FPI
-
ఇక్కడి లాభాలు అక్కడికి.. ఎఫ్ఐఐల తీరుపై ఉదయ్‌కోటక్ స్పందన
భారత స్టాక్ మార్కెట్లో ఇటీవల పెద్దమొత్తంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. రోజూ సుమారు రూ.3,000 కోట్లకు పైగా విక్రయాలు చేస్తున్నారు. ఈ ప్రభావం పెరుగుతుండటంపై కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్‌కోటక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ‘ఛేజింగ్ గ్రోత్ 2025 ఇన్వెస్టర్ ఈవెంట్’లో ఆయన మాట్లాడారు. స్టాక్ మార్కెట్లో నిరంతరం పెట్టుబడి పెడుతున్న దేశీయ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఎఫ్ఐఐలు ఎలా ప్రయోజనం పొందుతున్నారో వివరించారు.‘భారత్‌లో స్టాక్ వాల్యుయేషన్లు పెరగడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను ఉపసంహరించడం అధికమైంది. దేశం అంతటా రిటైలర్లు రోజూ ఈక్విటీల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఇది దేశీయ సంస్థాగత ప్రవాహాలకు సాయపడుతుంది. అయితే, ఎఫ్ఐఐలు లాభాలు సంపాదించడానికి కూడా ఇదే కారణమవుతుంది. భారత మార్కెట్లో వారు లాభాలు గడించి ఇతర ప్రపంచ మార్కెట్లకు వాటిని తరలిస్తున్నారు. యూఎస్ డాలర్ బలపడుతుండడంతో ఎఫ్ఐఐలు భారతదేశం సహా వర్ధమాన మార్కెట్ల నుంచి మూలధనాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ప్రస్తుతం 4.5 శాతానికి పైగా ఉన్న అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం కూడా భారత మార్కెట్లు కుప్పకూలడానికి కారణం’ అని చెప్పారు.ఇదీ చదవండి: తేమ నుంచి తాగునీటి ఉత్పత్తికి ఏర్పాట్లు చేసిన ఐసీఐసీఐ బ్యాంక్ఇప్పటికే ఎఫ్ఐఐలు, ఎఫ్‌డీఐలు భారత్‌లోని చాలా కంపెనీల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకున్నాయని కోటక్ తెలిపారు. అధిక వాల్యుయేషన్ల కారణంగా వర్ల్‌పూల్, హ్యుందాయ్ వంటి కంపెనీలు భారత్‌లో తమ హోల్డింగ్స్‌ను తగ్గించుకున్నాయని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఈ ఉపసంహరణ తంతు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇది మరింతగా పెరిగితే ఆర్బీఐ తన రిజర్వ్‌లను అధికంగా ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు. లేదా రూపాయి బలహీనపడే ప్రమాదం ఉందని అంచనా వేశారు. -
బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలు
అధికమొత్తంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2025 ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74% నుంచి 100%కు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ మార్పు చాలా బీమా రంగంలో అవసరమైన మూలధనం సమకూరుతుందని, పోటీని పెంచుతుందని, దేశవ్యాప్తంగా బీమా వ్యాప్తిని మెరుగుపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.ఈ చర్య 2047 నాటికి ‘అందరికీ బీమా’ అనే ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలు, షరతులను సమీక్షించి కేంద్రం వాటిని సరళీకృతం చేయనుంది. ఎఫ్‌డీఐ పరిమితిని పెంచడం వల్ల మరిన్ని గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఆకర్షించడం, పోటీని పెంచడం, కొత్త మార్కెట్‌ను తీసుకురానున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ సంస్కరణ బీమా సంస్థలు ఒకే విధానంతో తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి, కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించడానికి అనుమతిస్తుంది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్.. వంటి ప్రధాన బీమా కంపెనీల షేర్లు ఈ ప్రకటన తర్వాత భారీగా లాభపడ్డాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రపంచ స్థాయి నైపుణ్యాలు, వనరులను తీసుకువచ్చేందుకు, మెరుగైన రిస్క్ మేనేజ్మెంట్కు దోహదం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
మళ్లీ డబ్బు పెడుతున్న ఎఫ్‌పీఐలు
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీరేట్లను మరింత తగ్గించనుందనే అంచనాలతో భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను పెంచుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారీగా అమ్మకాలు చేసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) రెండు వారాలుగా తిరిగి ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌ను పెంచుతున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.డిసెంబరు మొదటి రెండు వారాల్లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.22,766 కోట్లను భారతీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. నవంబర్‌లో వీరు రూ.21,612 కోట్లు, అక్టోబర్‌లో భారీగా రూ.94,017 కోట్లను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు సెప్టెంబరులో ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్మెంట్ తొమ్మిది నెలల గరిష్టానికి చేరడం విశేషం. ఆ నెలలో నికర పెట్టుబడి రూ.57,724 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: క్లెయిమ్ చేసుకోని నిధులు రూ.880 కోట్లుఎఫ్పీఐలు పెరగడానికిగల కారణాలు..అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతపై అంచనాలు: ఇప్పటికే ఫెడ్ వడ్డీరేట్లను దాదాపు 50 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. డిసెంబర్ 19న విడుదలయ్యే ఫెడ్ సమావేశంలో మరో 25 బేసిస్ పాయింట్లను తగ్గించనున్నట్లు అంచనా వేస్తున్నారు. దాంతో ఇతర ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లను మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.మార్కెట్ సెంటిమెంట్: సానుకూల రాజకీయ పరిణామాలు, కార్పొరేట్ ఆదాయాల్లో రికవరీ, ప్రైమరీ, సెకండరీ మార్కెట్లలో పెరిగిన పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచాయి.సీఆర్ఆర్ తగ్గింపు: క్యాష్ రిజర్వ్ రేషియో(సీఆర్ఆర్) తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం వల్ల మార్కెట్లో లిక్విడిటీ, సెంటిమెంట్ మెరుగుపడనుంది.ద్రవ్యోల్బణం తగ్గుదల: భారత వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 6.21 శాతం నుంచి నవంబర్‌లో 5.48 శాతానికి తగ్గింది. ఇది ఆర్బీఐ ద్రవ్య విధాన సడలింపుపై ఆశలను పెంచింది.చైనా మార్కెట్లలో అనిశ్చితి: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చైనా వస్తువులపై ప్రతిపాదిత సుంకాల పెంపు అంచనాలు భారతీయ ఈక్విటీలకు పాజిటివ్‌గా నిలుస్తున్నాయి. -
రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి!
స్టాక్ మార్కెట్లో మదుపర్లు శుక్రవారం ప్రారంభ సమయం నుంచి తమ షేర్లను భారీగా విక్రయిస్తున్నారు. దాంతో ఉదయం 11.45 సమయం వరకు సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా పడిపోయింది. గత సెషన్ ముగింపు వరకు మార్కెట్ విలువ మొత్తంగా రూ.458 లక్షల కోట్లు ఉండగా, ఈరోజు సూచీలు నేల చూపులు చూస్తుండడంతో పెట్టుబడిదారుల సంపద రూ.4 లక్షల కోట్లు తగ్గి రూ.454 లక్షల కోట్లకు చేరుకుంది. నిఫ్టీ 368 పాయింట్లు జారి 24,180 వద్దకు పడిపోయింది.స్టాక్ మార్కెట్ పతనానికిగల కారణాలు..విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలు: ఎఫ్ఐఐలు నిన్నటి మార్కెట్ సెషన్లో రూ.3,560 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించారు. ఇటీవల కాలంలో కొంత తక్కువ మొత్తంలో అమ్మకాలు చేసిన ఎఫ్ఐఐలు తిరిగి భారీగా విక్రయాలకు పూనుకోవడం మార్కెట్ నెగెటివ్‌గా పరిగణించింది.బలహీనమైన రూపాయి: రూపాయి జీవితకాల కనిష్టాన్ని తాకింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 84.83కు చేరింది. ఇది ఇన్వెస్టర్ల ఆందోళనలను మరింత పెంచింది.గ్లోబల్ మార్కెట్ బలహీనత: అమెరికా, యూరప్, జపాన్, చైనా మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. వాటి ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై పడినట్లు నిపుణులు చెబుతున్నారు.రంగాలవారీ క్షీణత: బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఐటీ వంటి రంగాలకు సంబంధించి మార్కెట్లో అధిక వాటాలున్న ప్రధాన షేర్లు భారీగా పతనమయ్యాయి.పారిశ్రామికోత్పత్తి సూచీ: పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఈసారి భారీగా కొలుకుంటుందని మార్కెట్ ఊహించింది. అయితే, ఈ సూచీ గతంలో కంటే కోలుకున్నా కాస్త నెమ్మదించింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.ఇదీ చదవండి: బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్డీఏఐరిలయన్స్ షేర్లు ఢమాల్..నిఫ్టీలో దాదాపు 10 శాతం వాటాను కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఈ వారంలో భారీగా క్షీణించింది. గడిచిన ఐదు సెషన్‌ల్లో 4.47 శాతం, అదే ఆరునెలల్లో 14.55 శాతం పడిపోయింది. అందుకుగల కారణాలను మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ రిటైల్, ఆయిల్-టు-కెమికల్స్ (ఓ2సీ) సెగ్మెంట్లు ఊహించిన దానికంటే బలహీనమైన పనితీరును కనబరిచినట్లు నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను పెంచుకోవడం కాస్తా నెమ్మదించింది. అంతకుముందు వీటి సంఖ్యను గణనీయంగా పెంచుతామని కంపెనీ పేర్కొంది. దానికితోడు ఏడాది కాలంలో పుంజుకున్న మార్కెట్లో క్రమంగా లాభాల స్వీకరణ పెరుగుతోంది. రిలయన్స్ వంటి కంపెనీల్లో ఎఫ్ఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగానే పెట్టుబడి పెట్టారు. వీరిలో చాలామంది ఇటీవల ప్రాఫిట్బుక్ చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. -
ట్రిలియన్ డాలర్లకు ఎఫ్‌డీఐలు
న్యూఢిల్లీ: గత దశాబ్ద కాలానికిపైగా విదేశీ పెట్టుబడులకు భారత్ కీలకంగా నిలుస్తోంది. దీంతో భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) భారీగా తరలివస్తున్నాయి. 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ వరకూ చూస్తే ఎఫ్‌డీఐలు ట్రిలియన్ డాలర్లను అధిగమించాయి. వెరసి ప్రపంచవ్యాప్తంగా రక్షణాత్మక కీలక పెట్టుబడుల ప్రాంతంగా భారత్ నిలుస్తోంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) గణాంకాల ప్రకారం విదేశీ పెట్టుబడులలో భారత్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఫలితంగా ఈక్విటీలు, ఆర్జనతోపాటు ఇతర మూలధనాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేయడం తదితరాల ద్వారా భారత్ ఆకట్టుకున్న ఎఫ్‌డీఐలు 1,033.4 బిలియన్ డాలర్లను తాకాయి. మారిషన్ కీలకం మొత్తం ఎఫ్‌డీఐలలో 25 శాతం మారిషస్ నుంచి లభించగా.. 24 శాతంతో తదుపరి సింగపూర్ నిలిచింది. ఈ బాటలో యూఎస్ వాటా 10 శాతంకాగా.. నెదర్లాండ్స్ 7 శాతం, జపాన్ 6 శాతం, యూకే 5 శాతం, యూఏఈ 3 శాతం, కేమన్ ఐలాండ్స్, జర్మనీ, సైప్రస్ 2 శాతం చొప్పున తదుపరి ర్యాంకులను ఆక్రమించాయి. విలువపరంగా బిలియన్ డాలర్లలో మారిషన్ వాటా 177.18కాగా.. సింగపూర్ 167.47, యూఎస్ 67.8గా నమోదయ్యాయి. విదేశీ పెట్టుబడులను ఆకట్టుకున్న ప్రధాన రంగాలలో సరీ్వసెస్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ఆటోమొబైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్ నిలిచాయి. 2014 నుంచి స్పీడ్ వాణిజ్య శాఖ వివరాల ప్రకారం 2014 నుంచి పదేళ్లలో భారత్‌కు మొత్తం 667.4 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు తరలివచ్చాయి. అంతక్రితం దశాబ్ద కాలం(2004–2014)లో నమోదైన విదేశీ పెట్టుబడులతో పోలిస్తే ఇవి 119 శాతం అధికం. 2014–24 కాలంలో తయారీ రంగంలోకి తరలి వచి్చన ఈక్విటీ పెట్టుబడులు 165.1 బిలియన్ డాలర్లు. ఇది అంతక్రితం పదేళ్లలో నమోదైన 97.7 బిలియన్ డాలర్లతో పోలిస్తే 69 శాతం వృద్ధి. పెట్టుబడిదారుల సానుకూల దేశంగా నిలవడం ద్వారా భారత్ విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. సంబంధిత వర్గాలతో చర్చలు, సమావేశాల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎఫ్‌డీఐ విధానాలను సవరిస్తోంది. ఇది సానుకూల అంశంగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2025లోనూ వచ్చే కేలండర్ ఏడాది(2025)లోనూ భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలి వచ్చే అవకాశముంది. ఇందుకు పటిష్ట స్థూల ఆర్థిక గణాంకాలు, పారిశ్రామికోత్పత్తి బలిమి, పీఎల్ఐ పథకాలు ప్రభావం చూపనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లున్నప్పటికీ విదేశీ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ ప్రాంతంగా నిలుస్తున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. అయితే యూఎస్‌లో విధానాల సవరణ, చైనా ఆర్థిక వ్యవస్థ పురోగతికి మద్దతుగా సహాయక ప్యాకేజీలు వంటి అంశాల కారణంగా భారత్‌కు ఎఫ్‌డీఐల రాక మందగించే వీలున్నట్లు డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త ఆర్.మజుందార్ అభిప్రాయపడ్డారు. కాగా.. ప్రస్తుతం కొన్ని రంగాలలో ఎఫ్‌డీఐలపై నిషేధం అమలవుతోంది. లాటరీ, గ్యాంబ్లింగ్, చిట్ పండ్స్, నిధి కంపెనీ, సిగార్ల తయారీ, పొగాకుతో తయారయ్యే సిగరెట్లు తదితర విభాగాలలో విదేశీ పెట్టుబడులను అనుమతించడంలేదు. -
పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి అర్ధభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా ఎగిశాయి. ఏప్రిల్–సెప్టెంబర్‌లో 29.79 బిలియన్ డాలర్ల(రూ.2.4 లక్షల కోట్లు)ను తాకాయి.ప్రధానంగా సర్వీసులు, కంప్యూటర్, టెలికం, ఫార్మా రంగాలకు పెట్టుబడులు పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో 20.5 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు మాత్రమే లభించాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో ఎఫ్‌డీఐలు 43 శాతం వృద్ధితో 13.6 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది క్యూ2లో కేవలం 9.52 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు తరలి వచ్చాయి. ఇక ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో మరింత అధికంగా 48 శాతం అధికంగా 16.17 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఈక్విటీ పెట్టుబడులుసహా మొత్తం ఎఫ్‌డీఐలు 28 శాతం పెరిగి 42.1 బిలియన్ డాలర్లను తాకాయి. గతేడాది తొలి 6 నెలల్లో ఇవి 33.12 బిలియన్ డాలర్లు మాత్రమే.ఇదీ చదవండి: 1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం! -
క్షీణిస్తున్న ఫారెక్స్ నిల్వలు.. కారణాలు
భారత విదేశీ మారక నిల్వలు(ఫారెక్స్ రిజర్వ్‌లు) భారీగా క్షీణిస్తున్నాయి. నవంబరు 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 17.76 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.44 లక్షల కోట్లు) తగ్గి 657.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.55.31 లక్షల కోట్ల)కు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. అంతకుముందు ఇవి 6.477 బిలియన్ డాలర్లు క్షీణించి 675.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అందుకు అంతర్జాతీయంగా కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.యూఎస్ డాలర్ పెరుగుదల: అమెరికా ఎన్నికల ప్రచార సమయం వరకు స్థిరంగా కదలాడిన డాలర్, ఫలితాల తర్వాత ఊపందుకుంది. దాంతో రూపాయి విలువ పడిపోయింది. ఫలితంగా దేశీయ పారెక్స్ నిల్వలు తగ్గిపోతున్నాయి.పెరుగుతున్న దిగుమతులు: దేశీయ దిగుమతులు అధికమవుతున్నాయి. విదేశీ వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఆయా ఉత్పత్తులకు డాలర్లలోనే చెల్లించాలి.ఆర్బీఐ: మార్కెట్ ఒత్తిళ్ల మధ్య రూపాయికి మద్దతుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలను విక్రయిస్తోంది. రూపాయి మరింత పడిపోకుండా చర్యలు తీసుకుంటోంది. డాలర్-రూపీ మార్కెట్ అస్థిరతను తగ్గించడానికి ఇది దోహదపడుతోంది.ఇదీ చదవండి: అదానీ కంపెనీల రేటింగ్ తగ్గింపువిదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాలు: విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్స్, బాండ్లను విక్రయించడంతో స్థానిక ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. నవంబర్‌లో ఇప్పటి వరకు దాదాపు 4 బిలియన్ డాలర్ల(రూ.33 వేలకోట్లు)కు పైగా అమ్మకాలు చేపట్టారు.ఫెడరల్ రిజర్వ్ విధానాలు: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఇటీవల కాలంలో కీలక వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో భారత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన విదేశీ పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను ఉపసంహరిస్తున్నారు. -
జాగ్రత్త.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్!
ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (ఎఫ్‌పీఐ) విషయంలో అప్రమత్తంగా ఉండాలని క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎఫ్‌పీఐ మార్గం ద్వారా స్టాక్ మార్కెట్ యాక్సెస్‌ను సులభతరం చేస్తామంటూ మోసగిస్తున్న ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎఫ్‌పీఐలతో తమకు అనుబంధం ఉందని, ఎఫ్‌పీఐ లేదా సంస్థాగత ఖాతాల ద్వారా ట్రేడింగ్ అవకాశాలు కల్పిస్తామని కొన్ని మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్లను మభ్యపెడుతున్నాయని సెబీకి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ సెబీ ఈ హెచ్చరిక ప్రకటన విడుదల చేసింది. మోసగిస్తున్నారిలా.. స్టాక్ మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు, సెమినార్లు, మెంటర్షిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా మోసగాళ్లు బాధితులను ప్రలోభపెడుతున్నారని, ఇందుకోసం వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు లైవ్ బ్రాడ్క్యాస్ట్ను ఉపయోగిస్తున్నారని సెబీ పేర్కొంది. సెబీ నమోదిత ఎఫ్‌పీఐలకు చెందిన ఉద్యోగులు లేదా అనుబంధ సంస్థలుగా చెప్పుకొంటూ షేర్ల కొనుగోలు, ఐపీఓలకు సబ్స్క్రయిబ్ కోసం బాధితులతో యాప్‌లను డౌన్లోడ్ చేయిస్తున్నారని సెబీ తెలిపింది. ఇలాంటి మోసాలు చేయడానికి తప్పుడు పేర్లతో నమోదైన మొబైల్ నంబర్లను ఉపయోగిస్తాస్తున్నారని వెల్లడించింది. నిబంధనల ప్రకారం.. దేశంలో నివసిస్తున్న పౌరులకు ఎఫ్‌పీఐ పెట్టుబడి మార్గం అందుబాటులో ఉండదు. అయితే దీనికి కొన్ని పరిమిత మినహాయింపులు ఉంటాయి. -
అదానీకి ఊరట..
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ర్యాలీ విషయంలో నియంత్రణలపరమైన వైఫల్యమేమీ లేదని సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ పేర్కొంది. అయితే, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక రావడానికి ముందే అదానీ స్టాక్స్‌లో షార్ట్ బిల్డప్ జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. రిపోర్టు వెల్లడై, షేర్లు కుప్పకూలిన తర్వాత ట్రేడర్లు పొజిషన్లు స్క్వేర్ ఆఫ్ చేసి, లాభపడ్డారని వివరించింది. ఆరు సంస్థలు అనుమానాస్పద ట్రేడింగ్ నిర్వహించాయని.. వాటిలో నాలుగు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) కాగా, ఒకటి కార్పొరేట్ సంస్థ, మరొక వ్యక్తి ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ప్రస్తావిస్తూ పేర్కొంది. ‘మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇచ్చిన వివరణ, డేటా ప్రకారం నియంత్రణ వైఫల్యాల వల్ల షేర్ల ధరల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలను ధ్రువీకరించలేము‘ అని సుప్రీం కోర్టుకు ఇచ్చిన 173 పేజీల నివేదికలో కమిటీ తెలిపింది. అలాగే, పరస్పర సంబంధమున్న వర్గాల మధ్య లావాదేవీల్లోనూ, కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనల విషయంలోనూ సెబీ విఫలమైనట్లు చెప్పలేమని కమిటీ వివరించింది. సందేహాస్పద విదేశీ సంస్థల నుంచి అదానీ సంస్థల్లోకి నిధులు వచ్చాయన్న ఆరోపణలపై సెబీ 2020 నుంచి చేస్తున్న విచారణలో నిర్దిష్టంగా ఏమీ తేలలేదని కమిటీ తెలిపింది. ఈ నివేదికే తుది తీర్పు కాకపోయినప్పటికీ అదానీ సామ్రాజ్యానికి కాస్త ఊరట మాత్రం కలిగించేదేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదానీ గ్రూప్ ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ సంస్థల షేర్లు కుప్పకూలాయి. ఈ వ్యవహారంపై అటు సెబీ తన వంతుగా దర్యాప్తు చేస్తుండగా, సుప్రీంకోర్టు కూడా సమాంతరంగా ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏఎం సాప్రే సారథ్యంలోని ఈ కమిటీలో కేవీ కామత్, ఓపీ భట్, నందన్ నీలేకని వంటి దిగ్గజాలు ఉన్నారు. స్టాక్స్ రయ్.. కమిటీ నివేదికతో శుక్రవారం అదానీ గ్రూప్ స్టాక్స్‌కు ఊతం లభించింది. గ్రూప్‌లోని 10 స్టాక్స్ 1.2 శాతం నుంచి 7 శాతం వరకు పెరిగాయి. అదానీ విల్మర్ 6.85%, అదానీ పవర్ 4.93%, అదానీ ట్రాన్స్మిషన్ 4.62%, అదానీ గ్రీన్ ఎనర్జీ 4.18%, అదానీ ఎంటర్ప్రైజెస్.. అదానీ పోర్ట్స్ చెరి 3.65 శాతం, ఎన్డీటీవీ 3.53%, అదానీ టోటల్ గ్యాస్ 3.05% లాభపడ్డాయి. అంబుజా సిమెంట్స్, ఏసీసీ చెరి 1 శాతం లాభపడ్డాయి. -
రూ. 88 వేల కోట్లకు పీ-నోట్స్ పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్ల వేల్యుయేషన్లు గరిష్ట స్థాయిల్లో తిరుగాడుతున్న నేపథ్యంలో పార్టిసిపేటరీ నోట్స్ (పీ-నోట్స్) రూపంలో వచ్చే పెట్టుబడుల విలువ ఫిబ్రవరిలో రూ. 88,398 కోట్లకు పరిమితమైంది. జనవరిలో ఇవి రూ. 91,469 కోట్లుగా నవెదయ్యాయి. పీ-నోట్ల పెట్టుబడులు తగ్గడం ఇది వరుసగా మూడో నెల. నేరుగా రిజిస్టర్ చేసుకోకుండా భారత వర్కెట్లలో ఇన్వెస్ట్ చేయదల్చుకునే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) పీ-నోట్స్ ద్వారా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్లో పీ-నోట్ల పెట్టుబడుల విలువ ర. 96,292 కోట్లుగా, నవంబర్‌లో ర. 99,335 కోట్లుగా, అక్టోబర్‌లో రూ. 97,784 కోట్లుగాను ఉన్నాయి. ఇతర వర్ధవన మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్ ఖరీదైనదిగా ఉంటోందని ఎఫ్‌పీఐలు భావిస్తున్నారని నిపుణులు తెలిపారు. భారత్‌లో లాభాలు బుక్ చేసుకుని, ఇతరత్రా చౌక మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయ్యాలనే ఆచనతో వారు ఉన్నట్లు వివరించారు. పీ-నోట్ల రపంలో ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వచ్చిన పెట్టుబడుల్లో ర. 78,427 కోట్లు ఈక్విటీల్లోనూ, రూ. 9,851 కోట్లు డెట్‌లోన, రూ. 119 కోట్లు హైబ్రిడ్ సెక్యరిటీల్లోను ఉన్నాయి. -
ఎఫ్‌పీఐలకు కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: సమాచార వెల్లడి అంశంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీలు) నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సవరించింది. ఎఫ్‌పీఐల నిర్మాణం(స్ట్రక్చర్), యాజమాన్యం(కామన్ ఓనర్షిప్) తదితర అంశాలలో ప్రస్తావించదగ్గ మార్పులు ఉంటే 7 పని దినాలలోగా తెలియజేయవలసి ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా రిజిస్టర్కాదలచిన ఎఫ్‌పీఐల విషయంలో అవసరాన్నిబట్టి అదనపు డాక్యుమెంట్లను దాఖలు చేయవలసిందిగా సెబీ ఆదేశించనుంది. తాజా మార్గదర్శకాలతో సెబీ నోటిఫికేషన్‌ను జారీ చేయడంతో ఈ నెల 14 నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తద్వారా నిబంధనలను మరింత పటిష్ట పరచింది. వెరసి స్ట్రక్చర్, యాజమాన్య నియంత్రణ తదితర అంశాలలో అక్రమ లేదా తప్పుదారి పట్టించే మార్పులు చోటుచేసుకుంటే సెబీతోపాటు, తత్సంబంధిత డిపాజిటరీకు ఏడు పనిదినాలలోగా వివరాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఇదేవిధంగా విదేశీ నియంత్రణ సంస్థలు ఏవైనా చర్యలు తీసుకుంటున్నా నిర్ణత గడువులోగా వెల్లడించవలసి ఉంటుంది. జరిమానాలు, దర్యాప్తులు, పెండింగ్ కార్యాచరణ తదితర అంశాలుంటే వారం రోజుల్లోగా తెలియజేయాలి. ఎఫ్‌పీఐ లేదా ఇన్వెస్టర్ గ్రూప్ యాజమాన్య నియంత్రణ, స్ట్రక్చర్ అంశాలలో ప్రత్యక్ష లేదా పరోక్ష మార్పులు చోటు చేసుకుంటే తాజా నిబంధనలు వర్తిస్తాయి. ఇదేవిధంగా డిపాజిటరీ పార్టిసిపెంట్లు ఈ సమాచారాన్ని సెబీకి రెండు రోజుల్లోగా వెల్లడించవలసి ఉంటుంది. -
ఎఫ్‌పీఐల దూకుడు, ఈక్విటీలలో భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా దేశీ ఈక్విటీలలో అమ్మకాలకే కట్టుబడుతున్న విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నవంబర్‌లో మాత్రం కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్నారు. వెరసి దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 36,329 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు స్పీడు తగ్గవచ్చన్న అంచనాలు, నీరసించిన చమురు ధరలు, ద్రవ్యోల్బణం ఇందుకు కారణమైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల డాలరు ఇండెక్స్‌తోపాటు ట్రెజరీ ఈల్డ్స్ మందగించడం, దేశీ ఆర్థిక పురోగతిపై ఆశావహ అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. సెపె్టంబర్, అక్టోబర్ తదుపరి గత నెల నుంచి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న ఎఫ్‌పీఐలు డిసెంబర్‌లోనూ పెట్టుబడులకే ప్రాధాన్యమివ్వడం గమనార్హం! దీంతో ఇకపై ఈ నెలలో మరిన్ని విదేశీ పెట్టుబడులకు వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గత వారానికల్లా మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలకు చేరడంతో సమీప కాలంలో కొంతమేర లాభాల స్వీకరణకు అవకాశమున్నదని, వేల్యూ స్టాక్స్‌వైపు దృష్టి సారించవచ్చని అరిహంత్ క్యాపిటల్ నిపుణులు అనితా గాంధీ, జియోజిత్ ఫైనాన్షియల్ విశ్లేషకులు వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. సెపె్టంబర్, అక్టోబర్‌లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 7,632 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. చదవండి అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ! -
ఈక్విటీల్లో తగ్గుతున్న ఎఫ్‌పీఐల వాటా
న్యూఢిల్లీ: భారత ఈక్విటీల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మార్చి త్రైమాసికంలో పలుచబడింది. ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు కలిగి ఉన్న వాటాల విలువ మార్చి త్రైమాసికం చివరికి 612 బిలియన్ డాలర్లకు (రూ.47.12 లక్షల కోట్లు) పరిమితమైంది. 2021 డిసెంబర్ చివరికి ఉన్న ఎఫ్‌పీఐల ఈక్విటీ పెట్టుబడుల విలువ 654 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే 6 శాతం తగ్గినట్టు మార్నింగ్ స్టార్ నివేదిక వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో నిరాటంకంగా విక్రయాలు చేస్తుండడం తెలిసిందే. వారి వాటాల విలువ తగ్గిపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఇక 2021 మార్చి నాటికి ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ 552 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈక్విటీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మొత్తం విలువ)లో ఎఫ్‌పీఐల వాటా విలువ పరంగా 18.3 శాతం నుంచి 17.8 శాతానికి తగ్గింది. మన దేశ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు ఎక్కువగా ఆఫ్‌షోర్ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడులను హోల్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆఫ్‌షోర్ ఇన్సూరెన్స్ కంపెనీలు, హెడ్జ్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్ రూపంలో ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో పెట్టుబడులు కలిగి ఉన్నారు. విక్రయాలు.. మార్నింగ్‌స్టార్ నివేదిక పరిశీలిస్తే.. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల్లో నికర అమ్మకందారులుగా ఉన్నారు. 14.59 బిలియన్ డాలర్ల మేర (రూ.1.13 లక్షల కోట్లు) అమ్మకాలు చేశారు. జనవరిలో 4.46 బిలియన్ డాలర్లు, ఫిబ్రవరిలో 4.74 బిలియన్ డాలర్లు, మార్చిలో 5.38 బిలియన్ డాలర్ల చొప్పున విక్రయాలు చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోవడంతో విదేశీ ఇన్వెస్టర్ల ధోరణిలో మార్పు వచ్చింది. ఈక్విటీల్లో రిస్క్ తీసుకునే ధోరణి తగ్గడంతో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొందని మార్నింగ్ స్టార్ నివేదిక తెలిపింది. ‘‘త్వరలోనే వడ్డీ రేట్లు పెంచుతానంటూ యూఎస్ ఫెడ్ చేసిన ప్రకటనతో మార్చి త్రైమాసికం ఆరంభంలోనే సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీంతో ఖరీదైన వ్యాల్యూషన్ల వద్ద ట్రేడవుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడాన్ని విదేశీ ఇన్వెస్టర్లు వేగవంతం చేశారు’’ అని మార్నింగ్ స్టార్ పేర్కొంది. ఆదుకున్న ఫండ్స్.. దేశీయంగా వృద్ధి ఆధారిత బడ్జెట్, కరోనా మూడో విడత సాధారణంగా ఉండడం కొంత ఉపశమనాన్ని ఇచ్చినట్టు మార్నింగ్ స్టార్ నివేదిక తెలియజేసింది. విక్రయాల ఒత్తిడి కొద్దిగా తగ్గేలా సాయపడ్డాయి. దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఇనిస్టిట్యూషన్స్ కొనుగోళ్ల ఈక్విటీ మార్కెట్లను చాలా వరకు ఆదుకున్నాయి. సిప్ రూపంలో ప్రతీ నెలా రూ.11వేల కోట్లకుపైనే పెట్టుబడులు వస్తుండడంతో.. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఆకర్షణీయ వ్యాల్యూషన్లకు దిగొస్తున్న కంపెనీల్లో ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపిస్తుండడం గమనార్హం. ప్రతికూలంగా మారిన పరిస్థితులు చమురు ధరలు గణనీయంగా పెరిగిపోవడం, అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం పరిస్థితులు విదేశీ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. అమెరికాలో ఈ పరిస్థితులే రేట్ల పెంపునకు దారితీయడం తెలిసిందే. దీంతో ఎఫ్‌ఫీఐలు భారత ఈక్విటీల్లో పెద్ద మొత్తంలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఉక్రెయిన్‌పై రష్యా ఫిబ్రవరి చివర్లో యుద్ధం మొదలు పెట్టగా.. రష్యాపై పలు దేశాల ఆంక్షలను చూసి ఇన్వెస్టర్లు అమ్మకాలను మరింత పెంచారు. అప్పటి నుంచి అస్సలు కొనుగోళ్ల వైపే వారు ఉండడం లేదు. 2018 తర్వాత ఫెడ్ మొదటిసారి రేట్లను పెంచడం కూడా ప్రతికూల సెంటిమెంట్‌కు దారితీసింది. మరిన్ని విడతలుగా రేట్లను పెంచనున్నట్ట కూడా ఫెడ్ స్పష్టం చేసింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు కొంత పెట్టుబడులను తరలించుకుపోతున్నారు. 2022లో ఇప్పటి వరకు వారు చేసిన విక్రయాలు 18 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సమీప కాలంలోనూ ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో అమ్మకాలు కొనసాగించొచ్చని మార్నింగ్ స్టార్ నివేదిక అంచనా వేసింది. -
ఉక్రెయిన్‌పై రష్యా ఆగని విధ్వంసం! భారత్ నుంచి వేల కోట్లు హుష్ కాకి!
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో దేశీ స్టాక్స్‌లో నికరంగా అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చారు. దీంతో ఏకంగా రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. ఇది దేశీ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అత్యధికంకాగా.. ఇందుకు కోవిడ్–19 కేసులు భారీగా విస్తరించడం, ఆర్థిక రికవరీపై ఆందోళనలు, రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం తదితర ప్రతికూల అంశాలు ప్రభావం చూపాయి. అయితే అంతక్రితం ఏడాది(2020–21) ఇందుకు విరుద్ధమైన రీతిలో ఎఫ్‌పీఐలు ఏకంగా రూ. 2.7 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయడం విశేషం! గతంలో ఇలా.. ఇంతక్రితం 2008–09లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 47,706 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. 2015–16లో రూ. 14,171 కోట్లు, 2018–19లో రూ. 88 కోట్ల విలువైన స్టాక్స్ మాత్రమే విక్రయించారు. గతేడాది అంటే 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చివరకూ ఎఫ్‌పీఐలు దేశీ ఈక్విటీలలో రూ. 1.4 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. గతేడాది 12 నెలల్లో 9 నెలలపాటు అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిచ్చారు. 2021 అక్టోబర్ నుంచి అమ్మకాల తీవ్రత పెరగింది. భవిష్యత్‌లోనూ చమురు ధరల సెగ, ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా ఎఫ్‌పీఐల పెట్టుబడులు వెనక్కి మళ్లే వీలున్నట్లు స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ప్రతికూలతలు.. దేశీ స్టాక్ మార్కెట్లో ఎఫ్‌పీఐల విక్రయాలకు పలు అంశాలు కారణమవుతున్నట్లు మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. వీటిలో కరోనా మహమ్మారి భారీగా విస్తరించడాన్ని ప్రస్తావించారు. అంతవరకూ వేగవంత ఆర్థిక రికవరీపై ఆశలు పెట్టుకున్న ఇన్వెస్టర్లు కేసులు భారీగా పెరగడంతో ఒక్కసారిగా నిరాశకు లోనైనట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో రూ. 12,613 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా.. కేసులు తగ్గి ఆంక్షలు వైదొలగడంతో తిరిగి జూన్‌లో రూ. 17,215 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. మరోపక్క దేశీ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆకట్టుకోవడం, వ్యాక్సినేషన్ పుంజుకోవడం వంటి సానుకూల అంశాలు ఇందుకు తోడ్పాటునిచ్చాయి. ఆపై జూన్, జులైల్లో తిరిగి విక్రయాలకే కట్టుబడగా.. ఆగస్ట్, సెప్టెంబర్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. ఆపై అక్టోబర్ నుంచీ భారీ అమ్మకాలకు తెరతీశారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన పరపతి నిర్ణయాలు, వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు ప్రభావం చూపాయి. భారత మార్కెట్లు ఖరీదే.. దేశీ స్టాక్ మార్కెట్లు ఖరీదుగానే కనిపిస్తున్నట్లు ట్రూ బీకాన్, జిరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అభిప్రాయపడ్డారు. దీంతో ఎఫ్‌పీఐలు చైనాకు ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రీబ్యాలెన్సింగ్‌లో భాగంగా దేశీ స్టాక్స్ విక్రయించడంతోపాటు.. ఇతర అవకాశాలవైపు దృష్టిసారించినట్లు వివరించారు. దేశీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు వెనక్కి మళ్లేందుకు ప్రధానంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ పెంపు సంకేతాలే కారణమని అప్‌సైడ్‌ఏఐ సహవ్యవస్థాపకుడు ఏ.అగర్వాల్ అభిప్రాయపడ్డారు. చమురు ధరల జోరు, రూపాయి బలహీనత, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ భయాలు, మార్కెట్లు ఖరీదుకావడం వంటి పలు అంశాలు సైతం ఎఫ్‌పీఐలపై ఒత్తిడి పెంచుతున్నట్లు ఆయన వివరించారు. -
ఎన్ఎస్డీఎల్: అదానీకి భారీ షాక్
సాక్షి, ముంబై: అదానీ గ్రూప్‌నకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)భారీ షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన మూడు విదేశీ ఫండ్ల ఖాతాలను స్తంభింపజేసింది. నాలుగు అదానీ గ్రూప్ కంపెనీలల రూ.43,500 కోట్ల విలువైన షేర్లను ఫ్రీజ్ చేసింది. డిపాజిటరీ వెబ్సైట్ ప్రకారం అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్,క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ఫండ్ ఖాతాలుమే 31న లేదా అంతకుముందే వీటిని స్తంభింపజేసినట్టు తెలుస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం సరైన సమాచారాన్ని బహిరంగ పరచడంలో ఈ 3 కంపెనీలు విఫలమైనట్టు తెలుస్తోంది. నిబంధనలు పాటించడంలో విఫలమైతే ఖాతాలను స్తంభింపజేయవచ్చు. దీంతో ఈ ఫండ్స్ ఇప్పటికే ఉన్న సెక్యూరిటీలలో దేనినీ విక్రయించలేవు లేదా కొత్త సెక్యూరిటీలను కొనలేవు. అదానీ గ్రూప్‌లో ఆరు లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. మారిషస్‌కు చెందిన మూడుకంపెనీలు అదానీ ఎంటర్ ప్రైజెస్ 6.82 శాతం, అదానీ ట్రాన్మిషన్ 8.03 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 5.92 శాతం, అదానీ గ్రీన్ 3.58 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. అదానీ గ్రూప్ గత ఏడాదిలో 200శాతం నుంచి 1,000 శాతం మధ్య లాభపడింది. అయితే దీనిపై అదానీ గ్రూప్ ఇంకా స్పందించలేదు. తాజా వార్తతో స్టాక్మార్కెట్లో అదానీ గ్రూపు షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అదానీ ఎంటర్ప్రైజెస్ 25 శాతం క్షీణించి ఇంట్రాడే కనిష్టానికి 1,201.10 డాలర్లకు చేరుకుంది.దీంతో సంస్థ మార్కెట్ క్యాప్ 1,40,500.74 కోట్లకు పడిపోయింది. అదానీ పోర్టు 19 శాతం క్షీణించి, ఇంట్రాడే కనిష్టానికి 681.50 రూపాయలకు చేరుకుంది. సంస్థ మార్కెట్ క్యాప్ 1,46,444.65 రూపాయలకు పడిపోయింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ , అదానీ ట్రాన్స్మిషన్ 5 శాతం పతనమై లోయర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి. చదవండి: stockmarket: అదానీ షాక్, భారీ నష్టాలు -
ఫిబ్రవరిలో ఎఫ్‌పిఐ పెట్టుబడులు వెల్లువ
భారత మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) ఫిబ్రవరిలో ఇప్పటి వరకు రూ.24,965 కోట్లు పెట్టుబడి పెట్టారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ పై ఆశావాదం, దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం వంటి కారణంగా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది. డిపాజిటరీస్ డేటా గణాంకాల ప్రకారం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ (ఎఫ్‌పిఐ) భారతీయ ఈక్విటీల్లోకి రూ.24,204 కోట్లు, రుణ విభాగంలోకి రూ.761 కోట్లు పెట్టుబడులుగా వెళ్లినట్లు తెలిపింది. గత నెలలో ఎఫ్‌పిఐలు ద్వారా నికరంగా రూ.14,649 కోట్లు భారత్‌కు వచ్చాయి. 2021లో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసినందున ఎఫ్‌పిఐలు భారత మార్కెట్లపై సానుకూలంగా ఉన్నాయని ఎల్కెపి సెక్యూరిటీల పరిశోధన విభాగాధిపతి ఎస్. రంగనాథన్ తెలిపారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి రేటు అంచనాలపై సానుకూలంగా ఉండడంతో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఫిబ్రవరిలోనూ కొనసాగుతున్నాయని గ్రో సంస్థ సీవోవో హర్ష జైన్ తెలిపారు. ఒక అంతర్జాతీయ ఏజెన్సీ భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 2022లో 11.5 శాతంగా ఉంటుంది అని అంచనా వేసింది. గతంలో పేర్కొన్న8.8 శాతం వృద్ధి రేటు అంచనాను సవరించింది. దీనితో కరోనావైరస్ మహమ్మారి మధ్య రెండంకెల వృద్ధిని నమోదు చేసిన ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారతదేశం నిలవనుంది. చదవండి: పెట్రోల్ ధరలను తగ్గించిన నాలుగు రాష్ట్రాలు! -
బిగ్బుల్ వాటాను తగ్గించుకున్న షేరు ఇదే..!
భారత స్టాక్‌మార్కెట్ బిగ్బుల్, ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అతని సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలాలు తొలి త్రైమాసికంలో అగ్రోటెక్ ఫుడ్స్ షేర్లలో వాటాను తగ్గించుకున్నారు. మార్చి 31 నాటికి ఈ ఇద్దరికి అగ్రోటెక్‌లో 5.75శాతం వాటా ఉండేది. ఈ తొలి త్రైమాసికంలో వారిద్దరూ 1.46లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించడంతో మొత్తం వాటా 5.14శాతానికి దిగివచ్చినట్లు ఎక్చ్సేంజ్‌లు చెబుతున్నాయి. అదేబాటలో ఎఫ్‌ఫీఐలు కూడా... ఇదే కంపెనీలో విదేశీ ఇన్వెస్టర్లు సైతం వాటాలను తగ్గించుకున్నాయి. మార్చి 31లో 8.58శాతంగా ఉన్న ఎఫ్‌పీఐ వాటా... 2020 క్యూ1 నాటికి 8.48 శాతానికి చేరుకుంది. కోచి ఆధారిత ఇన్వెస్టర్ ఈక్యూ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఈకంపెనీలో ఎలాంటి క్రయ, విక్రయాలు జరపలేదు. అలాగే ఏ మ్యూచువల్ ఫండ్ కూడా ఈ క్యూ1లో ఎలాంటి అమ్మకాలుగానీ కొనుగోళ్లు గానీ జరపలేదు. -
ఎఫ్‌పీఐలను మెప్పిస్తున్న ఐటీ షేర్లు
దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ షేర్లపై విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) సానుకూల వైఖరినే కలిగి ఉన్నారు. ఎఫ్‌పీఐలు ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో జరిపిన క్రయ, విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతం అవుతుంది. ఈ క్యూ1లో వారు టీసీఎస్, ఎల్అండ్ టెక్నాలజీస్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ షేర్లకు కొనుగోలు చేశారు. హెచ్‌సీఎల్, విప్రో కంపెనీల షేర్లను విక్రయించారు. అలాగే మైండ్‌ట్రీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఈ కార్లెక్స్ సర్వీసెస్, సోనాటా సాఫ్ట్వేర్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్ కంపెనీల్లో 2శాతం వరకు తమ వాటాలను తగ్గించుకున్నాయి. ఇన్ఫోసిస్‌కు షేర్ల విషయంలో ఎఫ్‌పీఐల వైఖరీ ఎలా ఉందో అనే విషయం నేడు(క్యూ1 ఫలితాలు విడుదల)తెలిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 6.7శాతం లాభపడింది. అయితే బీఎస్ఈలో సెన్సెక్స్ మాత్రం 10.9శాతం నష్టపోయింది. ఇదే క్యూ1లో టీసీఎస్‌లో ఇన్వెస్టర్లు 0.11శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఫలితంగా కంపెనీలో ఎఫ్‌పీఐల మొత్తం వాటా 15.85శాతానికి చేరుకుంది. ఇదే తొలి త్రైమాసికంలో మ్యూచువల్ ఫండ్స్ టీసీఎస్‌లో తమ వాటాను 2.55శాతం నుంచి 2.51శాతానికి తగ్గించుకున్నారు. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ రంగాల్లో ఎఫ్‌పీఐల వాటా జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. లాక్డౌన్ విధింపుతో వ్యవస్థ అంతా స్తంభించుకుపోయింది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా టెక్నాలజీ రంగం మిగతా అన్ని రంగాల కంటే ఎక్కువ లాభపడింది. ఈ అంశం ఇన్వెస్టర్లను ఆకర్షించగలిగింది. క్లౌడ్ కంప్యూటింగ్, నెట్వర్కింగ్లో అవకాశాలు కొంతమందికి కొత్త అవకాశాలను అందించాయి. ఇప్పటివరకు ఐటీ షేర్లు బాగుందని ఇక ముందు ఈ రంగ షేర్ల ఎంపిక పట్ల జాగ్రత అవసరం. యూఎస్ అమెరికా ఆర్థిక వ్యవస్థలు రికవరీకి మరింత సమయం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇది ఐటీ కంపెనీల ఖర్చు, డిమాండ్ ప్రభావితం చేయగలవు.’’ అని ఈక్వినామిక్స్ రీసెర్చ్ ఫౌండ్ జి జొక్కాలింగం తెలిపారు. -
ఎఫ్ఐఐలు వాటాలను తగ్గించుకున్న కంపెనీలు ఇవే..!
గడచిన ఏడాదిలో విదేశీ ఇన్వెస్టర్లు 254 కంపెనీల్లో వాటాలను తగ్గించుకున్నారు. 12నెలల్లో ఏకంగా 8నెలల్లో వారు నికర అమ్మకందారులుగా నిలిచారు. అయితే మొత్తం ప్రతిపాదికన రూ.5వేల కోట్లతో ఎఫ్ఐఐలే నికర కొనుగోలుదారులుగా ఉన్నట్లు ఏస్ ఈక్విటీ గణాంకాలు చెబుతున్నాయి. ఎఫ్ఐఐలు ఫైనాన్షియల్, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్, టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో వాటాను విక్రయించారు. వాల్యూయేషన్ ప్రాతిపదికన, కార్పోరేట్ పాలన సమస్యల దృష్ట్యా, డిమాండ్ పతనం, లేదా లాభాల స్వీకరణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎఫ్ఐఐలు కంపెనీల్లో వాటాలను విక్రయించి ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్ఐఐలు వాటాలను విక్రయించిన 254 కంపెనీల్లో సన్ ఫార్మా, డాబర్ ఇండియా, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్‌లున్నాయి. ఈ మొత్తం 254 కంపెనీల్లో 93 కంపెనీల షేర్లు 50శాతం నష్టాన్ని చవిచూశాయి. పీసీ జూవెలరీస్, ఫ్యూచర్స్ రీటైల్, సద్భావన్ ఇంజనీరింగ్, కాక్స్ అండ్ కింగ్స్, మన్‌పసంద్ బేవరీజెస్, మాగ్మా ఫిన్ కార్ప్, ధావన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు ఉన్నాయి. ‘‘వాల్యూయేషన్ల విస్తరణ, కార్పోరేట్ పాలన బాగోలేకపోవడం, పెరుగుతున్న పోటీ తదితర కారణాల దృష్ట్యా ఎఫ్ఐఐలు కంపెనీల్లో వాటాను తగ్గించుకొని ఉండొచ్చు. కారణలేవైనప్పటికీ.., జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్, నెస్లే ఇండియా, అలెంబిక్ ఫార్మా, సిప్లా, డాబర్ లాంటి బ్లూచిప్ కంపెనీల్లో వాటాలను తగ్గించుకోవడం కొంత ఆందోళలను కలిగించే అంశం.’’ అని ఎస్ఎస్జే ఫైనాన్స్ సీనియర్ విశ్లేకుడు అతీష్ మత్లావాలా తెలిపారు. ఇన్వెస్టర్లు ఏంచేయాలి..? కేవలం ఎఫ్ఐఐలు వాటా విక్రయించారనే ఒకే కారణంతో షేర్లను అమ్మేయం మంచి పద్దతి కాదని విశ్లేషకులు అంటున్నారు. కంపెనీల గత ఆర్థిక ట్రాక్ రికార్డు, ప్రమోటర్ల పనితీరు, బ్యాలెన్స్ షీట్, నగదు ప్రవాహం, వ్యాల్యూయేషన్లు, వృద్ధి అవకాశాలను విశ్లేషించడం చాలా ముఖ్యమని వారు తెలిపారు. కోవిడ్-19 సమయంలో కంపెనీ కనబరిచిన ప్రదర్శన, వచ్చే త్రైమాసికాలకు సంబంధించి యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలు లాంటి అంశాలను స్పష్టంగా అధ్యయనం చేసి పిదప స్టాక్స్‌లో లాభాల స్వీకరణ గానీ, స్టాక్స్ నుంచి పూర్తిగా వైదొలగడం కాని చేయాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా నిపుణులు పర్యవేక్షణలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్ఐఐలు చివరి నాలుగు క్వార్టర్ల నుంచి అనేక చిన్న-మధ్య తరహా కంపెనీల్లో తమ వాటాలను క్రమంగా తగ్గించుకుంటున్నారు. డిమాండ్ మందగించడం, ఆర్థిక వ్యవస్థ క్షీణత ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. చిన్న-మధ్య తరహా స్టాకులు 2018 నుంచి బేర్‌ఫేజ్‌లో ఉన్నాయి. అయితే బెంచ్‌మార్క్ ఇండెక్స్ ఏడాదిలోని బేర్ ఫేజ్‌లోకి ప్రవేశించాయి. -
ఎఫ్ఐఐల రాకతో రూపాయిలో స్థిరత్వం
గత రెండు నెలలుగా భారీ పతనాన్ని చవిచూసిన రూపాయి ఇటీవల సిర్థత్వాన్ని సంతరించుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెసర్లు తిరిగి కొనుగోళ్లు జరపడం ఇందుకు కారణమని ఫారెక్స్ విశ్లేషకులంటున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పతనం, ఫారెక్స్ నిల్వలు వరుసగా 5వారంలోనూ కొత్త జీవితకాల గరిష్టానికి చేరుకోవడం లాంటి అంశాలు రూపాయి స్థిరమైన ట్రేడింగ్‌కు కారణమైనట్లు వారు చెప్పుకొచ్చారు. ఎక్చ్సేంజ్ రేట్ స్థిరత్వం అనేది అంతర్జాతీయ పెట్టుబడిదారులకు అత్యంత కీలకమైన అంశం. మూలధన కేటాయింపు నిర్ణయాలలో ఇది చెప్పుకొదగిన పాత్ర పోషిస్తుంది. లాక్డౌన్ ప్రకటించిన తరువాత, కరెన్సీ ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటలకు వరకే కుదించారు. ‘‘ కొన్ని ప్రత్యేక కారణాల కలయికలు రూపాయి స్థిరమైన రాణింపునకు తోడ్పాటును అందించాయి. అంతర్జాతీయంగా చైనా యువాన్ బలపడటం, డాలర్ ఇండెక్స్ పతనం దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐ ప్రవాహాలు పెరిగేందుకు సహకరించాయి. ఇటీవల పెద్ద కార్పొరేట్ సంస్థలు వాటా అమ్మకాలతో పాటు రైట్స్ ఇష్యూలు, ఎఫ్‌డీఐలు స్థానిక కరెన్సీకి డిమాండ్‌ను పెంచాయి. దీంతో ఎఫ్‌పీఐలు స్థానిక మర్కెట్లలో నిధుల సమీకరణను ప్రారంభించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు రైట్స్ ఇష్యూ, క్యూఐపీల పద్దతిలో 9బిలియన్ డాలర్లను సమీకరించాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెసర్లు రూపాయి ఆధారిత ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి డాలర్లను తీసుకువచ్చారు.’’ అని గ్లోబల్ ట్రేడింగ్ సెంటర్ విశ్లేషకుడు కునాల్ శోభిత తెలిపారు. దాదాపు 2నెలల తర్వాత లాక్డౌన్ సడలింపులతో ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ ఇన్వెస్టర్లు రిస్క్-అసెట్స్‌లైన ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. భారత ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐలు గడచిన 7రోజుల్లో 3బిలియన్ డాలర్ల కొనుగోళ్లు చేశారు. మార్చి నెలలో దాదాపు 7.7బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపారు. ఏప్రిల్‌లో అర బిలియన్ డాలర్లుగానూ ఉన్నాయి. తైవాన్, సౌత్ కొరియా దేశాల ఈక్విటీ మార్కెట్లలో జరిపిన కొనుగోళ్ల కంటే అధికంగా ఉండటం విశేషం. ‘‘కరోనా వైరస్ అంటువ్యాధి భయాందోళనలు క్రమంగా అంతరించిపోతుండటం ఇన్వెసర్లకు కలిసొస్తుంది. త్వరలో వ్యాపారాలు సాధారణ స్థాయికి చేరుకొవచ్చనే ఆశావమన అంచాలు వారిలో నెలకొన్నాయి. వైరస్ వ్యాప్తి కట్టడికి భారత్ తీసుకుంటున్న చర్యలు రూపాయి స్థిరత్వం పొంది డాలర్లను పొందడంలో సహాయపడుతుంది.’’ అని కోటక్ సెక్యూరిటీస్‌లో రూపాయి అనలిస్ట్ హెచ్ అనిక్ద బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఫారెన్ ఎక్చ్సేంజ్ నిల్వలు వరుసగా 5వారం కొత్త గరిష్టానికి చేరుకుంది. మార్చి 29తో ముగిసిన వారంలో మొత్తం 493 బిలియన్ డాలర్ల విలువైన నిల్వలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ డాలర్ల కొనుగోలు చేయడంతో నిల్వలు పెరినట్లు డీలర్లు చెబుతున్నారు. -
90 శాతం కంపెనీల్లో తగ్గిన ఎఫ్ఐఐ వాటా!
నాలుగో త్రైమాసికంలో దాదాపు 90 శాతం నిఫ్టీ కంపెనీల్లో విదేశీ మదుపరులు వాటాలు తగ్గించుకున్నాయి. బడ్జెట్ టెన్షన్స్, కరోనా కలకలం, అంతర్జాతీయ ఉద్రిక్తతలతో ఎఫ్ఐఐలు పోర్టుఫోలియోల్లో అమ్మకాలకు దిగాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ధోరణే కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సంక్షోభాల కారణంగా నిఫ్టీ 500లో విదేశీకంపెనీల వాటా ఐదేళ్ల కనిష్ఠాలకు దిగివచ్చిందని మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. జనవరి, ఫిబ్రవరిల్లో ఒకమోస్తరుగా కొనుగోళ్లు చేసిన ఎఫ్ఐఐలు మార్చిలో ఒక్కమారుగా రూ.1.2 లక్షల కోట్ల విలువైన అమ్మకాలకు దిగారు. దీంతో ఆ నెల సూచీలు భారీ పతనం చవిచూశాయి. మార్చి త్రైమాసికంలో ఎఫ్ఐఐల అమ్మకాలకు వ్యతిరేకంగా డీఐఐలు కొనుగోళ్లకు దిగాయి. ఈ త్రైమాసికంలో ఎఫ్ఐఐలు నిఫ్టీ 50లోని 78 శాతం కంపెనీల్లో వాటాలు పెంచుకున్నాయి. నిఫ్టీ 500 కంపెనీల్లో కూడా డీఐఐలు గణనీయంగా కొనుగోళ్లు జరిపాయి. దీంతో నిఫ్టీ 500లో ఎఫ్ఐఐ- డీఐఐ వాటా నిష్పత్తి మరింత క్షీణించింది. గత ఐదేళ్లలో ఈ నిష్పత్తి 2.2 ఉండగా మార్చిలో 1.4కు దిగివచ్చింది. ఇదే ధోరణి కొనసాగేనా? కరోనా సంక్షోభ భయాలు చల్లారడం ఆధారంగా సూచీల్లో ఎఫ్ఐఐల కొనుగోళ్లు పెరగడం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎకానమీ తిరిగి గాడిన పడడం, అంతర్జాతీయ పరిస్థితులు పాజిటివ్‌గా మారడంపై మార్కెట్ తదుపరి భవితవ్యం ఆధార పడి ఉంటుంది. క్యు2లో ఎకానమీ రికవరీ బాట పడితే ఇండియా వైపు తిరిగి విదేశీ మదుపరులు చూస్తారని నిపుణుల అంచనా. అయితే సమీప భవితవ్యంలో మాత్రం ఎఫ్ఐఐల అమ్మకాలే కొనసాగవచ్చని, మిడ్‌టర్మ్‌కు ఈ అమ్మకాలు నిలిచిపోవచ్చని ఎక్కువమంది భావిస్తున్నారు. పెద్దదేశాలు ప్రకటించిన ఉద్దీపనల కారణంగా పెరిగే లిక్విడిటీ నెమ్మదిగా భారతీయ మార్కెట్లోకి వస్తుందని, అందుకు సమయం పడుతుందని అభిప్రాయపడుతున్నారు. -
కొత్త ఎఫ్‌పీఐలు పెరుగుతున్నాయ్!
దేశీయ మార్కెట్లో బలహీనత కొనసాగుతున్నా, కొత్తగా భారత్‌లో రిజిస్ట్రేషన్‌కు వస్తున్న విదేశీ ఫండ్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఒకపక్క ఉన్న ఎఫ్‌పీఐలు ఇబ్బడిముబ్బడిగా విక్రయాలకు దిగుతున్న సమయంలో కొత్తగా ఎఫ్‌పీఐలు రిజిస్టర్ కావడం పెరిగింది. మార్చి నుంచి ఇప్పటివరకు సెబి వద్ద దాదాపు 200కి పైగా కొత్త ఎఫ్‌పీఐలు రిజిస్టరయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో 70--80 అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. వచ్చే రెండు మూడువారాల్లో వీటికి లైసెన్సులు మంజూరు కావచ్చు. ప్రస్తుతం ఇండియాలో రిజిస్టరయిన ఎఫ్‌ఐఐఉ 9789కి చేరాయి. గతమార్చిలో వీటి సంఖ్య 9533. మరోవైపు మార్చి నుంచ ఇప్పటివరకు ఉన్న ఎఫ్‌పీఐలు దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు జరిపాయి. దీంతో సూచీలు దాదాపు 25 శాతం పతనమయ్యాయి. డెట్‌మార్కెట్లలో విక్రయాలు కూడా కలిపితే దేశీయంగా ఎఫ్ఐఐల విక్రయాలు రూ. 1.43 లక్షల కోట్లకు చేరతాయి. ప్రస్తుతం కొత్తగా రిజిస్టరయితున్న ఎఫ్ఐఐల్లో ఎక్కువ శాతం మిడ్‌సైజ్ ఫండ్స్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫండ్స్ ఎక్కువగా లాంగ్‌టర్మ్ ధృక్పథంతో ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నాయి. దేశీయ మార్కెట్లోకి గతేడాదిలో నెలకు కొత్తగా వచ్చే ఎఫ్ఐఐల సరాసరి సంఖ్య 87 కాగా, ఈ ఏడాది ఇది 114కు చేరిందని డాయిష్‌బ్యాంక్ తెలిపింది. విదేశీ నిధుల నిబంధనలను కొంతమేర సడలించడం, దేశీయ ఎకానమీపై బలమైన నమ్మకం, దీర్ఘకాలిక ధృక్పధంతో కొత్త విదేశీ ఫండ్స్ భారత్‌లోకి వస్తున్నాయని వివరించింది. ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు రాబోయే కాలంలో మంచి ఫలితాలు ఇస్తాయన్న నమ్మకంతో విదేశీ ఫండ్స్ ఇండియాలో రిజిస్టర్ చేసుకుంటున్నాయని ఖైతాన్ అండ్ కో ప్రతినిధి మోయిన్ లధా చెప్పారు. ఇలా రిజిస్టరయిన ఎఫ్‌పీఐల కారణంగా క్రమంగా తిరిగి ఈక్విటీల్లోకి పెట్టుబడులు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. -
భారత్‌లో చైనా ఎఫ్‌పీఐలు ఇవే!
భారత్‌లో దాదాపు 16 చైనా సంస్థలు ఎఫ్‌పీఐ(విదేశీ సంస్థాగత మదుపరి)లుగా నమోదయ్యాయి. వీటిలో ప్రఖ్యాత ఏఐఐబీ(ఆసియన్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్), పీబీఓసీ(పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా), ఎన్ఎస్ఎస్ఎఫ్(నేషనల్ సోషల్ సెక్యూరిటీ ఫండ్)లాంటి దిగ్గజాలున్నాయి. ఇవన్నీ భారత్‌లో శాశ్వత ఎఫ్‌పీఐ రిజిస్ట్రేషన్ పొందాయి. ఇటీవల కాలంలో వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను సెబి రెన్యువల్ చేసిందన్న వార్తలు వస్తున్నాయి. కానీ నిజానికి ఇవన్నీ శాశ్వత ఎఫ్‌పీఐలు, రెన్యువల్ అవసరం లేనివని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇవన్నీ మూడేళ్లకు ఒకసారి నిర్ధేశిత ఫీజులు చెల్లిస్తుంటాయి. ఇందులో సెబికి ఎలాంటి సంబంధం ఉండదు. 2014లో దేశంలో కొత్త ఎఫ్‌పీఐ నిబంధనలు తీసుకువచ్చారు. అప్పటికే రిజిస్టరయిన ఎఫ్ఐఐలు కొత్త నిబంధనల ప్రకారం తిరిగి రిజిస్టర్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఈ చైనా సంస్థలన్నీ శాశ్వత రిజిస్ట్రేషన్ పొందాయి. పైన పేర్కొన్న సంస్థలతో పాటు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, చైనా ఏఎంసీ గ్లోబల్ ఫండ్, సీఐఎఫ్‌ఎం ఏసియా పసిఫిక్ ఫండ్, ఫ్లోరిష్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, మాన్యులైఫ్ టెడా ఫండ్, వీఛీలైలకు చెందిన ఇతర సంస్థలు ఇండియాలో ఎఫ్‌పీఐలుగా రిజిస్టరయ్యాయి. వీటితో పాటు 111 హాంకాంగ్ ంస్థలు, 124 తైవాన్ సంస్థలు ఇండియాలో ఎఫ్‌పీఐ రిజిస్ట్రేషన్ పొందిఉన్నాయి. ఇటీవలి కాలంలో చైనా ఎఫ్‌పీఐలు భారతీయ కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి వీటి పెట్టుబడులు ఇతర దేశాల ఎఫ్‌పీఐలతో పోలిస్తే స్వల్పమేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో అత్యధిక విదేశీ పెట్టుబడులు పెట్టిన జాబితాలో వరుసగా యూఎస్, మారిషస్, సింగపూర్, లగ్సెంబర్గ్, యూకే, ఐర్లాండ్, కెనెడా, జపాన్, నార్వే, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఈ దేశాల ఎఫ్ఐఐల పెట్టుబడులన్నీ కలిపి మొత్తం ఎఫ్ఐఐ పెట్టుబడుల్లో 80 శాతం వరకు ఉంటాయని అంచనా. -
ఎఫ్ఐఐలు అమ్మేస్తున్నాయ్!
దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐలు అమ్మకాలకు దిగాయి. దీంతో సూచీలు భారీగా అమ్మకాల ఒత్తిడి చవిచూస్తున్నాయి. కాస్త పెరిగిన ప్రతిసారి మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. సంక్షోభ సమయంలో ఎక్కువమంది ‘‘సెల్ ఆన్ రైజ్’’ సూత్రం పాటిస్తున్నారు. దీంతో చిన్నపాటి పుల్‌బ్యాక్స్‌కూడా నిలబడట్లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి తరుణంలో బేర్ పుట్ స్ప్రెడ్ వ్యూహం మంచిదని సలహా ఇస్తున్నారు. ఈ వ్యూహంలో మార్కెట్ పెరిగినప్పుడు ఏటీఎం పుట్ కొనుగోలు చేసి ఓటీఎం పుట్‌ను విక్రయిస్తారు. నిఫ్టీలో షార్ట్ పొజిషన్లు పరిశీలిస్తే ఎఫ్ఐఐలు కొత్త షార్ట్స్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. సోమవారం విదేశీ మదుపరులు ఒకపక్క షేర్లను విక్రయిస్తూ మరోపక్క షార్ట్పొజిషన్లు పెంచుకున్నారు. సోమవారానికి నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీల ఉమ్మడి షార్ట్ ఇండెక్స్ ఫ్యూచర్లు పెరుగుదల నమోదు చేశాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పుట్‌బేర్ వ్యూహం బెటరని, చిన్నపాటి బౌన్సులను ఈ వ్యూహంతో క్యాష్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
మార్కెట్ ర్యాలీ..?
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారాంతాన పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత.. భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపే పలు చర్యలను మంత్రి ప్రకటించారు. తాజా ప్రభుత్వ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో మార్కెట్‌కు జోష్ వచ్చే అవకాశం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై బడ్జెట్లో ప్రతిపాదించిన సర్‌చార్జీని ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం సానుకూల అంశంగా ఉందని చెబుతున్నాయి. సర్‌చార్జ్ అంశం ఇటీవల దేశ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా నష్టపరచగా.. ఈ కీలక అంశంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టంచేయడంతో మళ్లీ ఎఫ్‌పీఐల పెట్టుబడి భారత క్యాపిటల్ మార్కెట్‌కు వచ్చి చేరే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ మార్కెట్ ఫండమెంటల్స్ రీసెర్చ్ హెడ్ రస్మిక్ ఓజా విశ్లేషించారు. డాలరుతో రూపాయి మారక విలువ బలపడేందుకు కూడా ప్రభుత్వ తాజా నిర్ణయం దోహదపడనుందని అభిప్రాయపడ్డారు. ‘ఎఫ్‌పీఐల అమ్మకాల ప్రవాహం ఆగిపోయి.. కొనుగోళ్లు జరిగేందుకు అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నాం. అయితే, ఈ ర్యాలీ కొనసాగాలంటే.. కంపెనీల ఆదాయ వృద్ధి పుంజుకుని, ఆర్థిక వ్యవస్థలో మందగమనం తొలగిపోవాలి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె.విజయ్ కుమార్ అన్నారు. భారత జీడీపీలో వృద్ధి వేగంగా కొనసాగుతుందని ఆర్థిక మంత్రి భరోసా, ఎఫ్‌పీఐ సర్‌చార్జ్ ఉపసంహరణ వంటి కీలక అంశాల నేపథ్యంలో సోమవారం మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్‌కు చాన్స్ ఉందని ట్రేడింగ్ బెల్స్ కో–ఫౌండర్, సీఈఓ అమిత్ గుప్తా చెప్పారు. పీఎస్‌యూ బ్యాంక్ షేర్లకు మద్దతు..! ఆర్థిక వ్యవస్థలో రుణ మంజూరీని పెంచేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లను మూలధన సాయంగా అందించనున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. మరోవైపు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు)కు అదనంగా రూ.20,000 కోట్ల నిధులను ఎన్‌హెచ్‌బీ ద్వారా అందించనున్నట్లు చెప్పారు. ఈ తాజా అంశాల నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకుల షేర్లకు కొనుగోలు మద్దతు లభించే అవకాశం ఉందని ఎలారా క్యాపిటల్ విశ్లేషకులు గరిమా కపూర్ అన్నారు. ఇక ఆటో రంగానికి ఊతమిస్తూ.. ప్రభుత్వ శాఖలు, విభాగాలు పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు సవరణను 2020 జూన్ వరకు వాయిదా వేయడం వంటి పలు ప్రోత్సాహక నిర్ణయాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ అంశానికి తోడుగా.. వస్తు, సేవల పన్ను ఊరట లభిస్తే ఆటో రంగ షేర్లలో పతనం ఆగుతుందనేది దలాల్ స్ట్రీట్ వర్గాల అంచనా. ఇక ఈ ఏడాది రెండో త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) జీడీపీ అంచనాల గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించనుంది. అంతర్జాతీయ అంశాల ప్రభావం.. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు ధీటుగా చైనా సవాలు విసురుతోంది. ఇటీవల చైనా దిగుమతులపై 10% సుంకం విధించాలని అమెరికా తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంగా.. మొత్తం 75 బిలియన్ డాలర్ల విలువగల యూఎస్ వస్తువులపై అదనంగా 10% టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు చైనా శుక్రవారం ప్రకటించింది. దీంతో ట్రంప్ అదేరోజున మరోసారి తీవ్రంగా స్పందించారు. చైనా దిగుమతులపై అదనపు సుంకాలను విధించడంతో పాటు ఆదేశం నుంచి అమెరికన్ కంపెనీలు బయటకు వచ్చేయాలని కోరారు. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు ఆరోజున భారీ నష్టాలను చవిచూశాయి. నాస్డాక్ ఏకంగా 3% నష్టపోయింది. ఆగస్టులో రూ.3,014 కోట్లు ఉపసంహరణ... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆగస్టు 1–23 కాలానికి ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.12,105 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే, డెట్ మార్కెట్లో రూ.9,091 కోట్లను పెట్టుబడి పెట్టారు. దీంతో క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ ఈనెల్లో ఇప్పటివరకు రూ.3,014 కోట్లకు పరిమితమైంది. ఎఫ్‌పీఐ లపై కేంద్ర ప్రభుత్వం సర్‌చార్జ్ ఉపసంహరణతో వీరి పెట్టుబడులు మళ్లీ పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీ ఎండీ, సీఈఓ విజయ్ చందోక్ అన్నారు. ఆర్థిక మంత్రి ఇచ్చిన భరోసాతో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని వి.కే విజయ్‌కుమార్ విశ్లేషించారు. -
రూపాయికీ ప్యాకేజీ వార్తల జోష్
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం మొట్టమొదటిసారి 72 దిగువకు పడిపోయింది. అయితే చివరకు బలపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గురువారం ముగింపుతో పోల్చిచూస్తే, 15 పైసలు బలపడి 71.66 వద్ద ముగిసింది. ఎఫ్‌పీఐ పారిన్ పోల్టిఫోలియో ఇన్వెస్టర్లపై సర్‌చార్జ్ తీసివేస్తారని, వృద్ధికి దోహదపడే చర్యలను ప్రభుత్వం ప్రకటించనుందని వచ్చిన వార్తలు, ఈ వార్తలతో లాభాల బాటన నడిచిన ఈక్విటీ మార్కెట్లు రూపాయిని బలోపేతం చేశాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సాయంత్రం పత్రికా సమావేశంలో ప్రసంగించనున్నారన్న ప్రకటన అటు ఈక్విటీ మార్కెట్లను ఇటు ఫారెక్స్ మార్కెట్‌ను ఒడిదుడుకుల బాటనుంచి స్థిరీకరణ దిశగా నడిపించాయి. అంతర్జాతీయంగా కీలక స్థాయికన్నా దిగువున ఉన్న క్రూడ్ ధరలూ రూపాయి సెంటిమెంట్‌కు కొంత బలాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. గురువారం రూపాయి ఎనిమిది నెలల కనిష్టం 71.81 వద్ద ముగిసింది. శుక్రవారం ఉదయం టేడింగ్ మొదట్లో బలహీనతలోనే 71.93 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 72.05ను తాకింది. 71.58 గరిష్టస్థాయిని నేటి ట్రేడింగ్‌లో రూపాయి చూసింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. -
ప్యాకేజీ ఆశలు ఆవిరి
విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లపై బడ్జెట్లో విధించిన పన్నును తగ్గించవచ్చని... మందగమన ప్రభావంతో కునారిల్లిన రంగాలకు ప్యాకేజీ ప్రకటిస్తారనే ఆశలతో కొద్దిరోజులుగా పెరుగుతున్న మార్కెట్లు గురువారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఎలాంటి ప్యాకేజీ ఉండబోదని ప్రభుత్వ వర్గాలు పరోక్షంగా వెల్లడించడంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోవడం దీనికి తోడయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 36,500 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,800 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ప్రధానంగా బ్యాంక్, వాహన, లోహ షేర్లు నష్టపోయాయి. రూపాయి పతనం కారణంగా ఐటీ రంగ షేర్లు మాత్రం లాభపడ్డాయి. సెన్సెక్స్ 587 పాయింట్లు పతనమై 36,473 పాయింట్ల వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు తగ్గి 10,741 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలకు ఇదే కనిష్ట స్థాయి. వరుసగా మూడో రోజూ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. పతనానికి ప్రధాన కారణాలు.... ప్యాకేజీ ఆశలు హుళక్కి డిమాండ్ తగ్గి కుదేలైన రంగాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వగలదన్న ఆశలతో ఇటీవల స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడుతూ వచ్చాయి. కానీ ప్యాకేజీ ఇవ్వడం అనైతికం అంటూ ప్రధాన ఆర్థిక సలహాదారు సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించడంతో ప్యాకేజీ ఆశలు అడుగంటాయి. దీంతో బ్లూచిప్‌లతో సహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. జోష్‌నివ్వని సెబీ నిర్ణయాలు... ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెబీ సరళతరం చేసింది. అయితే సూపర్ రిచ్ సర్ చార్జీపై ఎలాంటి స్పష్టత లేకపోవడం నిరాశపరిచింది. బడ్జెట్లో ఈ సర్‌చార్జీ ప్రతిపాదన వెలువడినప్పటినుంచి కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు సెబీ నిర్ణయం ఎలాంటి అడ్డుకట్ట వేయలేకపోయింది. ఎఫ్‌పీఐలు జూలైలో రూ.17,000 కోట్లు, ఈ నెలలో రూ.10,000 కోట్ల మేర నిధులను వెనక్కి తీసుకున్నారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలు రేట్ల కోత విషయమై అమెరికా ఫెడరల్ రిజర్వ్ దూకుడుగా వ్యవహరించకపోవచ్చని ఆ సంస్థ తాజా మినట్స్ వెల్లడించాయి. ఫలితంగా భారత్ వంటి వర్థమాన దేశాలకు విదేశీ నిధుల ప్రవాహంపై ప్రభావం పడుతుంది. మరోవైపు చైనా కరెన్సీ యువాన్ 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ కారణాలన్నింటి వల్ల ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. చైనా షాంఘై సూచీ, జపాన్ నికాయ్ సూచీలు మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కె ట్లు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. రూపాయి... దిగువ పయనం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం, స్టాక్ మార్కెట్ బలహీనంగా ట్రేడవుతుండటంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణిస్తోంది. ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం 40 పైసలు తగ్గి 71.96ను తాకింది. ఈ ఏడాది ఇదే కనిష్ట స్థాయి. మరోవైపు ముడి చమురు ధరలు 0.65 శాతం మేర పెరగడం రూపాయిపై ఒత్తిడిని పెంచింది. సాంకేతిక కారణాలు కీలక మద్దతు స్థాయిలు... 10,906, 10,800, 10,750 పాయింట్లను నిఫ్టీ సూచీ కోల్పోయింది. దీంతో అమ్మకాలు ఒత్తిడి పెరిగింది. నిఫ్టీ తదుపరి మద్దతు 10,580–19,455 పాయింట్ల వద్ద ఉందని టెక్నికల్ ఎనలిస్ట్‌లు అంటున్నారు. 11,120 పాయింట్లపైన స్థిరపడగలిగితేనే నిఫ్టీ బలం పుంజుకుంటుందని వారంటున్నారు. మరోవైపు నిఫ్టీ 10,782 పాయింట్ల దిగువకు దిగి వచ్చిందని, ఇలియట్ వేవ్ థియరీలో ఐదో లెగ్ పతనాన్ని ఇది నిర్ధారిస్తోందని టెక్నికల్ ఎనలిస్ట్‌ల అభిప్రాయం. మరిన్ని విశేషాలు... ► యస్ బ్యాంక్ షేర్ నష్టాలు నాలుగో రోజూ కొనసాగాయి. 14 శాతం నష్టంతో రూ.56.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఆర్థిక అవకతవకలు జరిగిన సీజీ కన్సూమర్ కంపెనీలో ఈ బ్యాంక్‌కు కూడా వాటా ఉండటంతో ఈ షేర్ పతనమవుతోంది. గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 27 శాతం నష్టపోయింది. ► 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, హిందుస్తాన్ యునిలివర్, హెచ్‌సీఎల్ టెక్– ఈ నాలుగు షేర్లు మాత్రమే పెరిగాయి. మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి. ► ఇక నిఫ్టీలో బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 1 –2 శాతం మేర లాభపడగా, మిగిలిన 44 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ► డీహెచ్ఎఫ్ఎల్ రుణదాతలు తమ రుణాల్లో కొంత భాగాన్ని ఈక్విటీగా మార్చుకునే దిశగా ఆలోచిస్తున్నారన్న వార్తల కారణంగా డీహెచ్ఎఫ్ఎల్ షేర్ 13 శాతం నష్టంతో రూ.39.70 వద్ద ముగిసింది. ► రుణ భారం తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రమోటర్లు్ల చేస్తున్న ప్రయత్నాలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపుతుండటంతో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్ 5 శాతం లాభం తో రూ.76.40 వద్ద ముగిసింది. గత నాలు గు రోజుల్లో ఈ షేర్ 21 శాతం ఎగసింది. ► మార్కెట్ భారీగా పతనమైనా, హిందుస్తాన్ యూని లివర్ (హెచ్‌యూఎల్) ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,879ను తాకింది. నెల కాలంలో ఈ షేర్ 12 శాతం పెరిగింది. ► టాటా మోటార్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, టాటా కాఫీ, సెయిల్ వంటి దిగ్గజ షేర్లు ఐదేళ్ల కనిష్ట స్థాయిలకు క్షీణించాయి. వీటితో పాటు మరో 140 షేర్లు ఈ స్థాయికి చేరాయి. డీఎల్ఎఫ్, టాటా స్టీల్, ఐటీసీ, రేమండ్ వంటి 270 షేర్లు రెండేళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. మరో 400 షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. అలహాబాద్ బ్యాంక్, అవంతి ఫీడ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐషర్ మోటార్స్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు డెన్ నెట్వర్క్స్, నెస్లే ఇండియాలు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ప్యాకేజీ ఇవ్వడం అనైతికం.. కష్టాల్లో ఉన్న కంపెనీలను ఆదుకోవడానికి పన్ను చెల్లింపుదార్ల సొమ్ములను ఉపయోగించడం అనైతికమని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్య ఆర్థిక వ్యవస్థకు శాపం లాంటిదన్నారు. మరోవైపు తక్కువ వడ్డీరేట్లు, ప్రైవేట్ రంగానికి రుణ లభ్యత... ఈ రెండూ ప్యాకేజీ కంటే ఉత్తమమైనవని విద్యుత్తు శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వ్యాఖ్యానించారు. వీరిద్దరి వ్యాఖ్యలూ ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వవచ్చన్న ఆశలను అడియాసలు చేశాయి. మరోవైపు ఈ క్యూ1లో జీడీపీ వృద్ధి మరింతగా తగ్గగలదని (5.5 శాతానికి )గత నెల వరకూ ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన గార్గ్ పేర్కొనడం మరింత ప్రతికూల ప్రభావం చూపించింది. 697 రేంజ్లో సెన్సెక్స్... ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ఆరంభమైంది. ప్యాకేజీ ఆశలు ఆడియాసలు కావడం, రూపాయి క్షీణించడం తదితర కారణాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో 28 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, మరో దశలో 669 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 697 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 201 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ ఇంట్రాడేలో 800 పాయింట్లు నష్టపోయింది. దెబ్బతిన్న సెంటిమెంట్ డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ ఏడాది కనిష్టానికి పడిపోవడం... స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోవడానికి ఒక కారణమని షేర్‌ఖాన్ బై బీఎన్పీ పారిబా ఎనలిస్ట్ హేమాంగ్ జణి పేర్కొన్నారు. డిమాండ్ లేక కుదేలైన రంగాలను ఆదుకునే విషయమై ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి ప్యాకేజీ ప్రకటనలు రాకపోవడం ప్రతికూల ప్రభావం చూపించిందని తెలియజేశారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థకు ప్యాకేజీ అవసరం లేదని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందన్నారు. -
ఇన్వెస్టెర్రర్ 2.0
విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను విషయంలో ఊరట లభించగలదన్న అంచనాలు ఆవిరవ్వడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 38,500 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,500 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. అంతంతమాత్రంగానే ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు, వినియోగం మందగించడం, నైరుతి రుతు పవనాల విస్తరణ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. వరుసగా మూడు రోజుల పాటు నష్టపోతూ వచ్చిన డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకున్నా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత విషయమై సానుకూల సంకేతాలివ్వడంతో ప్రపంచ మార్కెట్లు పెరిగినా, మన మార్కెట్ పతన బాటలోనే పయనించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 560 పాయింట్లు పతనమై 38,337 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 178 పాయింట్లు నష్టపోయి 11,419 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది సెన్సెక్స్, నిఫ్టీలకు ఇవే రెండో అత్యధిక రోజువారీ నష్టాలు. ఈ రెండు సూచీలు రెండు నెలల కనిష్టానికి పడిపోయాయి. బడ్జెట్ రోజు సెన్సెక్స్ ఈ ఏడాదిలో అత్యధికంగా 793 పాయింట్లు నష్టపోయింది. విద్యుత్తు, కన్సూమర్ డ్యూరబుల్స్ సూచీలు మినహా మిగిలిన అన్ని బీఎస్ఈ రంగాల సూచీలు క్షీణించాయి. వాహన, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 399 పాయింట్లు, నిఫ్టీ 133 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. లాభాల్లో ఆరంభమైనా... ఈ నెలాఖరులో జరిగే సమావేశంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనాలను మించి రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని ఫెడరల్ రిజర్వ్ కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించడంతో ఆసియా మార్కెట్లు జోరుగా పెరిగాయి. ఈ దన్నుతో మన మార్కెట్ కూడా మంచి లాభాలతో ఆరంభమైంది. అయితే ఆ తర్వాత వెంటనే సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారిపోయాయి. ఒక దశలో 161 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, మరో దశలో 626 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 787 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 43 పాయింట్లు పెరిగి, ఆ తర్వాత 198 పాయింట్లు పతనమైంది. ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం 5 పైసలు లాభపడి 68.92 వద్ద ముగిసింది. ఇక ముడిచమురు ధరలు 1.7 శాతం ఎగిశాయి. మరిన్ని విశేషాలు.... ► మొత్తం 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు–ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, టీసీఎస్, ఓఎన్జీసీలు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► 500కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, యస్ బ్యాంక్, గెయిల్ ఇండియా, మహీంద్రా, ఐషర్ మోటార్స్, అరబిందో ఫార్మా, ఫోర్స్ మోటార్స్, వొడాఫోన్ ఐడియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ షేర్ ఆల్‌టైమ్ హై, 2,370ను తాకింది. చివరకు 7%(రూ.147)లాభంతో రూ.2,317 వద్ద ముగిసింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 20 శాతానికి పైగా ఎగసింది. పతనానికి కారణాలు ► పన్ను విషయమై తగ్గేది లేదు... సంపన్నులపై విధించిన పన్ను(విదేశీ ఇన్వెస్టర్లకు ఈ పన్ను వర్తిస్తుంది) కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తరలిపోతాయనే వాదనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపడేశారు. గురువారం ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె ఈ పన్ను విషయమై పునరాలోచన లేదని తెగేసి చెప్పారు. ఎఫ్‌పీఐలు కంపెనీగా వ్యవహరిస్తే, ఈ పన్ను పోటు ఉండదని ఆమె పేర్కొన్నారు. ఎఫ్‌పీఐలకు పన్ను విషయంలో ఊరట లభించకపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ► అమ్మకాల్లో తగ్గని ఎఫ్‌పీఐలు ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, పన్ను పోటు కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. శుక్రవారంతో కలుపుకొని వరుసగా 14వ రోజూ నికర అమ్మకాలు జరిపారు. ఒక్క గురువారం రోజే రూ.1,405 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ నికర కొనుగోళ్లు జరిపిన ఎఫ్‌పీఐలు ఈ నెలలో ఇప్పటిదాకా రూ.7,000 కోట్ల మేర విక్రయాలు జరిపారు. ► జోష్‌నివ్వని ఆర్థిక ఫలితాలు... ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లలో జోష్ని నింపలేకపోయాయి. ఒక్క ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్ మినహా ఇతర కంపెనీల ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. యస్‌బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, మైండ్‌ట్రీ, విప్రో, డీసీబీ బ్యాంక్ ఫలితాలు నిరాశపరిచాయి. ఫలితాలు ఓ మోస్తరుగా ఉంటాయన్న అంచనాలను కూడా కొన్ని కంపెనీలు అందుకోలేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ► వర్షాలు.. అంతంతే.... ఈసారి నైరుతి రుతుపవనాలు నిరాశపరిచాయి. సాధారణ వర్షపాతం కంటే 16 శాతం తక్కువగా వర్షాలు కురవడంతో వర్షాధార వ్యవసాయ దేశమైన మన దేశంలో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండగలవన్న ఆందోళన నెలకొన్నది. ► జీడీపీ అంచనాలు తగ్గించిన ఏడీబీ భారత దేశ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపించింది. 2 రోజుల్లో రూ. 3.79 లక్షల కోట్లు ఆవిరి గత రెండు రోజుల నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.3.79 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్డైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ విలువ రూ.3.79 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.145.35 లక్షల కోట్లకు పడిపోయింది. శుభవార్తల కోసం మన స్టాక్ మార్కెట్ మొహం వాచిపోయి ఉంది. కంపెనీల డిఫాల్ట్‌లు కొనసాగుతుండటం, పన్నులు అధికంగా ఉండటం, కంపెనీల ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండటం, ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉండటం.. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. – జగన్నాథమ్ తునుగుంట్ల, సెంట్రమ్ బ్రోకింగ్ అనలిస్ట్ -
ఎఫ్‌పీఐలకు సులభ కేవైసీ
క్యాపిటల్ మార్కెట్లను ప్రజలకు మరింత చేరువ చేసే చర్యలు నిర్మలాసీతారామన్ బడ్జెట్లో కనిపించాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) సంబంధించి కేవైసీ నిబంధనల సడలింపు, సామాజిక, స్వచ్చంద సంస్థల లిస్టింగ్‌కు వీలుకల్పించే విధంగా సోషల్ స్టాక్ ఎక్సే ్చంజ్ ఏర్పాటు, లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల కనీస వాటా 25 శాతం నుంచి 35 శాతానికి పెంపు ప్రతిపాదనలు బడ్జెట్లో చోటు చేసుకున్నాయి. క్యాపిటల్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యాన్ని పెంచే చర్యలు కనిపించాయి. కార్పొరేట్ బాండ్ మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు ఆర్బీఐ, సెబీతో సంప్రదింపుల అనంతరం మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. సామరస్య, సమస్యల్లేని పెట్టుబడుల వాతావరణాన్ని ఎఫ్‌పీఐలకు కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అందుకే వారికి సంబంధించి కేవైసీ (మీ క్లయింట్ ఎవరన్నది తెలుసుకునే వివరాలు) నిబంధనలను క్రమబద్ధీకరించడం, సులభతరం చేయడం ద్వారా... సమగ్ర, సీమాంతర పెట్టుబడుల విషయంలో రాజీ పడకుండా మరింత పెట్టుబడి అనుకూలంగా మార్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు. స్టాక్ మార్కెట్లో అడ్డంకుల్లేని పెట్టుబడులకు గాను ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మార్గాన్ని కూడా ఎఫ్‌పీఐల మార్గంలో విలీనం చేయాలని మంత్రి ప్రతిపాదించారు. డెట్ సెక్యూరిటీల్లో ఎఫ్ఐఐలు, ఎఫ్‌పీఐల పెట్టుబడులను దేశీయ ఇన్వెస్టర్లకు బదలాయించడం, విక్రయించడం, అలాగే, ఎన్బీఎఫ్సీలు జారీ చేసే డెట్ సెక్యూరిటీల్లో ఎఫ్‌పీఐల ప్రవేశానికి మంత్రి ప్రతిపాదించారు. -
విదేశీ ఇన్వెస్టర్ల ‘బీమా’ మోజు!
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు లిస్టెడ్ బీమా సంస్థల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రీమియం వసూళ్లలో బలమైన వృద్ధి చూపిస్తుండడం, అదే సమయంలో ఈ కంపెనీల షేర్ల విలువలు భవిష్యత్తు వృద్ధి అవకాశాల కోణంలో ఆకర్షణీయంగా కనిపిస్తుండడంతో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) బీమా కంపెనీల్లో మార్చి నెలలో ఏకంగా రూ.6,780 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశారు. అందుబాటులో ఉన్న తాజా గణాంకాలను పరిశీలించినట్టయితే మార్చి నెలలో రంగాల వారీగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో బీమా రంగమే అత్యధిక పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. 2018 మార్చి తర్వాత ఒక నెలలో బీమా రంగంలోకి అధిక పెట్టుబడులు రావడం కూడా గత నెలలోనే. ప్రైమరీ, సెకండరీ మార్కెట్లలో డీల్స్ ‘‘ఎఫ్‌పీఐల పెట్టుబడులను కంపెనీల మూలాలు, ధరల పనితీరు, మొత్తం మార్కెట్ పెట్టుబడుల కోణంలో చూడాల్సి ఉంటుంది. ఫండమెంటల్స్ పరంగా చూస్తే జీవిత బీమా, సాధారణ బీమా కంపెనీలు ఫిబ్రవరి నెల ప్రీమియం వసూళ్లలో బలమైన వృద్ధిని నమోదు చేశాయి’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎండీ, సీఈవో శిల్పా కుమార్ పేర్కొన్నారు. ఒకవైపు అధిక ఎఫ్‌పీఐల పెట్టుబడులకు తోడు బీమా రంగంలో ప్రైమరీ, సెకండరీ మార్కెట్లో ఒప్పందాలు కూడా చోటు చేసుకోవడం గమనార్హం. బ్రిటన్‌కు చెందిన ప్రుడెన్షియల్ కార్పొరేషన్ తనకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న వాటాల్లో 3.7 శాతాన్ని ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,400 కోట్లు). అలాగే, దీనికి ముందు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో స్టాండర్డ్ లైఫ్ 4.93 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలోనే తగ్గించుకుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఒకానొక భాగస్వామి బీఎన్పీ పారిబాస్ కార్డిఫ్ సైతం 5 శాతం మేర వాటాలను బ్లాక్ డీల్ ద్వారా రూ.3,000 కోట్లకు మార్చి నెలలో విక్రయించింది. వృద్ధి అవకాశాలు... ఆర్థిక రంగంలో బీమా కూడా అధిక వృద్ధితో కూడిన రంగమని శిల్పా కుమార్ పేర్కొన్నారు. ‘‘ప్రైవేటు బీమా సంస్థలు వార్షికంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం పరంగా 20 శాతానికి పైగా వృద్ధిని సాధించాయి. అదే సాధారణబీమా సంస్థలు వార్షికంగా మొత్తం మీద 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి. వైద్య బీమా వ్యాపారం అయితే 40 శాతం మేర వృద్ధి చెందింది’’ అని ఆమె వివరించారు. బీమా రంగం పట్ల ఆసక్తి తిరిగి పుంజుకుందని, భౌగోళికంగా భిన్న ప్రాంతాల నుంచి... ఎఫ్‌పీఐలు, సావరీన్ వెల్త్ ఫండ్స్, ఆల్టర్నేటివ్ అస్సెట్ మేనేజర్స్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి భాగస్వామ్యం ఉన్నట్టు చెప్పారు. నిజానికి దేశీ ఈక్విటీ మార్కెట్లలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ భాగం ఎఫ్‌పీఐలు అమ్మకాలు వైపు ఉండగా... ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈక్విటీల్లో నికరంగా రూ.51,200 కోట్లు, బాండ్ల మార్కెట్లలో నికరంగా రూ.5,964 కోట్ల పెట్టుబడులతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించడం విశేషం. అంతర్జాతీయంగా లిక్విడిటీ మెరుగుపడడం, స్థిరమైన వడ్డీ రేట్లు, అధికార పార్టీయే తిరిగి మళ్లీ విజయం సాధిస్తుందన్న అంచనాలు విదేశీ ఇన్వెస్టర్లలో భారత మార్కెట్ల పట్ల ఆశావహ పరిస్థితి కారణమని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నవీన్ కులకర్ణి తెలిపారు. ‘‘అంతర్జాతీయ వృద్ధి నిదానించడం, అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకుల విధానాల్లో మార్పు రావడంతోపాటు అమెరికాలో రేట్ల పెంపు అవకాశాలు లేకపోవడమే... ఎఫ్‌పీఐలకు భారత్ ఏడారిలో ఒయాసిస్‌లా మారింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పీసీజీ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటజీ హెడ్ వీకే శర్మ పేర్కొన్నారు. -
ఎఫ్ఐఐల పెట్టుబడులే కీలకం..
ముంబై: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) భారత స్టాక్ మార్కెట్లలో తమ పెట్టుబడులను జోరుగా కొనసాగించిన నేపథ్యంలో గతవారం ప్రధాన సూచీలు మూడున్నర శాతం మేర లాభాలను నమోదుచేశాయి. రెట్టించిన ఉత్సాహంతో వీరు పెట్టుబడులను కొనసాగించడంతో నిఫ్టీ వారాంత ట్రేడింగ్ రోజున 11,427 వద్దకు చేరుకుంది. అయితే, ఇక్కడ నుంచి జీవితకాల గరిష్టస్థాయిలకు చేరుకుంటుందా..? లేదంటే, స్వల్పకాలిక దిద్దుబాటుకు లోనవుతుందా? అనే ప్రధాన అంశానికి ఎఫ్ఐఐల నిర్ణయమే అత్యంత కీలకం కానుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈనెల్లో ఇప్పటివరకు దేశీ స్టాక్ మార్కెట్లో రూ.17,055 కోట్లను పెట్టుబడి పెట్టిన వీరు ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తే సూచీలు ఊర్థ్వముఖంగా ప్రయాణం కొనసాగిస్తాయని భావిస్తున్నారు. ‘ఎమర్జింగ్ మార్కెట్లతో పోల్చితే ఫిబ్రవరి మధ్యవరకు దేశీ ప్రధాన సూచీలు అండర్పెర్ఫార్మ్ చేశాయి. ఇప్పుడైతే ఈ ట్రెండ్‌లో మార్పు కనిపిస్తోంది. సాధారణ ఎన్నికలపై అంచనాలు, ఇక్కడి మార్కెట్లో స్వల్పకాలిక రాబడికి ఉన్న అవకాశాల ఆధారంగా ఎఫ్ఐఐల పెట్టుబడుల కొనసాగింపు ఉండనుంది. ఒకవేళ వీరి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే మాత్రం షార్ప్ కరెక్షన్ ఉంటుంది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. నిఫ్టీలో 38 శాతం వాటా కలిగిన ఫైనాన్షియల్ రంగంలో ప్రస్తుతం పెట్టుబడులు జోరుగా కొనసాగుతున్నాయి. వీటిలో ప్రైవేటు బ్యాంకులు బలమైన రిటైల్ వృద్ధిని నమోదుచేస్తుండగా.. పీఎస్‌యూ బ్యాంకులు మొండిబకాయిల భారం నుంచి బయటపడడం సానుకూలంగా ఉంది. ఇక హోలీ సందర్భంగా 21న (గురువారం) మార్కెట్లకు సెలవుకావడం గమనార్హం. అంతర్జాతీయ అంశాలపై దృష్టి.. అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ).. కీలక వడ్డీ రేట్లపై ఈవారంలో తన నిర్ణయాన్ని వెలువరించనుంది. అత్యధిక శాతం నిపుణుల అంచనాల ప్రకారం ఫెడరల్ ఫండ్ రేట్లు (2.25 శాతం నుంచి 2.5 శాతం) మార్చకపోవచ్చు. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బీఓఈ) వడ్డీ రేట్ల నిర్ణయం గురువారం వెల్లడికానుంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ మరింత జాప్యం కానుందని తెలుస్తోంది. ఈవారంలో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. యూకే ద్రవ్యోల్బణం బుధవారం వెల్లడికానుండగా.. జపాన్ వాణిజ్యలోటు సోమ వారం, ద్రవ్యోల్బణం డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. ఎఫ్ఐఐల నికర కొనుగోళ్లు మార్చి 1–15 కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.20,400 కోట్ల పెట్టుబడులను భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. రూ.17,919 కోట్లను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసిన వీరు.. రూ.2,499 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడిపెట్టారు. అటు దేశీయ, ఇటు అంతర్జాతీయ సానుకూల అంచనాలు దీనికి కారణం. -
గణాంకాలే దిక్సూచి..!
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి, డిసెంబర్ త్రైమాసికానికి పలు కార్పొరేట్ రంగ సంస్థలు ప్రకటించనున్న ఫలితాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి 15 మధ్యకాలంలో 2,000 కంపెనీలు క్యూ3 ఫలితాలను ప్రకటించనుండగా.. ఈవారంలోనే పారిశ్రామికోత్పత్తి, టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ ప్రధాన అంశాలపైనే మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి అంతర్జాతీయ అంశాల పరంగా.. డిసెంబర్‌కు సంబంధించిన అమెరికా రిటైల్ అమ్మకాల డేటా ఫిబ్రవరి 14న (గురువారం) వెలువడనుంది. చైనా జనవరి ద్రవ్యోల్బణ డేటా, జపాన్ డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈనెల 15న (శుక్రవారం) వెల్లడికానున్నాయి. ఇక దేశీ ప్రధాన అంశాల విషయానికి వస్తే.. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ 13న (బుధవారం) ముగియనుంది. డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, సీపీఐ డేటా ఈనెల 12న (మంగళవారం) వెలువడనుండగా.. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 14న వెలువడనుంది. భౌగోళిక రాజకీయ అంశాల ప్రభావం.. అమెరికా–ఉత్తర కొరియా చర్చలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. ఈసారి వియత్నాం రాజధాని హనోయ్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్‌తో సమావేశం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈనెల 27, 28 తేదీల్లో భేటీ ఉంటుందని, ఇరు దేశాల దౌత్యాధికారుల మధ్య ఇందుకు సంబంధించిన ముందస్తు చర్చలు సానుకూలంగా సాగాయని ట్రంప్ చెబుతున్నప్పటికీ.. అటువైపు ఉత్తర కొరియా నుంచి ఎటువంటి అణు నిరాయుధీకరణ పరమైన ప్రకటనలు వెలువడకపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళనను కొనసాగించే అంశగా మారింది. యూరోజోన్ వృద్ధి మందగిస్తుందంటూ వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారనేది మార్కెట్ వర్గాల మాట. కంపెనీల ఫలితాలు.. సోమవారం అమరరాజా బ్యాటరీస్, ఆంధ్రా బ్యాంక్, ఐషర్ మోటార్స్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్, ఇండియా సిమెంట్స్, స్పైస్‌జెట్ క్యూ3 ఫలితాలను వెల్లడించనున్నాయి. మంగళవారం బాటా, కోల్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్, హెచ్ఈజీ, హిందాల్కో, కరూర్ వైశ్యా బ్యాంక్, మన్‌పసంద్ బెవరేజెస్, ఎన్సీసీ, సన్ ఫార్మా గణాంకాలను వెల్లడించనున్నాయి. అదానీ గ్యాస్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, గ్లెన్‌మార్క్ ఫార్మా, జీవీకే పవర్, ఇన్ఫీబీమ్, ఎంటీఎన్ఎల్, నెస్లే ఇండియా, ఓఎన్జీసీ, యునైటెడ్ బ్రూవరీస్, వోల్టాస్ ఫలితాలు ఈవారమే ఉన్నాయి. రూ.5,300 కోట్ల ఎఫ్ఐఐల పెట్టుబడి... ఫిబ్రవరి 1–8 మధ్యకాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,273 కోట్ల పెట్టుబడులను దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడైంది. మరోవైపు డెట్ మార్కెట్ నుంచి రూ.2,795 కోట్లను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు స్టాక్ మార్కెట్లో కూడా నికర అమ్మకందారులుగా నిలిచిన ఎఫ్‌పీఐలు ఈసారి కొనుగోలుకు మొగ్గు చూపడానికి గల ప్రధాన కారణం అధిక ఆర్ధిక వృద్ధి అంచనాలేనని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ అనలిస్ట్ హిమాంషు శ్రీవాత్సవ వివరించారు. ‘సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున వీరు వేచిచూసే వైఖరిని అవలంభించేందుకు అవకాశం ఉంది. ముడిచమురు, డాలరుతో రూపాయి కదలికలు సైతం ఎఫ్‌పీఐల ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నాయి’ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. -
జెఫ్ బెజోస్- కిషోర్ బియానీ డీల్ సిద్ధం?
దేశీయ రీటైల్ మార్కెట్లో తన ఉనికిని మరింత పటిష్టం చేసేందుకు అమెరికన్ రీటైల్‌దిగ్గజం అమెజాన్ భారీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెరికన్ ఆన్లైన్ రిటైలర్ అమెజాన్ దేశీయ కంపెనీ వాటాపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫ్యూచర్ గ్రూప్ స్థాపకుడు కిషోర్ బియానీతో ప్రాథమిక చర్చలు నిర్వహిస్తోంది. ఫ్యూచర్స్ రీటైల్ లిమిటెడ్‌లో రూ.2500 కోట్ల మేర దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తోందని ఎకానమిక్స్ టైమ్స్ నివేదించింది. ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ (FPI)గా నిబంధనలు అనుమతినిస్తే 8-9సంవత్సరాల పాటు ఈ పెట్టుడులను పెట్టనుంది. ఫ్యూచర్ రీటైల్లో అమెజాన్ 9.5శాతం వాటాను కొనుగోలుకు సంబంధించి తొలి విడత చర్చలు తుది దశలో ఉన్నాయని తెలిపింది. అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ వచ్చే నెలలో ఈడీల్ వివరాలను ప్రకటించనున్నట్లు నివేదిక పేర్కొంది. ఫ్యూచర్ రిటైల్ (స్టాక్-ఎక్స్చేంజ్ డేటా) 46.51వాటా బియానీ, అతని కుటుంబం సొంతం. ఫ్యూచర్ రీటైల్లో బిగ్ బజార్, నీలగిరి సూపర్ మార్కెట్లు ఉన్నాయి. షాపర్స్ స్టాప్‌లో 5శాతం వాటాలను సొంతం చేసుకుంది. దీంతోపాటు అమెజాన్ ఆదిత్య బిర్లా రిటైల్స్ (మోర్)లో కూడా విట్ జిగ్ ఎడ్వైజరీస్, సమారా క్యాపిటల్ సంస్థలతో కలిసి పెట్టుబడులను సమకూర్చింది. మరోవైపు దేశంలోని చట్టాల ప్రకారం దేశీయ సంస్థల్లో విదేశీ ఇన్వెస్టర్లు గరిష్టంగా 51శాతం పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ నేపథ్యంలో అమెజాన్ భారత దేశంలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అమెజాన్ ‘ఫ్యూచర్’ షాపింగ్!
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘షాపింగ్’లో దూకుడు పెంచుతోంది. ఆన్లైన్ గ్రోసరీ (కిరాణా, ఆహారోత్పత్తులు ఇతరత్రా) మార్కెట్లో మరింత మార్కెట్‌ను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బిగ్‌బజార్, నీల్గిరీస్ బ్రాండ్లతో సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న ఫ్యూచర్ రిటైల్‌లో అమెజాన్ పాగా వేసేందుకు సిద్ధమైంది. 9.5 శాతం మైనారిటీ వాటాను అమెజాన్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఫ్యూచర్ రిటైల్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టయింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఫ్యూచర్ రిటైల్ విలువ దాదాపు రూ.25వేల కోట్లు. 9.5 శాతం వాటా కోసం అమెజాన్ కొంచెం అటూఇటుగా రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలియవచ్చింది. ఫ్యూచర్ రిటైల్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,100కు పైగా స్టోర్లు ఉన్నాయి. చర్చలు పూర్తయ్యాయని, కొద్ది రోజుల్లోనే ఒప్పందం కుదురుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ) మార్గంలో అమెజాన్ ఈ 9.5 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఫ్యూచర్ రిటైల్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తర్వాత బహుశా ఈ నెల 14న డీల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి’ అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఇటు ఫ్యూచర్ రిటైల్, అటు అమెజాన్ ఈ వార్తలపై నేరుగా స్పందించలేదు. జనవరిలో బీజం... కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్‌లో ఫ్యూచర్ రిటైల్ ప్రధానమైన కంపెనీ. ఇది రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం హెరిటేజ్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో 3.65 శాతం వాటా కూడా ఉంది. ఈ ఏడాది జనవరిలోనే ఫ్యూచర్ రిటైల్‌లో వాటా తీసుకోవాలని అమెజాన్ భావించింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను కిశోర్ బియానీ స్వయంగా సీటెల్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో కలిశారు కూడా. తర్వాత ఇరు కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు పలుమార్లు సమావేశమై చర్చలు జరిపారు. ప్రస్తుతం మల్టీబ్రాండ్ రిటైల్‌లో 49 శాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) భారత్ అనుమతిస్తోంది. దీంతో అమెజాన్ ఎఫ్‌పీఐ మార్గంలో దేశీ కంపెనీల భాగస్వామ్యంతో పెట్టుబడులకు మొగ్గుచూపుతోంది. ఇప్పటికే షాపర్స్ స్టాప్‌లో 5 శాతం వాటాను అమెజాన్‌కు చెందిన విదేశీ ఇన్వెస్ట్మెంట్ అనుబంధ సంస్థ ఎఫ్‌పీఐ మార్గంలోనే కొనుగోలు చేసింది. ఏదైనా భారతీయ కంపెనీలో విదేశీ సంస్థలు సింగిల్ కంపెనీ ద్వారా 10 శాతం వాటాను ఎఫ్‌పీఐ రూట్లో కొనుగోలు చేయొచ్చు. అదేవిధంగా భారతీయ కంపెనీలు 49 శాతం వరకూ వాటాను బహుళ ఎఫ్‌పీఐలకు విక్రయించుకునే అవకాశం ఉంది. ఇటీవలే ఆదిత్య బిర్లా రిటైల్ నుంచి మోర్ సూపర్ మార్కెట్లను సమారా క్యాపిటల్‌తో కలిసి అమెజాన్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ వాటా కూడా అమెజాన్ ఎఫ్‌పీఐ రూట్లోనే కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.4,200 కోట్లు. ఇక్కడ సమారా క్యాపిటల్ 51 శాతం, అమెజాన్ 49 శాతం వాటాను దక్కించుకున్నప్పటికీ... సాంకేతికంగా చూస్తే మోర్‌పై పూర్తి నియంత్రణ అమెజాన్ చేతికి వచ్చింది. ఆన్‌లైన్‌కు ఆఫ్‌లైన్ దన్ను... మోర్ కొనుగోలు ద్వారా అమెజాన్‌కు దాదాపు 500కు పైగా సూపర్ మార్కెట్ స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్లో దూసుకెళ్తున్న అమెజాన్... ఆఫ్‌లైన్‌ను ఉపయోగించుకోవటానికి దీనిద్వారా మార్గం సుగమమయింది. ఫ్యూచర్ రిటైల్‌లో పెట్టుబడి కూడా ఇలాంటిదేనని రిటైల్ కన్సల్టెన్సీ సంస్థ వాజిర్ అడ్వయిజర్స్ వ్యవస్థాపకుడు హర్మిందర్ సాహ్ని వ్యాఖ్యానించారు. ఈ వాటా కొనుగోలు ద్వారా అమెజాన్‌కు ఫ్యూచర్ గ్రూప్ భారీ ఆఫ్‌లైన్ నెట్వర్క్, గిడ్డంగులు, సరఫరా వ్యవస్థ ఇతరత్రా సదుపాయాలన్నీ అందుబాటులోకి వస్తాయని.. దీంతో ఆన్లైన్ బిజినెస్‌లో మరింత దూసుకెళ్లేందుకు వీలవుతుందని ఆయన విశ్లేషించారు. అత్యంత భారీ మార్కెట్ ఉన్న భారత గ్రోసరీ, ఆహారోత్పత్తుల మార్కెట్లో దూసుకెళ్లాలంటే ఆఫ్‌లైన్ కూడా కీలకం కావడంవల్లే అమెజాన్ ఈ దిశగా అడుగులు వేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే అమెజాన్ ప్యాంట్రీ, అమెజాన్ నౌ ద్వారా ఆన్లైన్ ఫుడ్, గ్రోసరీల్లో అమెజాన్ ప్రవేశించింది. భారత్‌లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన అమెజాన్ తాజాగా ఆహార రంగంలో 50 కోట్ల డాలర్ల పెట్టుబడి ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదాన్ని కూడా పొందింది. ఊరిస్తున్న మార్కెట్.. దేశంలో 95 శాతం రిటైల్ అమ్మకాలన్నీ ఇప్పటికీ సూపర్ మార్కెట్లు, కిరాణా స్టోర్ల ద్వారానే జరుగుతున్నాయి. ఇక కిశోర్ బియానీ ఫ్యూచర్ రిటైల్‌కు దేశవ్యాప్తంగా బలమైన నెట్‌వర్క్‌తో పాటు బిగ్‌బజార్ వంటి ప్రధానమైన బ్రాండ్ ఉంది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులను విక్రయిస్తూ లాభాల్లో ఉన్న ఈ సంస్థలో పెట్టుబడి తమ ‘ఫ్యూచర్’కు కీలమని అమెజాన్ బలంగా విశ్వసిస్తోంది. ప్రధానంగా ఫ్యూచర్ రిటైల్‌కు దుస్తులు, జనరల్ వస్తువులు, లగేజ్, ఫుట్‌వేర్ విభాగాల్లో చాలా పట్టుంది. 340 నగరాల్లో మొత్తం 14.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్ స్టోర్లను ఫ్యూచర్ రిటైల్ నిర్వహిస్తోంది. దీనికితోడు 50 కోట్ల మేర కస్టమర్ల డేటా కూడా ఫ్యూచర్ గ్రూప్ వద్ద ఉండటం అమెజాన్‌కు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్ ఆన్లైన్ రిటైల్ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాలు ఫుడ్, గ్రోసరీలేనని మోర్గాన్ స్టాన్లీ ఇటీవలే పేర్కొంది. 2020 నాటికి ఈ విభాగం వార్షికంగా 141 శాతం చక్రీయ వృద్ధిని నమోదు చేస్తుందని.. మార్కెట్ విలువ 15 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. మొత్తం ఆన్లైన్ రిటైల్ అమ్మకాల్లో ఇది 12.5 శాతమని కూడా లెక్కగట్టింది. కాగా, మన రిటైల్ మార్కెట్ ప్రస్తుతం 672 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2020 నాటికల్లా 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇంతలా ఊరిస్తున్న ఈ భారీ మార్కెట్‌ను ఆన్లైన్, ఆఫ్లైన్ల ద్వారా కొల్లగొట్టడమే లక్ష్యంగా ఇప్పుడు అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాలు భారత్‌పై గురిపెట్టాయి. ఇదిలా ఉండగా.. ప్రధాన ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ దక్కించుకోవడం కూడా ఆమెజాన్ దూకుడు పెంచేందుకు ప్రధాన కారణ మని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బలమైన ఆఫ్‌లైన్ నెట్వర్క్ ఉన్న వాల్‌మార్ట్‌తో పోటీపడాలంటే అమెజాన్‌కు ఈ పెట్టుబడులు తప్పనిసరి. దీనికి అనుగుణంగానే అమెరికాలో కూడా అమెజాన్ హోల్ ఫుడ్స్‌ను దాదాపు 14.5 బిలియన్ డాలర్లతో చేజిక్కించుకోవడం గమనార్హం. స్పెన్సర్పైనా గురి... ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ కంపెనీ అయిన స్పెన్సర్ రిటైల్‌పైనా ఆన్లైన్ కంపెనీల కన్ను పడింది. దీనిలో వాటా కొనుగోలుపై అమెజాన్‌తో పాటు ఆలీబాబా (పేటీఎం మాల్ ద్వారా) కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పేటీఎం మాల్ బిగ్‌బాస్కెట్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టింది. ఈ మేరకు స్పెన్సర్ యాజమాన్యంతో అమెజాన్ ఇప్పటికే చర్చలు కూడా జరిపినట్లు సం బంధిత వర్గాలు వెల్లడించాయి. 1996లో రిటైల్ రంగంలోకి అడుగుపెట్టిన స్పెన్సర్స్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35 నగరాల్లో 120 సూపర్ మార్కెట్ స్టోర్లు, 37 హైపర్ స్టోర్లు ఉన్నాయి. మరోపక్క, రిలయన్స్ రిటైల్‌లో వా టా కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో... ఇప్పుడు ఆలీబాబా స్పెన్సర్‌పై దృష్టి పెట్టునట్లు తెలుస్తోంది. పేటీఎం మాల్లో ఆలీబాబా కీలక వాటాదారు కావడం గమనార్హం. -
రీటైల్ రంగంలోకి అమెజాన్ : భారీ పెట్టుబడులు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రణాళికలను భారీగా వేస్తోంది. ఈ కామర్స్‌వ్యాపారంలో దూసుకుపోతున్న అమెజాన్ తాజాగా భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న రిటైల్ రంగంపై కన్నేసింది. దేశంలోని పలు చైన్ సూపర్ మార్కెట్ల కంపెనీల్లో వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ (FPI)గా భారీ ఎత్తున నిధులను కుమ్మరించేందుకు అమెజాన్ యోచిస్తోంది.ఇందుకు సంబంధించిన డీల్‌ను ఈ నెలలోనే పూర్తి చేయనుంది. ఈ నెల 14న బోర్డు ఆమోదం పొందిన తర్వాత ఈ ఒప్పందాన్ని అధికారికంగా వెల్లడించనుంది. దేశీయంగా పలు రిటైల్ అవుట్ లెట్లు కలిగిన బిగ్ బజార్, నీలగిరి సూపర్ మార్కెట్లలో 9.5శాతం వాటాలను కొనుగోలుకు అమెజాన్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ డీల్ మొత్తం విలువ రు. 2,500 కోట్లుగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫ్యూచర్స్ రిటైల్ సంస్థకు దాదాపు దేశం మొత్తం మీద 1,100 స్టోర్లు ఉన్నాయి.దీనికి సంబంధించి ఒప్పంద పత్రాలు కూడా సిద్ధమయ్యాయని, బోర్డ్ ఆమోదం ఒక్కటే మిగిలి ఉందని ఫ్యూచర్స్ రిటైల్స్ వర్గాలు తెలిపాయి. ఈ నవంబర్ 14 నాటికి ఈ డీల్ సాకారం కానున్నట్టు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే అమెజాన్ షాపర్స్ స్టాప్‌లో 5శాతం వాటాలనుసొంతం చేసుకుంది. అలాగే అమెజాన్ ఆదిత్య బిర్లా రిటైల్స్ లో కూడా విట్ జిగ్ ఎడ్వైజరీస్, సమారా క్యాపిటల్ సంస్థలతో కలిసి పెట్టుబడులను సమకూర్చింది. దీంతోపాటు అమెజాన్ భారత దేశంలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తుంది. 500 మిలియన్ డాలర్లతో దేశీయంగా ఫుడ్, ప్రాసెసింగ్ విభాగాల్లో పెట్టబడులకు భారత ప్రభుత్వం అనుమతి లభించిందని అమెజాన్ తెలిపింది. అమెజాన్ ప్యాంట్రీ, అమెజాన్ నౌ ఇన్నోవేటివ్స్ పేరిట త్వరలోనే తన కార్యకలాపాలను ప్రారంభిచనుంది. కాగా మన దేశంలోని చట్టాల ప్రకారం దేశీయ సంస్థల్లో విదేశీ ఇన్వెస్టర్లు గరిష్టంగా 51శాతం పెట్టుబడులు పెట్టొచ్చు. అదీ ఎఫ్‌పీఐగా రిజిస్టర్డ్ చేసుకుని ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. బహుళజాతి పెట్టుబడి బ్యాంకు మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం ఆన్లైన్ ఫుడ్ అండ్ కిరాణా రిటైల్ మార్కెట్ 2020 నాటికి 141శాతం వార్షిక వృద్ధిరేటును సాధించనుంది. -
మార్కెట్లకు ఎఫ్‌పీఐల జ్వరం
ముంబై: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) కేవైసీ నిబంధనలకు సంబంధించి సెబీ జారీ చేసిన సర్క్యులర్ తాజాగా మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎఫ్‌పీఐల లాబీ.. నిబంధనలను సవరించకపోతే ఏకంగా 75 బిలియన్ డాలర్ల విలువ చేసే పెట్టుబడులు తరలిపోతాయని హెచ్చరించింది. రూపాయి పతనం, వివిధ ప్రతికూల అంశాలకు ఇది కూడా తోడు కావడంతో మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌పీఐలకు భరోసా కల్పించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఏప్రిల్ 10 నాటి సెబీ సర్క్యులర్‌లో కొత్త ప్రతిపాదనలేమీ చేర్చలేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి ఎస్సీ గర్గ్ మంగళవారం చెప్పారు. ఇందుకు సంబంధించిన డెడ్‌లైన్‌ను సెబీ గత నెల్లోనే డిసెంబర్ దాకా పొడిగించిందన్నారు. ఇప్పటికైతే ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు ప్రతిపాదిత మార్గదర్శకాలపై ఇప్పుడు వివాదం ఎందుకు రేపుతున్నారో అర్ధం కావడం లేదని గర్గ్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఏప్రిల్ 10 నాటి సర్క్యులర్ కారణంగా భారత మార్కెట్ల నుంచి 75 బిలియన్ డాలర్లు తరలిపోతాయన్న వ్యాఖ్యలు పూర్తిగా అర్ధరహితమైనవని, బాధ్యతారహితమైనవని సెబీ ఆక్షేపించింది. దీనిపై మంగళవారం ఉదయం ప్రత్యేక ప్రకటన కూడా జారీ చేసింది. వివాదమిదీ.. రిస్కు సామర్థ్యాల ఆధారంగా సెబీ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐ) మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. ఇందులో 2, 3 కేటగిరీలకి చెందిన ఎఫ్పీఐలంతా తమ పెట్టుబడులకు సంబంధించి లబ్ధిదారైన యజమానుల (బీవో) జాబితాను, వివరాలను (కేవైసీ) నిర్దిష్ట ఫార్మాట్లో ఆరు నెలల్లోగా సమర్పించాలంటూ సెబీ ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేసింది. వీటిని సమీక్షించాలంటూ, మార్గదర్శకాలను పాటించేందుకు మరింత గడువివ్వాలంటూ మార్కెట్ వర్గాల నుంచి అభ్యర్ధనలు రావడంతో డెడ్‌లైన్‌ను ఆగస్టులో మరో రెండు నెలలు (డిసెంబర్ దాకా) పొడిగించింది. ఆయా వర్గాల అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని భరోసా ఇచ్చింది. ఈ కేవైసీ ఆదేశాలే ప్రస్తుత వివాదానికి దారి తీశాయి. ప్రతిపాదిత కొత్త నిబంధనల కారణంగా విదేశాల్లోని భారత పౌరులు (ఓసీఐ), భారత సంతతికి చెందిన వారు (పీఐవో), ప్రవాస భారతీయులు (ఎన్నారై).. భారత మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు అర్హత కోల్పోతారని ఎఫ్‌పీఐల లాబీ గ్రూప్ ఏఎంఆర్ఐ (అసెట్ మేనేజ్మెంట్ రౌండ్‌టేబుల్ ఆఫ్ ఇండియా) సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని సవరించకపోతే ఆయా వర్గాల నిర్వహణలో ఉన్న 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్వల్పకాలంలోనే అమ్మేసుకుని, వైదొలగాల్సిన పరిస్థితి ఉంటుందని పేర్కొంది. అదే జరిగితే ఇటు స్టాక్స్‌పైనా అటు రూపాయిపైనా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలపైనే ఇటు కేంద్రం, అటు సెబీ మంగళవారం స్పందించాయి. నిబంధనల ప్రభావమిదీ.. ప్రతిపాదిత నిబంధనల వెనుక ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. దీని అమలు విషయంలోనే అనేక సమస్యలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మార్గదర్శకాల పరిభాషను సమీక్షించి, సవరించకపోతే మార్కెట్లో తీవ్ర సంక్షోభానికి దారి తీయొచ్చని అంటున్నారు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం .. భారత్‌లోని లిస్టెడ్ కంపెనీలో ఒక్కో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టరు (ఎఫ్‌పీఐ) వాటా 10%కి మించరాదు. ఒకవేళ మించితే సదరు బీవో (లబ్ధిదారు) పరిమితికిమించిన వాటాలను 5 ట్రేడింగ్ సెషన్లలోగా విక్రయించుకుని, నిర్దేశిత 10% లోపునకు తగ్గించుకోవాలి. లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారు కేటగిరీలోకి మారాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మనీలాండరింగ్‌ను నిరోధించే ఉద్దేశంతో వీటిని ప్రతిపాదించారు. అందుకే ఆయా పెట్టుబడులకు అసలైన యజమానులు (బీవో) ఎవరో చెప్పి తీరాలంటూ నిర్దేశించారు. ఈ నిబంధన డిసెంబర్ నుంచి అమల్లోకి రానుంది. పరిభాషతోనే ఇబ్బంది.. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం భారత ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 425 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. మెజారిటీ షేర్హోల్డర్లు, మేనేజర్లు ఎఫ్‌పీఐల్లో ఉన్న వివిధ ఫండ్స్ ద్వారా చాలా మటుకు ఎన్ఆర్ఐలు 75 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశారు. సెబీ ఆదేశాల కారణంగా వీరందరూ కూడా క్రిమినల్స్ కేటగిరీలోకి చేరిపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఎఫ్‌పీఐ మార్గం ద్వారా పెట్టుబడులు పెట్టడానికి ఇకపై ఆస్కారం ఉండదు కనుక.. ఎన్నారైలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చని, ఫలితంగా పెద్ద ఎత్తున అమ్మకాలు వెల్లువెత్తవచ్చని వారు చెబుతున్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ సంస్థ (ఎఫ్‌పీఐ)లో యాజమాన్య వాటాలు లేదా నియంత్రణాధికారాలు ఉన్న వ్యక్తి లేదా వ్యక్తుల సమూహాన్ని లబ్ధి దారైన యజమాని (బీవో)గా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిగణిస్తోంది. ఒకవేళ బీవోని ప్రత్యక్షంగా గుర్తించలేని పక్షంలో సదరు ఎఫ్‌పీఐకి సంబంధించిన సీనియర్ మేనేజింగ్ అధికారినే బీవోగా పరిగణిస్తారు. అలాగే నియంత్రణాధికారాలకు కూడా పీఎంఎల్ఏలో విస్తృత నిర్వచనం ఉంది. ఈ నిర్వచనాలతోనే చిక్కొస్తుందనేది మార్కెట్ వర్గాల వాదన. ఇవే కాకుండా, కేవైసీ నిబంధల కింద చిరునామా, ట్యాక్స్ రెసిడెన్సీ నంబరు, సోషల్ సెక్యూరిటీ నంబరు కూడా ఇవ్వాల్సి రానుండటం కూడా ఇన్వెస్టర్లు ఇబ్బందిపడొచ్చంటున్నాయి. డేటా భద్రత, ప్రైవసీ చట్టాలు పటిష్టంగా లేని దేశాలకు కీలక వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడానికి ఇన్వెస్టర్లు ఇష్టపడకపోవచ్చని చెబుతున్నారు. -
ఫలితాలు, ఎఫ్‌పీఐ ట్రెండ్ కీలకం
న్యూఢిల్లీ: ప్రస్తుతం కొనసాగుతున్న ఎర్నింగ్స్ సీజన్, ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, రాజకీయ పరిణామాలు ఈ వారంలో స్టాక్ మార్కెట్ దిశానిర్దేశం చేయనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ విశ్లేషించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. విదేశీ నిధుల ప్రవాహం, డెరివేటీవ్ కాంట్రాక్టుల ముగింపు అంశాలపై ఇన్వెస్టర్లు ప్రత్యేక దృష్టిసారించారు. మార్కెట్ పరంగా చూస్తే కేంద్ర ప్రభుత్వంపై లోక్ సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పెద్ద విషయమే కాదన్నారు. ఈ అంశం మార్కెట్‌పై ఎటువంటి ప్రభావం చూపలేదన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలు మాత్రమే ప్రస్తుతం ప్రభావం చూపనున్న రాజకీయ అంశాలుగా ఉన్నాయన్నారు. ‘ ఈ వారంలో ఫలితాలు ప్రకటించనున్న కంపెనీల జాబితా ఎక్కువగా ఉండగా, క్యూ1 ఫలితాల్లో ఏమాత్రం పునరుద్ధరణ కనబర్చినా.. వాల్యూయేషన్స్‌లో రీ–రేటింగ్ చోటుచేసుకుంటుంది.’ అని జియోజిత్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘ఏషియన్ పెయింట్స్, బీహెచ్ఈఎల్, కెనరా బ్యాంక్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్టమ్స్, హీరో మోటో కార్ప్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, ఐటీసీ, మారుతి సుజుకి, టాటా పవర్, యస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంకులు ఈ వారంలో ఫలితాలను ప్రకటించనున్నాయి. పార్లమెంట్ సెషన్ కొనసాగుతున్నందున...ఆ సమావేశాల్లో తికమక పెట్టే ఎటువంటి అంశం వెల్లడైనా ఒడిదుడుకులకు ఆస్కారం ఉంటుంది. వచ్చే గురువారం జూలై డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ఒడిదుడుకులను పెంచే అవకాశం ఉంది. సంస్కరణల ఎజెండా ఊపందుకుంటే మార్కెట్‌కు ఇది సానుకూలంకానుంది.’ అని సామ్కో సెక్యూరిటీస్ వ్యవస్థాపకులు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) జిమిత్ మోడి అన్నారు. ‘ఈ వారంలో డెరివేటివ్ ముగింపు ఒడిదుడుకులకు ఆజ్యంపోసే అవకాశం ఉంది.’ అనేది ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ విశ్లేషణ. ‘నిఫ్టీకి అత్యంత కీలక నిరోధం 11,078 వద్ద ఉండగా.. ఈ స్థాయిని అధిగమించినట్లయితే మరింత ర్యాలీ ఉంటుంది. దిగువస్థాయిలో 10,925 వద్ద మద్దతు ఉంది. అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. మార్కెట్ ప్రస్తుతం క్యూ1 ఫలితాల వెల్లడిపైనే దృష్టిసారించిందని వివరించిన డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి.. ప్రత్యేకించి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్ ఫలితాలపై మరింత ఎక్కువగా మార్కెట్ వర్గాలు దృష్టిసారించినట్లు వివరించారు. అలజడి రేపిన రూపాయి... డాలరుతో రూపాయి విలువ కదలికల విషయానికి వస్తే.. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో జీవితకాల కనిష్టస్థాయి 69.12 వద్దకు పతనమై ఆ తరువాత కొంత కోలుకుని ముగింపు సమయానికి 68.85 వద్ద స్థిరపడింది. అంతక్రితం రోజు ముగింపు 68.88 నుంచి 3 పైసలు కోలుకుంది. అయితే అంతకుముందు రోజైన గురువారం సైతం 69.05 వద్దకు క్షీణించి జీవితకాల కనిష్టస్థాయిని నమోదుచేసింది. మార్కెట్‌ను ఆదుకున్న డీఐఐలు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) సమాచారం మేరకు గడిచిన వారంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ.1,209 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇదే సమయంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ.1,300 కోట్ల విలువైన షేర్లను కొనుగోలుచేశారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) 129.80 మిలియన్ డాలర్లు (రూ.889 కోట్లు) విలువైన పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. -
కొత్త ఏడాదిలోనూ ఎఫ్‌పీఐల జోరు
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మన దేశ క్యాపిటల్ మార్కెట్ల పట్ల తమ మక్కువను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే మూడు బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ.19,200 కోట్లు) పెట్టుబడులు పెట్టారు. కార్పొరేట్ కంపెనీల ఎర్నింగ్స్ మెరుగుపడతాయన్న అంచనాలు, ఆకర్షణీయ రాబడులే వారిని పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత ఏడాది డిసెంబర్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్ల (డెట్, ఈక్విటీ) నుంచి నికరంగా రూ.3,500 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ఈ నెలలో ఇప్పటి వరకు నికర కొనుగోలుదారులుగా ఉండటం గమనార్హం. ‘‘ప్రస్తుత నెలలో విదేశీ పెట్టుబడుల ప్రవాహానికి.. ఎర్నింగ్స్ రికవరీపై ఉన్న అంచనాలు, ఆకర్షణీయ రాబడులే కారణం. ఈ అంశాలే విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల రాకను మరింత బలోపేతం చేస్తాయి’’అని 5నాన్స్ సీఈవో దినేష్ రోహిరా తెలిపారు. డిపాజిటరీల డేటా ప్రకారం ఈ నెల 1 నుంచి 25 వరకు... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నికరంగా ఈక్విటీల్లో రూ.11,759 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయగా, డెట్‌లో రూ.6,127 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. దీంతో నికరంగా 17,866 కోట్ల మేర వారు దేశీయ క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లయింది. 2017లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మన దేశ ఈక్విటీ, డెట్ మార్కెట్లో నికరంగా రూ.2 లక్షల కోట్ల మేర ఇన్వెస్ట్ చేయడం తెలిసిందే. అయితే, ఇదే పరిస్థితి 2018లోనూ పునరావృతం కాకపోవచ్చని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ పంకజ్ పాఠక్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో రేట్లు పెరగడం, ఉపసంహరణలే దీనికి కారణాలుగా పేర్కొన్నారు. -
ఏ ట్రేడింగ్‌కైనా ఒకటే ఎక్స్ఛేంజ్!
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ, పర్యవేక్షణ సంస్థ సెబీ... షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, కమోడిటీలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) సంబంధించి గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు షేర్లు, కమోడిటీలు, కరెన్సీ ట్రేడింగ్‌కు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లు ఉండగా... వీటిని ఒకే వేదికపైకి తీసుకురావాలని సెబీ నిర్ణయించింది. దేశంలోకి మరిన్ని విదేశీ నిధులు రావటానికి వీలుగా ఎఫ్‌పీఐ నిబంధనలను సరళతరం చేయటం, మ్యూచువల్ ఫండ్స్‌లో క్రాస్ హోల్డింగ్స్ (ఒక సంస్థకు రెండు మ్యూచువల్ ఫండ్స్‌లో వాటాలుండటం) పరిమితి 10 శాతంగా ఖరారు చేయడం సెబీ నిర్ణయాల్లో కీలకమైనవి. సమావేశం అనంతరం ఈ వివరాలను సెబీ చైర్మన్ అజయ్ త్యాగి మీడియాకు వెల్లడించారు. ఇన్వెస్ట్మెంట్ ఏదైనా... ఎక్స్ ఛేంజ్ ఒక్కటే సెబీ తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానమైనది స్టాక్స్, కమోడిటీలను ఒకే ఎక్స్ ఛేంజ్ ప్లాట్‌ఫామ్‌పై ట్రేడింగ్‌కు అనుమతించడం. దీంతో ఎంతో కాలంగా ఆసక్తితో వేచి చూస్తున్న కమోడిటీ, స్టాక్స్ అనుసంధానతకు ఎట్టకేలకు ఆమోదం లభించినట్లయింది. రెండు దశల్లో కమోడిటీ డెరివేటివ్స్, ఇతర సెక్యూరిటీ మార్కెట్ల ఏకీకరణ అంశంపై గురువారం నాటి సమావేశంలో సెబీ చర్చించి ఆమోదం తెలిపింది. సెక్యూరిటీల మార్కెట్ నియంత్రణ చట్టంలోని ప్రస్తుత నిబంధనలను తొలగించడం ద్వారా అనుసంధాన ప్రక్రియ 2018 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు త్యాగి చెప్పారు. దీంతో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని రకాల ఎక్సే్ఛంజ్‌లు స్టాక్స్, కమోడిటీల ట్రేడింగ్ ప్రవేశపెట్టేందుకు వీలు పడుతుంది. దేశంలో ప్రస్తుతం స్టాక్స్‌కు సంబంధించి బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రధాన ప్లాట్‌ఫామ్‌లుగా ఉండగా, కమోడిటీలకు సంబంధించి ఎంసీఎక్స్, ఎన్సీడీఈఎక్స్ పనిచేస్తున్నాయి. తాజా నిర్ణయంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు కమోడిటీ ట్రేడింగ్‌ను ఆరంభించే అవకాశాలున్నాయి. ఏకీకరణ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు వీలుగా దీన్ని రెండు దశల్లో చేపట్టాలని సెబీ నిర్ణయించింది. మొదటి విడతలో మధ్యవర్తిత్వ స్థాయిలో, రెండో విడతలో ఒకే ఎక్స్ఛేంజ్లో ఈక్విటీ, ఈక్విటీ డెరి వేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, వడ్డీ రేట్ల ఫ్యూచర్స్, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ తదితర వాటిని నడిపించేందుకు వీలు కల్పించనుంది. తొలి దశకు ఇప్పటికే చర్యలను తీసుకోగా, రెండో దశ కోసం చట్టంలో సవరణలు చేయాలని గురువారం నాటి సమావేశంలో నిర్ణయించింది. ఎఫ్‌పీఐలకు సుస్వాగతం... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ప్రవేశానికి ఉన్న నిబంధనలను సరళీకరించాలన్నది సెబీ మరో నిర్ణయం. మన దేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలున్న ఇతర దేశాల ప్రవేశానికీ ఇది వీలు కల్పించనుంది. విదేశీయులు ఎఫ్‌పీఐలుగా నమోదు చేసుకోకపోయినప్పటికీ, పార్టిసిపేటరీ నోట్ల ద్వారా భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంది. పీ–నోట్ల మార్గంలో కాకుండా నేరుగా ఎఫ్‌పీఐలుగా రిజిస్టర్ చేసుకుని వచ్చేలా చేయటమే తాజా నిర్ణయం వెనకనున్న ఉద్దేశం. ఫలితంగా కెనడా తదితర దేశ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది. సెక్యూరిటీ రిసీప్ట్‌ల లిస్టింగ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు జారీ చేసిన సెక్యూరిటీ రిసీప్ట్స్‌ను స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్ చేసుకునేందుకు సెబీ అనుమతించింది. సెక్యూరిటీ రంగానికి నిధుల లభ్యత పెంచేందుకు ఇది దోహదం చేయగలదని, ముఖ్యంగా బ్యాంకుల ఎన్పీఏల పరిష్కారానికి ఇది ఉపకరిస్తుందని త్యాగి తెలియజేశారు. సెక్యూరిటీ రిసీప్ట్ అనేది సెక్యూరిటైజేషన్ కంపెనీ లేదా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ జారీ చేసే పత్రం. మరోవైపు రియల్ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌ల (ఆర్ఈఐటీ) వృద్ధికి బాటలు వేస్తూ హోల్డింగ్ కంపెనీల్లో కనీసం 50 శాతం ఇన్వెస్ట్ చేసేందుకు వీటిని అనుమతించాలని కూడా సెబీ నిర్ణయం తీసుకుంది. ఫండ్స్‌లో 10 శాతమే... మ్యూచువల్ ఫండ్స్‌లో క్రాస్హోల్డింగ్స్ను 10%కి పరిమితం చేయాలని సెబీ నిర్ణయించింది. అంటే ఏదైనా ఒక సంస్థకు ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థలో 10 శాతం వాటా ఉంటే, మరో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలో 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటా కలిగి ఉండేందుకు ఇకపై వీలు కాదు. దీనివల్ల యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ ప్రమోటర్ల వాటాల్లో మార్పులు జరుగుతాయి. ఎందుకంటే ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ, ఎల్ఐసీ సంస్థలకు యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో 18.24 శాతం చొప్పున వాటాలున్నాయి. ఈ సంస్థలకు సొంతంగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కూడా ఉండటంతో యూటీఐలో వాటాలు తగ్గించుకోవాల్సి వస్తుంది. సమాచారం లీక్ అయితే చర్యలు... కంపెనీలకు సంబంధించి కీలకమైన ఆర్థిక వివరాలను వాట్సాప్ వంటి వేదికల ద్వారా ముందుగానే సర్క్యులేట్ చేసిన ఘటనల నేపథ్యంలో సెబీ తాజాగా గట్టి హెచ్చరికలు చేసింది. ఈ విషయంలో బాధ్యులైన వారు, ఆడిటర్లతో పాటు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అవసరమైతే ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను కఠినతరం చేస్తామన్నారు. ఇటీవల వాట్సాప్‌లో సమాచారాన్ని లీక్ చేసిన ఘటనలో కంపెనీల పాత్ర ఉందని త్యాగి స్పష్టం చేశారు. -
మూడోరోజూ లాభాల్లోనే...
