ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల రూపంలో సంపాదన పెరిగినప్పుడు విలాసాలకు, అనవసర ఖర్చులకు డబ్బు వృథా చేయకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. వచ్చే దసరా, దీపావళి వంటి పండగలకు చాలా కంపెనీలు బోనస్‌ను ప్రకటిస్తుంటాయి. ఈ డబ్బును పొదుపు చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
బోనస్, ఇంక్రిమెంట్, ప్రమోషన్ రూపంలో అదనంగా సమకూరే డబ్బును దీర్ఘకాల రాబడులిచ్చే ఈక్విటీ మార్కెట్‌లోకి మళ్లించాలి. ఇప్పటికే నెలవారీ క్రమానుగత పెట్టుబడి విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి ఇది మరింత డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక మదుపునకు అదనంగా జోడించే ఐదుశాతం భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు మీ నెల జీతం యాభైవేల రూపాయలు అనుకుందాం. ప్రతినెలా రూ.10 వేలు మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారనుకుందాం. ఏటా ఐదు శాతం ఇంక్రిమెంటును పరిగణనలోకి తీసుకుందాం. మన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై 12 శాతం వార్షిక రాబడి ఉంటుందనే అంచనాకు వద్దాం. అప్పటి దాకా కొనసాగిస్తున్న దీర్ఘకాలిక మదుపును ఏటా ఐదు శాతం పెంచుకోవడం వల్ల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదు. రోజువారీ ఖర్చుల విషయంలో రాజీ పడాల్సిన అవసరమూ రాదు. కానీ, ముప్పై ఏళ్ల తర్వాత.. రూ.3.7 కోట్ల స్థానంలో అక్షరాలా రూ.5.2 కోట్లు అందుకుంటారు. అంటే, ఏటా ఐదుశాతం అదనంగా ఇన్వెస్ట్ చేస్తే రూ.1.5 కోట్లు ఎక్కువగా సమకూరుతాయి.
ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందని హెచ్చరిక!
Comments
Please login to add a commentAdd a comment