గూగుల్ కంపెనీలో మూడేళ్లకు పైగా పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి.. తన ప్రమోషన్ గురించి, 30 శాతం పెంపు ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి థ్రెడ్‌లో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 'జెర్రీ లీ' అనే వ్యక్తి 2018లో గూగుల్‌లో చేరాడు. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే సీనియర్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా ఎదిగారు. తన పోస్ట్‌లో..తన సహచరులు ఎక్కువగా తనను బాధ్యతగా భావించారని వెల్లడించాడు.గూగుల్‌లో నా మొదటి రెండు నెలలు? నిజాయితీగా, అవి విచిత్రంగా సాగాయని వివరించాడు.
పనిని సులభంగా తీసుకో అని చెప్పడం, ఉచిత భోజనం తినమని చెప్పడం, క్యాంపస్ చూడమని చెప్పడం చేసేవారు. ఎందుకంటే నేను కంపెనీలో ఉన్న ఇతరుల కంటే చిన్నవాడిని. ఆరు ఏళ్లు దాటిన వారితో కూడిన బృందంలో వారు నన్ను మొదటి కొన్ని నెలలపాటు నెగిటివ్‌గా చూశారని భావించినట్లు పేర్కొన్నాడు.
రెండు నెలలు గడిచినా ఏమీ చేయకపోవడంతో విసుగు వచ్చిందని, ఎలాగైనా తన విలువ పెంచుకోవాలని భావించానని చెప్పాడు. నేను ప్రాజెక్ట్‌ల కోసం అడగడం మొదలుపెట్టాను. చివరగా నా మేనేజర్‌లలో ఒకరు, మీరు ఈ మార్కెట్ ల్యాండ్‌స్కేప్ విశ్లేషణను ఎందుకు చూడకూడదు? అని చెప్పారు. నేను దానిని గమనించాను.
ఇదీ చదవండి: అక్కడ భారీగా బయటపడ్డ తెల్ల బంగారం
ఆ తరువాత ఇద్దరు ప్రాజెక్ట్ మేనేజర్లు, ఆరుగురు ఇంజనీర్లు, మరో ఐదుగురు విశ్లేషకులు, కార్యకలాపాలు, చట్టపరమైన విభాగాలకు చెందిన ఇతర ఉద్యోగులతో కలిసి ఒక ప్రాజెక్ట్‌ను నడిపిస్తున్నట్లు నన్ను గుర్తించారు. దీంతో కంపెనీలో చేరిన ఎనిమిది నెలల తరువాత 80 లక్షల బోనస్ అందుకోవడం మాత్రమే కాకుండా.. ప్రమోషన్ కూడా పొందినట్లు పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment