న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా దేశీ ఈక్విటీలలో అమ్మకాలకే కట్టుబడుతున్న విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నవంబర్‌లో మాత్రం కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్నారు. వెరసి దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 36,329 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు స్పీడు తగ్గవచ్చన్న అంచనాలు, నీరసించిన చమురు ధరలు, ద్రవ్యోల్బణం ఇందుకు కారణమైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల డాలరు ఇండెక్స్‌తోపాటు ట్రెజరీ ఈల్డ్స్ మందగించడం, దేశీ ఆర్థిక పురోగతిపై ఆశావహ అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు.
సెపె్టంబర్, అక్టోబర్ తదుపరి గత నెల నుంచి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న ఎఫ్‌పీఐలు డిసెంబర్‌లోనూ పెట్టుబడులకే ప్రాధాన్యమివ్వడం గమనార్హం! దీంతో ఇకపై ఈ నెలలో మరిన్ని విదేశీ పెట్టుబడులకు వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గత వారానికల్లా మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలకు చేరడంతో సమీప కాలంలో కొంతమేర లాభాల స్వీకరణకు అవకాశమున్నదని, వేల్యూ స్టాక్స్‌వైపు దృష్టి సారించవచ్చని అరిహంత్ క్యాపిటల్ నిపుణులు అనితా గాంధీ, జియోజిత్ ఫైనాన్షియల్ విశ్లేషకులు వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. సెపె్టంబర్, అక్టోబర్‌లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 7,632 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
చదవండి అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ!
Comments
Please login to add a commentAdd a comment