స్టాక్ మార్కెట్‌లో మదుపర్లు శుక్రవారం ప్రారంభ సమయం నుంచి తమ షేర్లను భారీగా విక్రయిస్తున్నారు. దాంతో ఉదయం 11.45 సమయం వరకు సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా పడిపోయింది. గత సెషన్ ముగింపు వరకు మార్కెట్ విలువ మొత్తంగా రూ.458 లక్షల కోట్లు ఉండగా, ఈరోజు సూచీలు నేల చూపులు చూస్తుండడంతో పెట్టుబడిదారుల సంపద రూ.4 లక్షల కోట్లు తగ్గి రూ.454 లక్షల కోట్లకు చేరుకుంది. నిఫ్టీ 368 పాయింట్లు జారి 24,180 వద్దకు పడిపోయింది.
స్టాక్ మార్కెట్ పతనానికిగల కారణాలు..
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలు: ఎఫ్ఐఐలు నిన్నటి మార్కెట్ సెషన్‌లో రూ.3,560 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించారు. ఇటీవల కాలంలో కొంత తక్కువ మొత్తంలో అమ్మకాలు చేసిన ఎఫ్‌ఐఐలు తిరిగి భారీగా విక్రయాలకు పూనుకోవడం మార్కెట్ నెగెటివ్‌గా పరిగణించింది.
బలహీనమైన రూపాయి: రూపాయి జీవితకాల కనిష్టాన్ని తాకింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 84.83కు చేరింది. ఇది ఇన్వెస్టర్ల ఆందోళనలను మరింత పెంచింది.
గ్లోబల్ మార్కెట్ బలహీనత: అమెరికా, యూరప్, జపాన్, చైనా మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. వాటి ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై పడినట్లు నిపుణులు చెబుతున్నారు.
రంగాలవారీ క్షీణత: బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఐటీ వంటి రంగాలకు సంబంధించి మార్కెట్‌లో అధిక వాటాలున్న ప్రధాన షేర్లు భారీగా పతనమయ్యాయి.
పారిశ్రామికోత్పత్తి సూచీ: పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఈసారి భారీగా కొలుకుంటుందని మార్కెట్ ఊహించింది. అయితే, ఈ సూచీ గతంలో కంటే కోలుకున్నా కాస్త నెమ్మదించింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
ఇదీ చదవండి: బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్‌డీఏఐ
రిలయన్స్ షేర్లు ఢమాల్..
నిఫ్టీలో దాదాపు 10 శాతం వాటాను కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఈ వారంలో భారీగా క్షీణించింది. గడిచిన ఐదు సెషన్‌ల్లో 4.47 శాతం, అదే ఆరునెలల్లో 14.55 శాతం పడిపోయింది. అందుకుగల కారణాలను మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ రిటైల్, ఆయిల్-టు-కెమికల్స్ (ఓ2సీ) సెగ్మెంట్లు ఊహించిన దానికంటే బలహీనమైన పనితీరును కనబరిచినట్లు నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను పెంచుకోవడం కాస్తా నెమ్మదించింది. అంతకుముందు వీటి సంఖ్యను గణనీయంగా పెంచుతామని కంపెనీ పేర్కొంది. దానికితోడు ఏడాది కాలంలో పుంజుకున్న మార్కెట్‌లో క్రమంగా లాభాల స్వీకరణ పెరుగుతోంది. రిలయన్స్ వంటి కంపెనీల్లో ఎఫ్‌ఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగానే పెట్టుబడి పెట్టారు. వీరిలో చాలామంది ఇటీవల ప్రాఫిట్‌బుక్ చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment