increaments
-
పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి అర్ధభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా ఎగిశాయి. ఏప్రిల్–సెప్టెంబర్‌లో 29.79 బిలియన్ డాలర్ల(రూ.2.4 లక్షల కోట్లు)ను తాకాయి.ప్రధానంగా సర్వీసులు, కంప్యూటర్, టెలికం, ఫార్మా రంగాలకు పెట్టుబడులు పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో 20.5 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు మాత్రమే లభించాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో ఎఫ్‌డీఐలు 43 శాతం వృద్ధితో 13.6 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది క్యూ2లో కేవలం 9.52 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు తరలి వచ్చాయి. ఇక ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో మరింత అధికంగా 48 శాతం అధికంగా 16.17 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఈక్విటీ పెట్టుబడులుసహా మొత్తం ఎఫ్‌డీఐలు 28 శాతం పెరిగి 42.1 బిలియన్ డాలర్లను తాకాయి. గతేడాది తొలి 6 నెలల్లో ఇవి 33.12 బిలియన్ డాలర్లు మాత్రమే.ఇదీ చదవండి: 1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం! -
ఇంక్రిమెంట్లు, బోనస్‌ల పవర్ తెలుసా..?
ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల రూపంలో సంపాదన పెరిగినప్పుడు విలాసాలకు, అనవసర ఖర్చులకు డబ్బు వృథా చేయకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. వచ్చే దసరా, దీపావళి వంటి పండగలకు చాలా కంపెనీలు బోనస్‌ను ప్రకటిస్తుంటాయి. ఈ డబ్బును పొదుపు చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.బోనస్, ఇంక్రిమెంట్, ప్రమోషన్ రూపంలో అదనంగా సమకూరే డబ్బును దీర్ఘకాల రాబడులిచ్చే ఈక్విటీ మార్కెట్లోకి మళ్లించాలి. ఇప్పటికే నెలవారీ క్రమానుగత పెట్టుబడి విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి ఇది మరింత డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక మదుపునకు అదనంగా జోడించే ఐదుశాతం భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు మీ నెల జీతం యాభైవేల రూపాయలు అనుకుందాం. ప్రతినెలా రూ.10 వేలు మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనుకుందాం. ఏటా ఐదు శాతం ఇంక్రిమెంటును పరిగణనలోకి తీసుకుందాం. మన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై 12 శాతం వార్షిక రాబడి ఉంటుందనే అంచనాకు వద్దాం. అప్పటి దాకా కొనసాగిస్తున్న దీర్ఘకాలిక మదుపును ఏటా ఐదు శాతం పెంచుకోవడం వల్ల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదు. రోజువారీ ఖర్చుల విషయంలో రాజీ పడాల్సిన అవసరమూ రాదు. కానీ, ముప్పై ఏళ్ల తర్వాత.. రూ.3.7 కోట్ల స్థానంలో అక్షరాలా రూ.5.2 కోట్లు అందుకుంటారు. అంటే, ఏటా ఐదుశాతం అదనంగా ఇన్వెస్ట్ చేస్తే రూ.1.5 కోట్లు ఎక్కువగా సమకూరుతాయి.ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందని హెచ్చరిక! -
టీసీఎస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి..
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు జీతాలు పెంచింది. 4.5 నుంచి 7 శాతం శ్రేణిలో వార్షిక ఇంక్రిమెంట్లను ప్రకటించింది. టాప్ పెర్ఫార్మర్లకు రెండంకెల పెంపుదల ఉంటుందని చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. ఈ వేతనాల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలు కానుందని చెప్పారు. "క్యాంపస్ నియామకాలు, పెరిగిన కస్టమర్ విజిట్ల ఫలితంగా అట్రిషన్ 12.5 శాతానికి తగ్గింది. ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావడం మా డెలివరీ సెంటర్లలో గొప్ప చైతన్యాన్ని కలిగించింది. మా సహచరుల ఉత్సాహాన్ని పెంచింది" అని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ కొంత మంది పర్ఫార్మర్లకు 12-15 శాతం వరకు జీతాలను పెంచి ప్రమోషన్స్ సైకిల్‌ను ప్రారంభించింది. ఈ పెంపుదల 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఫలితాలను ప్రకటించిన తర్వాత లక్కాడ్ మీడియాతో మాట్లాడుతూ, 2023-24లో కంపెనీ చాలా మంది ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేసిందని, అయితే, ఇంకా కొంతమందిని చేర్చుకోవాల్సి ఉందని అన్నారు. ఈ మిగిలిన ఫ్రెషర్లను ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చేర్చుకుంటామని ఆయన తెలిపారు. కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను చేర్చుకోవాలని యోచిస్తున్నట్లు గతంలో టీసీఎస్ తెలిపింది. అయితే, బడ్జెట్ పరిమితుల కారణంగా ఫ్రెషర్లు, ఇతర నియామకాల ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేస్తోంది. -
ఉద్యోగులకు బంపరాఫర్, జీతం ఎంత పెరగనుందంటే?
ఆర్ధిక మాంద్యం భయాలు. ప్రాజెక్ట్‌ల కొరత, అవధుల్లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం, వరుస లేఆఫ్స్, వేతనాల కోతల వంటి సంస్థలు వరుస నిర్ణయాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘డెలాయిట్ ఇండియా టాలెంట్ ఔట్లుక్ 2024’ నివేదిక ప్రకారం..ఆయా కంపెనీల్లో పని చేస్తున్న కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లకు 9 శాతం శాలరీ పెరుగుతుందని అంచనా వేసింది. ఐటీ, బీపీఓలు మినహా అన్ని రంగాలలో కోవిడ్‌కు ముందు స్థాయిల కంటే మెరుగుగానే జీతాల పెంపు ఉంటుందని తెలిపింది. అయితే, ఈ అంచనా 2023లో వేసిన 9.2శాతం కంటే కొంచెం తక్కువగా ఉంది. కంపెనీలు జూనియర్ మేనేజ్మెంట్కు గణనీయమైన ఇంక్రిమెంట్లను అందించే అవకాశం ఉండగా.. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వేతనాల చెల్లింపు ఉండనుంది. ఇంక్రిమెంట్లు డెలాయిట్ ఇండియా శాలరీ నివేదిక ప్రకారం.. టాప్ పెర్ఫార్మర్లు సగటు రేటెడ్ ఉద్యోగులకు చెల్లించే ఇంక్రిమెంట్ల కంటే 1.8 రెట్లు ఎక్కువ పొందే అవకాశం ఉంది. 2023లో 0.6 రెట్లుతో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువ రేటింగ్ ఉన్న ఉద్యోగులు 0.4 రెట్లు పెరగనున్నారు. బోనస్‌లు 2024లో దాదాపు సగం కంపెనీలు తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలకు మించి అదనంగా బోనస్‌లు ఇవ్వనున్నట్లు డెలాయిట్ ఇండియా నివేదిక హైలెట్చేస్తోంది. ప్రతిభ గల ఉద్యోగుల్ని నిలుపుకునేందుకు సంస్థలు 7.5శాతంతో ప్రమోషన్ల పెంపును కొనసాగించాలని కూడా భావిస్తున్నట్లు వెల్లడించింది. పదోన్నతులు నివేదిక ప్రకారం, పదోన్నతులు పొందగలరని అంచనా వేసిన ఉద్యోగుల శాతం 2023లో 12.3శాతం నుండి తగ్గింది. -
దుమ్ము రేపిన ప్యాసింజర్ వాహన అమ్మకాలు
-
వేతనాల పెంపునకు రంగం సిద్ధం.. అందులో హైదరాబాద్..
