అధికమొత్తంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2025 ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74% నుంచి 100%కు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ మార్పు చాలా బీమా రంగంలో అవసరమైన మూలధనం సమకూరుతుందని, పోటీని పెంచుతుందని, దేశవ్యాప్తంగా బీమా వ్యాప్తిని మెరుగుపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ చర్య 2047 నాటికి ‘అందరికీ బీమా’ అనే ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలు, షరతులను సమీక్షించి కేంద్రం వాటిని సరళీకృతం చేయనుంది. ఎఫ్‌డీఐ పరిమితిని పెంచడం వల్ల మరిన్ని గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఆకర్షించడం, పోటీని పెంచడం, కొత్త మార్కెట్‌ను తీసుకురానున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ సంస్కరణ బీమా సంస్థలు ఒకే విధానంతో తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి, కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించడానికి అనుమతిస్తుంది.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్.. వంటి ప్రధాన బీమా కంపెనీల షేర్లు ఈ ప్రకటన తర్వాత భారీగా లాభపడ్డాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రపంచ స్థాయి నైపుణ్యాలు, వనరులను తీసుకువచ్చేందుకు, మెరుగైన రిస్క్ మేనేజ్‌మెంట్‌కు దోహదం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment