
ఎఫ్‌పీఐలకు సెబీ నిబంధనలు
ముంబై: విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా సెబీ మరిన్ని చర్యలు తీసుకుంది. కొత్తగా రూపొందించిన ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (ఎఫ్‌పీఐ) తరగతి ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు విధి విధానాలను శనివారం ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనవాటిని సులభతరం చేసింది.
ప్రస్తుతం వేర్వేరు తరగతులుగా ఉన్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ), క్వాలిఫైడ్ ఫారిన్ ఇన్వెస్టర్లను (క్యూఎఫ్‌ఐ) కలిపి ఎఫ్‌పీఐ పేరిట కొత్త తరగతి ఏర్పాటు చేశారు. రిస్కు సామర్థ్యాన్ని బట్టి ఇందులో ఇన్వెస్టర్లు మూడు కేటగిరీలుగా విభజిస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలకు భిన్నంగా ఎఫ్‌పీఐలకు శాశ్వత రిజిస్ట్రేషన్ వెసులుబాటు లభిస్తుంది. శనివారం సమావేశంలో కొత్త నిబంధనలను బోర్డు ఆమోదించింది. సెక్యూరిటీలు, దేశీ ఫండ్స్ పథకాలు, ప్రభుత్వ బాండ్లు వంటి వాటిల్లో ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేయొచ్చు.