ముంబై: ఉద్యోగుల సగటు వేతనాల పెంపు ఈ ఏడాది 8.13 శాతంగా ఉండొచ్చని టీమ్‌లీజ్ సంస్థ అంచనా వేసింది. కరోనా లాక్డౌన్ల నుంచి పరిస్థితులు కుదుటపడినట్టు పేర్కొంది. ‘జాబ్స్ అండ్ శాలరీ ప్రైమర్ రిపోర్ట్ 2021–22’ పేరుతో టీమ్‌లీజ్ తన వార్షిక నివేదిక విడుదల చేసింది. గత రెండేళ్ల మాదిరిగా కాకుండా, అన్ని రంగాల్లోనూ ఎక్కువ విభాగాల్లో వేతనాల పెంపు ఉంటుందని ఈ నివేదిక తెలియజేసింది. ఈ నివేదికలో భాగంగా 17 రంగాల్లోని పరిస్థితులను సమీక్షించింది. అన్నింటిలోనూ వేతనాల పెంపు ఒక అంకె స్థాయిలో ఉంటుందని అంచనా వేసింది. ‘‘వేతనాల పెంపు డబుల్ డిజిట్‌ను చేరుకోవాల్సి ఉంది. గత రెండేళ్లలో చూసిన వేతనాల క్షీణత, స్తబ్ధత అన్నవి ముగింపునకు రావడం సంతోషకరం’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకురాలు రితూపర్ణ చక్రవర్తి తెలిపారు.త్వరలోనే ఇంక్రిమెంట్లు కరోనా ముందు నాటికి చేరుకుంటాయన్నారు. తొమ్మిది పట్టణాల్లోని 2,63,000 మంది ఉద్యోగులకు చేసిన వేతన చెల్లింపుల ఆధారంగా టీమ్‌లీజ్ ఈ నివేదికను రూపొందించడం గమనార్హం. కొత్త తరహా ఉద్యోగాలకు డిమాండ్ నెలకొన్నట్టు రీతూపర్ణ తెలిపారు. ‘‘2020–21లో 17 రంగాలకు గాను ఐదు రంగాల్లోనే హాట్ జాబ్ రోల్స్ ఏర్పాటయ్యాయి. కానీ, 2021–22లో తొమ్మిది రంగాల్లో కట్టింగ్ ఎడ్జ్ (కొత్త తరహా రోల్స్) ఉద్యోగాలు ఏర్పాటు అయ్యాయి’’అని రీతూ పర్ణ చెప్పారు. ఇక్కడ అధికం.. ఈ ఏడాది 12 శాతానికి పైగా వేతనాల పెంపును చేపట్టే వాటిల్లో హైదరాబాద్, ముంబై, పుణె, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ పట్టణాలు ఉన్నాయి. ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు, హెల్త్‌కేర్, అనుబంధ రంగాలు, ఐటీ, నాలెడ్జీ సర్వీసెస్ రంగాలు అధిక వేతన చెల్లింపులకు సముఖంగా ఉన్నాయి. చదవండి: టెక్ మహీంద్రా ఉద్యోగులకు శుభవార్త.. వేతనాల పెంపు ఎంతంటే? -
మా నాన్నకు జీతం పెంచండి
విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు ‘కరెంటోళ్ల దీక్షలు’ పేరుతో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమం సోమవారం కూడా కొనసాగింది. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల పిల్లలు, కుటుంబసభ్యులు కూడా ఈ దీక్షల్లో పాల్గొన్నారు. ‘మా నాన్నకు జీతం పెంచండి’ అని రాసిన ప్లకార్డులతో చిన్నారులు ఆందోళనలో పాల్గొనటం గమనార్హం. ఎస్వీఎన్ కాలనీ(గుంటూరు) : న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి 14వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కలెక్టరేట్ రోడ్డులో రహదారిపై బైఠాయించి తమ నిరసనను తెలిపారు. ధర్నా శిబిరంలో భార్యా, పిల్లలతో కలిసి కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్వీ నరసింహారావు మాట్లాడుతూ 14 రోజులుగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నా యాజమాన్యాలుగాని, ప్రభుత్వంగాని స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన విజయవాడలోని విద్యుత్ సౌధ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. స్పందన రాకుంటే 10న రహదారుల దిగ్బంధం, 12న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌కు కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. సీఐటీయూ నాయకులు పోపూరి సుబ్బారావు, హుస్సేన్‌వలి, కాంగ్రెస్ నేత వినయ్‌కుమార్, సీపీఎం జిల్లా నాయకులు పాశం రామారావు, ఓబీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, యూనియన్ నేతలు శివకుమారి, షకీలా పాల్గొన్నారు. -
