గడచిన ఏడాదిలో విదేశీ ఇన్వెస్టర్లు 254 కంపెనీల్లో వాటాలను తగ్గించుకున్నారు. 12నెలల్లో ఏకంగా 8నెలల్లో వారు నికర అమ్మకందారులుగా నిలిచారు. అయితే మొత్తం ప్రతిపాదికన రూ.5వేల కోట్లతో ఎఫ్‌ఐఐలే నికర కొనుగోలుదారులుగా ఉన్నట్లు ఏస్ ఈక్విటీ గణాంకాలు చెబుతున్నాయి. ఎఫ్ఐఐలు ఫైనాన్షియల్, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్, టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో వాటాను విక్రయించారు.
వాల్యూయేషన్ ప్రాతిపదికన, కార్పోరేట్ పాలన సమస్యల దృష్ట్యా, డిమాండ్ పతనం, లేదా లాభాల స్వీకరణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎఫ్‌ఐఐలు కంపెనీల్లో వాటాలను విక్రయించి ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎఫ్‌ఐఐలు వాటాలను విక్రయించిన 254 కంపెనీల్లో సన్ ఫార్మా, డాబర్ ఇండియా, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్‌లున్నాయి. ఈ మొత్తం 254 కంపెనీల్లో 93 కంపెనీల షేర్లు 50శాతం నష్టాన్ని చవిచూశాయి. పీసీ జూవెలరీస్, ఫ్యూచర్స్ రీటైల్, సద్భావన్ ఇంజనీరింగ్, కాక్స్ అండ్ కింగ్స్, మన్‌పసంద్ బేవరీజెస్, మాగ్మా ఫిన్ కార్ప్, ధావన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు ఉన్నాయి.
‘‘వాల్యూయేషన్ల విస్తరణ, కార్పోరేట్ పాలన బాగోలేకపోవడం, పెరుగుతున్న పోటీ తదితర కారణాల దృష్ట్యా ఎఫ్‌ఐఐలు కంపెనీల్లో వాటాను తగ్గించుకొని ఉండొచ్చు. కారణలేవైనప్పటికీ.., జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్, నెస్లే ఇండియా, అలెంబిక్ ఫార్మా, సిప్లా, డాబర్ లాంటి బ్లూచిప్ కంపెనీల్లో వాటాలను తగ్గించుకోవడం కొంత ఆందోళలను కలిగించే అంశం.’’ అని ఎస్‌ఎస్‌జే ఫైనాన్స్ సీనియర్ విశ్లేకుడు అతీష్ మత్లావాలా తెలిపారు.
ఇన్వెస్టర్లు ఏంచేయాలి..?
కేవలం ఎఫ్‌ఐఐలు వాటా విక్రయించారనే ఒకే కారణంతో షేర్లను అమ్మేయం మంచి పద్దతి కాదని విశ్లేషకులు అంటున్నారు. కంపెనీల గత ఆర్థిక ట్రాక్ రికార్డు, ప్రమోటర్ల పనితీరు, బ్యాలెన్స్ షీట్, నగదు ప్రవాహం, వ్యాల్యూయేషన్లు, వృద్ధి అవకాశాలను విశ్లేషించడం చాలా ముఖ్యమని వారు తెలిపారు.
కోవిడ్-19 సమయంలో కంపెనీ కనబరిచిన ప్రదర్శన, వచ్చే త్రైమాసికాలకు సంబంధించి యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలు లాంటి అంశాలను స్పష్టంగా అధ్యయనం చేసి పిదప స్టాక్స్‌లో లాభాల స్వీకరణ గానీ, స్టాక్స్ నుంచి పూర్తిగా వైదొలగడం కాని చేయాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా నిపుణులు పర్యవేక్షణలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎఫ్‌ఐఐలు చివరి నాలుగు క్వార్టర్ల నుంచి అనేక చిన్న-మధ్య తరహా కంపెనీల్లో తమ వాటాలను క్రమంగా తగ్గించుకుంటున్నారు. డిమాండ్ మందగించడం, ఆర్థిక వ్యవస్థ క్షీణత ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. చిన్న-మధ్య తరహా స్టాకులు 2018 నుంచి బేర్‌ఫేజ్‌లో ఉన్నాయి. అయితే బెంచ్‌మార్క్ ఇండెక్స్ ఏడాదిలోని బేర్ ఫేజ్‌లోకి ప్రవేశించాయి.
Comments
Please login to add a commentAdd a comment