడి, ఇంత ఖర్చు పెట్టుకుని మరీ వచ్చినా.. సమగ్ర కుటుంబ సర్వే మాత్రం అనుకున్నంత సీరియస్‌గా జరగలేదనే చెప్పాలి. ఎన్యుమరేటర్ల స్థాయిలో తగిన శిక్షణ లేకపోవడం, ముందుగా ఎంతమంది సిబ్బంది కావాలో తేల్చుకోలేక.. అరకొరగానే నియమించారు. దాంతో ముందు ఒక్కొక్కరికి 21 ఇళ్లు మాత్రమేనేని చెప్పి, తర్వాత దాదాపు 50 ఇళ్ల వరకు కూడా అప్పగించారు. ఒక్కో ఇంట్లో ఎన్ని కుటుంబాలున్నా అంతే. దీంతో ఎన్యుమరేటర్ల పరిస్థితి దారుణంగా మారింది. పీజీ నుంచి డిగ్రీ విద్యార్థుల వరకు అందరినీ సర్వేలోకి దింపేశారు. వాళ్లకు ఏ వివరాలు కావాలో, ఏవి అక్కర్లేదో కూడా పూర్తిగా తెలియలేదు. చాలావరకు కేవలం కుటుంబ సభ్యులు చెప్పినవే రాసుకున్నారు తప్ప.. సొంతంగా ఏవీ పరిశీలించలేదు. వాస్తవానికి అలా పరిశీలించేందుకు వారికి సమయం కూడా సరిపోలేదు. కొన్ని శివారు ప్రాంతాల్లో అయితే సోమవారమే సర్వే ఫారాలు పూర్తిచేయించుకుని వెళ్లిపోయారు. స్టిక్కర్ల మీద మాత్రం మూడు రోజులూ వచ్చినట్లుగా టిక్ పెట్టేశారు. ఇదేంటని అడిగితే.. ఒక్క రోజులో సర్వే పూర్తి చేయాలంటే దేవుడు దిగి రావాలని విద్యార్థులు చెప్పారు.