డబ్బుల్.. ఇంక్రిమెంట్లు
అర్హతలు లేకున్నా అదనపు ఇంక్రిమెంట్లను అందుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల చిట్టా బయటపడింది. పదేళ్లుగా అధికారుల కళ్లుగప్పి సాగుతున్న ఈ బాగోతంతో జిల్లాలో దాదాపు రూ.కోటి సర్కారు సొమ్ము దుర్వినియోగమైంది. ఉపాధ్యాయుల జీతాలు సహా సర్వీసు వివరాలన్నీ జిల్లా విద్యాశాఖ ఆన్లైన్లో పొందుపరచటంతో ఈ అక్రమం వెలుగులోకి వచ్చింది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : 39 మంది టీచర్లు అడ్డదారిలో ఇంక్రిమెంట్లను లబ్ధి పొందినట్లు ఇప్పటికే లెక్క తేలింది. స్వయంగా డీఈవో లింగయ్య ఆన్లైన్లో కొన్ని మండలాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు పరిశీలించి ఈ గోల్మాల్ను వెతికి పట్టుకున్నారు. అదే తీరుగా అన్ని మండలాలను గాలిస్తే.. అడ్డదారిలో సర్కారు సొమ్మును మింగేసిన టీచర్ల సంఖ్య వందకు మించుతుందని అంచనా వేస్తున్నారు. తిరిగి ఈ సొమ్మును ఎలా రికవరీ చేయాలి? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చూసీచూడనట్లుగా ఇంక్రిమెంట్లు జారీ చేసిన హెచ్ఎంలు, ఎంఈవోలకు ఈ అక్రమంలో ఎంతమేరకు ప్రమేయముంది? అనే కోణంలో జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. పధానంగా ఎస్జీటీలు, పీఈటీలు ఈ అక్రమానికి పాల్పడ్డట్లు తేలింది. నిబంధనల ప్రకారం... 24 ఏళ్ల సర్వీసు నిండిన ఎస్జీటీలు, పీఈటీలకు యాంత్రిక పదోన్నతి స్కేలు మంజూరవుతుంది. 2003 జూలై నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం.... డిగ్రీ, బీఎడ్‌తోపాటు కనీసం రెండు డిపార్టుమెంట్ టెస్టులు విధిగా పాసైన వారికే యాంత్రిక పదోన్నతి స్కేలు పొందేందుకు అర్హులుగా పరిగణిస్తారు. కానీ.. ఇంటర్, టీటీసీ ఉన్న టీచర్లు సైతం అడ్డదారిలో ఈ స్కేలును అందుకొని అక్రమాలకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మరో ఇంక్రిమెంట్‌కు ఎసరు పెట్టారు. 24 ఏళ్ల సర్వీసు తర్వాత రెగ్యులర్ ప్రమోషన్ పొందిన ఎస్జీటీ, పీఈటీలు ఎఫ్ఆర్-22 (ఏ)1, 31(2) ప్రకారం వేతన స్థిరీకరణతోపాటు ఒక ఇంక్రిమెంట్ పొందేందుకు అర్హులవుతారు. కానీ.. తమకు వర్తించని ఎఫ్ఆర్ 22(బి) చూపించి రెండు ఇంక్రిమెంట్లు అందుకున్నారు. నిజానికి ఈ నిబంధన 24 ఏళ్ల సర్వీసు కంటే ముందుగా ప్రమోషన్ అందుకున్న టీచర్లకు మాత్రమే వర్తిస్తుంది. అదేమీ పట్టించుకోకుండా అదనంగా ఒక ఇంక్రిమెంట్‌ను కొల్లగొట్టిన 39 మంది టీచర్లను అధికారులు వెతికి పట్టుకున్నారు. పధానంగా భీమదేవరపల్లి, రామగుండం మండలాల్లో ఈ అక్రమం బయటపడింది. జిల్లా అంతటా వెతికితే.. ఈ సంఖ్య అంతకంతకు పెరిగిపోతుందని అధికారులు అనుమానిస్తున్నారు. పదేళ్లుగా ఈ డబుల్ ఇంక్రిమెంట్లతో దాదాపు రూ.కోటి సర్కారు సొమ్ము లూటీ అయినట్లు భావిస్తున్నారు. ఈ నిధుల రికవరీతోపాటు విద్యాశాఖ తమపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే భయాందోళన అక్రమార్కులను వెంటాడుతోంది. వీరికి ఇంక్రిమెంట్లు జారీ చేసిన హెచ్ఎంలు, ఎంఈవోలతో పాటు బిల్లులు మంజూరీ చేసిన ట్రెజరీ విభాగానికి సైతం ఈ భాగోతం కంటి మీద కునుకు లేకుండా చేసింది.