భారత స్టాక్‌మార్కెట్ బిగ్‌బుల్, ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అతని సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలాలు తొలి త్రైమాసికంలో అగ్రోటెక్ ఫుడ్స్ షేర్లలో వాటాను తగ్గించుకున్నారు. మార్చి 31 నాటికి ఈ ఇద్దరికి అగ్రోటెక్‌లో 5.75శాతం వాటా ఉండేది. ఈ తొలి త్రైమాసికంలో వారిద్దరూ 1.46లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించడంతో మొత్తం వాటా 5.14శాతానికి దిగివచ్చినట్లు ఎక్చ్సేంజ్‌లు చెబుతున్నాయి.
అదేబాటలో ఎఫ్‌ఫీఐలు కూడా...
ఇదే కంపెనీలో విదేశీ ఇన్వెస్టర్లు సైతం వాటాలను తగ్గించుకున్నాయి. మార్చి 31లో 8.58శాతంగా ఉన్న ఎఫ్‌పీఐ వాటా... 2020 క్యూ1 నాటికి 8.48 శాతానికి చేరుకుంది. కోచి ఆధారిత ఇన్వెస్టర్ ఈక్యూ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఈకంపెనీలో ఎలాంటి క్రయ, విక్రయాలు జరపలేదు. అలాగే ఏ మ్యూచువల్ ఫండ్ కూడా ఈ క్యూ1లో ఎలాంటి అమ్మకాలుగానీ కొనుగోళ్లు గానీ జరపలేదు.
Comments
Please login to add a commentAdd a comment