భారత్‌లో దాదాపు 16 చైనా సంస్థలు ఎఫ్‌పీఐ(విదేశీ సంస్థాగత మదుపరి)లుగా నమోదయ్యాయి. వీటిలో ప్రఖ్యాత ఏఐఐబీ(ఆసియన్ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్), పీబీఓసీ(పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా), ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్(నేషనల్ సోషల్ సెక్యూరిటీ ఫండ్)లాంటి దిగ్గజాలున్నాయి. ఇవన్నీ భారత్‌లో శాశ్వత ఎఫ్‌పీఐ రిజిస్ట్రేషన్ పొందాయి. ఇటీవల కాలంలో వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను సెబి రెన్యువల్ చేసిందన్న వార్తలు వస్తున్నాయి. కానీ నిజానికి ఇవన్నీ శాశ్వత ఎఫ్‌పీఐలు, రెన్యువల్ అవసరం లేనివని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇవన్నీ మూడేళ్లకు ఒకసారి నిర్ధేశిత ఫీజులు చెల్లిస్తుంటాయి. ఇందులో సెబికి ఎలాంటి సంబంధం ఉండదు. 2014లో దేశంలో కొత్త ఎఫ్‌పీఐ నిబంధనలు తీసుకువచ్చారు. అప్పటికే రిజిస్టరయిన ఎఫ్‌ఐఐలు కొత్త నిబంధనల ప్రకారం తిరిగి రిజిస్టర్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఈ చైనా సంస్థలన్నీ శాశ్వత రిజిస్ట్రేషన్ పొందాయి.
పైన పేర్కొన్న సంస్థలతో పాటు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, చైనా ఏఎంసీ గ్లోబల్ ఫండ్, సీఐఎఫ్‌ఎం ఏసియా పసిఫిక్ ఫండ్, ఫ్లోరిష్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, మాన్యులైఫ్ టెడా ఫండ్, వీఛీలైలకు చెందిన ఇతర సంస్థలు ఇండియాలో ఎఫ్‌పీఐలుగా రిజిస్టరయ్యాయి. వీటితో పాటు 111 హాంకాంగ్ ంస్థలు, 124 తైవాన్ సంస్థలు ఇండియాలో ఎఫ్‌పీఐ రిజిస్ట్రేషన్ పొందిఉన్నాయి. ఇటీవలి కాలంలో చైనా ఎఫ్‌పీఐలు భారతీయ కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి వీటి పెట్టుబడులు ఇతర దేశాల ఎఫ్‌పీఐలతో పోలిస్తే స్వల్పమేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో అత్యధిక విదేశీ పెట్టుబడులు పెట్టిన జాబితాలో వరుసగా యూఎస్, మారిషస్, సింగపూర్, లగ్సెంబర్గ్, యూకే, ఐర్లాండ్, కెనెడా, జపాన్, నార్వే, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఈ దేశాల ఎఫ్‌ఐఐల పెట్టుబడులన్నీ కలిపి మొత్తం ఎఫ్‌ఐఐ పెట్టుబడుల్లో 80 శాతం వరకు ఉంటాయని అంచనా.
భారత్‌లో చైనా ఎఫ్‌పీఐలు ఇవే!
Published Fri, May 22 2020 1:28 PM | Last Updated on Fri, May 22 2020 1:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment