కొత్త రిజిస్టర్డ్ ఎఫ్ పీఐలు ఎన్నో తెలుసా..? | FPI Nearly 2,900 fresh FPIs register with Sebi in FY'16 New Delhi | Sakshi
Sakshi News home page

కొత్త రిజిస్టర్డ్ ఎఫ్ పీఐలు ఎన్నో తెలుసా..?

Published Fri, May 20 2016 2:21 PM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

కొత్త రిజిస్టర్డ్ ఎఫ్ పీఐలు ఎన్నో తెలుసా..?

కొత్త రిజిస్టర్డ్ ఎఫ్ పీఐలు ఎన్నో తెలుసా..?

న్యూఢిల్లీ : మార్కెట్ నిదానంగా కొనసాగుతున్నప్పటికీ 2015-16 ఆర్థికసంవత్సరంలో దాదాపు 2,900 కొత్త విదేశీ పోర్ట్ ఫోలియో మదుపరులు(ఎఫ్ పీఐలు) సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) దగ్గర నమోదు చేసుకున్నారట. సెబీ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మూలధన మార్కెట్లో 1,444 మంది  కొత్త రిజిస్ట్ర్డర్డ్ ఎఫ్ పీఐలు ఉన్నారని సెబీ డేటా తెలిపింది. అదనంగా 2,867 ఎఫ్ పీఐలకు గత ఆర్థికసంవత్సరం సెబీ నుంచి అనుమతులు లబించాయని డేటా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన రూ.1.11 లక్షల కోట్ల నుంచి రూ.14వేల కోట్లకు పైగా మొత్తాన్ని ఎఫ్ పీఐలు విత్ డ్రా చేసుకున్నారని డేటా పేర్కొంది.  బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ గత ఆర్థిక సంవత్సరం 9.36శాతం పడిపోయింది.

వివిధ కేటగిరీలో ఉన్న విదేశీ మదుపరులను కొత్త క్లాస్ ఎఫ్ పీఐ ల్లో కలుపుతూ.. సెబీ 2014లో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలతో ఎఫ్ పీఐలను రిస్క్ ప్రొఫైల్, నో యువర్ క్లెయింట్(కేవైసీ) అవసరాలు, రిజిస్ట్రేషన్ పద్ధతులకు అనుగుణంగా మూడు రకాలుగా వర్గీకరించారు. అంతకముందు భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ సంస్థలకు ఒక ఏడాదికి లేదా ఐదేళ్లకు మాత్రమే అనుమతులు లభించేవి. అయితే ప్రస్తుత ఎఫ్ పీఐలకు శాశ్వత రిజిస్ట్రేషన్ అనుమతులను సెబీ కల్పించింది. బోర్డు సస్పెండ్ లేదా రద్దు అయ్యేంతవరకూ ఈ రిజిస్ట్రేషన్ శాశ్వతంగా ఉంటుంది. అదేవిధంగా డీమ్డ్ ఎఫ్ పీఐలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 4,406 పెరిగాయని డేటా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 6,772 ఉన్నాయి. 55 వివిధ అధికార ప్రాంతాలకు చెందిన ఎఫ్ పీఐలు సెబీ దగ్గర నమోదయ్యాయి.      
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement