దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి అర్ధభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా ఎగిశాయి. ఏప్రిల్–సెప్టెంబర్‌లో 29.79 బిలియన్ డాలర్ల(రూ.2.4 లక్షల కోట్లు)ను తాకాయి.
ప్రధానంగా సర్వీసులు, కంప్యూటర్, టెలికం, ఫార్మా రంగాలకు పెట్టుబడులు పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో 20.5 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు మాత్రమే లభించాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో ఎఫ్‌డీఐలు 43 శాతం వృద్ధితో 13.6 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది క్యూ2లో కేవలం 9.52 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు తరలి వచ్చాయి. ఇక ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో మరింత అధికంగా 48 శాతం అధికంగా 16.17 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఈక్విటీ పెట్టుబడులుసహా మొత్తం ఎఫ్‌డీఐలు 28 శాతం పెరిగి 42.1 బిలియన్ డాలర్లను తాకాయి. గతేడాది తొలి 6 నెలల్లో ఇవి 33.12 బిలియన్ డాలర్లు మాత్రమే.
ఇదీ చదవండి: 1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం!
Comments
Please login to add a commentAdd a comment