ఫార్మా షేర్ల జోరు... ∙స్వల్పంగా పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ ∙సుప్రీం వివరణతో లిక్కర్ షేర్ల రయ్ ముంబై: అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు వెలువడినప్పటికీ... దేశీ స్టాక్ సూచీలు మాత్రం లాభాల హ్యాట్రిక్‌ను నమోదుచేశాయి. ప్రధానంగా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిశాయి. గురువారం ట్రేడింగ్‌లో సూచీలు ఆద్యంతం పరిమిత శ్రేణిలోనే కదలాడాయి. చివరకు సెన్సెక్స్ 28 పాయింట్ల పెరుగుదలతో 31,596 పాయింట్ల వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 9,857 వద్ద ముగిశాయి. గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్ 309 పాయింట్లు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రాథమిక సమాచారం ప్రకారం దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) నికరంగా రూ.1,044 కోట్ల మేర కొనుగోళ్లు జరపగా... విదేశీ మదుపరులు(ఎఫ్‌పీఐ) రూ.696 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. అమెరికాలో పరిణామాలపై దృష్టి... మెక్సికో సరిహద్దు వెంబడి గోడను నిర్మించేందుకు తగిన నిధులను కేటాయించేందుకు అవసరమైతే ప్రభుత్వ కార్యకలాపాల నిలిపివేతకు (షట్‌డౌన్) కూడా వెనుకాడబోనని అమెరికా అధ్యక్షుడు చేసిన హెచ్చరికతో ముందురోజు వాల్‌స్ట్రీట్ నష్టాల్లో ముగిసింది. దీని ప్రభావంతో ఆసియాలో కూడా ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి. మరోపక్క, ప్రపంచంలోని కీలక సెంట్రల్ బ్యాంకర్ల సదస్సు గురువారం అమెరికాలోని జాక్సన్హోల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో విధానపరంగా ఎలాంటి ప్రకటనలు ఉండొచ్చన్న దానిపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారించినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటెజిస్ట్ ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల అప్రమత్త ధోరణి కారణంగానే మన మార్కెట్లు కూడా పరిమిత శ్రేణిలో(రేంజ్ బౌండ్)లో కదలాడాయని చెప్పారు. ఇక వినాయక చవితి సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు కావడంతో ట్రేడింగ్ వరుసగా మూడు రోజులు ట్రేడింగ్‌కు విరామం రావడంకూడా ఇన్వెస్టర్ల అప్రమత్త ధోరణికి ఒక కారణమని ఆయన తెలిపారు. ఫార్మా రయ్... ఇటీవల కాలంలో భారీగా పడిన ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లకు దిగువస్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో దూసుకెళ్లాయి. ఈ రంగం సూచీ 2.53 శాతం ఎగసింది. సెన్సెక్స్ జాబితా ఉన్నవాటిలో లుపిన్ అత్యధికంగా 3.87 శాతం లాభపడగా, సన్ ఫార్మా 3.1 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.88 శాతం, సిప్లా 2.47 శాతం చొప్పున ఎగబాకాయి. జైడస్ క్యాడిలాకు చెందిన యాంటీ హైపర్‌టెన్షన్ ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి లభించిన వార్తలతో క్యాడిలా హెల్త్‌కేర్ షేరు 7 శాతం రివ్వుమంది. దీంతోపాటు ఐటీ, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు కూడా లాభాల్లో నిలిచాయి. నందన్ నీలేకని ఇన్ఫీ చైర్మన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్తలతో ఇన్ఫోసిస్ 2 శాతం ఎగసి రూ.913 వద్ద స్థిరపడింది. ఇంకా లాభపడిన షేర్లలో టాటామోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, పవర్‌గ్రిడ్ ఉన్నాయి. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీ నాల ప్రక్రియ వేగవంతం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముందుజోరు ర్యాలీ జరిపిన బ్యాంకింగ్ షేర్లలో గురువారం మళ్లీ నిస్తేజం ఆవహించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు స్వల్పంగా పెరగ్గా.. ప్రైవేటు బ్యాంకుల్లో చాలావరకూ మిశ్రమంగా ముగిశాయి. లిక్కర్ షేర్లకు ‘సుప్రీం’ కిక్... జాతీయ రహదారుల పక్కన లిక్కర్ షాపులపై విధించిన నిషేధం నగరాలు, మునిసిపాలిటీల పరిధిలోని వాటికి వర్తించబోదని సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వడంతో లిక్కర్ కంపెనీల షేర్లకు జోష్ లభించింది. యునైటెడ్ స్పిరిట్స్, తిలక్‌నగర్ ఇండస్ట్రీస్, గ్లోబస్ స్పిరిట్స్, జీఎం బ్రూవరీస్ తదితర షేర్లు 12 శాతం వరకూ దూసుకెళ్లాయి. నేడు మార్కెట్లకు సెలవు... వినాయకచవితి సందర్భంగా నేడు (శుక్రవారం) స్టాక్ మార్కెట్లతోపాటు బులియన్, ఫారెక్స్, ఇతర కమోడిటీ మార్కెట్లన్నింటికీ సెలవు ప్రకటించారు. -
నాలుగు రోజుల్లో రూ.5,000 కోట్లు
డెట్ మార్కెట్లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడుల వరద అధిక రాబడులే ఆకర్షణీయం న్యూఢిల్లీ: భారతీయ డెట్ మార్కెట్లు విదేశీ పోర్ట్ ఫోలియో (ఎఫ్‌పీఐ) ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కేవలం గత నాలుగు పని దినాల్లో రూ.5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడం దీన్నే సూచిస్తోంది. స్టాక్ విలువలు గరిష్ట స్థాయిల్లో ఉండడంతో ఎఫ్‌పీఐలు ఇదే సమయలో ఈక్విటీల నుంచి రూ.1,500 కోట్లు వెనక్కి తీసేసుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం ఎఫ్ -
ఈక్విటీల్లోకి పెట్టుబడుల వరద
♦ ఆరు నెలల్లో రూ.97,000 కోట్లు ♦ ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐ, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ♦ మార్కెట్ల రికార్డులకు వెన్నుదన్ను ♦ విదేశీ ఇన్వెస్టర్లకు దీటుగా దేశీయ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ♦ ఇది ఆరోగ్యకర సంకేతమంటున్న నిపుణులు న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్ల భారీ ర్యాలీకి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ), మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) సంస్థలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఇందుకు నిదర్శనం ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల్లో వీరు నికరంగా రూ.97,705 కోట్లను పెట్టుబడులుగా పెట్టడమే. వీటిలో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ.55,908 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, ఫండ్స్ పెట్టుబడులు రూ.41,797 కోట్లుగా ఉన్నాయి. 2016 సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో పోల్చి చూస్తే ఈ ఏడాదిలో ఎఫ్‌పీఐలు, మ్యూచువల్ ఫండ్స్ మూడు రెట్లు అధికంగా పంప్ చేయడం విశేషం. బుల్ మార్కెట్ వాతావరణాన్ని ఇది ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2016 తొలి ఆరు నెలల్లో ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు, మ్యూచువల్ ఫండ్స్ నికర పెట్టుబడులు రూ.28,811 కోట్లుగా ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్న విషయం తెలిసిందే. ఎఫ్‌పీఐలు, ఫండ్స్ నుంచి వస్తున్న నిధుల వెల్లువలు సూచీలు ఈ స్థాయికి చేర డంలో ప్రధాన పాత్ర పోషించాయని చెప్పుకోవాలి. మార్కెట్లు ఈ ఏడాదిలో ఇప్పటికే 18 శాతానికి పైగా పెరిగి ప్రపంచంలో మంచి పనితీరు చూపించిన మార్కెట్లుగా నిలిచాయి. మిడ్, స్మాల్ క్యాప్‌లలో అయితే ఈ పెరుగుదల మరింత వేగంగా ఉంది. ఈ సూచీలు సమారు 30 శాతం మేర పెరగడం గమనార్హం. 11 నెలలుగా ఫండ్స్ జోరు మ్యూచువల్ ఫండ్స్ ఈ ఏడాది జనవరి – జూన్ కాలంలో పెట్టిన పెట్టుబడులు రూ.41,797 కోట్లు కాగా, వీటిలో రూ.30,328 కోట్లు (మొత్తంలో 78 శాతం) కేవలం మూడు నెలలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో వచ్చినవే. అంతేకాదు, 2016 ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకూ ఫండ్స్ ఈక్విటీ విభాగంలో నికర కొనుగోలుదారులుగానే కొనసాగుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ పట్ల ప్రాచుర్యం, అవగాహన పెరగడం వీటిలోకి నిధుల రాక అధికం కావడానికి కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఎఫ్‌పీఐల రూ.55,908 కోట్ల పెట్టుబడుల్లో ఒకటో వంతు రూ.16,097 కోట్లు ఐపీవో మార్గంలో వచ్చినవి కావడం గమనార్హం. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు ఏర్పాటైన తర్వాత అంటే 2014 జూన్ క్వార్టర్లో ఎఫ్‌పీఐలు భారీగా రూ.59,521 కోట్లను ఈక్విటీల్లోకి పంప్ చేయగా, ఆ తర్వాత అత్యధికంగా ఇన్వెస్ట్ చేసింది ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలోనే. ఎఫ్‌పీఐలు, ఫండ్స్ 2008 తొలి ఆరు నెలల్లో నికరంగా రూ.17,114 కోట్ల నిధుల్ని వెనక్కి తీసుకోగా, ఇక ఆ తర్వాత ఇప్పటి వరకూ ఏటా తొలి ఆరు నెలల్లో నికర కొనుగోలుదారులుగానే ఉన్నారు. ఇక ముందూ మన మార్కెట్లు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయనే పరిశీలకులు భావిస్తున్నారు. సమీప కాలంలో పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం ఉన్నప్పటికీ అది సాధారణ ప్రక్రియలో భాగమేనంటున్నారు. ‘‘దీర్ఘకాలంలో వృద్ధి పరంగా భారత్‌కు ఉన్న అవకాశాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన అంశమేమిటంటే దేశీయ ఇన్వెస్టర్ల నుంచి కూడా పెట్టుబడులు పెరగడం. ఇది మార్కెట్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల అంతర్జాతీయ అంశాల కారణంగా దేశీయ మార్కెట్లలో ఆటుపోట్లు తగ్గుతాయి’’ అని వేద ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు జ్యోతివర్ధన్ జైపూరియా పేర్కొన్నారు. ఇన్వెస్టర్లలో పరిణతి ఇన్వెస్టర్లలో పరిణతి పెరిగింది. నిపుణుల ఆధ్వర్యంలో సరైన నియంత్రణలతో నడిచే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు సురక్షితమని వారు అర్థం చేసుకుంటున్నారు. అదే సమయంలో ఇతర పెట్టుబడి సాధనాలైన రియల్టీ, బంగారం ఆకర్షణను కోల్పోయాయి. దీంతో వారు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు – నీలేష్‌షా, ఎండీ,కోటక్ మహింద్రా అస్సెట్ మేనేజ్మెంట్ -
జోరుగా విదేశీ ఇన్వెస్టర్ల నమోదు
ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,700 మంది జత న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడి అవకాశాల పట్ల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అధికాసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో కొత్తగా 1,700 మంది విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ)మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద నమోదు కావడమే దీనికి నిదర్శనం. గత ఆర్థిక సంవత్సరంలో 2,900 మంది నమోదు చేసుకున్నారని, ఈ ఏడాది మార్చి నాటికి తమ వద్ద నమోదైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లసంఖ్య 4,311గా ఉందని, ఈ ఏడాది అక్టోబర్ చివరినాటికి ఈ సంఖ్య 6,079కు పెరిగిందని సెబీ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్–అక్టోబర్ కాలానికి విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.2,800 కోట్లు పెట్టుబడులు పెట్టగా,డెట్‌మార్కెట్ల నుంచి రూ.42,600 కోట్లు ఉపసంహరించుకున్నారని పేర్కొంది. విదేశీ నిధులు తరలిపోవడానికి పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ఒక కారణం కావచ్చని సెంట్రమ్ బ్రోకింగ్ ఫండ్ మేనేజర్ అంకిత్ అగర్వాల్ చెప్పారు.పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్వల్పకాలమేనని, దీర్ఘకాలంలో విదేశీ పెట్టుబడులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వివరించారు. దీర్ఘకాలానికి భారత వృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. నల్ల ధనంనిరోధానికి, నగదు లావాదేవీల్లో మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల దీర్ఘకాలంలో సానుకూల స్పందన వ్యక్తం కావచ్చని వివరించారు. భారత్‌కు ప్రాధాన్యం భారత మార్కెట్ నిలకడగా ఉందని, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయని, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు అపారమని, ఆర్థిక, సామాజిక సంస్కరణలు జోరుగా కొనసాగుతున్నాయని అందుకే భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికివిదేశీ ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారని నిపుణులంటున్నారు. కంపెనీ బాండ్లలో నేరుగా పెట్టుబడులు పెట్టడానికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు సెబీ ఆనుమతించిన విషయం తెలిసిందే. -
కొత్త రిజిస్టర్డ్ ఎఫ్ పీఐలు ఎన్నో తెలుసా..?
న్యూఢిల్లీ : మార్కెట్ నిదానంగా కొనసాగుతున్నప్పటికీ 2015-16 ఆర్థికసంవత్సరంలో దాదాపు 2,900 కొత్త విదేశీ పోర్ట్ ఫోలియో మదుపరులు(ఎఫ్ పీఐలు) సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) దగ్గర నమోదు చేసుకున్నారట. సెబీ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మూలధన మార్కెట్లో 1,444 మంది కొత్త రిజిస్ట్ర్డర్డ్ ఎఫ్ పీఐలు ఉన్నారని సెబీ డేటా తెలిపింది. అదనంగా 2,867 ఎఫ్ పీఐలకు గత ఆర్థికసంవత్సరం సెబీ నుంచి అనుమతులు లబించాయని డేటా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన రూ.1.11 లక్షల కోట్ల నుంచి రూ.14వేల కోట్లకు పైగా మొత్తాన్ని ఎఫ్ పీఐలు విత్ డ్రా చేసుకున్నారని డేటా పేర్కొంది. బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ గత ఆర్థిక సంవత్సరం 9.36శాతం పడిపోయింది. వివిధ కేటగిరీలో ఉన్న విదేశీ మదుపరులను కొత్త క్లాస్ ఎఫ్ పీఐ ల్లో కలుపుతూ.. సెబీ 2014లో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలతో ఎఫ్ పీఐలను రిస్క్ ప్రొఫైల్, నో యువర్ క్లెయింట్(కేవైసీ) అవసరాలు, రిజిస్ట్రేషన్ పద్ధతులకు అనుగుణంగా మూడు రకాలుగా వర్గీకరించారు. అంతకముందు భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ సంస్థలకు ఒక ఏడాదికి లేదా ఐదేళ్లకు మాత్రమే అనుమతులు లభించేవి. అయితే ప్రస్తుత ఎఫ్ పీఐలకు శాశ్వత రిజిస్ట్రేషన్ అనుమతులను సెబీ కల్పించింది. బోర్డు సస్పెండ్ లేదా రద్దు అయ్యేంతవరకూ ఈ రిజిస్ట్రేషన్ శాశ్వతంగా ఉంటుంది. అదేవిధంగా డీమ్డ్ ఎఫ్ పీఐలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 4,406 పెరిగాయని డేటా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 6,772 ఉన్నాయి. 55 వివిధ అధికార ప్రాంతాలకు చెందిన ఎఫ్ పీఐలు సెబీ దగ్గర నమోదయ్యాయి. -
పన్ను సమస్యలను పరిష్కరిస్తాం
విదేశీ ఇన్వెస్టర్లకు ఆర్థిక శాఖ హమీ * దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పన్ను సంబంధిత ఆందోళనలన్నింటినీ వీలైనంతం వేగంగా పరిష్కరిస్తామని కేంద్రం హామీనిచ్చింది. అయితే, దేశంలో శాశ్వత కార్యకలాపాలను ఏర్పాటు చేయాల్సిందిగా వారిని కోరుతున్నట్లు కూడా పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2016-17) బడ్జెట్ కసరత్తులో భాగంగా మంగళవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు దిగ్గజ ఎఫ్‌పీఐలతో భేటీ అయ్యారు. సిటీ బ్యాంక్, డాయిష్ బ్యాంక్, ఫిడిలిటీ, గోల్డ్‌మన్ శాక్స్, బ్లాక్‌రాక్ సహా రెండు డజన్లకుపైగా అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ఈ భేటీలో ఎఫ్‌పీఐలు అనేక సూచనలు, సలహాలను ఇచ్చారు. ప్రభుత్వం వీటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఇక పన్ను సంబంధ సమస్యలు సహజంగా ఉత్పన్నమైనవే. దేశంలో ఫండ్ మేనేజ్మెంట్ పరిశ్రమ స్థితిగతులపై కూడా మేం చర్చించాం’ అని ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్బీఐ, సెబీ, సీబీడీటీలకు చెందిన ఉన్నతాధికారులకు కూడా ఈ సమావేశానికి హజరయ్యారు. ప్రస్తుతం ఎఫ్‌పీఐలు భారత్‌తో ద్వంద్వ పన్ను నిరోధక ఒప్పందం(డీటీఏఏ) ఉన్న దేశాల నుంచి తమ నిధులను ఇక్కడికి తరలిస్తున్నారని.. దీనివల్ల వారికి స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు లభిస్తున్నట్లు దాస్ చెప్పారు. అయితే, ఆయా సంస్థలు భారత్‌లోనే తమ కార్యకాలాపాలను నెలకొల్పినట్లయితే ఇక్కడి చట్టాల ప్రకారం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందన్నారు. కార్పొరేట్ బాండ్లపై 5 శాతం విత్‌హోల్డింగ్ పన్ను అంశాన్ని ఈ సమావేశంలో చర్చించినట్లు నోమురా ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఎండీ నీరజ్ గంభీర్ చెప్పారు. 2017తో ఈ 5 శాతం పన్ను విధింపునకు గడువు ముగియనుంది. ఈ ఏడాది వృద్ధి 7.5 శాతం పైనే... * ఎస్అండ్పీ అంచనాలతో విబేధం భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) వెలిబుచ్చిన అనుమానాలను శక్తికాంత దాస్ తోసిపుచ్చారు. అది కేవలం ఆ సంస్థ అభిప్రాయం మాత్రమేనని.. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.5 శాతంపైనే ఉంటుందని తాము అంచనావేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వృద్ధి జోరందుకోవాడానికి ప్రభుత్వం మరిన్ని సంస్కరణ చర్యలను చేపట్టనున్నట్లు కూడా దాస్ వెల్లడించారు. భారత్ ఆర్థిక మూలాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయన్నారు. కాగా, భారత్ సార్వభౌమ రేటింగ్‌ను ఇప్పుడున్న బీబీబీ(మైనస్) స్థాయిలోనే కొనసాగిస్తున్నట్లు ఎస్అండ్పీ తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా రేటింగ్ పెంచే అవకాశాల్లేవని స్పష్టం చేసింది. పెట్టుబడులకు సంబంధించి ఇదే అత్యల్ప స్థాయి రేటింగ్. కాగా, విధాన, సంస్కరణల పరంగా తాము ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని... రేటింగ్ అప్‌గ్రేడ్ చేయాలంటూ ఆర్థిక శాఖ చాన్నాళ్లుగా కోరుతున్న సంగతి తెలిసిందే. -
కావేరి సీడ్స్‌లో ఎఫ్‌పీఐల వాటా పెంపునకు ఆర్బీఐ ఓకే
ముంబై: విత్తన తయారీ సంస్థ కావేరి సీడ్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) వాటాను 49 శాతానికి పెంచుకునేందుకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. 2015 మార్చి చివరి నాటికి కంపెనీలో ఎఫ్ఐఐల వాటా 22.26 శాతం ఉంది. వాటా కొనుగోలుకు ఉన్న పరిమితులను తొలిగిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద ఎఫ్ఐఐలు లేదా ఆర్‌ఎఫ్‌పీఐలు 49 శాతం వరకు పెట్టుబడి పెట్టొచ్చని తెలిపింది. ఎఫ్ఐఐల పరిమితిని ప్రస్తుతమున్న 24 నుంచి 49 శాతానికి చేర్చేందుకు బోర్డుతోపాటు వాటాదారుల నుంచి కంపెనీ మే నెలలో సమ్మతి పొందింది. -
చట్టబద్ధమైన పన్నులు కట్టాల్సిందే..
నోటీసులను వేధింపులుగా భావించనక్కర్లేదు ఎగవేతదారులకు భారత్ స్వర్గధామం కాదు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: చట్టబద్ధమైన పన్నులు కట్టాలంటూ నోటీసులివ్వడాన్ని పన్నులపరమైన వేధింపులుగా పరిగణించనక్కర్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పన్ను బకాయిలను తప్పనిసరిగా చెల్లించాల్సిందేనన్నారు. అలాగే, భారత్‌ను పన్ను రహిత స్వర్గధామంగా భావించరాదని ఆయన చెప్పారు. దాదాపు 100 విదేశీ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 5-6 బిలియన్ డాలర్ల మేర పన్నుల నోటీసులు ఇవ్వడాన్ని సమర్థించిన జైట్లీ .. భారత్‌లో చట్టబద్ధమైన పన్నులను చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. చట్టబద్ధమైన ప్రతీ పన్ను డిమాండ్‌నూ ట్యాక్స్ టైజం అంటూ వ్యాఖ్యానిస్తే వెనక్కి తగ్గిపోయేంత బలహీన పరిస్థితిలో భారత్ లేదని జైట్లీ స్పష్టం చేశారు. గడిచిన కొన్నాళ్లుగా భారత మార్కెట్లలో పన్నులు చెల్లించకుండా పొందిన లాభాలపై తాజాగా 20 శాతం కనీస ప్రత్యామ్నాయ పన్నులు (మ్యాట్) కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ దాదాపు 100 ఎఫ్ఐఐలకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పన్నుల నోటీసులపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో కావాలంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని, అయితే చట్టబద్ధంగా చెల్లించాల్సిన వాటిని మాత్రం చెల్లించి తీరాల్సి ఉంటుందని జైట్లీ చెప్పారు. పెట్టుబడులకు కేంద్రంగా ఎదగాలనుకునే ఏ వర్ధమాన దేశం కూడా ట్యాక్స్ టైజం వంటి వాటికి పాల్పడే దుస్సాహసం చేయబోదన్నారు. మరోవైపు ఎఫ్ఐఐలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై (ఎఫ్‌పీఐ) మ్యాట్ విధింపునకు ముందు అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించినట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్)కు కూడా మ్యాట్ వర్తిస్తుందని చెప్పిన మీదటే ఆదాయ పన్ను అసెసింగ్ అధికారులు డిమాండ్ నోటీసులు పంపినట్లు ఆయన తెలిపారు. పన్నుల చట్టాలు సరళతరం.. పన్నుల రేట్లను క్రమబద్ధీకరించే దిశగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానాలను సరళతరం చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని జైట్లీ చెప్పారు. బ్లాక్‌మనీపై కొత్త చట్టాన్ని ప్రస్తావిస్తూ.. విదేశాల్లో నల్లధనం దాచిపెట్టుకున్న వారు స్వచ్ఛందంగా వెల్లడించి, తగు పన్నులు కట్టేందుకు తగినంత సమయం ఇస్తామన్నారు. ఇక వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంపై విస్తృత ఏకాభిప్రాయం ఉందని, ఏప్రిల్ 20న మొదలయ్యే తదుపరి బడ్జెట్ సెషన్లో ఇందుకు సంబంధించిన సవరణ బిల్లు ఆమోదం పొందగలదని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. పన్నులపరమైన సంస్కరణల్లో దేశ చరిత్రలోనే ఇది అత్యంత ముఖ్యమైనది కాగలదని ఆయన చెప్పారు. అటు భూసేకరణ చట్టంలో సవరణలకు ఆమోదం పొందడం పెను సవాలేనని జైట్లీ పేర్కొన్నారు. కంపెనీల కష్టాలపై కమిటీ.. కొత్త కంపెనీల చట్టం సజావుగా అమలయ్యేలా చూసే దిశగా.. కార్పొరేట్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించేందుకు కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ చెప్పారు. కంపెనీల చట్టంలో ప్రతిపాదిత సవరణలకు పార్లమెంటు ఆమోదం పొందటం తమ తక్షణ ప్రాధాన్యతాంశంగా ఆయన తెలిపారు. ఒక చట్టం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే దానికి సవరణలు కూడా చేయాల్సి రావడం చాలా అరుదంటూ.. గత ప్రభుత్వానికి చురకలు వేశారు. అవినీతి నిరోధక చట్టానికి సవరణలు.. వివిధ కుంభకోణాల్లో పలువురు పరిశ్రమ దిగ్గజాలు, విధానకర్తలపై క్రిమినల్ కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టానికి సవరణలు చేపట్టాలని యోచిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. -
ఎఫ్‌పీఐలకు సెబీ నిబంధనలు
ముంబై: విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా సెబీ మరిన్ని చర్యలు తీసుకుంది. కొత్తగా రూపొందించిన ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (ఎఫ్‌పీఐ) తరగతి ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు విధి విధానాలను శనివారం ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనవాటిని సులభతరం చేసింది. ప్రస్తుతం వేర్వేరు తరగతులుగా ఉన్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ), క్వాలిఫైడ్ ఫారిన్ ఇన్వెస్టర్లను (క్యూఎఫ్ఐ) కలిపి ఎఫ్‌పీఐ పేరిట కొత్త తరగతి ఏర్పాటు చేశారు. రిస్కు సామర్థ్యాన్ని బట్టి ఇందులో ఇన్వెస్టర్లు మూడు కేటగిరీలుగా విభజిస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలకు భిన్నంగా ఎఫ్‌పీఐలకు శాశ్వత రిజిస్ట్రేషన్ వెసులుబాటు లభిస్తుంది. శనివారం సమావేశంలో కొత్త నిబంధనలను బోర్డు ఆమోదించింది. సెక్యూరిటీలు, దేశీ ఫండ్స్ పథకాలు, ప్రభుత్వ బాండ్లు వంటి వాటిల్లో ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేయొచ్చు.