మనదేశానికి చెందిన ఓ యువకుడు గూగుల్‌కు భారీ షాకిచ్చాడు. గూగుల్ కు చెందిన వివిధ ప్రొడక్ట్‌లలో భారీ ఎత్తున లోపాల్ని(బగ్స్) గుర్తించాడు. లోపాల్ని గుర్తించడమే కాదు గూగుల్ నుంచి కోట్ల రూపాయిల రివార్డ్‌లును అందుకున్నాడు.
భారత్‌కు చెందిన అమన్ పాండే ఎన్ఐటీ భోపాల్ లో పట్టభద్రుడయ్యాడు. అనంతరం ప్రముఖ కంపెనీలకు చెందిన సాఫ్ట్‌వేర్‌లలో లోపాల్ని గుర్తించేందుకు గతేడాది బగ్స్ మిర్రర్ పేరిట కంపెనీని స్థాపించాడు. ఈ నేపథ్యంలో గూగుల్ తమ సంస్థలకు చెందిన సాఫ్ట్‌వేర్‌లలో లోపాల్ని గుర్తించిన వారికి భారీ ఎత్తున ప్రోత్సాహకాల్ని అందిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం వల్నరబిలటీ రివార్డ్ ప్రోగ్రామ్ 2021 ను నిర్వహించింది.
అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమన్ పాండే.. గూగుల్, ఆండ్రాయిండ్, గూగుల్ క్రోమ్, గూగుల్ ప్లేస్టోర్ తో పాటు ఇతర ప్రొడక్ట్‌లలో వందల సంఖ్యలో బగ్స్‌ను గుర్తించాడు. ఒక్క ఏడాదిలోనే గూగుల్ తో పాటు ఆ సంస్థకు చెందిన మిగిలిన కంపెనీలకు చెందిన పలు సాఫ్ట్‌వేర్‌లలో మొత్తం 232 లోపాల్ని గుర్తించాడు. ఈ నేపథ్యంలో అమన్‌ను గూగల్ ప్రత్యేకంగా అభినందించింది. బగ్స్ ను గుర్తించినందుకు రూ.65కోట్ల రివార్డ్‌ను అందిస్తున్నట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో ప్రధానంగా హైలెట్ చేసింది.
కాగా, 2019లో సారా జాకోబస్ అనే వ్యక్తి అండ్రాయిడ్ వల్నరబిలిటీస్ రివార్డ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 280కి పైగా బగ్స్‌ను నివేదించి తొలిస్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment